కొత్తిమీరి కారం
కరోనా వచ్చినారికి మందుగానూ, రాని వారికి రోగ నిరోధకంగానూ నిమ్మకాయ వాడమంటున్నారు విటమిన్ సి కోసం. ఇలాటిదే మరొకటి ఉసిరికాయ. ఉసిరి కాయంటే రాచ ఉసిరి లేదా పెద్ద ఉసిరి. దీని నిలవ పచ్చడి నల్లగా ఉంటుంది అందుకు దీన్ని నల్ల పచ్చడి అంటారు, ఇది అణువణువూ విటమిన్ సి. కాని దానిని ఇప్పుడు వాడ కూడదన్నారు. అది వాడే సమయం వేరు. ఈ నిమ్మకాయ రసాన్ని తాగమంటున్నారు. దానితో పాటు కొత్తి మీర చేర్చి పచ్చిమిర్చి,ఉప్పు చేర్చి కొత్తిమీరి కారం చేసుకు తింటే బలే రుచి. వ్యాధినిరోధానికి మరొకటి కొత్తిమీరి చేర్చినట్లవుతుంది. కొత్తిమీరి అంటే మరేంకాదు ధనియాలే :)
కొత్తిమీరి తీసుకోండి నీటిలో ఝాడించండి. ముక్కలుగా తరగండి. స్తీలు పాత్రలో వేయండి. నిమ్మకాయ రసం పిండండి,చిటికెడు పసుపు వేయండి, తగిన ఉప్పు చేర్చండి, పచ్చి మిర్చి తొక్కి కలపండి. దీనిలో కొత్తిమీరి చేర్చండి, కలిపేయండి,బాగా. రుచికరమైన మందు కొత్తిమీరి కారం రెడీ :)
నిమ్మ రసం పిండుకోండి. తగిన ఉప్పు జత చేయండి. లేత బీరకాయ ముక్కలు, లేత దొండకాయ ముక్కలు, మరీ ముదురుకాని పచ్చి మిర్చి ముక్కలు, చిన్నవిగా తరుక్కోండి. ఒక స్టీల్ పాతర్లో వీటిని కలిపే ఉంచండి, చిటికెడు పసుపు వేయండి.రెండు మూడు గంటలు తరవాత అన్నంలో కలుపుకు తినండి, అద్భుతం. పప్పు అన్నం ఐతే చెప్పేదే లేదు.
పైన చెప్పినవి బాగానే ఉన్నాయి కాని చేసుకోవడం తలనొప్పి అంటారా! మరో చిన్న చిటకా.నిమ్మకాయ ను పిండి రసం తీయండి. తగినంత ఉప్పు వేయండి చిటికెడు పసుపు వేయండి. వేయించిన్ జీలకర్ర కారం కలిపేయండి బలే ఉంటుంది. నోటికి బలే రుచిగా ఉంటాయి,ఆహారం తీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంటే చెప్పక్కర లేదు.
నిమ్మరసంతో పచ్చి బీరకాయముక్కలు.
నిమ్మ రసం పిండుకోండి. తగిన ఉప్పు జత చేయండి. లేత బీరకాయ ముక్కలు, లేత దొండకాయ ముక్కలు, మరీ ముదురుకాని పచ్చి మిర్చి ముక్కలు, చిన్నవిగా తరుక్కోండి. ఒక స్టీల్ పాతర్లో వీటిని కలిపే ఉంచండి, చిటికెడు పసుపు వేయండి.రెండు మూడు గంటలు తరవాత అన్నంలో కలుపుకు తినండి, అద్భుతం. పప్పు అన్నం ఐతే చెప్పేదే లేదు.
నిమ్మకాయ కారం.
పైన చెప్పినవి బాగానే ఉన్నాయి కాని చేసుకోవడం తలనొప్పి అంటారా! మరో చిన్న చిటకా.నిమ్మకాయ ను పిండి రసం తీయండి. తగినంత ఉప్పు వేయండి చిటికెడు పసుపు వేయండి. వేయించిన్ జీలకర్ర కారం కలిపేయండి బలే ఉంటుంది. నోటికి బలే రుచిగా ఉంటాయి,ఆహారం తీసుకోడానికి ఇబ్బంది కలుగుతుంటే చెప్పక్కర లేదు.
ReplyDeleteనోరూరు తోంది
వయసు కుర్రో వద్దో మొర్రో అంటోంది :)
జిలేబి
జిలేబీ,
Deleteరెండు రోజుల్నుంచి ఉదయం నాలుక్కి లేవటం లేదేం? ఏమిటి అయిందీ?హుషారు లేకపోతే కరోనా ఖాయం :) ఈ వయసుకి కావలసినవే నవి. నోటికి రుచయిన మందు,ఆహారం ఒకటే ఐతే భలే కదూ!అదే ఇది. ట్రై, ట్రైచెయ్యవమ్మా! లేప్ టప్ ముందు కూచుని కదలకపోతే............చెప్పనా? :) :)
నాలుక్కి లేవ లేదా ?
Deleteనాలా మీలా పనుల ? పనాళ్ళున్నార్గా !
మేలుగ నిద్రోవనియర ?
తాలదు ఈ పద్యహేల తప్పదు రేలన్ .
చిట్కాలు బాగానే ఉన్నాయి. మరి మొదటి రెండింటిలోనూ తిరగమోత పెట్టనక్కర లేదా, శర్మ గారు ?
