Saturday 18 April 2020

తృష్ణ




17 comments:

  1. Photo భలే capture చేశారండి, శర్మ గారు 👌🙂. గోడమీద పెట్టుంచిన ఆ డొక్కులో నీళ్ళు నింపి వుంచడం పక్ష్యాదులకు ఉపయోగపడే పని👏.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఉదయం పూట కార్యక్రమాల్లో ఇదొకటి. ఫోటో తీయడానికి కుదరనివ్వలేదు.ఓపిక పట్టి తీశానండి. మరికొంచం బాగుగా తీయాలని ప్రయత్నం.

      Delete


  2. కరోనా టైమ్ లో ఉడతల వేట సారీ ఫోటో :)

    ReplyDelete
  3. శర్మ గారు,
    కరోనా రాజమండ్రీ, రామచంద్రాపురాల్లోకి ప్రవేశించిందని ఇవాళ్టి టీవీ వార్త. మీ ఊరికి సమీప టౌన్లు కదా ఇవి, జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోంచి బయటకు వెళ్ళటంలేదు గదా మీరు, మీ వాళ్ళు?

    ReplyDelete
    Replies
    1. "రాజమండ్రీ, రామచంద్రాపురాల్లోకి"

      ఏప్రిల్ 20 బులెటిన్ ప్రకారం తూగో జిల్లాలో కొత్త కేసులు రెండు. అవి ఈ రెండు ఊళ్ళవా గురువు గారూ?

      Delete
    2. ..... అనే నాకు టీవీలో వినిపించినది.

      Delete
    3. రాజమంద్రి టవును,పెద్దాపురం,పిఠాపురం టవున్లు, శంఖవరం మండలం,కొత్తపేట మండలాలు రెడ్ జోన్లుగా ప్రకటించారు.ఇక అదిగో పులి అంటే ఇదుగో తోక అనే టి.వి వార్తలు వినను,నమ్మనుకూడా, నిజమైనా నమ్మలేను. అవి రాజమంద్రిలోవే అనుకుంటున్నా. మా వాళ్ళందరికి మనకేం కాదనే నమ్మకం జాస్తిగా ఉంది, అందరిలోనూ. మంచిదేగాని, అతి నమ్మకం పనికిరాదన్నది,జాగ్రత్తలు అవసరం అన్నది నా మాట. ఇరవయ్యో తారీకును౭ంచి పోలీస్ పహరా పెరిగింది. ఉదయం ఆరు నుంచి పది దాకా భౌతిక దూరం పాటిస్తూ ఇచ్చిన సడలింపును కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టే వుందండి. అందరూ మాస్క్ లు మాత్రం తగిలించుకు ఉంటున్నారు.

      Delete
    4. "ఇక అదిగో పులి అంటే ఇదుగో తోక అనే టి.వి వార్తలు వినను,నమ్మనుకూడా, నిజమైనా నమ్మలేను"

      "అందరిలోనూ. మంచిదేగాని, అతి నమ్మకం పనికిరాదన్నది,జాగ్రత్తలు అవసరం అన్నది నా మాట"

      100% correct approach.

      పేషంట్ వారీగా వివరాలు కూడా అధికారిక ప్రకటనలలో ఉన్నాయండీ.

      Example:

      https://twitter.com/ArogyaAndhra/status/1252189601399050240

      ఆరోగ్య ఆంద్ర, డా. పీవీ రమేశ్ లేదా రాజీవ్ కృష్ణ ట్విట్టర్ హాండిలులో చూస్తే బెస్ట్.

      విశాఖ కమిషనర్ గుమ్మళ్ల శ్రీజన ట్విట్టర్ కూడా నగరవాసులకు చాలా ఉపయోగకరంగా ఉంది.

      Delete
    5. జై గారు

      ఎక్కడ చూసినా ఊహాగానాలే కనపడుతున్నాయండి. ఎ.పి మరియు తెలంగాణా ప్రభుత్వాల నోటిఫికేషన్ లింక్ లుంటే ఇవ్వగలరు.

      Delete
  4. విన్నకోటవారు,
    మా మండలం తూగోజికి మధ్యలో ఉంటుందండి. మాకు కావలసిన పట్టణాలు రామచంద్రాపురం, రాజమంద్రి. ఒకప్పుడు రెవిన్యూ డివిషన్ రాజమంద్రి, ఇప్పుడు రామచంద్రాపురం. మా వాళ్ళకి ఆరోగ్యం పట్ల స్పృహ ఎక్కువ. నిన్నటి దాక ఇంటికి మూడు వందల మీటర్లలో పోలీస్ చెక్ పోస్ట్, ఇప్పుడు మరొకటి వంద మీటర్లలో ఈ రోజే వచ్చిందండి.

    నేనైతే సంవత్సరం పైగా లాక్ డవున్ లోనే ఉన్నా. జాగ్రత్తలు చెబుతున్నా. తీసుకుంటున్నాను. మార్చ్ ౨౪ నుంచి వాకింగ్ కూడా మానేశానండి. మొన్ననొక రోజు వెళితే ఉదయమే బార్బర్ షాప్ తీసుంటే, మనుషులుంటే చూసి బాధ పడ్డా,చెప్పాను కూడా....

    ఇప్పుడు వాకింగ్ పెరటిలోనే చేస్తున్నానండి. ఇంట్లోవాళ్ళూ కదలడం లెదు. నడిచొస్తే ఏం చేయలేం కదండీ...ఈ లాక్ డవున్ దాటితేగాని తెరిపి ఉండదండీ.....

