Wednesday, 1 April 2020

సిగరట్టు బాబూ! సిగరెట్టూ!!

courtesy: Whats app


సిగరట్టు బాబూ! సిగరెట్టూ!!

చూసేవాళ్ళకి నవ్వులాటగా ఉండచ్చుగాని అనుభవించేవారికే తెలుస్తుంది బాధ ఏమిటో!!!
ఇలాగే మందు కూడా వారం నుంచి ఏమీ లేవు ఎలాబతికేది?ఒక్కసారిగా సిగరట్టు,మందూలేని ఈ ప్రపంచం చాలా వింతగా,కొత్తగా ఉంది.Sudden withdrawal symptoms are more dangerous. 

33 comments:

  1. నిత్యాగ్నిహోత్రులకు ఇన్నిన్ని కష్టాలు కటకటా. నిత్యతీర్థసేవకుల ఆర్తనాదాలు విపించుకునే నాథుడే కరువాయనా.

    పొగబాబులను కైలాసాన కొలవయిన ఆ ఆది చిల్లుమ్ బాబాయే కటాక్షించాలి. ఆధునికయుగ దేవదాసులను ఆ దేవ దేవుడే ఆదుకోవాలి.

    jk, just for fun please :)

    ReplyDelete
  2. జై గారు,

    నిజంగానే సిగరట్లు మందు దొరక్క బాధ పడుతున్నారు. కేరళలో డాక్టర్ సర్టిఫికట్ మీద మందు అమ్ముతామన్నారు,ప్రభుత్వంవారు. ఒక కపూర్ గారు ప్రధానికే విజ్ఞప్తి చేశారు మందుగురించి.

    కైలాస వాసుడు చిలుంపట్టినట్టులేదెక్కడా! తెలిస్తే చెప్పరూ :)

    ReplyDelete
    Replies
    1. అవును గురువు గారూ. నా వ్యాఖ్యను lighten the atmosphere in the increasingly morbid environment ధోరణిలోనే రాసాను తప్ప బాధితులను ఎక్కిరించే ఉద్దేశ్యం లేదు.

      పరమశివుడి అలవాట్ల గురించి దేవదత్త్ పట్నాయక్ లాంటి వారెవరిదో వ్యాసం ఎప్పుడో ఏదో సైటులో చదివాను. భంగుబాబులు "జై జై శివ శంకర్" అంటూ గంతులేయడం పాత రాజేష్ ఖన్నా సినిమాలో ఉంది.

      సీసా బాయిల ఇలవేలుపు ఉజ్జయిని కాల భైరవుని గుడి తెరిచుందో లేదో. స్వామివారికే తీర్థం అందకపోతే భక్తుల సంగతి దేవుడెరుగు.

      Delete

    2. జైగారు,
      ఇటువంటి అలవాట్లున్నవారిని మీరు ఎగతాళి చేశారని నేననలా.It is only on lighter vein

      మానవుల అలవాట్లు అవుసరాలు అన్నీ శంకరునికి ఆపాదించేస్తున్నారు మనుషులు

      Delete
    3. Thank you sir.

      Take care & be safe!

      Delete
    4. జై గారు,
      పర్లేదు. సెంచరీ నాట్ ఔట్ చెయ్యందే క్రీజ్ లోంచి కదలను. Thank you sir.

      Delete
  3. Replies

    1. లిమిట్ చేసి ఉంటారు

      Delete
  4. ఎవడి గోల వాడిది!

    ReplyDelete
    Replies

    1. బోనగిరి గారు,
      నిజమేగానండి, ఆ బాధ ఏంటో అనుభవిస్తేగాని తెలీదండి. ఒకప్పుడు నేనూ ఆ బాధ అనుభవించిన వాడినే

      Delete
  5. ఎవడి గోల వాడిది!

    ReplyDelete
  6. ఎండ బాగా ఉందట. పెరట్లో ఏదో చెట్టు ఆకులు కోసుకుని, సగం నానబెట్టి కుళ్ళబెట్టాలి. మిగతా సగం ఎండబెట్టుకోవాలి. అప్పుడు రెంటికీ లోటుండదు!