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteపైన చెప్పినావాటిలో దేనికి పోపు అక్కరలేదు. నేచురల్ గా తినెయ్యడమే, పచ్చివి
ReplyDeleteమూస్కో మూతి కరోనా
కాస్కో వచ్చెన్ విరుగుడు కాస్తైనా లే
వేస్కొమ్మ నిమ్మ కారము
చేస్కొమ్మా కొత్తిమీర చేర్చి జిలేబీ
జిలేబి
బామ్మ గారూ!
Deleteఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడూ, డ్రైవ్ చేస్తుండగా ఎ.సి కార్ లోనూ మూతికి ముక్కుకీ అడ్డుగా గుడ్డక్కర లేదు :) నలుగురిలోకి వెళ్ళినపుడు,మరొకరితో ఎదురెదురుగా మాటాడేటప్పుడు, మూతికి ముక్కుకీ గుడ్డ అడ్డు కావాలి.
ముక్కుకు మూతికి మాస్కుల్
Deleteపక్కన కోవిడ్ విహారి భయపెడుతుంటే
అక్కా జిలేబిసారూ !
అక్కజ మిది పిండివంట లయ్యరు సేయన్ .
రాజావారు,
Deleteరాత్రి పన్నెండుకి ఇటకల బండి వచ్చేదాకా నిద్దరోదు. పడుకోవే అని అయ్యరు గారు నస పెడుతూనే ఉంటారు. అప్పుడు పడుకున్నావిడ నాలుక్కి లేచి కాఫీ కాపీ అని అరుస్తుంటుంది ఇటకలు సద్దుతూ. నాలుగుంపావు మొదట సద్దిన ఇటకల్ని విసురుతుంది. అక్కడ మొదలు. లేప్ టాప్ దగ్గరనుంచి కదిలితేగా :)
రెండురోజులనుంచి నాలుగ్గంటలకి ఇటకలు విసరడం లేదు. అందుకడిగా! పోనివ్వండి కరోన కాలం కదా అని అడిగానంతేనండి.
Deleteఇటకల విసురు నాలుగు ఇరవై యెనిమిదికే వుందే ? ఎక్కడ చూసేరో తాతగారు :(
జిలేబి
పొద్దుటే లేవగానే గుమ్మలో పడ్డ ఇటుకల్ని ఎత్తిపోసుకోవడం అలవాటయిపోయింది. రెండు రోజుల్నించి ఇటుకలు కనపళ్ళా అదనమాట.
Deleteపోస్ట్ చూసిగాని కిచెన్ లోకెళ్ళేరో వేలే తెగ్గోసుకున్నారో, దొండకాయే తెగ్గోసేరో తెలియక కంగారు పడిపోయా :)
Deleteమీ పోస్టు ఓ రెండు గంటలు లేటేమో :)
అవునౌను లింగా
Deleteఏమి చేతురా లింగా ఏమీ చేతు?
Deleteబామ్మ గారి పై గురిపెట్టేముందు ఒకటికి వెయ్యి మార్లు సరి చూసుకుని బాణ మెక్కుపెట్టవలె :)
నారదా!
జిలేబి
నా గుమ్మంలో ఇటకలు లేవన్నా! బామ్మ బుర్రలో బలుబెలగలా
Deleteఏమి చేతురా లింగా ఏమిచేతు
Deleteఇటుకల నెచ్చట వెతికితిరి ? :)
ఇటుకలు కందోత్పలమున
ReplyDeleteనటు నిటు పేర్వంగ జూచి నాదో లెక్కా ?
నిటలాక్షుడు బ్రహ్మ హరియు
గుటకలు వడి రర్థమవక , గోక్కొనె శిరమున్ .
ఏమి చెప్పుదును ఓరాజా!
Deleteమీకెదురే లేదిక మహరాజ!!
Deleteఇటుకలు సిమెంటు కాంక్రీ
టు టాపు లేకన్ గృహమ్మెటుల వచ్చునయా
కిటుకెక్కడ కష్టము పడ
క టక్కున గడి వడి విద్దె కయి వచ్చుటకున్
జిలేబి
గురుదేవుని వీధిబడికి
Deleteపరుగున 'డబ్బిచ్చి' చనిన 'పవ' రింతేనా ?
గురిజూచి గుండు వగలగ
సరగున ఇటుకేసి కొట్టు , సారు ! జిలేబీ !
Deleteనేటి నిద్ర మానుకోకండి
"మా మీ" యుద్ధం నిర్విరామం
నిద్రే ఆనందారామం
చీర్స్
జిలేబి
రాజావారు,
Deleteమన చిన్నప్పుడు కిరాణాకొట్లలో ఒక చెక్కపెట్టి దానికి మూత మీద ఒక చిన్న చిల్లు, దానిలోంచి లోపలికి డబ్బు వేసేవాడు గుర్తుందా? బామ్మ గల్లా పెట్టీ అటువంటిదే. వెయ్యడమే తియ్యడం లేదు. గురువుకి బామ్మ బహుమతి కరక్కాయ :)
నిద్రాయతలోచన! నిర్
ReplyDeleteనిద్రపరంజ్యోతి, కృష్ణు, నీరజనేత్రున్
భద్రముగా శ్రావణమున
నిద్రాసక్తతలు మాని నియతిన్ గొలుమా !