మునగ ఆకు పచ్చడి
మునగ/ములగ ఎలగైనా వాడతారు. ములగ పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నదే.ములగ నీటిని శుద్ధి చేస్తుంది. ములగ కాడ వాడకం తెలిసినదే. కూర చారు వగైరాలలో ఎక్కువగా వాడేదే. బలవర్ధక ఆహారం. ములగ లో ఇనుము ధాతువు ఎక్కువ. ఆషాఢ మాసం లో ములగ కూర తినాలని అంటారు. ములగ ఆకు కొంచం వాసన ఉంటుంది, ఎక్కువ మంది ఆకును ఇష్టపడలేకపోవచ్చు, పప్పులో కలగలుపుగా వాడుకున్నా. అందుకు పచ్చడి చేసి చూడండి ఇలా. గుప్పెడు ములగ రెమ్మలు విరవండి. కొన్ని లేతవి కొన్ని ముదురువి. చీడ పీడ చూడండి. నీటిలో జాడించంది. ఆపైన ఆకుకోయండి. తడిగా ఉంటే ఆరబెట్టండి. కొద్దిగా చమురు వేసి మూకుడులో వేయించండి. ఆపైన గోంగూర పచ్చడిలా చేసుకోండి. కొద్దిగా చింతపండు ఎక్కువ వేస్తే బాగోవచ్చు. ఖర్చులేని బలమైన వంటకం,సులువుగా అరుగుతుంది. ఇప్పుడి మినగాకు కూడా ఎగుమతి చేస్తున్నారట.ఇలాటిదే మరొకటి పొన్నగంటి కూర, ఇది కళ్ళకి మంచిదిట, పచ్చడి చేసుకుంటే బాగుంది పైన చెప్పినట్టే.
ReplyDeleteగుప్పెడు ములగ రెమ్మలు విరవండి.
ఎక్కణ్నుంచి విరిచేది ? :) అంతా పేకమేడల ఇళ్లాయె :)
కొద్దిగా చమురు వేసి మూకుడులో....
పెట్రోలు , డీసెలు ధరలు ఆకాశంలో వున్నాయి. కడాయిలో పోసుకునే స్తోమతుందంటారా :)
జిలేబి
జిలేబిపాటీ
Delete//ఎక్కణ్నుంచి విరిచేది ? :) అంతా పేకమేడల ఇళ్లాయె :)//
అవును చేతులు కళ్ళు విరుచుకోవాలి :)
//పెట్రోలు , డీసెలు ధరలు ఆకాశంలో వున్నాయి. కడాయిలో పోసుకునే స్తోమతుందంటారా :)//
కడాయిలో పెట్రోలు,డీసిలూ పొయ్యరమ్మా!అయ్యరు గారిని అడుగుతల్లీ!పొరబాటున వంట చెయ్యకేం :) కరువొస్తుంది.
ReplyDeleteతీక్ష్ణమూలకసవ్యంజనము అని టపా టైటిల్ పెడితే బాగుంటుందని నా ఉబోస :)
జిలేబి
Zilebi
Delete/తీక్ష్ణమూలకసవ్యంజనము/
పిల్లిని బల్లిమింగె :)
మీరూ, “జిలేబి” గారు ఏమైనా తేల్చుకోండి గానీ నా తక్షణ కర్తవ్యం మాత్రం ఈ పచ్చడి గురించి మా ఆవిడకు తెలియకుండా జాగ్రత్త పడడం 😉.
ReplyDeleteమునగ ఆకుతో కూర చేస్తేనే నేను భరించలేను (తినను కూడా), ఇంక పచ్చడి కూడానా 😳, నో, ఎంత ఆరోగ్య సూత్రాలు చెప్పినప్పటికీ😕 .
విన్నకోటవారు,
Deleteఆ వాసన నాకూ కిట్టదండి. కాని కోడలమ్మాయి పచ్చడి చేసింది, బలే ఉంది తిన్న తరవాత చెప్పింది, మునగాకు పచ్చడని, ట్రై చెయ్యండి :)
ఈ విషయంలో విన్నకోట వారితో ఏకీభవిస్తాను. ఎన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పినా తినను గాక తినను. .............. మహా
Deleteబులుసువారు,
Deleteఏం చేస్తాం కాదంటుంటే :)కొంతమందికి నచ్చదండి :)
Thank you బులుసు వారు ..... మహా 🙂
Deleteవిన్నకోటవారు,
Deleteమేడం గారితో చెప్పిస్తే వెల్లుల్లితో తిలపిష్టం నచ్చచ్చేమో, ఆ తరవాత మునగాకు :)
“మేడం” గారు చెప్పినా సరే వెల్లుల్లి తినే “ఛాన్సే లేదు” (అరవల ఊతపదం వాడాలంటే) 🙂.
