Tuesday, 28 July 2020

దూధ్ సాగర్ జలపాతం

courtesy whats app

28 comments:



  1. కొండను దూకుచు కోనల
    నిండుగ పరుగుల దుముకుచు నిటునటు నా బ్ర
    హ్మాండము బ్రద్దలు కొట్టుచు
    మెండుగ తెలికడలి సరవి మించారె కదా



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బామ్మోయ్!
      చివరి మూడు ఇటుకలు సరిగ్గా ఉన్నట్టులేవే :)

      Delete
  2. Awesome 👌.
    ఆ అమెరికా “నయగారా” లు పోతుంది కానీ ఈ అద్భుత దృశ్యం ఏం తీసిపోయింది? ఏమిటో మనం పబ్లిసిటీ సరిగ్గా చేసుకోం 😕.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు.
      సారూ, కుతూహలం కొద్దీ అడిగాను. ఏమనుకోకండీ! మీరు నేషనలిస్టులా ? పెద్ద స్క్రేన్ మీద చూడండి 3D ఎఫెక్ట్ కనపడుతుంది.

      Delete
    2. పెద్ద స్క్రీన్ మీద కూడా చూశాను శర్మ గారు, బాగుంది.

      నేను ప్రత్యేకించి ఏ “ఇస్టు”నూ కాదు గానీ సహజంగానే మాతృదేశం అంటే అందరికి లాగానే “ఇస్ట”మే ... దైనందిన జీవితంలో ఎంత తిట్టుకున్నా కూడా 🙂. అయుతే మన దేశం లోనే ఉన్న ఎన్నో వింతలు విశేషాలకు తగినంత ప్రచారం, ప్రాముఖ్యం లభించడం లేదని నా పాయింట్.

      Delete
    3. క్షీర ధార జలపాతం దృశ్యకం ' ఏమిటప్పా ' లో ( ' WhatsApp ) వచ్చింది. చాలా బాగుంది. వర్షాకాలం లో ఇలా ఉధృతం గా ఉంటుంది అనిపిస్తుంది. అయితే నయాగరా లాంటి బృహత్ జలపాతం కాదు. భారత దేశంలో జోగ్ జలపాతం విశాలమైనది.

      ప్రకృతి సౌందర్యం , కడలి కెరటాలు, చందమామ, పర్వతాలు, జలపాతాలు ఎక్కడ చూసినా కనువిందు చేస్తాయి.

      Delete
    4. vinnakota
      sir,
      Thank you

      Delete
    5. బుచికి గారు
      వాట్సాప్ ని ఏమిటప్పా అన్నారా బాగుంది సార్! :)మంచి మాట చెప్పేరు. ఎక్కడైనా ప్రకృతి అందమే. మనదేశం లో దంటే అదో అభిమానం కదండి ;)

      Delete
    6. అవును, “ఏమిటప్పా” బలే కుదిరింది👌. సరైన ఆంధ్రీకరణ 🙂.

      Delete
    7. విన్నకోటవారు,
      వెయ్యండి వీరతాడు బుచికి గారికి కొత్తమాట వాట్సాప్=''ఏంటప్పా'' కి.

      Delete
    8. ఒకటేమిటి శర్మ గారు, రెండు వీరతాళ్ళు వేద్దాం 🎖🎖.

      Delete
  3. Replies
    1. బుచికిగారు,
      అందుకోంది వీరతాడు :)

      Delete
  4. ' ఏంటప్పా ' లేదా ' ఏమిటప్పా ' లాగానే

    ట్విట్టర్ కు కూడా ' పిట్టల్ ' అనే తెలుగీకరణ తోచింది సర్.

    ReplyDelete
    Replies
    1. మరో రెండు వీరతాళ్ళు 🥇🥇.

      Delete
    2. బుచికి గారు,
      బాగుందండి. అందుకోండి వీరతాళ్ళు :)

      Delete
    3. విన్నకోటవారు,
      అలాగేనండి వేయించండి బుచికిగారికి వీరతాళ్ళు. :)
      మా ఊళ్ళల్లో ఒక అలవాఅటండి. పుట్టిన రోజు దగ్గరనుంచి ప్రతి ఫంక్షన్ కీ ఫ్లెక్సీలు కట్టేస్తారండి. ఇప్పుడు కొత్త ట్రెండ్, "కరోనాను జయించి తిరిగొచ్చిన వీరుడు అన్న... కు స్వాగతం" మరిఇటువంటి ఏర్పాటు :)

      Delete
    4. Super buchiki 😁😆😁😆😆👏👏👏👏👏

      Delete
    5. ఈ వీరతాళ్ళ కార్యక్రమం కూడా చెయ్యవలసిన కార్యక్రమమే శర్మ గారు. ప్రస్తుత పరిస్ధితులలో ఆన్-లైన్ కార్యక్రమం చెయ్యచ్చు 🙂.

