Monday 6 July 2020

గడ్డి గుడిసెలు-గూన పెంకలు




గడ్డి గుడిసెలు గూన పెంకలు
మట్టి గోడలు మాయమాయే

మోటబావులు పూడిపోయే
ఊటబావుల ఊసె లేదే

వరికల్లం కానరాదే
వడ్లు ఇంటికి చేరవాయే

బండిఎడ్లు ఏడబోయే
బర్రె తలుగు కానరాదే

ఒడ్ల గుమ్ములు ఒరిగిపోయే
కుడితి గోలెం ఇరిగిపాయే

మొక్కజొన్న చేనలల్ల
మంచెలన్నీ కూలిపోయే

పొద్దు తిరుగుడు చేనులన్నీ
ఆ పొద్దుకోసం ఎదురుచూసే

వెదురు షాటలు పెండ్ల తట్టలు
పెంటకుప్పల కూలిపోయే

బడికిపోయేబత్త సంచీ
బుక్కులెయ్యని ఎక్కి ఏడ్చే

చెక్కపలక సుద్దముక్కా
సూద్దమన్నా లేకపోయే

మర్రి చెట్టు ఉయ్యాలలేవీ
ఈత పండ్ల జాడలేవీ

మోదుగు పూల హోళీ రంగు
ఎరుపు తగ్గీ ఎలిసిపోయే

సిర్రగోనెలు సెదలుపట్టే
శిలుక్కొయ్యలు శిధిలమాయే

మంచినీళ్ళ మట్టికుండలు
మట్టిలోనే కలిసిపోయే

తేనెటీగల గోండ్రు కప్పల
రాగమేదీ తాలమేదీ

నింగిలోన పిల్లలకోడి
నిద్రపోయి లేవదాయే

గడ్డిగుడిసెల గూండ్లు కట్టిన
బుర్రు పిట్ట ఎగిరిపోయే

మనిషి ఆడిన కోతికొమ్మ
ఇపుడు కోతులొచ్చీ ఆడబట్టే

రచ్చబండ రంది తోటి
మంది ఏరని ఎదురు చూసే

తిరిగిరానీ రోజులన్నీ
తలుసుకుంటూ తల్లడిల్లే

జ్ఞాపకాలను మది మందిరంలో
దాచుకుంటూ సాగిపోతూ.....

జానపద అజ్ఞాత కవి కి నమస్కారం.

ఇది తెలంగాణా ప్రాంతంలోని జానపద గీతంగా తలుస్తాను, కొన్ని పలుకుబడులకు అర్ధం చెప్ప గలను. 
Courtesy Whats app







13 comments:

  1. శర్మ గారు,
    పాట బాగుంది. ఆ అఙాత కవి తెలంగాణా వారు గనక అయ్యుంటే జై గొట్టిముక్కల గారికి తెలిసే అవకాశం ఉండచ్చు.

    కుప్పకూలిపోతున్న గ్రామీణ వ్యవస్ధ గురించిన ఆవేదనతో దాదాపు ఇటువంటి భావాలతోనే కూడిన మరొక పాట, బహుళ ప్రాచుర్యం పొందిన పాట మరొకటుంది, మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖ తెలంగాణా కవి గోరటి వెంకన్న గారు రచించిన "పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల" అనే పాట. దీన్ని సినీనటుడు కీ.శే.శ్రీహరి "కుబుసం"అనే సినిమాలో పెట్టుకున్నారు, నటించారు కూడా. పాట, దాని సాహిత్యం ... లింకులు ఈ క్రింద ఇస్తున్నాను. మీకు నచ్చుతాయని నా నమ్మకం.

    పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల (సాహిత్యం)

    పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కుట్రల (పాట) ("కుబుసం" సినిమాలో)

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      గోరటి గారి పాటలంటే ఇష్టం. విరిది జానపద పాటల కార్యక్రమం ఒక ట్.ఇ.వి లో వచ్చేది,ఇప్పుడు వస్తున్నదో లేదో తెలీదు. ఉత్తరాంధ్ర జానపద కవి వంగపండు, ఏం పిల్లడో ఎల్దమొస్తవా తో ప్రసిద్ధి. మీరిచ్చిన రెండు లింకుల్లో గోరటి గారి ఆ పాట అందుబాటులోకి రాలేదు.

      Delete
  2. చాలా కృతజ్ఞతలు.. కరోన కాలంలో కాలక్షేపం కోసం రాసిన గేయం.. ఇంత ప్రాచుర్యం పొందడం నా అదృష్టం..

    ReplyDelete
    Replies
    1. సురేష్ గారు, (Suresh Adupa)
      ఈ జానపదం మీదా! ఇలా వదిలేస్తే ఎలాగండి, బాగున్నదానిని స్వంతం చేసుకునే లోకం కదా!
      జానపదం బాగుంటే పంచుకున్నానండి..అంతే

      Delete

    2. ఇట్లా కాపీ రైటంటే కాపీ కొట్టుటకు రైటని మీరూ కా పీ కొడితే ఎట్లాగండీ తాతగా రూ ?




      జిలేబి

      Delete
    3. జిలేబి
      చదువుకోక ముందు కాకరకాయ అనేవాడు చదువుకున్న తరవాత కీకరకాయ అనడం మొదలెట్టేడట అలా ఉంది తమ వ్యవహారం :)

      Delete
  3. ఈమధ్య జిలేబీలో
    'ధీమమ్ములపులుపు' చచ్చె, దేనికి సారూ?
    ఏమో? విబుధుల జట్టుల
    సామీప్యలందు మెలుగు సంగతివలనా ?

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      జి౯లేబిని చదవేస్తే ఉన్నమతి పోయింది, ఇలా తయారయింది...
      చదివించిరి నను గురువులు అంటోంది......పాపం జిలేబి :)

      Delete
  4. గురుదేవులు కడు ఘనులు , క్ష
    వరమున , తద్గురు ముఖాన , పద్యవిరచనా
    వరవిద్యనేర్చి , మండిత
    శిరసాంగులయిరి , జిలేబి శ్రేష్టులు మహితా !


    ReplyDelete
  5. ఎవరు రాశారో చెప్పండి ప్లీజ్

    ReplyDelete
    Replies
    1. Unknown
      ప్రచురించే నాటికి కవి పేరు నాకూ తెలియదు. అందుకే అజ్ఞాత కవికి నమస్కారం చేశాను. ఆ తరవాత అడుపా సురేష్ గారు పై పాట తానే రాశానని కామెంట్ లో రాశారు. చూడండి.

      Delete