Thursday 23 July 2020

ఏమి సేతురా లింగా ఏమి చేతు

ఏమి సేతురా లింగా ఏమి చేతు   
ఏమి సేతురా లింగా ఏమి చేతు   

కరోనా కాలమాయె!
దారి కానదౌను లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు! మాహానుభావా!!  
 ఏమి సేతురా లింగా ఏమి చేతు!   

చీనా పుట్టిల్లాయే !
ప్రపంచమంతపాకె లింగా!!
ఏమి సేతురా లింగా ఏమి చేతు!   మాలింగమూర్తీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!   

తగులుకుంటే వదలదాయె!
 తేల్చునాయె చావొ రేవో లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!  మాదేవ శంభో!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!

మందేమో లేదాయె!
వేక్సిన్ రాదాయె  లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! మాలింగ మూర్తీ!!
 ఏమి చేతురా లింగా ఏమి చేతు!   

గోటి దనే దొకడాయె!
 గొడ్డలనే దొకడాయెలింగా!!
 ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిశూల పాణీ !! 
 ఏమి చేతురా లింగా ఏమి చేతు !

గాల్లో నిలవదనే దొకడాయె!
 కాదనుదొకడాయెలింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! హాలాహలధరా!!  
ఏమి చేతురా లింగా ఏమి చేతు!

కన్ను చాలానే దొకడాయె!
 కాదు కాదనే దొకడాయెలింగా!!
 ఏమి చేతురా లింగా ఏమిచేతు! మహా శివా!!
ఏమి చేతురా లింగా ఏమిచేతు!

ఏది నికరమొ తెలియదాయె!
 తిరమాయె చావు లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! త్రిపురాంతక శివా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! 

భయమేమో లావాయె! 
ఆకలి తప్పదాయె లింగా!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు! అన్నపూర్ణాపతే!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు!  

చాకిరేమో తప్పదాయె!
 మనుజులంటె భయమాయెలింగా!! 
ఏమి చేతురా లింగా ఏమి చేతు! గజచర్మధారీ!!
ఏమి చేతురా లింగా ఏమి చేతు !


 బాలమురళిగారికి అపరాధ శత పరిహార నమస్సులు అర్పిస్తూ


22 comments:



  1. ఏమీ చేయనక్కర లేదురా నా లింగా
    ఆ బూడిద కాస్తా నెత్తి పై పూసుకొనుమురా నా‌ లింగా
    యే యిక్కట్లూ దరి రావురా లింగా



    నెత్తి పై అయ్యరు వారి మూడు రేఖల
    భస్మమే మీకు హాలాహలుని కరోనా రక్ష


    జై భస్మేశ్వరాయ నమః


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నిటలాక్షుబూది కాస్తా
      ఇటుకలబూడిదగమారె,నిక ,కందమ్మే
      పటుమెడిసనగు, కరోనా
      గుటగుటలనుగూల్చ, నందుకొనుము,జిలేబీ !

      Delete
    2. బామ్మోయ్!
      ఇప్పుడే అందిన వార్త ''కరోనా వైరస్ కాదు బేక్టీరియా''. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ఉవాచ.కరోన ఉన్న మందులతోనే నివారింప బడుతుందిట
      నిటలాక్షుడే రక్షించాలి.

      Delete
    3. రాజావారు,
      అరవ పాటీ ఏ మేజిక్కయినా చేయగలదు :)

      Delete
  2. శర్మ గారు,
    తన పాటకు చక్కటి సమకాలీన అనుకరణ వ్రాసినందుకు
    బాల మురళి గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు లెండి పైనుండి.

    ReplyDelete

  3. // “ఇప్పుడే అందిన వార్త ''కరోనా వైరస్ కాదు బేక్టీరియా“ //

    మంచిదే శర్మ గారు. బాక్టీరియా గనక అయితే anti-biotics పని చేసే అవకాశం ఉందని, వైరస్ ల మీద anti-biotics పని చెయ్యవని అమెరికా ప్రభుత్వ సంస్ధ CDC (Centers for Disease Control & Prevention) వారి ఉవాచ 👇.

    https://www.cdc.gov/patientsafety/features/be-antibiotics-aware.html

    పై వెబ్-సైట్ లో సదరు పేరా 👇

    “Antibiotics do not work on viruses, such as those that cause colds, flu, bronchitis, or runny noses, even if the mucus is thick, yellow, or green. Antibiotics are only needed for treating infections caused by bacteria, but even some bacterial infections get better without antibiotics.“

