Tuesday, 14 April 2020

Rare films division news reel

Courtesy. Whats app.  A rare films division news reel

 సినిమా మొదటిలో, ఇలా ఒక న్యూస్ రీల్ వేసేవారు. . ఇది తప్పని సరిగా వేయాలి. ఇలా న్యూస్ రీల్ వేసినందుకు హాలువాళ్ళు కొంత సొమ్ము చెల్లించాలి.దీనికి బాకీలుంటే మాత్రం సినిమాహాలు లైసెన్స్ రెన్యూ చేసేవారు కాదు. ఇప్పుడు వేస్తున్నారో లేదో తెలియదు

8 comments:

  1. చాలా బాగుండేవండి. రేడియోలో వార్తలు విన్నా కూడా దృశ్యమాధ్యమంలో చూడడం వేరు కదా. క్రికెట్ మాచ్ లు జరుగుతుంటే (టెస్ట్ సీరీసే; ఇప్పటి ఈ వన్జేల గోల ఇంకా పుట్టలేదు) ఆ మాచ్ బిట్స్ కూడా న్యూస్ రీల్ లో చూపించేవారు. ఆ వార్త తెలిస్తే అవాళే సినిమా హాలుకు వెళ్ళేవాళ్ళం - ఎందుకంటే ప్రతి శుక్రవారం అనుకుంటా న్యూస్ రీల్ మారిపోయేది 🙂.

    ఇప్పుడు కూడా వేస్తున్నారా అంటే ... నాకు అనుమానమేనండీ, టీవీ వచ్చిన తరువాత న్యూస్ రీల్ ఆవశ్యకత లేదనిపించిందేమో మరి?

    చైనాతో యుద్ధం తరువాతో, పాక్ తో యుద్ధం తరువాతో సినిమా హాళ్ళల్లో సినిమా చివర జనగణమన కూడా వేసేవారు, అది పూర్తయ్యేంత వరకు జనం నిలబడి ఉండేవారు కదా. తరువాత తరువాత అదీ మానేశారు. ఈ మధ్య పునరుద్ధానానికి ప్లయత్నం జరిగింది కానీ కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు ....
    అలా మాట్లాడడం గొప్పతనం అనుకుంటారేమో మరి? మూర్ఖత్వం అంతే. పాతకాలానికీ ఇప్పటికీ “మేధావులు“ ఎక్కువయ్యారు కదా మరి 😡.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ౨౦౧౧ దకా వేస్తున్నట్టు తెలుసు. ఒక మిత్రుని కోసం కరస్పాండెన్స్ చేసేవాడిని, ఫిల్మ్స్ దివిజన్ లోకల్ ఆఫీస్ తో. తరవాత తెలియదు.
      ’మేధావులు’పెరిగారా అంటారా? బలేవారే పుట్టలో ఉసుళ్ళలాగా పెరగలేదూ?

      Delete
  2. ౨౦౧౧ దాకానైనా వేస్తుండేవారా 🤔? Not bad కదా.
    నేను సినిమా చూడడానికి సినిమా హాలుకు వెళ్ళడం మానేసి ఓ పాతిక సంవత్సరాల పైమాటేనండి. కాబట్టి ఈ నాటి సినిమా హాళ్ళ గురించి పెద్దగా ఐడియా లేదు.

    ReplyDelete
    Replies
    1. మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలి సార్.
      ఈలెక్క మీరు చాలా మిస్సయ్యారు. ఏ ప్రసాద్ ఐమాక్స్ లోనో, లండన్ BFI ఐమాక్స్ లోనో క్రిష్టఫర్ నోలన్ తీసిన సినిమా చూడండి. కురుసభలో శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన దృతరాష్ట్రుడు ఎలా ఫీల్ అయ్యాడో మీరూ అలా ఫీల్ అవుతారు.

      Delete
    2. కళాపోషణకేమీ లోటు రానివ్వడం లేదు. సినిమాలు ఇంటి హాల్లోకే వచ్చి కూర్చుంటున్నాయిగా, ఇంక థియేటర్లకు వెళ్ళడం ఎందుకు? పైగా ఇప్పుడు ప్రైమ్, నెట్-ఫ్లిక్స్, హాట్-స్టార్, యూట్యూబ్ ఉండగా ఎందుకు చింత.

      Delete
    3. దేవుడిగది ఇంట్లో ఉండగా తిరుపతికి ఎందుకెళ్తున్నారు? ఇంట్లో కిచెన్ ఉండగా వారంతాల్లో రెస్టారెంట్లకి ఎందుకు వెళ్లేవారు? ఇంట్లో టీవీలో చూసే బొమ్మకి హాల్లో చూసే సినిమాకి చాలా తేడా ఉంటుందండోయ్. నిజం!

      Delete
    4. సూర్యగారు,
      మన్నించాలి. దీనికీ సమాధానం విన్నకోటవారు చెప్పాలిసిందే. నేనైతే ఎక్కడేనా సినిమా చూసి అంటే హాల్ లోగాని,టివిలోగాని ఫోన్ లోగాని, కంప్యూటర్ లోగాని చూసి నలభై ఏళ్ళ పైమాటే సుమా!

      Delete
  3. అయిందా, శర్మ గారు మరో నాలుగాకులెక్కువ చదివారు 🙏.

    స్వగృహ వెసులుబాటుల గురించి చెబుతూ సూర్య ఆ రెండు ఉదాహరణలతోటే సరిపెట్టాడు, బతికాం 😉।

    ReplyDelete