      Delete
    6. విన్నకోటసార్,
      కరోన టైమ్ లో వర్షాకాలంలో ఆన్ లైన్ మంచిది కదు సార్! అటులనే సార్
      ఈ రోజు మధ్యాహ్నం పెద్ద వర్షం, చక్కటి నీరు డ్రైన్ లోకి పోతుంటే ఎంత బాధేసిందో! ఈ నీటిని దాచుకోగలిగితే,ఎలా చేయాలి,ఎంత సంపు ఉండాలి పిచ్చి లెక్కలేసేననుకోండి.

      Delete


  5. అరె బుచికి ఏమిటప్పా
    సరి వాట్సాపున కతికె వసందుగ సుమ్మీ
    పరికింపంగ మన ప్రకృతి
    సిరి మన దేశమునకు భళి సెహభేషనగా

    ***

    పిట్టల్దొరలోయ్ ట్వీటర్స్!
    చుట్టేస్తూంటారు పల్కుచు, జిలేబివలెన్
    కట్టేస్తుంటారిటుకల
    చట్టనుచు పొడిపొడి పదపు చమకులమరగా


    ***

    ఇదె వీరతాళ్లు వేద్దా
    మిదె యచ్చతెలుగునకున్ భళీ బుచికీకిన్
    సదనపు కామింట్ కింగు ప
    సదనము లీయ పిలిచిరి విశాల హృదయులై


    నారదా!
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బామ్మా!
      పజ్జాలు బాగున్నాయి, ఇటకలు సరిగా ఉన్నాయోలేదో తెల్వదు గాని సొంపుగా ఉన్నాయి.

      Delete
  6. ఇన్నాళ్ళకి మెప్పువడసె
    బన్నించుజిలేబిసారుపద్యాల్,ఇక-యే
    గన్నయ్యా గిద్యాలని
    చిన్నంబుచ్చంగరాదు క్షేమం గాదూ .

    ReplyDelete
  7. రాజావారు,
    జిలేబి మేధావి, మేధాజీవి (భాషా ప్రయోగం బాగుందా సార్?) తెనుగు,సంస్కృతం,ఇంగ్లీషు,ఫ్రెంచ్,జర్మన్,కన్నడ,తమిళ్,మలయాలం భాషలు తెలిసినవారు.అరవై ఏళ్ళలోపు బామ్మ పట్టుదలగా ఛందం నేర్చి, తెనుగు పద్యాలు రాసినవారు.పలుగురాళ్ళు చాలానే ఉన్నాయి. "సాధనమున పనులు సమకూరు ధరలోన"ఈ మాట ఆధారంగా పద్యాలు రాసినవారు. "తెనుగున సుళువుగ నలుగురు పాడగ పలికెద సీతారామకథ,నే పలికెద సీతారామకథ", గుర్తుంది కదండీ.అదే జిలేబి ప్రయత్నమండి. బాగున్నపుడు పువ్వులు...అంతేనండి. ఇటిక ముక్కలు మంచి పద్యాలు కట్టమని తప్పించి మరేం కాదు. జిలేబి అంటే అభిమానం,చనువు, నేనో పెద్ద పంఖా :)

    ReplyDelete
    Replies
    1. మీరూ జిలేబి అనడం
      సారూ!బాగోదు వారి చక్కని పేరన్
      జీరుట బావుండునుగద
      సారించుడు దాన దృష్టి సకలము దెలియున్ .

      Delete
    2. మేధాజీవి ప్రయోగము
      శోధింపగనగును తమవచోవిధి యొప్పున్
      మేధోజీవని విందును
      మేధస్ ప్లస్ జీవనంగ మేల్ విభజింపన్ .

      Delete
  8. తొలినుండీ వారికి నే
    నలుపెరగని విసనకఱ్ఱ, ఆపై హితుడన్
    తెలిసీ తెలియని ఛాంధసు
    లులుకుచు నెద్దేవసేసి రూరకె మూర్ఖుల్ .

    ReplyDelete
  9. ఏమిటప్పా: వాట్సాప్ప్, పిట్టల్: ట్విట్టర్, మీగొట్టం: యూట్యూబ్, ముఖపుస్తకం: ఫేస్ బుక్, ఇట్టేగ్రాము: ఇన్స్-టాగ్రామ్, అంతర్జాల లేఖిని: వెబ్ లాగ్ (బ్లాగ్)

    నన్ను చూచి.. నీకచలే తొందరెక్కువా.. బుచికి వారి సౌజన్యం తో తోచిన కొన్ని తెలంగాణాంధ్రాయలసీమకరణ యాపులియేల్

    ReplyDelete