ఆక్రోశం
సామీ! ఎంకన్న బాబూ!! దయలేదా!!!
పొద్దుటే లేస్తాను,
నీ మొహం చూస్తాను.
పొన్నకాయలా గుండు కొట్టిస్తాను.
తలనీలాలు నీకే ఇస్తాను.
నీకు తిరునామం పెట్టిస్తాను.
నేను నామం పెట్టుకుంటాను.
ప్రజలికి ఎగనామం పెట్టిస్తాను.
నడిచేదంతా నిజమనిపిస్తాను.
నిన్నే దైవంగా కొల్చుకున్నాను.
ప్రతాదివారం నీ కొలువుకొస్తాను.
భక్తి శ్రద్ధలతో ఉపవాసముంటాను.
పొర్లు దండాలు పడిపడీ పెడతాను.
నాకు తోచినప్పుడల్లా చేయించాను
నీకు బంగారు కిరీటాలూ,బాల తొడుగులు
వరద ముద్రలు,అభయ ముద్రలు
తిరునామాలు, మణిహారాలు.
ఎందుకొచ్చిందయ్యా కోపం చెప్పు?
దేశం లో ఉన్నవాణ్ణి ఒక్కణ్ణేనా చెప్పు
అందరినీ వదిలేసి నాకే ఎందుకు చెప్పు
కష్టాలూ, కన్నీళ్ళూ, నీకవుపించలేదా చెప్పు.
నా ఒక్కడి దగ్గరే ఉందా చెప్పు
చిన్న తల్లి లేనిదెవరిదగ్గర చెప్పు
దొరకనివాళ్ళంతా దొరలేనా చెప్పు
ఎవరెవరి దగ్గరెంతుందో తెలియదా చెప్పు.
పిలవకుండానే పలికేవారు అంతా
నేడు వీళ్ళకేమయైంది ఇదో వింతా
చిన్నమ్మ పలుకుతోనే ఉందా అంతా
నీకూ ఉందనుకుంటా అనుభవం సుంతా
దానికేంగాని మనలో మనమాటా
ఇందులో ఫిఫ్టీ ఫీఫ్టీ నీ వాటా
ఇలా కానీవయ్యా ఈ సారికంతా
విప్పవయ్యా ముడి నీకిదెంతా
కాదంటావా చెప్పు లేదు తంటా
కాదంటే చెప్పేస్తా నీకు టాటా
చూసుకుంటా మరో మరో చోటా
ఇదిగో ఇదిగో ఇదే ఆఖరు మాటా
దయ ఉండాది కాబట్టే గాంధీ నగరం ఇంటికి మాత్రమే కన్నం వేయించాడు :)
ReplyDeleteఓయ్!ఓయ్!! అనానిమస్సూ!!!
Deleteనీకేం తెలుసు తుస్సూ
ఒక గ్రాం ఖరీదు 2845 ఐతే
కేజిన్నర ఖరీదెంతో చెప్పూ
కలం కాగితం లేకుండా :)
ఆపాటి దానికింత బడాయి ఆక్రోశమున్నూ :)
Delete