Saturday 25 April 2020

మేము గోదారోళ్ళమండి ఆయ్!

courtesy: Whats app

14 comments:

  1. 👌.
    ఈ విడియోలో చెప్పుకున్నంత మరీ పూర్తి సుగుణాల ప్రోవులు కాకపోయినా గోదావరి జిల్లాల వారు కాస్త విభిన్న వ్యక్తులే 🙂🙂.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారు,

      అందరూ భయపెట్టి, కొట్టి చంపుతారు. గోదారోళ్ళo పెట్టి, తిన పెట్టి పంపుతాము. అదేనండి మా ప్రత్యేకత.

      Delete


  2. ఎటకారం మాకెంతో రుసండీ :)

    రుసబుసలు మొదలగునేమో యిక :)


    జిలేబి.

    ReplyDelete
  3. అన్నింటా యెక్కువయే ,
    మన్నింపుడు , మాటతీరు మరిమరి మధురం ,
    అన్నా ! నరసింహన్నా !
    యెన్నగ సుగుణాల ప్రోవు లెందుకు కారో ?




    ReplyDelete
    Replies
    1. వాళ్ళే చెప్పుకుంటున్నారుగా, రాజారావు మాస్టారూ, తమకు వెటకారం ఎక్కువని. అది సుగుణం అవదు కదా 😁😁😁.

      అలాగే మీరన్నట్లు “మాటతీరు మరిమరి మధురం” అయితే ఎదుటివారిని బుట్టలో పడేసే ప్రమాదం ఉంటుందిగా, మాస్టారూ 😁😁😁.

      (jk సరదాగా 🙂)

      Delete


    2. ఆయ్ :) గోదారోళ్ళమండీ :)


      గోదారోళ్ళము మేమం
      డీ దారిని బోవు వార్ని ఢీకొంటామం
      డీ! దాష్టీకము లెంతయొ
      సాదాసీదాగ చేయు సరసులమండీ :)



      ఎటకారం మా జన్మ హక్కు :)



      జిలేబి

      Delete
    3. పెద్దలు శ్రీ నరసింహరావుగారూ , నమస్సులు .
      గోదారాళ్ళ వెటకారం కూడా , తగు మోస్తరులో ,
      యెదుటివాళ్ళను హింసించకుండా , కడు చతురంగా ,
      గౌరవప్రదంగానే ఉంటుంది . ఎదుటివాళ్ళుకూడా నవ్వి
      సరిపెట్టుకుంటారు . ఇక , మాటతీరంటారా , మర్యా
      ద పూర్వకంగా యెదుటివాళ్ళను ఆకట్టుకుంటారు . ఇది
      వాళ్ళకే సొంతం . ఇదీ , గొప్పగుణమే .

      Delete
    4. 👍
      నేనూ సగం గోదావరి జిల్లా వాడినే లెండి, మాస్టారూ 🙂.

      Delete
    5. మిత్రులు రాజారావుగారు,
      వెటకారం హాస్యంగా ఉండి ఇతరులను బాధపెట్టనిది ఆనందం కదండీ! హాస్యానికి అపహాస్యానికి తేడా తెలియనివారిని విశిష్టా చేసి గౌరవిస్తారు కదండీ!గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవడం సంస్కారం కదండీ!
      నమస్కారం.
      ధన్యవాదాలు.

      Delete
    6. విన్నకోటవారు,
      భారత దేశం లో పుట్టినవారు ఎప్పుడో ఒకప్పుడు గంగాజలం కొద్దిగానైనా తాగుతారు ( గంగా జల లవ కలితా పీత్వా) అలాగే దక్షణ భారతంలో వారు ఎప్పుడో ఒకప్పుడు గోజిలలో ఉండడం, గడపడం కూడా సర్వ సహజం, గోదావరి నీరు తాగడమూ సహజమే! ఆ కాలాన్ని గుర్తు చేసుకుని నేనూ సగం గోదావరి వాడినే అని గుర్తు చేసుకున్నందుకు
      నమస్కారం.
      ధన్యవాదాలు..

      Delete
  4. రాజారావు మాస్టారు, మా స్టారు
    మధురం,మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. గోదారోళ్ళు చాలా వరకు సింపుల్ గా ఉంటారు.
    కలిసిన ప్రతీ ఒక్కరినీ ఫ్రెండ్స్ చేసేసుకుంటారు.
    ఫ్యాషన్ కంటే ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
    వ్యాపారం చెయ్యడం కంటే వ్యవసాయం చెయ్యడం బాగా తెలుసు.
    తిండికి లోటు ఉండదు కాబట్టి హింస కంటే వినోదం ఎక్కువ.
    రేపటి గురించి భయం తక్కువ.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,
      గోదారోళ్ళ గురించి సింపుల్ గా రెండు ముక్కల్లో ఉన్నదంతా చెప్పేసేరండి.
      నమస్కారం.నేలతల్లిని, గోదారి తల్లిని నమ్ముకున్నవాళ్ళం కదండీ. రేపంటే భయం లేదు.అమ్మ బతికిస్తుందని నమ్మకం. అందరు నావాళ్ళే అనుకోడం లో ఆనందం ఉంది కదండీ!ఎవరైనా నాలుగు ముద్దలు కదండి కావలసింది.అలా ఆనాలుగు ముద్దలూ ఎంతమంది తింటే అంత ఆనందమండి.మేము ఎవరిని కొట్టి చంపమండి, పెట్టి పంపుతామండి
      నమస్కారం
      ధన్యవాదాలు..



      Delete