Delete
Deleteతీక్ష్ణమూలకము నచ్చని మనుషులు కూడా వుంటారా ! ఏమి విచిత్రము :)
జిలేబి
విన్నకోటవారు,
Deleteమేడం గారు చెప్పినా వినరంటే ఏం చేయగలం చెప్పండి :) మునగాకు మంచి మందు, వెల్లుల్లి చెప్పేదే లేదు. అసలు వెల్లుల్లి లేని ఆవకాయ,కంది పచ్చడి ఊహించలేము :)
జిలేబి బామ్మా!
Deleteకొంతమందికి కొన్ని ఇష్టం ఉండవు,ఏం చేస్తాం, లోకో భిన్న రుచిః కదా! :)
ఆవకాయలో వెల్లుల్లి అంటే సరే అనుకుందాం కానీ కందిపచ్చడిలో కూడా వెల్లుల్లా, హతవిధీ 😳? అరుణ గారూ, అరుణ గారూ, ఎక్కడ మీరు 🤕?
Deleteవిన్నకోటవారు,
Deleteకంది పచ్చడికే ఆశ్చర్యపోయారా?అవాక్కయ్యారా? ఇంకా వినండి! గోంగూర పచ్చడిలో, తోటకూర పులుసులో చాలా...వెల్లుల్లి లేనిది ముద్దదిగదు. అదీ లహసున్ యొక్క గొప్ప.ఇదే సామాన్యుల ఆరోగ్య రహస్యం, పేదవాళ్ళం కదండీ :)ఇంట్లో ఎప్పుడూ కెజి వెల్లుల్లి స్టాక్ ఉండాల్సిందే!
పాపం! అరుణగారినేం ఇబ్బంది పెడతారు లెండి. ఆవిడ ఎప్పుడో వదిలేశారు బ్లాగుని :)
శ్రీహీ రామ్హ చ్హంద్హ్రా 🙄🙄!
Deleteఎవరింటికైనా భోజనానికి (పిలిస్తే) వెళ్ళడం అంత క్షేమకరం కాదేమో నా బోంట్లకు 🤔?? సర్లెండి, ఎవరి రుచులు వారివి.
మీరు మరీనూ శర్మ గారూ, వెల్లుల్లి తినడానికి పేదగొప్పా తారతమ్యం ఏమిటి?
అవునండి, అరుణ గారు బ్లాగుల నుండి దూరంగా ఉంటున్నట్లున్నారు. దానికి నేనూ ఒక కారణమా అనే అనుమానం నన్ను పీకుతుంటుంది 😕.
విన్నకోట వారూ మీరు ఎప్పుడో గార్లిక్ తిననని చెప్పినట్లు గుర్తు. ఎందుకైనా మంచిది ఎవరింటికయినా భోజనానికి వెళ్ళినప్పుడు ముందరే అడగండి. నేను ఆ పనే చేస్తాను.
Deleteవిన్నకోటవారు,
Deleteఅతిధులకు పెట్టమండి. ముందే అడిగేస్తాం. ఇంటికొచ్చిన ఆడపడుచుకి జాకట్ ముక్కయినా చేతులో పెట్టి బొట్టు పెట్టడం సంప్రదాయం. బొట్టు పెట్టచ్చా? అడిగి మాత్రమే బొట్టు పెట్టే అలవాటండి.ఎక్కడికైనా మీరు భోజనానికి వెళ్ళచ్చు భయం నాస్తి.
/తినాడానికి తారతమ్యం ఏమిటి?/
పల్లెటూరివాళ్ళం. వైద్య సదుపాయాలు తక్కువా. ఉన్నవి కూడా పెద్దలకి తప్ప అందుబాటులోకీ రాకపోవచ్చు, పేదలం కనక.. అందుకు రోగాన్ని దగ్గరకి రానివ్వకపోవడం అవసరమండి.ఆరోగ్యం కోసం అన్నీ తింటామండి. ఎవరిని మీరిది తినాలి అని బలవంత పెట్టం.పుర్రెకో బుద్ధి,జిహ్వకో రుచి అనే సిద్ధాంతం, మాది. తిన్నవాళ్ళంతా గొప్పవాళ్ళు,తిననివాళ్ళు మరోటి అనుకోం. వెల్లుల్లి,ఉల్లి,సొరకాయ, ములగ,వంకాయ, పుచ్చకాయ ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదేనండి. ఇవన్నీ విశ్వామిత్ర సృష్టి(ట) సాత్వికులు వాడరు.ఆహారం మూడు రకాలుటండి, తామస,రాజస,సాత్విక ఆహారాలు(ట). పైన చెప్పిన లిస్ట్ అంతా తామస అహారంటండి. ఒకప్పుడు నేనూ మీ పార్టీవాణ్ణే లెండి, అరవై ఏళ్ళకితం పార్టీ మారిపోయా :)
/అవునండి, అరుణ గారు బ్లాగుల నుండి దూరంగా ఉంటున్నట్లున్నారు. దానికి నేనూ ఒక కారణమా అనే అనుమానం నన్ను పీకుతుంటుంది 😕./
అంతేనంటారా? :)
This comment has been removed by the author.
