Sunday 26 April 2020

ఆవిడైనగాని కోవిడైనగాని

కొసరి పెట్టినదేదొరుచిలేనిదైనను
నోరు మూసుకు తినితీరవలయు

విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా
చూసిచూడనియట్లు చూడవలయు

అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు
వినపడనియట్లుగా వెడలవలయు

పైమూడు సూత్రాలు పాటించి మగవారు
దీటుగా లాక్ డవును దాటవలయు

ఆశ వీడకుండ ఆరాట పడకుండ
మూడు సూత్రములను వాడువాడు

హాయిగా తరించు నాపద నొందడు
ఆవిడైనగాని కోవిడైనగాని.
Courtesy:C.V.L.N.Ravi kumar

2 comments:

  1. లాక్-డౌన్ రాకముందు కూడా ప్రశాంత జీవనానికై పాటించినది ఇవే మూడు సూత్రాలు కదా, శర్మ గారు 🤔
    🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      ఈ కవి కిశోరానికి ఇప్పుడిప్పుడే జీవితానుభవం కలుగుతున్నట్టుగా ఉందండి. :)

      Delete