    ReplyDelete
    Replies
    1. సూర్యగారు,
      ఆజ్ కి తాజా ఖబర్ నేడు 40/24 c

      ఆ ఆకు పేరేదో చెప్పి పుణ్యం కట్టుకోరాదూ! జనం ఇవి రెండూ దొరక్క బాధపడిపోతున్నారు.

      Delete
    2. ఏ ఆకైతే ఏముందండీ కాలిస్తే పొగ రావాలిగాని!☺️

      Delete
    3. ఈ సూర్య ఇంత వరకూ కూడా ఆ ఆకు పేరేమిటో చెప్పనే లేదు.
      కొంటెతనం ఓ పాలు ఎక్కువే ఉన్న సూర్య ఆ ఉపాయం చెప్పడం ఏప్రిల్ ఒకటి బాపతు గానీ కాదు గదా? 🤔☹️.

      Delete


    4. సూర్యగారు,
      ఏదో ఒక ఆకైతే ఈతిప్పలెందుకండీ. అ ఆకు పొగాకే ఐ ఉండాలి, అదీ ఒక బ్రాండు సిగరెట్టు నలభై ఏళ్ళు కాల్చిన నుభవంతో చెబుతున్నా. స్వానుభవమున చాటు నా సందేశమిదే...సిగరెట్టు కాలుస్తుంటే నికోటిన్ నెమ్మది నెమ్మదిగా నరాల్లోకి జేరుతుంటే ఓహ్ ఆ ఆనందం అనుభవించాలిగాని చెప్పేది కాదండీ. తాచు పాము విషం కూడా అంత కిక్ ఇవ్వదేమో సుమా :)

      Delete


    5. విన్నకోటవారు,
      పొగాకు మారుగా మరొకటా లేదుగాక లేదు నొక్కి వక్కాణించి చెబుతున్నా. ఏదో ఆశ సూర్యగారు కొత్త పేరేమైనా చెబుతారేమోననిగాని..

      Delete
    6. పొగాకు మానేయమని మా మేనత్త ఒకరు అరివీర భయంకరంగా సాధించి పోరితే, ఆవిడ భర్త పొగ మానేసి తంబాకు (జర్దా పాన్) నమలడం మొదలెట్టాడు. ఆమె కూడా సంతోషించింది, పోనీలే ఏదయినా మానిండు. రోజుకో రెండు పాకెట్లు తగలెట్టే మా నాయన కంటే మీ అన్నే నయమంటూ అమ్మను కొంచం ఎక్కిరించింది కూడా.

      ఒక వారం రోజులు తరువాత మామయ్య ఇక నా వల్ల కాదని మళ్ళీ యథావిధిగా, ఇంకా చెప్పాలంటే కాంపెన్సేషన్ కోసం ఇంకో రెండు పీకలు ఎక్కువ తగిలించి మరీ, నిరతధూమపారాయణంలో మునిగి తేలాడు. కొత్తగా కోరి కోరి అంటించుకున్న జర్దా సవితి పోరు కూడా తప్పలేదు అత్తకు!

      ఇవి నా చిన్నప్పటి ముచ్చట్లు. నాయన పోయి ఇరవై సంవత్సరాలు దాటింది, సదరు మామయ్య నడవడానికి కష్టపడుతున్నా ఇప్పటికీ అదే జోషులో ఊడడం, ఊంచడం రెండూ ఫుల్ ఫ్లెడ్జెడ్.

      Delete
    7. బలేవారే స్వంత అన్నగారు, మూడో నాలుగో ఎం.ఎ లు చేసినవాడు, సవ్యసాచి, తెనుగు ఇంగ్లీషులలో. నేనేమో సిగరట్టు కాలిస్తే ఛీ వెధవ సిగరట్లేంటీరా అని అనేవాడు,ముక్కు పొడి పీల్చేవాడు.వారు కాలం చేసి ఐదేళ్ళ పై మాట. నేనాయన ఎదురుగా సిగరట్ కాలచలేదు చాలా కాలం. అమ్మలకి తెలుసుకాని ఎప్పుడూ కాల్చగా చూడలేదు,వారు. ఇదో స్వయంగా చేసుకున్న నిర్ణయం ఆ తరవాత చాలా కాలం నడిచింది, మనవరాలి కాలంలో మానేశా! నిజం పుష్కరమైంది. ఇక ఖైనీ సేవకుల గురించి చెప్పేది లేదండి.