    ReplyDelete
  5. విన్నకోటవారు,
    ఒకప్పుడు గో.జి అంతా ఒకటే అది చరిత్ర, జంగారెడ్డిగూడెం,భద్రాచలంలతో కలిసి. ఆపై రాజమంద్రి,అమలాపురం,కాకినాడ,పెద్దాపురం రి.డివిషన్లు. ఆపై రంపచోడవరం రి.డి ఏర్పడింది. మొన్న రామచంద్రాపురం,ఏటపాక రి.డి లు ఏర్పడ్డాయి. ఇప్పుడీ జిల్లా మూడు జిల్లాలు కాబోతోంది. తూ.గో.జి రాజమంద్రి కేంద్రంగా, కాకినాడ జిల్లా కాకినాడ కేంద్రంగా, కోనసీమ అమలాపురం కేంద్రంగా.
    మీ అభిమానానికి ధన్యవాదాలు,జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఆపై అమ్మ దయ.

    ReplyDelete
  6. అవును శర్మ గారు. మా తండ్రి గారు అమలాపురం RDO గా పనిచేస్తున్న రోజుల నాటికి (1960 ల నాటి మాట) తూగోజీలో ... అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి ... అని
    నాలుగే రెవిన్యూ డివిజన్లు వుండేవని నాకు లీలగా గుర్తు. రాజమండ్రిలో సబ్-కలెక్టర్ వుండేవాడు. అప్పటికింకా రంపచోడవరం రె.డి. అయిందా, లేక రాజమండ్రి డివిజన్ క్రిందనే వుండేదా ... కించిత్ సందేహం.

    ఓహో, తూగోజి మూడుముక్కలవబోతోందా? బాగుంది, మహదానందం. The more the merrier అని ఆంగ్ల నానుడి.

    ReplyDelete
  7. మొదట నాలుగే రి.డి లండి. తరవాతే రంపచోడవరం. ఇప్పుడు ఏటపాక,రామచంద్రాపురం.

    రాజమంద్రి,రంపచోడవరం,కొవ్వూరు రి.డి లు ఒక జిల్లా తూ.గో.జిల్లా. పెద్దాపురం,కాకినాడ, ఏటపాక రి.డి లు తాండవ జిల్లాగాను, రామచంద్రపురం,అమలాపురం రి.డిలు జిల్లాగా కోనసీమ జిల్లా అని అనధికార వార్తలు.

    పగోజిలో నరసాపురం జిల్లా,ఏలూరు జిల్లాలని వార్తలు.నిజాలు తెలియవండి.

    ReplyDelete
  8. గురువు గారూ, most recent updates:

    https://twitter.com/TelanganaHealth/status/1252606099691208704

    https://twitter.com/ArogyaAndhra/status/1252838287569350656

    ప్రతిరోజు సాయంకాలం 4 ఘంటలకు కేంద్ర పత్రికా ఘోష్టి కుదిరినప్పుడల్లా తప్పక చూడండి. ఆరోగ్య శాఖ లవ్ అగర్వాల్ విధి తప్పకుండా హాజరు కావడం విశేషం.

    కేంద్ర రాష్ట్ర ప్రకటనలలో కొంత synchronization గాపులు ఉండవచ్చును. ఉ. తెలంగాణా సూచీ రాత్రి 8 ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఇవాళ్టి లెక్కలు రేపటి కేంద్ర నంబర్లలో వెళ్తాయి.

    The underlying base data collection framework is the common to all reporting systems.

    ReplyDelete
    Replies
    1. జై గారు,
      లింక్ లిచ్చినందుకు ధన్యవాదాలు. వాటిని విహంగ వీక్షణ చేశా, నాకనిపించింది.
      తెలంగాణాలో ముఫి మూటికి ఇరవైనాలుగు జిల్లాలలోనూ,ఆంధ్రలో పదమూటికి రెండు జిల్లాలలోనూ కరోనా జాడ కనపడలేదు. కారణం ఏమై ఉండచ్చును అని ఆలోచించగా వాట్స్ ఆప్ యూనివర్సిటీ వారి పరిశోధనలో తేలిన విషయం, అక్కడి వారి ఆహారపు అలవాట్లేనని. ఆంధ్రా లోని జిల్లాలవారి ప్రత్యేక ఆహారపు అలవాటు చెబుతున్నారు అలాగే తెలంగాణా జిల్లాలలోని ప్రత్యేక ఆహారపు అలవాటేమైనా ఉన్నదా? తెలియజేయగోర్తాను.ముందస్తు ధన్యవాదాలు.

      Delete
    2. గురువు గారూ, thanks for excellent observation.

      తెలంగాణా సూచీ గడచిన 24 ఘంటల గురించినది (i.e. day book, not full ledger) మాత్రమే కాబట్టి దీన్నే ఆధారంగా అనాలిసిస్ చేయలేమనుకుంటా.

      పూర్తి జాబితా (కాస్త పాతది) చూస్తే గిరిజన ప్రాంతాలు కాస్త మెరుగ్గానే ఉన్నట్టుంది. ఇందుకు కారణం ఆహారమా, జనసాంద్రత లేదా బీదరికం మూలాన బయటి వాళ్ళ రాకపోకలు తక్కువా తెలియదు.

      https://twitter.com/TelanganaHealth/status/1251161935480946688

      సిద్దిపేట & రాజన్న జిల్లాలలో పరిస్థితి బాగుండడానికి కారణం బహుశా అధిక చైతన్యం అయుండొచ్చు. These two districts are comparatively rich & dense but still have very few cases.

      ఏదేమయినా మన ఆహార సంస్కృతి మారాలి. సాగు నీటి ఎద్దడి తగ్గాలన్నా, సాధారణ ఆరోగ్యం మెరుగు పడాలన్నా రెండు తరాల వెనుకటి ఆహార అలవాట్లకు తిరిగి వెళ్తేనే మంచిదని నా అభిప్రాయం.

      Delete