Thursday, 23 April 2020

ఆమెగా అతడు


నిశాజిందాల్ ఆడ పేరుతో పదివేల స్నేహ బృందంతో, ఒక ముఖపుస్తక పేజి. అందులో ఒక వర్గం, మతం వగైరా వారిపై మరొకరికి ద్వేషం కలిగించే పోస్ట్లు పెట్టడం అలవాటు. ఓ పిక పట్టేరు, చిరాకొచ్చిన ఒకరు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.

పోలీస్ పరిశోధనలో వెలుగు చూసిన నిజాలు. ఈ స్త్రీ నని చెబుతున్నవారు ముఫై ఒక్క సంవత్సరాల  పురుషుడు. ఎనిమిదేళ్ళుగా, ఆమెగా సాగుతున్న ముఖ పుస్తక పేజి

   ఇంతకీ వీరేంటయ్యా అంటే! పట్టు వదలని విక్రమార్కునిలా పదేళ్ళుగా ఐ.టి ఇంజనీరింగ్ గట్టెక్కని వాడు. ఐతే ఆమెగా తన పరిచయంలో పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలలో ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు చెప్పుకుంటున్నావారు .
( World health Organisation, International monetary fund,  World trade Organisation.) ఇదేగాక ఒక పాకిస్తానీ నటీమణి పేరుతో ఈ మహానుభావుడు నడుపుతున్న  మరొక  ముఖపుస్తక పేజిలో నాలుగు వేల మంది మిత్ర బృందం. ఇదీ కత. నేను చెప్పడమేంటిగాని పోలీస్ ల మాటల్లోనే చదవండి. మన తెనుగు బ్లాగుల్లో కూడా ఇటువంటివి చూడబోతున్నామేమో!


 https://timesofindia.indiatimes.com/india/nisha-jindal-with-10k-fb-fans-turns-out-to-be-a-man/articleshow/75240983.cms

మొదటి లాక్డవున్ ముగిసింది. రెండవ లాక్ డవున్ నడుస్తోంది. గట్టేక్కకపోతే,జాగ్రత్తలు తీసుకోకపోతే పెరమనెంట్ లాక్ డవునే! . ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెచివల్స్.భయపెట్టడం కాదు. ఉన్న నిజం


4 comments:



  1. అతడే ఆమె జిలేబీ
    జత కలిపెను ఫేసుబుక్కు చాటున సుమ్మీ
    కతలిక బ్లాగ్లోకమ్మున
    వతిగ మనకు కానవచ్చు పలువిధములుగా


    జిలేబి

    ReplyDelete
  2. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
    ఇంకా ఎన్నెన్ని గోముఖవ్యాఘ్రాలు సో కాల్డ్ “సోషల్ మీడియా”లో సంచరిస్తున్నాయో?

    ReplyDelete
    Replies
    1. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఫేస్ బావుంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాళ్లే ఇలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ అవుతారు.

      Delete
    2. విన్నకోటవారు, సూర్యగారు.
      కలికాలం కదండీ, ఎన్ని వన్నెచిన్నెలు చూస్తున్నామో,చూస్తామో చెప్పలేను.
      ధన్యవాదాలు.

      Delete