Sunday 26 July 2020

.మదికదిలినవేళ

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనగా చెబుతున్నారు.

భార్యభర్త కీచులాడుకున్నారు. అది పెరిగి పెద్దదీ అయింది. జీవితం లో నీ మొహం చూడను,నీతో కలిసిబతకను. విడాకులేకావాలి అమ్మాయి పట్టు. నీవు లేక నా జీవితం లేదు, వ్యర్ధం అబ్బాయి మాట. ఎవరిపంతం వాళ్ళు వదలలేదు. చివరికి కేసు పోలీసులకి ఫేమిలీ కోర్టుకు చేరింది. అమ్మాయిని పోలీసులు కన్విన్స్ చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. సరిపడలా. అప్పుడు అబ్బాయికి వచ్చిన చిన్న ఆలోచనే ఈపాట. నా భార్య మనస్సు నాకు తెలియదా? నేనే నా భార్యను సముదాయించుకుంటానని ఈ పాట పాడి ఆమె మనసు మళ్ళీ గెలుచుకున్నాడు.ఆ పాట అర్ధం ఎవరేనా చెబితే ఆనందం.మాటకున్న పవరెంత? కవికి నమస్కారం.


https://youtu.be/GiYsvyMWnAk

మధురం మధురం ఈ సమయం 
ఇక జీవితమే ఆనందమయం.
తొలగిపోయె పెను చీకటి తెరలూ
లగిపోయె అనుమానపు తెరలు
పొంగి పొరలె మనకోర్కెల అలలు
భావియే మనకు నందనవనముగ.
మధురం మధురం ఈ సమయం 
ఇక జీవితమే ఆనందమయం.

Coutesy:పాత చినిమా పాట. కవిగారికి వందనం.
Courtesy:Whats app

21 comments:



  1. పరామర్ష్ కేంద్రానికి ప్రమోషన్ నటులండీ వారు తాతగారు :) కల నిజమైతే మంచిదే :)


    మధురం మధురం ఈ సమయం
    ఇక జీవితమా కరోన మయం :)




    జిలేబి

    ReplyDelete

  2. బామ్మా!
    నిజమని నమ్మేసేను జూడు.సిత్రం. పల్లెటూరోన్ని కదా!మంచి జరిగిందిగాబోలని పాట కూడా పాడెసినా పేరడీ.ఏమైనా బామ్మ బుర్రే బుర్ర కదా!చనంలో పట్టేసినాది :)చిన్న కత చెప్పనా? కరోన కతేలే :) వద్దులే రేపు చెప్పుకుందాం.

    ReplyDelete
    Replies


    1. పల్లెటూ బుల్లి తాతయ్య :)
      అన్నీ తెలుసూ కానీ ఏదీ తెలీదని చెప్పే హమ్ బుల్ మనీషి

      Delete
    2. బామ్మా!
      దమ్మిడీ పన్నేదు, కాన్డబ్బు సాంపదన్నేదు, యాష్టేలని సేలో బయలెల్లినా. ఏటికైనా సుకమేనని ఫోన్ గొట్టినా గుంటడికి. ”రావద్దు బాబోయ్! ఊరంతా అల్లకల్లోలంగా ఉంది, నే నే రెండు రోజులకోసారి చేలో కెళతన్నా.రావద్దూ, చెత్తకోతైపోయింది,పిండెయ్యాలీ” అనేసినాడు, బొట్టిడు.ఏటి చేసీదీ అని కూకడ బడిపోయినా, దీనికాడ. ఊరికెల్తన్నం కదా అని టపా రాయ లేదు.సిటిక లో టపా రాసి ఏస్తా చూడుమీ. నీకేటి పాస్ పీస్ అంతన్నావు నాకేటి ఎరిక నేదు తల్లో!

      Delete


    3. ఇది టెల్గేనా మరీ గొల్టీ :)



      జిలేబి

      Delete
  3. తాతా మనవ ళ్ళిరువురు
    తోతాపురిమావిపళ్ళతో సమ మధుర
    శ్శ్రోతృ శ్రవపేయంబుగ
    కోతలు గోసెడిని యెంత కోవిదులొగదా !