Deleteఏమిటో శర్మ గారు, ఈ కాలంలో కొన్ని కొన్ని విషయాలు అతిధులను అడిగి మాత్రమే చెయ్యడం అవసరమైపోయినట్లుంది ..... కాఫీ / టీలో పంచదార వెయ్యచ్చా అని అడిగినట్లు 🙂🙂. అదీ మంచిదే లెండి.
Deleteఅవును లక్కరాజు వారూ, వెల్లుల్లి కలిసిన వంటకాలు నేను తినను తినలేను. మీరు కూడా తినరని అర్థమవుతోంది. అయితే మన “క్లబ్బు”లో తగుమాత్రంగా సభ్యులున్నారన్నమాట 🙂🙂.
Deleteమీరన్నట్లు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ముందే చెప్పెయ్యడం మంచిది.
థాంక్యూ.
వెల్లుల్లి వినా క్లబ్బును
Deleteసల్లిలితులు నరసరాయసార్ నెలకొల్పెన్ ,
తల్లీ వెల్లుల్లి ! యకట !
తల్లడిలకు , నీకు మేము దన్నుగ నిలుతుమ్ .
Deleteవెల్లుల్లీ నప్పవటా!
తల్లియు చేయని సహాయతను చేస్తావే
యెల్లలు లేదే ఔషధ
మెల్లెడ నీలో గలదె క్షమించు జిలేబీ
:)
నారదా వింటున్నావా
జిలేబి
విన్నకోటవారు, లక్కరాజు గారు.
Deleteఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని సామెత. ఉల్లిలో రెండు రకాలు, వెల్లుల్లి నీరుల్లి. హోమియో లో రెండు మందులు ఎల్లియం సీపా, ఎల్లియం సతీవా. రెండూ కూడా పరాన్న జీవుల మీద పనిచేసే మందులే ( పారసైట్స్)రొంపకి పనికొచ్చే మందులు. మీరు వెల్లుల్లిని ఇష్టపడకపోవటానికి దాని ఘాటు వాసన కావచ్చు. ఇటువంటిదే మరో మందు అశ్వగంధ దానినే పెన్నేరు అనికూడా అంటారు. పేరు లేని రోగానికి పెన్నేరు మందని సామెత.దీని వాసన భరించలేం, అందునా గుర్రపు వాసన వస్తుంది. అందుకే దీనిని అశ్వగంధ అన్నారు.దీనిని భారతదేశపు జిన్సింగ్ అంటారు.ఈ మందులు కరోనాని తగ్గించవుగాని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
వెల్లుని తినలేని మీ అసహాయతకు నా సహానుభూతి
🙏 శర్మ గారు. ఏదో, ఈ సారికిలా పోనిద్దాం ..... 🙂
Deleteవిన్నకోటవారు,
Deleteఅలాగలాగేనండి. కాని ఒక్క మాట. మేం రా తినేస్తాం వాసనున్నా. మీలాటివారి కోసం వాసన తీసేసిన వెల్లుల్లి ఎసన్స్ కేప్సూల్స్ లో అమ్ముతున్నారు, మందుగా :)
శర్మ గారూ
Deleteకొన్ని శరీర తత్వాలకి వెల్లుల్లి పడదు ఆయుర్వేదంలో పిత్థ దోషం ఉన్న వాళ్లకి
What foods should Pitta avoid?
Avoid hot and spicy foods such as those cooked with chillies, raw onion, raw garlic, mustard and cayenne. Minimise the sour taste, for example, foods such as cheese, yoghurt and tomatoes are considered especially sour. Minimise your use of salt and salty foods such as salted nuts and crisps.
లక్కరాజువారు,
Deleteమీరు చెప్పిన మాట నిజం. కొంతమంది తత్త్వానికి కొన్ని పడవు. వాటిని వదిలేయాల్సిందేనండి, ఇష్టమైనా కదా!
సార్ ,
ReplyDeleteమంచి సమయంలో పాఠకలోకానికి మునగాకు అవసరం
చెప్పేరు . రక్తంతో ఐరన్ పెంచి , వ్యాధినిరోధక పాటవం
అభివృధ్ధి చేయడంలో మునగకు మించింది లేదంటారు మన పెద్దలు .
ఇక ,
మూషికం పిల్లుల్ని మింగడం అక్కడ షరా మామూలే .