      Delete
  7. చుట్ట లేదు, మందు లేదు, సౌఖ్యమే లేదు /
    ఉన్నదంతా కరోనైతే ఉందీ కర్ఫ్యూనే /
    మిగిలిందీ కర్ఫ్యూనే /

    అని పాడుకుంటూ సరిపెట్టుకోవడమే 😁.

    ReplyDelete
    Replies
    1. దేవదాసు మాటలు ప్రస్తుత టపాకు వాడడం classic poetic touchగా ఉంది. గొట్టిముక్కల ఖుష్ హువా.

      విన్నకోట వారు బండి రావు గారికి పోటీ వస్తున్నారు, సంతోషం! ఇదే ఊపులో మిగిలిన చరణాలు కూడా పూర్తి చేసేయండి గురువు గారూ.

      అప్పట్లో (అనగా ప్రస్తుత విషాద ఛాయలు మచ్చుకయినా good old daysలో) నేను కాస్త జబర్దస్తు రోజమ్మ గురించి నాలుగు ముక్కలు రాసా కానీ complete the full song challenge స్వీకరించలేకపోయా.

      Delete
    2. ఏదో మీ అభిమానం, శర్మ గారి అభిమానమే గానీ నిజానికి బండి రావు గారి talent ఎక్కడ, నేనెక్కడ? Thanks anyway, గొట్టిముక్కల గారు. .

      అవునూ, పూర్తి చెయ్యక పోతే పోనీండి గానీ, “రోజమ్మ” గురించి మీరు ... ధైర్యం చేసి .... వ్రాసిన ఆ నాలుగు ముక్కలైనా ఇక్కడ మాకు వినిపించండి, విని ఆనందిస్తాం. ఎంతైనా “జ జ జ్జ రోజా” కదా 🙂.

      Delete
    3. మేమెప్పుడూ విన్నకోట అభిమానులమేనండీ. శ్యామలీయం, జిలేబీ, బండి రావు, బులుసు, వైవీఆర్ & శర్మ గార్ల లాంటి పెద్దలన్నా, అట్లాగే నీహారిక, కొండల రావు & పవనుడి వంటి మిత్రులన్నా నిండా రొంబ జాస్తి అభిమానం.

      రోజమ్మ గురించి నేను రాసిన నాలుగు పిచ్చి ముక్కలు అంతర్జాలంలో ఎక్కడున్నాయో వెతికి లింకు ఇస్తాను. మీ సలహా మేరకు బండి వారికి పంపిస్తే ఆయన సదరు అభిమాన నాయకీమణి గురించి మాంచి టపా ఒకటి వదిలారు. స్పందన వ్యాఖ్యాలలో నేను చెంద్రాలు సారు & మల్లెపూల పవనాలు బాబు గురించి కూడా కాసిన్ని మాటతూటాలు పేలాను.

      Delete

    4. జై గారు,

      మానవ బలహీనతలు ఒక్కొక్కరివి ఒక్కో రకం, చూడడంతప్పించి ఏం చేయలేం.
      ఎదురుగా ఉన్న అపార్ట్మెంటుల నుంచి ఇది మొదటి కామెంట్ రాస్తుండగా జరిగింది.ఒకరు, జరదా పాన్ వేస్తారట. రెండు రోజులనుంచి వారి బాధ ఏం చెప్పమన్నారు, జరదా ఉందిగాని తమలపాకు దొరక్క బాధ. ఎవరో మా దొడ్డిలో బంగ్లా ఆకు ఉందంటే వచ్చారు. పెద్ద పెద్ద ఆకుల్ని తీగనున్నవానిని చూసి ఆయన మొహం చంద్రుని చూసిన కలువలా విచ్చుకుంది. ఆకు దొరకటం లేదని కొన్ని ఆకులు కోసుకు వెళ్ళేరు. శుభం సరదాగా వేసిన తీగ ఒకరికైనా ఉపయోగపడింది. ఇలా మానవ బలహీనతలని చూసి జాలిపడాలి తప్పించి..ఏమన్నా బాగోదు కదండీ...ఈ బలహీనతలకి స్త్రీ,పురుష భేదం లేదు కదండీ....మేధావులు వారి బలహీనతలు దాచుకుంటారు, మా లాటివారు వారి బలహీనతలు చెప్పుకుంటారు అంతే కదండీ తేడా.. :)

      ఐతే మీరూ పేరడి కింగులేననమాట శుభం.

