Saturday, 25 July 2020

ప్రయత్నం.




ఈ చిన్నారి నేర్పుతున్న జీవిత పాఠం ఏమిటి? ఓడిపోతానని,పడిపోతానని, దెబ్బ తగులుతుందని తెలిసినా  ప్రయత్నించు. గెలుపు నీదే,అంతిమ విజయం నీదే! నిరాశలో కూరుకుపోకు.

24 comments:



  1. కూరుకు పోకు నిరాశని
    ప్రేరణ జత నీ యతనము పెంచు జిలేబీ
    దారి కనులబడు సాధన
    తో రహదారివలె మారు తూకొనుమిపుడే



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అంతే కదు బామ్మగారూ, ''కందుకమువోలె సుజనుడు'' పజ్జం గుర్తుందా? ఇటుకల కింద పడిపోయిందా? :)

      Delete


    2. దారిని కనబడ్డ యిటుకల నంతా మా బుర్రలో పెట్టుకోడానికి మే మేన్నా దద్దోజనమా :) మేమే యిటుకల్ని పేర్చే సాంబార్యోజన‌ం :)



      జిలేబి


      Delete
  2. 👏 👏. ఈ బుడతడు జీవితంలో పైకొస్తాడండోయ్ ✋.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటసార్,
      ఇంకా పైకొస్తాడంటారేంటీ సార్, సాధించి ఆల్రెడీ పైకెక్కేసేడు :)

      Delete


    2. ఇంకా బుడతడు వస్తా
      ‌డింకా పై పైకి యని వడి పలికిరే? వా
      డింకా రావటమేమీ
      ఢంకా మ్రోగించి నిలిచె డాబుగ పైనన్



      జిలేబి

      Delete
    3. పాటీ బుడతడు పైకొచ్చుండ్లా :)

      Delete
  3. // “పైకొచ్చుండ్లా”, “పనిబళ్ళా” //

    ఈ మాండలికం మీకెలా పట్టుబడింది, శర్మ గారు 🙂? ఆ ప్రాంతమెక్కడ, మీ ప్రాంతమెక్కడ??

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెనుగూ ఒకటేనన్నా! తెనుగుజాతి మనది,నిండుగ వెలుగు జాతి మనదీ :)

      Delete
    2. నెల్లూరు మాండలీకము
      సల్లలితము మాటతీరు శారదకొలువై
      ఉల్లమలర మాటాడుదు
      మల్లిక బిల్లికలు లేవు మా మాటలలో .

      Delete
    3. రాజాసాబ్,
      ఔ! సినబ్బా! చెప్పుండ్లా :)

      Delete
    4. శర్మ గారు,
      “వరాల తెనుగు” సరే, ఆ మాండలికాన్ని నేనేమీ అనలేదు. అది మీరెలా పట్టుకున్నారు అని మాత్రమే అడిగాను అంతే.

      Delete
    5. విన్నకోట వారు,
      నలభై ఏళ్ళకితుం,శ్రీశ్రీశ్రీ తిరుమల సౌదరరాజన్ అయ్యోరు,ఆఫిసరు,సాచ్చిగా నామిని సినబ్బ సాచ్చిగా నేర్చినన్నయ్యోరు!చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడె పెద్దమ్మ,పెద్దయ్యల సాచ్చిగా తెలంగానం నేర్చినా దొరా!

      Delete
    6. అదా సంగతి? సంతోషం. ఇతర ప్రాంతాల మాండలికాలతో పరిచయం ఉండడం మంచిదే లెండి.

      Delete
    7. విన్నకోటవారు,

      అదండి సంగతి. అంతెందుకు సార్, నిన్నమొన్న పిచ్చిరాముడు బ్లాగ్లో శైలి చూసి నేనే రాశానని అపోహపడి అతన్ని బ్లాగులనుంచి గెంటేదాకా నిద్రపోలేదు కదుసార్, ఇంతన్యాయమా,చెప్పున్రి.ఆయన కూడా మరెవరో అని అపోహపడుతున్నారు, ఇదే బాగుందని బ్లాగొదిలేసి పారిపోయాడే!చాలావరకు ఈ మాండలీకాలు మరచాను కూడా కదు సార్!
      రాయల సీమ భాషా సౌకుమార్యాన్ని నేర్వనీకి జేసినా ఫాయిదా లేకపాయె.

      Delete
  4. Tenugu/Telugu.. whichone is correct?

    ReplyDelete
  5. Chiru Dreams sir,
    Both are acceptable for me.

    ReplyDelete
    Replies
    1. ఎంతైనా అరవ బుద్ధి పోదు.

      Delete


    2. :) ఉన్న మాటంటేనూ మేము టెల్గూస్ ని పిలిచే పలుకును అంటేనూ ఇట్లా అంటే ఎలాగండి భో, నగిరి గారు :)



      జిలేబి

      Delete
  6. మిత్రులకి, ముఖ్యం హిందూ ధర్మ సంబంధులైన ప్రతి ఒక్కరికీ మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చింది!

    Vedas.workd.inc వారు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా నియంత్రణ కోసం ఒక బృహద్యజ్ఞం చెయ్యాలని అనుకుంటున్నారు.

    వేసిన ప్లాను చాలా బాగుంది. ఒకేసారి 46 స్థలాల్లో ఒక్కో హోమగుండంతో ప్రతిరోజూ ఒకే సమయంలో 40 రోజులు చేస్తారు.ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ గుర్తించిన స్థలాలు అన్నీ శ్రీచక్ర యంత్రంలోని కోణాల వద్ద అమరుతాయి. అంటే నలభై రోజుల పాటు భాగ్యనగరం శ్రీ చక్ర రాజ మహేశ్వరీ శృంఖలా పరివేష్టితం అవుతుంది - వూహించుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది నాకు!

    మనం చెయ్యాల్సినది కూడా చాలా సరళమైనది.వారు ధనసేకరణకి వేసుకున్న ప్రణాళిక కూడా అద్భుతమైనదే - 50000 మంది ఒక్కొక్కరు మినిముం 1000 రూపాయలు ఇస్తే చాలు.

    దీనికోసం వారొక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు. మీ ఫోన్ నంబర్ మీ పేరుతో కలిపి ఇక్కడ () మధ్యన పెట్టి ఇస్తే నేను మిమ్మల్ని ఆ గ్రూపుకి పరిచయం చేస్తాను. వారు గూగుల్ అకవుంట్ క్రియేట్ చెయ్యగానే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే చాలు.

    మీరు గనక మీ ఫొనులోని వాట్సప్ అక్కవుంటు నుంచి దీన్ని చూస్తున్నట్టయితే {https://chat.whatsapp.com/EwpayCxAJ1TH3pYlXdGQEM} దగ్గిరకి భెల్లింఘం మీరే చేరవచ్చును.

    ఇక్కడ మీకు సెక్యూరిటీ సమస్య అనిపిస్తే నా హరికాలం బ్లాగు దగ్గిర కామెంట్ వెయ్యండి. {http://harikaalam.blogspot.com/?m=1}అక్కడ కామెంట్ మోడరేషన్ ఉంది గాబట్టి మీ వివరాలు బయటికి కనపడవు.మీరు చేరడమే కాదు, మీకు తెలిసిన ప్రతి హిందువుకీ విషయం చెప్పి నమ్మకం కలిగించి వితరణకి ప్రోత్సహించండి,గ్రూపులోకి తీసుకు రండి!

    ఇక మీదే ఆలస్యం!

    ReplyDelete
  7. ఇక మీదే ఆలస్యం!

    ReplyDelete