"విందు చేసినారు వియ్యాల వారింట
విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)
-------
(1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు
అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో
------------
(2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
నెయ్యి వేయ మన్న చెయ్యి తడవలేదు ||విందు||
(3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
హస్తంబు కదుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||
(4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(5). కూరే వంకాయ కూర, దానితోపాటే పచ్చడి లేదు
కలహంబులా కారం గుచ్చెత్తీనారూ ||ఏలాగు||
(6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యికడిగే వీలు లేదు ||ఏలాగు||
(7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
(8). లడ్డూ, జిలేబీలా పాకములో వడ్డించెరంట
వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
-----------
ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో
ఈ విందు మేమేలాగు భోంచేతుమో






