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఒకరేమో వైరస్ అంటారు మరొకరు బేక్టీరియ అంటారు.
      ఒకరు దగ్గు,రొంప, జ్వరం పారాసిటమాల్ చాలయ్యా అంటే మరొకరు అమ్మో మందులేదయ్యా త్రాంబోసిస్ వచ్చి నరాలు చిట్లిపోతాయంటారు.
      కంటి చూపుతో అంటుకుంటుందంటే కాదుకాదు దగ్గరగా ఉండి స్రావాలు మనిషి నుంచి మనిషికి చేరాలి భయం అనవసరం.
      కాలి గోళ్ళు వేళ్ళు దెబ్బతీటాయి, ఇదీ లక్షణం ఒకరిమాట, మరొకరు నోటిలో పుళ్ళు ఏర్పడాతాయి తగ్గవు అని అంటారు ఇలా సామాన్యుడిని బతకనివ్వక చావనివ్వక చంపుతున్నారు.

      ఎక్కడికో హాస్పిటల్ కి పట్టుకు పోయినవారికి చికిత్స ఏం చేస్తున్నారు? పారాసిటమాల్, ఆవిరి పట్టడం, ఎండలో నుంచో బెట్టడం, విటమిన్ సి,డి లు ఇవ్వడం, బలమైన ఆహారం. రోగనిరోధక శక్తి కలిగించడం, వ్యాయామమ్ చేయించడం ఇలా ఎన్నెన్నో!

      ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థవారు వార్తలు ఎక్కువగా చూడద్దని ఉచిత సలహా!

      అంతా గందరగోళం ఏమిచేతురా లింగా ఏమి చేతు? ఇప్పటి దాకా కూటికి లోటు లేదు, ఇక ముందు పెట్టే దారిలేదు, ధరలేమో పెరుగుతున్నాయి,బతుకేమో భయంగా ఉంది. పంట వేసి నెల కావస్తూంది, మళ్ళీ చూడలేదు,ఆ నాలుగు గింజలూ పండించుకోకపోతే, వామ్మో, పొలం పోతున్నా .........

      Delete
    2. // “ వామ్మో, పొలం పోతున్నా .........” //

      మీ వంటి అన్నదాతలకు వందనం.
      పరిస్ధితులు బాగున్నట్లయితే సరదాగా మీ పొలాల వైపు వచ్చి ఆ పచ్చదనం, సొంపు చూసుండేవాళ్ళం కదా మేం కూడా 😕😕?

      Delete


    3. బాగా పండిన రోజుల్లో వెళ్లేరా లేక వారేమన్నా పిలిచేరా రండీ అంటూ కష్టకాలం వస్తే కదా పొలం గురించి ఇంత చర్చ



      నారదా

      జిలేబి

      Delete
    4. విన్నకోటవారు,
      పేదవాళ్ళం,సామాన్యులమండీ!కోటీశ్వరులం కాదు సుమా! :)మట్టిని నమ్ముకున్నవాళ్ళం, మట్టి మనుషులం. ఒకప్పుడైతే అందరిని రమ్మని పిలిచేవాడిని. పిలవనివారు కూడా వచ్చి వెళ్ళిన సందర్భాలూ ఉన్నాయి. విదేశాలనుంచి వచ్చి చూసి వెళ్ళిన వారూ ఉన్నారు. అదంతా గత చరిత్ర..అంతేనండి.ఇప్పుడు పిలవరా? రోజులు బాగుంటే, నందో రాజా భవిష్యతి....ఇప్పటి దాకా రోజు నడిచిపోయింది. ఇప్పుడు గింజలు పండకపోతే...భయంకరం, ప్రపంచం అంతా అలాఅవుంది, గింజలు లేక, కరువు ఖాయం. అందుకే ఈ శ్రద్ధ, ఓపిక లేకున్నా....పది రోజుల పైగా ఒకటే వర్షాలు.

