Wednesday 29 July 2020

విందుచేసినారు వియ్యాలవారింట

Courtesy:Whats app

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ''విందుచేసినారు వియ్యాలవారింట'' పాట,ఇది తరతరాల మన వారసత్వ సంపద, ఇప్పటి వరకు మరుగున పడిపోయింది, ఎవరో మహానుభావులు దీన్ని వాట్సాప్లో పెట్టేరు.వారికి వందనం.  పాటపాడిన శ్రీరంగం గోపాలరత్నం గారికి ఇతర గాయకిలకు వందనం.వాద్య సహకారులకు వందనం.దీన్ని బ్లాగులో పెట్టడానికి సహకరించిన విన్నకోటవారికి నా అభినందనలు.

10 comments:

  1. శ్రీరంగం గారికి, ఇతరులకు, మీకూ 🙏🙏🙏.

    ReplyDelete


  2. విందుచేసినారు వియ్యాలవారింట'


    తేట గీతిగా వుందే వాహ్ !



    జిలేబి

    ReplyDelete
  3. చాలా బాగుంది సర్ ఈ పాట. తెలుగువారి సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలు ప్రతి బింబిస్తుంది. ఏమిటప్పా లో ఇటువంటి మంచి పాటలు వస్తుంటాయి.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. సారూ, నిజం చెప్పాలంటే నా అభిప్రాయంలో ఎవరో పాట వ్రాశారు, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడారు, మనమంతా విన్నాం సరే గానీండి ...ఏదో వంకలు పెట్టాలని లోపాలు వెదికి భూతద్దంలో చూపించినట్లు ఉంది గానీ ఆ అమ్మాయి తండ్రి పాపం ఏదో తన శక్తి మేరకు విందు ఏర్పాటు చేశాడు కదా. ఎద్దేవా చెయ్యకుండా ఒక్క పూటకు సర్దుకుంటే పోదా? కాదూ, పెళ్ళిళ్ళల్లో ఇటువంటి సరసం మామూలే అంటారా అది వేరే సంగతి.

    ReplyDelete


  6. తాతగారు దీని లిరిక్స్ పెట్టండి మీరే ఆన్ లైన్ లో మొదటి వారు దీన్ని తీసుకు రావడానికి



    జిలేబి

    ReplyDelete
  7. "జిలేబి" గారు,
    ఇదిగోనండి (నాకు నచ్చని) ఈ పాటకు పైన 29 July 2020 at 12:48 న మీ కామెంట్లో శర్మ గారిని మీరడిగిన "లిరిక్స్" / సాహిత్యం ... నాకు అర్ధమయినంత వరకు (ఈ మాత్రం దానికి శర్మ గారికెందుకు శ్రమ ఇవ్వడం అని నేనే చెయ్యి జేసుకున్నాను అన్నమాట 😎). నాకు స్పష్టంగా వినిపించనివి ఒకటి రెండు gaps గా (లేదా ప్రశ్నార్ధకంతో) వదిలేశాను, ఆసక్తి గలవారు విడియో విని అర్ధమయితే నింపుకోవచ్చు.
    ===============
    "విందు చేసినారు వియ్యాల వారింట
    విందు మాట చెబితే వింతగా తోచును ||విందు||(2)
    -------
    (1). పప్పూ ఉడకలేదు , చారూ కాగలేదు
    అరటికాయ కూర ఊసే అందలేదు ||విందు||
    ----------
    ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
    చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేము ఏలాగు భోంచేతుమో
    ఈ విందు మేమేలాగు భోంచేతుమో
    ------------
    (2). వియ్యపురాలొచ్చి నెయ్య వడ్డించింది
    ఎన్ని వేయకున్న (?) చెయ్యి తడవలేదు ||విందు||
    (3). విస్తళ్ళు వేశారు, చారెడేసి వెడల్పు లేవండీ
    హస్తంబు తడుపుటకు ఔరౌర చోటు లేదు ||ఏలాగు||
    (4). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
    గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
    (5). కూరే వంకాయ కూర, దానిలోకి మార్చే(?) పచ్చడి లేదు
    కలహంబులా ...(?)... ముట్టితిమి (?) ||ఏలాగు||
    (6). ముక్కాబియ్యము వండిరి, దానిలోకి ముద్దపప్పే వేసిరి
    చెప్పుకుంటే సిగ్గవుతుంది, చెయ్యగలిగే వీలు లేదు ||ఏలాగు||
    (7). అప్పడాల్ వడియాలు అసలే కన్ పడలేదు
    గొప్పచూడబోతే చెప్పతరము కాదు ||విందు||
    (8). లడ్డూ జిలేబీలా, పాకములో వడ్డించెరంట(?)
    వడ్డించే వదినె గారి వడ్డాణం జారిపోయె ||ఏలాగు||
    -----------
    ఏలాగు భోంచేతుమో ఈ విందు మేమేలాగు భోంచేతుమో
    చాలా పెళ్ళిళ్ళాయె ఈలాటి విందు మేముఏలాగు భోంచేతుమో
    ఈ విందు మేమేలాగు భోంచేతుమో
    ================

    ReplyDelete
    Replies


    1. మీరు పెట్టిన ప్రశ్నలకు నాకూ సమాధానం చిక్క లేదండీ ( పల్కులక్కడ మింగినట్టనిపించె రాగం కోసం) తెలిసిన మహాత్ములు వేరెవరైనా వున్నారేమో వేచి చూడడమే మిగులు‌.



      జిలేబి

      Delete
    2. మీ స్వంత బ్లాగ్ “వరూధిని”లో నీహారిక గారు పూరించి తన కామెంట్ రూపంలో పెట్టారు కదా. చక్కగా పూరించారు.

      Delete