Friday 23 December 2016

ఇంతనాడు లేదు,

ఇంతనాడు లేదు, అంతనాడు లేదు,సంత నాడు పెట్టింది, ముంతంత కొప్పు

https://youtu.be/ewhRWuGbl8Q

Monday 19 December 2016

సమానంగా తిందాం.

''నువ్వు పప్పు పట్రా,నేను పొట్టు తెస్తా, గుళ్ళో కూచుని  కలిపి  ,ఊదుకుని సమానంగా తిందాం'',

Tuesday 13 December 2016

ఆక్రోశం

ఆక్రోశం


సామీ! ఎంకన్న బాబూ!! దయలేదా!!!

పొద్దుటే లేస్తాను,
నీ మొహం చూస్తాను.
పొన్నకాయలా గుండు కొట్టిస్తాను.
తలనీలాలు నీకే ఇస్తాను.

నీకు తిరునామం పెట్టిస్తాను.
నేను నామం పెట్టుకుంటాను.
ప్రజలికి ఎగనామం పెట్టిస్తాను.
నడిచేదంతా నిజమనిపిస్తాను.

నిన్నే దైవంగా కొల్చుకున్నాను.
ప్రతాదివారం నీ కొలువుకొస్తాను.
భక్తి శ్రద్ధలతో ఉపవాసముంటాను.
పొర్లు దండాలు పడిపడీ పెడతాను.


నాకు తోచినప్పుడల్లా చేయించాను
నీకు బంగారు కిరీటాలూ,బాల తొడుగులు
వరద ముద్రలు,అభయ ముద్రలు
తిరునామాలు, మణిహారాలు.

ఎందుకొచ్చిందయ్యా కోపం  చెప్పు?
దేశం లో ఉన్నవాణ్ణి ఒక్కణ్ణేనా చెప్పు
అందరినీ వదిలేసి నాకే ఎందుకు చెప్పు
 కష్టాలూ, కన్నీళ్ళూ, నీకవుపించలేదా చెప్పు.

నా ఒక్కడి దగ్గరే ఉందా చెప్పు
చిన్న తల్లి లేనిదెవరిదగ్గర చెప్పు
దొరకనివాళ్ళంతా దొరలేనా చెప్పు
ఎవరెవరి దగ్గరెంతుందో తెలియదా చెప్పు.  

పిలవకుండానే పలికేవారు అంతా
నేడు వీళ్ళకేమయైంది ఇదో వింతా
చిన్నమ్మ పలుకుతోనే ఉందా అంతా
నీకూ ఉందనుకుంటా అనుభవం సుంతా

దానికేంగాని మనలో మనమాటా
ఇందులో ఫిఫ్టీ ఫీఫ్టీ నీ వాటా
ఇలా కానీవయ్యా ఈ సారికంతా
విప్పవయ్యా ముడి నీకిదెంతా

కాదంటావా చెప్పు లేదు తంటా
కాదంటే చెప్పేస్తా నీకు టాటా
చూసుకుంటా మరో మరో  చోటా
ఇదిగో ఇదిగో ఇదే ఆఖరు మాటా





Sunday 11 December 2016

తిడతాం! తిట్టడం మా జన్మ హక్కు!!!

మొన్నటిదాకా వాళ్ళని తిట్టేం! నిన్నటినుంచి వీళ్ళనీ తిడుతున్నాం!!, పని చేయకపోతే తిడతాం! పని చేస్తే తిడతాం!! తిట్టడం మా జన్మ హక్కు!!!  ఉంగరాల వేళ్ళవాళ్ళంటే ఇష్టం. 

Friday 9 December 2016

బంగారం

బంగారం చలామణీ....

మొన్న మా వెంకటేశం కనబడ్డాడు. అబ్బో! బాగ ఎదిగిపోయాడు, ఉపన్యాసాలూ ఇస్తున్నాట్ట. ఖాళీ గా ఉన్నా కదా, ఏదేనా ఒక విషయం మీద ఉపన్యాసం ఇమ్మంటేనో అనుకుని ”ఏం వాయ్! వేంకటేశం ఏంటి సంగతులు” అన్నా! దానికోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు ఇలా చెప్పేడు.

మా గురువుగారెప్పుడో The eleven causes for the degeneration of India లో చెప్పేరు ”భారద్దేశంలో ఆర్ధిక సంస్కరణలేవీ పని చెయ్యవూ" అని, మీరెవరూ వినరు. మేథావులనీ దేశం ఎప్పుడు గుర్తించింది గనక...