    ReplyDelete
    Replies
    1. బుగతా!
      కాన్డబ్బు కల్లు తాగి ఊరంతా ఊసినాడని సావెత.ఏటో బావులూ ఆయమ్మేటో అంతావున్నాది. ఇంగిలిపీసులో పీస్ పాస్ మంతన్నాదాదొరసాని. తవరుగారేటో అంతన్నారు. నాకేటి ఎరుకనేదు బావులూ.ఏటి బావూ ఇసేసికం

      Delete
    2. యావురేటి శర్మ గారో.. గా బాష ఏటో తెల్సి దెల్వకున్నది.. చలి రేతిరి ఇటుల నుండ బట్టే వర్షం దీనాము కురుస్తాదేమో.. ఔ.. గా బుడతడికి కల్లు వాసన పడదాయే గాబోలు.. ఊరంత ఊసి వాంతి జేస్ఖుండు మరపుడు దాని జోలికి యాదానికి బోవాలే.. యాక్.. ఫిరీ గా ఒచినాగుందని ముంత ముంచాడట ఎవరో.. పుట్టి బాయే.. ముంత బాయే.. ఈ వరదల్ కి దోమల్ చెరువాయే.. బ్యాడ్ నైట్.. ఆల్ ఇన్.. తార్ టీన్.. ఏది పొగబెట్టినా.. పగబట్టి కుడుతున్నాయి.. ఏబీఓ అన్ని జీర్ణించుకుని.. ఇదివరకిట్ల సైన్మ పాట ఉండా.. హా.. గదే.. చిలలపై షిప్పాలు సెక్కినార్ కదేటి.. దానొల్ల పెరఢి గొట్టి.. ఇట్లుంది.. శిల్పము పై శిలలతో గీకినారు పగవారు కోటనే శిథిలముగా మార్చినారు..! ప్చ్..!! ఇంతెనొల్ల..

      Delete
    3. హా.. ఏమిటో అయ్యా.. ఆయమ్మ ఏదో చెప్పినారు.. (బిజిలే అమ్మణ్ గారినుద్దేశించి) ఇంగ్లిష్ లో ఏదో పీస్ పాస్ అంటున్నారామే..మీరు ఇంకేదో అంటున్నారు (రావు గారినుదెశించి) నాకైతే ఏమి అర్దం కాలేదు సుమి.. ఏమిటి విశేషం..

      పసిగట్టేశా శర్మ గారు..

      Delete
    4. శ్రీధర్,

      వంగపండును స్మరిస్తూ.

      కోడిబాయె లచ్చమ్మదీ
      అరరె
      పందిబాయె,నందిబాయె...కోడిబాయెలచ్చమ్మదీ
      కంటిబాయె, పుంటిబాయె..కోడిబాయెలచ్చమ్మదీ
      తోడుబాయె పోడుబాయె...కోడిబాయె లచ్చమ్మదీ

      Delete
    5. జానపదం.. జనుల పదం.. తప్పెట గుళ్ళ మోత.. గజ్జలతో సైయాట.. వంగపండు గారి జానపదాలు మంచిగుంటాయి ఆచార్య

      Delete
  4. పసిగట్టేశా శర్మ గారు..
    చెప్పెయ్యరాదు బిడ్డా :)

    ReplyDelete
    Replies
    1. పశ్చిమ గోదారి యాస.. కదాండి శర్మ గారు..

      Delete
    2. గదే.. చిలలపై షిప్పాలు సెక్కినార్ కదేటి.. దానొల్ల పెరఢి గొట్టి.. ఇట్లుంది.. శిల్పము పై శిలలతో గీకినారు పగవారు కోటనే శిథిలముగా మార్చినారు..! ప్చ్..!! ఇంతెనొల్ల.

      Delete
    3. చెప్పేయనా గురువర్య..

      తమరి నామ ధేయం.. మాచనవఝుల వేంకటదీక్షితులు అలియాస్ చిర్రావూరి భాస్కర శర్మ గారిస్మి..