      Delete
    5. బామ్మా!
      విదేశం లో ఉన్నప్పుడు పిలిచా! వచ్చారా? దేశంలో కొచ్చాకా పిలిచా వచ్చారా? ఎందుకండీ, ఇలా.
      ఎండ మండిపోతుంటే పాపం నాకంటే ముసలాయన, అభిమాని, ఇల్లు వెతుక్కుంటూ, ఆయన్ని చూసి బాధ భరించలేకపోయా!........ఎందుకు పంపడం

      Delete
    6. విన్నకోట వారు,
      మరచానూ. కొన్ని బ్లడ్ గ్రూపుల వాళ్ళకే కరోన ఎక్కువగా వస్తోందన్న వారొకరు.ఒక్కమాట మాత్రం అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆడవారికి కరోన రాదూ. వచ్చినా బహుతక్కువా. మరణాలు అతి తక్కువా , అని.మగవాళ్ళనే పట్టుకు పీడిస్తోంది. మగలక్షణాలున్న ఆడవారినే కరోన పట్టుకుంటోందేమో :)

      Delete
    7. కరోనాకు కూడా భయమండీ, భయం 😳

      Delete


    8. ముసలాయన, అభిమాని, ఇల్లు వెతుక్కుంటూ, ఆయన్ని చూసి బాధ భరించలేకపోయా!........ఎందుకు పంపడం...


      ఏమిటీ కథాకమామీషు ?
      ఇదేదో కొత్త ట్విస్టుగా వుందే ?



      జిలేబి

      Delete
    9. సారీ మేడం గారు, పొరబాటు పడ్డానండీ

      Delete
  4. “జిలేబి” గారు, శర్మ గారింటికి వెళ్ళడానికి (ఈ కరోనా టైములో కాదు లెండి) నాకు ప్రత్యేక ఆహ్వానం ఎందుకండీ?

    ReplyDelete
  5. // “ పేదవాళ్ళం,సామాన్యులమండీ!కోటీశ్వరులం కాదు సుమా! ” //

    దత్తుడు, పొలం వసతి కలిగిన వారూ అయిన మీరే “పేదవాళ్ళం” అంటే .... సుయోధనుడు చెప్పినట్లు “సూదిమొన మోపినంత” భూమి కూడా లేని నాబోంట్ల సంగతేమిటట శర్మ గారూ 🤔 ?
    🙂

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      వ్యసాయం మీద మిగిలేది తక్కువేనండి. మీ అభిమానానికి
      ధన్యవాదాలు.

      Delete
    2. శర్మ గారు, శంకర్ దాదా సినిమాలో అన్నట్టు మీరు మరీ అంత "వినమ్రుడు" లా ఉండాల్సిన అవసరం లేదు.
      నా అంచనా ప్రకారం ఇంకో దశాబ్దం తర్వాత అందరూ అన్నం కోసం రైతులని బతిమాలుకుంటారు. అప్పుడు రైతులే కోటీశ్వరులు.

      Delete
    3. బోనగిరిగారు,
      పెద్దలిచ్చిన ఆస్థి,పేరు నిలబెట్టాలనే తాపత్రయం తప్ప వేరేం లేదండి, అమ్ముకోలేని అశక్తత.సంవత్సరానికి ఎకరానికి పదివేలు మిగిలితే గొప్పండి,పెట్టుబడులు పోను.మమ్మల్ని ఆశ్రయించుకుని ఉండేవారు చాలామంది, కాదనలేని బలహీనత. వ్యవసాయం చేస్తే అనుకోకుండానే ఈ నమ్రత వచ్చేస్తుందేమోనండి.
      ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా పాటలో కవిగారు ఆశ పడ్డాడు, నీవే దిక్కని వత్తురు పదవోయ్ అని. ఏదీ? జరగలేదండి, ఇది ఉత్త మాటేనండి,ఎప్పటికిన్నీ

      Delete
  6. పేరడీ బాగుంది కాకపొతే నాదొక ఒక చిన్న సూచన.

    "ఏమి సేతురా లింగా" అన్న తత్త్వం అప్పుడెప్పుడో గుర్తు తెలువని కాలంలో రాసింది పేరు కూడా తెలీని ఎవరో ఒక రాతగాడు. అటువంటి మహోన్నత పల్లె పదాలు దేశప్రజల వారసత్వ జానపద సంపద.

    అంచేత బాలమురళికి "అపరాధ పరిహారం" చెల్లించాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
    Replies
    1. జై గారు,

      తత్త్వం రచన ఎవరిదో తెలియదు.పాత కాలపు రచనను అర్ధవంతంగా పాడి బహుళ జనాదరణ కలగజేసినవారు గనక బాల మురళి గారికి అపరాధ శత పరిహార నమస్కారాలందజెసేనండి, అజ్ఞాతకవికి కూడా నమస్కారాలు తెలిపి ఉండవలసిందే, పొరబడ్డాను. వారికూడ నమస్కారాలు తెలియ జేసుకుంటున్నానండి. మనకంటే ముందు తరాలవారు కదా, అందుకు గౌరవం చూపించానండి, మన్నించలేరూ.

      Delete