      Delete
    5. అసలు గిరీశం ఈస్ట్రన్ ఘాట్స్ గురించి చెప్పినట్లుగానే లోకల్ గా ప్రతి వారూ తమ పెరట్లో పొగాకు మొక్క కూడా వేసుకోవాలంటాను. ఇంటి యజమానికో, ఇతరులకో ఉపయోగపడుతుంది, ఏమంటారు శర్మ గారు?
      (jk 🙂)

      Delete
    6. ఒక మొక్క పెంచుకుంటే చాలదండి. ఒక ఫేకటరీ పెట్టుకోవాలి :)

      Delete

  8. విన్నకోటవారు,
    ఎవరితో ఏం అంటే ఏం తగువొస్తుందోనని భయంగా ఉందండి :). ఐనా అనేస్తున్నా!
    మీరూ బండివారిలా పేరడీలు రాసెయ్యచ్చు

    చెలియలేదు చెలిమిలేదు వెలుతురే లేదు
    ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేలే మిగిలిందీ నీవేలే :)

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు,
      ఈ మాత్రం దానికే దణ్ణాలా బాబయ్యా!

      Delete


  9. సిగరెట్టు దొరక లేద
    య్య గట్టిగ కరోన వేటయ సకలజనులన్
    పగబట్టి చీల్చెనయ్యా
    సగటుమనిషి బతుక లేక చతికిలబడెనే


    కాకినాడ ప్రాంతంలో కొత్త కేసులు పట్టేరట
    సిగరెట్టు కొరకు బయటకు వెళ్ళమాకండేం



    జిలేబి

    ReplyDelete
  10. ఆంధ్రుల స్వంత బ్యాంక్, దాదాపు వంద యేళ్ళ చరిత్ర కలిగిన చిరపరిచితమైన "ఆంధ్రా బ్యాంక్" ఇక లేదు. నిన్న (01-04-2020) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనం చెయ్యబడిన ఆంధ్రా బ్యాంక్ పేరు కాలగర్భంలో కలిసిపోయింది. వ్యవస్థాపకుడైన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఆత్మ క్షోభిస్తుంటుంది. ఆంధ్రుల చరిత్రలో మరొక పుట చిరిగిపోయింది.

    R.I.P Andhra Bank 🌹🌹😥.

    ఒక దక్షిణాది బ్యాంకుని కల్చరల్ గా ఎంతో తేడా ఉన్న ముంబై బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంకులో కలపడం ఏమిటో? అలాగే ఉత్తరాది బ్యాంక్ అయిన అలహాబాద్ బ్యాంకుని దక్షిణాది బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంకులో విలీనం చెయ్యడం ఏమిటో?

    "సీ తా రా మ" స్వామీ నే చేసిన నేరములేమి?

    ఆంధ్రులు నాలుగు సిగరెట్లు ఊదేస్తూ బాధపడ దగిన సందర్భం.

    ఆంధ్రా బ్యాంక్ విలీనం

    కనుమరుగైన ఆంధ్రా బ్యాంక్

    ReplyDelete

  11. శ్రీభోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన ఆంద్రా బేం క్ కి నూరేళ్ళూ నిండాయండి,నిర్మలా సీతారామన్ గారి ద్వారా.. గత ఏభై సంవత్సరాలుగా ఈ బేంక్ కస్టమర్ ని, ప్రజల నమ్మకానీ పోగొట్టుకుని, నిరర్ధక ఆస్థులను పెంచుకున్నట్టు ఉందండి, ఈ బేంక్. పేరుకి కస్టమర్ కాని చాలా కాలంగా బేంక్ లను వదిలేసిన మాట నిజమండి, నమ్మిక లేకనే.
    భోగరాజు గారు స్థాపించి లైఫ్ ఇన్సూరెన్స్ జాతీయమైపోయింది. మరొక సంస్థ ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ ఉందో లేదో! ఆంధ్రులు ఆరంభ శూరులేనంటారా?

    ReplyDelete