బంగారం తో అనుబంధం, కోరిక భారతీయులకు ఈనాటిదా? పురాణ కాలం నాటిది కదూ? భారతీయ మహిళకీ బంగారానికి విడతీయలేని అనుబంధం. చిన్నమెత్తు బంగారం కూడా లేని భారతీయ మహిళ కనపడితేనే విచిత్రం.

ఇదెందుగ్గాని, నేడు బంగారమే మళ్ళీ అక్కరకొచ్చింది కదా! చలామణీ కి. బంగారాన్ని నాణేలుగా వేయడం ఈ నాటి అలవాటేం కాదు. ఇప్పుడైతే అరగ్రాము,గ్రాము,రెండు గ్రాములు,మూడు గ్రాములు, ఐదు గ్రాములు, పదిగ్రాముల నాణేలు బాగా దొరుకుతున్నాయి, చలామణీలో ఉన్నాయి. ఇదెందుకో తెలుసా? ఒకప్పుడు పచ్చనోటు చేతిలో పడితేగాని పనయ్యేది కాదు, కాలం మారి అది ఎర్రనోటు స్థాయికి పెరిగింది. ఇప్పుడేమో ఎర్రనోటు చిత్తుకాయితమైపోయింది. ”ఇరుసున కందెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ” అన్న మాట ఉన్నదే! ఎప్పటికి చెక్కుచెదరని దుందిగదా! ఇప్పుడక్కరకొచ్చింది పసిడి. అరగ్రాము పదేనువందలు, అమ్మేవాడు చిల్లర ఇబ్బందిలేకుండా రెండు వేల నోటు తీసుకుంటున్నాడు, చూశావా ఎంత సౌకర్యమో! దీన్నిలాగే పట్టుకుపోతే! పనెంత క్షణాల మీదైపోలా! ఇప్పుడు పుచ్చుకునేవాడిదే కావాలంటున్నాడు, ఎందుకో తెలుసా! ఎ.సి.బి వాళ్ళ భయంలేదు, దాచుకోడానికి పేంటుకు దొంగజేబులు కూడా కుట్టించేసేరు, కొత్తగా, లేదా డెస్క్ లో కాయితాలో పారేస్తే పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడు. విలువా పెరిగింది కదూ అద్దిరబన్న! బాగుందోయ్ బాగుంది.


నువ్వేదో నల్లధనం వగైరా అంటున్నవుగాని దానికి ఓ మంచిపేరుందిగదా! అదే ”సమాంతర ఆర్దిక వ్యవస్థ” ఇప్పుడిందులో చెల్లుబాటూ, చెల్లింపులూ అంతా బంగారమే, దీనికీ హవాలా పుట్టేసింది.
''మనదేశంలో ఆర్ధిక సంస్కరణలా? చాల్లేవోయ్!మనవాళ్ళంతా మేథావులోయ్'' అంటూ వెళిపోయాడు, మా వెంకటేశం

Thursday 8 December 2016

ఏడు కరువులు



ఆశమ్మ:- వదినా ఏడు వరస కరువులొస్తాయిట
బోశమ్మ:- పోనీలే వదినా! మొదటి కరువుకే చచ్చిపోతే మిగిలిన 6 కరువులు నన్నేం చేస్తాయిట. 

Friday 2 December 2016

అందరూ నల్లోళ్ళే! ఎంతో కొంత



అందరూ నల్లోళ్ళే ఎంతో కొంత. అదెలా?

కారు డ్రైవరుకి జీతవెంతిస్తున్నారు?
ఐదువేలు.
ఎంతరాసుకుంటున్నారు?
ఉష్..అడగద్దు... ఎనిమిదో పదో రాసుకోడం అలవాటూ...ఉద్యోగాలిచ్చేవాళ్ళంతా చేసేదిదే!
ఇప్పుడు జీతమివ్వాలి. కేష్ లెస్, అక్కౌంట్లో ఎంతేస్తారూ?
చిన్న కిరాణా షాపునుంచి పెద్ద మాల్ దాకా, పెద్దోళ్ళనుంచి మరోళ్ళ దాకా ఇంతే తంతు. ఈ నెల నుంచి జీతాలెలా ఇస్తారు? చూడాల్సిందే :)
ఇల్లు అద్దెకిచ్చాం రశీదెంతకిస్తున్నాం?, అసలిస్తే సుమా!
లెక్కేస్తే ఎన్నో!
खतरा खतरा दरिया बन जाती है

ఖతరా ఖతరా దరియా బన్ జాతీ హై
చుక్క చుక్కా సముద్రం