పండితులంతా (జిలేబీసారుతోసహా) తలలుపట్టుకుని ,
తలలు పగులగొట్టుకుని , ఆహా ఓహో అంటూ తలలూపు
ఆ అడ్డతలల ఆలోచనల గోల మనకెందుకు ? ధన్యవాదాలు , నమస్సులు .
చిన్న చిన్న మునగ కొమ్మల్ని కోసి , రాత్రిపూట గుడ్డలో
చుట్టి ఉంచితే , పొద్దునకు ఆకువిడిపోయి , శ్రమతప్పుతుంది .
రాజా సాబ్,
Deleteమంచి చిటకా చెప్పేరే! ప్రయత్నం చేస్తా.నిన్న ములగాకు కోసుకురమ్మంది కోడలమ్మాయి, ఎందుకో అనుకున్నా.పచ్చడి కనుకోలా. :) ములగాకు తినండోయ్ అని చెవినిల్లు కట్టుకు చెబుతున్నారండి. ములగాకు ఎగుమతి చేస్తున్నారండి, మనకు విరివిగా దొరుకుతుంది, తినడానికే వెగటు. :)
అక్కడ జిలేబి బీబీ బల్లులచేత పిల్లులని మింగిస్తుందండి, మనకొద్దు లెండి ఆ గోల :)
మునగాకు ఆకుకూరల్లో రుచికరం కూడానండి . కాపోతే , కాస్త కసురు . తగ్గాలంటే , ఉడకబెట్టి , చల్లార్చి ,పిండెయ్యడమే . వెల్లుల్లితో తిరగమాత పెట్టేస్తే , ఉత్తిదే
ReplyDeleteతినేసెయ్యొచ్చు . నాకు చాలా యిష్టం .
రాజా సాబ్,
Deleteమీరు చెప్పింది బాగుంది. ట్రై చేసి చూస్తా, నాకు వెల్లుల్లి అంటే మహ ఇష్టం. మీరు చెప్పినట్టు వెల్లుల్ల్న్ తిలపిష్టమున్ మెసవుట బాగా ఇష్టం,ఊరకనే తినెయ్యచ్చు :) ఆరోగ్యానికీ మంచిది, కొంచం వేడి చేస్తుందంతే
మునగాకు దివ్య ఔషధం శర్మ గారు.
ReplyDeleteఎంత తింటే అంత మంచిది. ఔషధం రుచిగా ఉండదు కదా!
మా అమ్మగారు మునగాకు తెలగపిండి కూర చేసేవారు.
బోనగిరిగారు,
Deleteమొదట మునగాకు, ఆపై తెలగపిండి, చివరగా వెల్లుల్లి. అబ్బ ఎంత బాగుంటుందో,మంఛి మందేకాదు,రుచి కూడా
Deleteతీక్ష్ణమూలకము తో కూష్మాండము వేయించి తిని చూడండీ టేస్ట్ బ్రహ్మాండంగా వుంటుంది
జిలేబి
Zilebi,
Deleteకూష్మాండం అంటే బూదిదగుమ్మడికాయ తో వెల్లుల్లి వినలేదు, అవియల్ కాదు మరేంటి ? వివరంగా చెప్పాలి.
గురుడీ కవిగారి తలను గుమ్మడి దూర్చెన్ .
Delete
Deleteఅరుదుగ వంటగదికి తా
నరుగు భళారె వడి వడి మునగ పదమును గాం
చి, రుచికరమనుచు రయ్యన
గురుడీ కవిగారి తలను గుమ్మడి దూర్చెన్ !
జిలేబి
పరుగిడి పద్యాల్ గట్టను
Deleteవరమడిగెను దస్కమిచ్చి వాంఛిత ఫలముల్
స్థిరముగ జొప్పించ దలచి
గురుడీ కవిగారి తలను గుమ్మడి దూర్చెన్.
విన్నకోట వారూ, వెల్లుల్లి వెలి క్లబ్బులో నన్నూ చేర్చుకొండి. వెల్లుల్లిలో నాకు సొక్కేది కారప్పొడి మాత్రమే.
ReplyDeleteవెల్కం వెల్కం శ్యామలరావు గారూ. The more the merrier. ఎంత మంది సభ్యులు ఉంటే “క్లబ్బు”కు అంత బలం 🙂.
Delete“వెల్లుల్లి వెలి క్లబ్బు” .... వీరతాళ్ళకు అర్హతాయోగ్యమైన పేరు కనిపెట్టారు మీరు 👏. బాగుంది 👌.
శ్యామలరావు గారు, విన్నకోటవారు.
Deleteశ్యామలీయం వారు రెండు పడవలమీద ప్రయాణం అంటున్నారు :) అసలు కారప్పొడి అంటే వెల్లుల్లి లేని కారప్పొడి ఊహించగలమా :)''వెల్లుల్లి వెలి క్లబ్'' పేరు బాగుందండీ