చలిమిడి
పుట్టింటికెడితే ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా చలిమిడి తెచ్చుకోని ఆడపడుచు వుండదు, తెలుగునాట. కలిగినవారు మడులు మాన్యాలూ కూతురికివ్వచ్చు గాని ఏమీ లేనివారైనా చలిమిడి పెట్టకుండా పసుపు,కుంకుమ ఇవ్వకుండా మాత్రం పంపరు. పుట్టింటి కెళ్ళొచ్చిన ఆడకూతురు భర్తకు మొదటగా పెట్టేదీ చలిమిడే. :)
ఇక తెలివి తక్కువ వాళ్ళని చలిమిడి ముద్దా, ముద్దపప్పూ,పప్పూ అనడం అలవాటే :)కాని చలిమిడి చాలా మంచిది,బలవర్ధకమేకాదు, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందిట.
చలిమిడి ఎలా తయారు చేస్తారు? ఇది రెండు రకాలు, చలిమిడి,పచ్చి చలిమిడి. చలిమిడికి కొట్టుపిండి కావాలి. కొట్టు పిండంటే, బియ్యం నానబోసి, ఆరబెట్టి దంపాలి. పిండి జల్లించుకోవాలి. మెత్తగా ఉంటుంది, పిండి.దీన్ని పంచదారతోనూ,బెల్లంతోనూ చేస్తారు. బెల్లంతో చేయడం శ్రేష్టం. బెల్లం కోరుకుని పాకం పట్టాలి, ఈ పాకం పట్టడమే టెక్నిక్. తీగపాకం రావాలి, అందులో కొట్టుపిండి పోయాలి కలియ బెట్టాలి. ఆపైన అందులో ఎండుకొబ్బరి ముక్కలు చిన్నగా తరుక్కున్నవి వేయాలి.కలిగిన వారు జీడిపప్పు,యాలకులు,పచ్చకర్పూరం కూడా వేస్తారు.
మరోమాట ఈ చలిమిడినే చిన్నచిన్న ఉండలులా తయారు చేసి వత్తి నూనెలో బంగారం రంగు వచ్చేదాకా వేయిస్తే అదే అరిసె. అరిసెల వంట చెప్పినంత తేలికకాదు సుమా.
ఇక పచ్చి చలిమిడి. బియ్యపు పిండిని కోరిన బెల్లంలో కలిపి, కొబ్బరిముక్కలేసి, కొద్ది నీటితో ముద్దలా చేస్తారు.ఇది నాగులచవితికి చేస్తారు.
చలిమిడిలో కొబ్బరి ముక్కలు అన్నప్పుడు ఎండు కొబ్బరి అని స్పష్టంగా చెప్పాలి శర్మ గారు. ఈ తరం ఆడపిల్లలకు ఏది ఎలా అర్థం అవుతుందో చెప్పడం కష్టం గదా?🙂
ReplyDeleteవిన్నకోటవారు,
ReplyDeleteసరి చేశానండి. ఇప్పటివారు చలిమిడి చేస్తున్నారా అని అనుమానం :)
Deleteఅంతా బుకిష్ విన్నాణమేనా తాతగారిది లేక ..... :)
జిలేబి
:)
Deleteపిండివంటమీద ప్రియపడినట్టుంది
ReplyDeleteనాల్క , దాని తీరు నమ్మరాదు ,
వయసు సరకుగొనదు , పడద్రోయు రోగాన ,
ఉచ్చు భిగియు దాక గిచ్చునేమొ !
Deleteబెదురవలదయ్య రాజా
విదురుల విన్నాణమదె చవిగొను విధముగా
సదనమ్మున వ్రాయుటయే
ను దమ్ము కనరాదు తినగ నొక్కింతయునౌ :)
జిలేబి
రాజాజీ,
Deleteఅరిసి ఆరునెలల రోగం అంటారు. మాటలో చెప్పేను తప్పించి అరిసి అంటే భయం :)
జిలేబీ కిజోస్యం తెలుసు :)
Delete