      నేను పుట్టిన ఇరవై ఒక రోజుల తరువాయి మా తాతగారు తనకి తెలిసిన అవధాని శాతన రామయ్య గారికి మా తాత తన మనవడి పేరు (అంటే నా పేరు) పెట్టాలని అడగాలని వెళ్ళారుట.. ఐతే తాను సూచించిన పేరు శ్రీధర్.. ఆ పేరుని అనుకుంటు దారి పొడవున.. దారిలో ఒక చోట ఆగి కాసిన్ని మామిడి పండ్లు తెంపుకున్నారట.. (మా తాతగారి ఊరి రోడు ఇరువైపుల మామిడి చెట్లు ఉంటాయి.. అదీను అపుడు వేసవి కావడం చేత).. తీరా ఇంటికి చేరుకున్నాక.. అమ్మ, నాన్న, నానమ్మ అడిగారట.. ఏమ్ పేరు సూచించారని.. ఐతే మామిడి పళ్ళ ధ్యాసలో పడి కాస్త ఏమారుపాటుకు గురై మరచిపోయారట.. ఆ రోజు అక్కడికి నన్ను చూడటానికి చాలా మంది గుమ్మిగూడారట.. ఐతే మా తాతగారికి ఒకరెవరో పలకరించారట.. అతని పేరు భాస్కర్ అటా.. ఆఁ గుర్తుకొచ్చింది.. ఆ పేరు నోరు తిరగటం లేదు.. రేపెల్లుండి వీడిని చూడటానికి స్వయాన అతనే వస్తారు అపుడు అడుగుదాం అన్నారట.. అపటిదాక భాస్కర్ పేరుతో పిలవటం మొదలు పెట్టారు.. రెండు మూడు రోజులైయ్యాక అవధానుల వారే విచ్చేసి భాస్కర్ కాదు శ్రీధర్ అని రాసి మా నాన్నగారి చేతికి ఇచ్చారట.. కాని నేను ఈ రోజుకి కూడా మా నాయనమ్మ ఊరెళితే నన్ను భాస్కరనే పిలుస్తారు.. భాస్కర్ అంటే సూర్యనారాయణ.. శ్రీధర్ అంటే ఆది నారాయణ.. ఏదేమైనా విష్ణువుని పేరే గనుక.. ఆయా పేర్లలో ఏ పేరుతో పిలిచినా పలుకుతా..

      కొసమెఱుపు: రెండేళ్ళ క్రితం నాకు నిశ్చితార్థం అయ్యాక ఒకానొక సారి మాయావిడ తొలిసారి నాకు రింగ్ ఇచ్చింది.. ఎంగేజ్మెంట్ రింగ్ కాదండి.. ఫోన్ రింగ్.. అపుడు తనకి డెయిలింగ్ టూ భాస్కర్ అని వస్తోందిట స్క్రీన్ పై.. వాయమ్మో.. ఎవరికో వెళిపోయిందేమోనని కంగారు పడిందిట.. పెళ్ళి అయ్యాక చెప్పి ఒహటే నవ్వులు..

      ఆ శాతన రామయ్య గారు.. మా నాన్న గారికి చదువులో గురువు గారు.. మా నాన్న గారితో పాటు మా ఇద్దరు చిన్ని నాయనలకు పెండ్లిలు తన చేతులు మీదుగానే జరిగాయి.. [బిఫోర్ కరోనా 2000 సం. లో పరమాపదించారు.. 2014 లో మా నాయనమ్మ స్వర్గస్తులయ్యారు.. 2019 లో మా తాతయ్య శివైక్యం చెందారు..]

      Delete
    4. బిఫోర్ కరోనా 2000 కు ముందు శాతన రాయమ్మ గారని రాయటం మరిచితి.. ఎర్రాట

      Delete
    5. కష్టపడ్డారే :) ఎవుడైనా ఎంకటేసుడే సావీ

      Delete
    6. అది ఉత్తరాంధ్ర గ్రామీణం

      Delete
    7. సిక్కోలు యాస నాగున్నాదొల్ల.. కదేటి.. ఐనా.. సిక్కోలిజియానగిరిశాపటంతూర్పుపడమరగోదారి లంక గ్యామ్యాల ఉత్తరాంధ్రీయమే.. గురైతల్వా..

      Delete
    8. ఉత్తరాంధ్రీయం “ఇశాపటం” వరకే, భూక్యా గారు.

      Delete
    9. అట్నే ఆచార్య.. నేనేరిగేదను.. నా సంధి అచ్ఛర మాల "సిక్కోలిజియనగిరిశాపటం" వరకే కలిసొచ్చిదనె అట్రాస్తినాచార్య.. క్షేమమే కదా అందరును..! మీకు శర్మ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు.. ఈ మూడు ఈదురు గాలుల ఆరు చినుకుల కాలం లో అదీను కోవిడ్ కాలమున అందరు క్షేమంగా ఉండాలని.. ప్రతి వారు ఆరోగ్య పరంగా, సుఖ సంతోషాలు, ధనధాన్యాదులతో వర్ధిల్లాలని ఆ ఏకదంతుణ్ణి ప్రార్థిస్తు..

      Delete