Friday 29 May 2020

మిడతల దండు


మిడతల దండు



మిడుత చాలా చిన్న జీవి.పతంగం అంటే కూడా మిడత అని అర్ధం ఉంది. దీనికున్న బలం ఎగురగలగడం. దీని బలహీనత నిప్పు. మిడుతలు ఎడారుల్లో గుడ్లు పెడతాయి. అవి ఒకటి రెండు మూడు ఆపై అసంఖ్యాకంగా పెరిగి ఆహారానికి బయలు దేరాతాయి. వీటికి దేశాలు సరిహద్దులు లేవు. పచ్చదనం ఎక్కడవుంటే అక్కడ వాలతాయి. అన్నీ తినేస్తాయి, లేచి వెళతాయి, అక్కడేం మిగలదు. ఇది కూడా కొన్ని అత్యాశాపరులైన దేశాల వారి సృష్టి కావచ్చు. ప్రపంచాన్ని శాసించాలనే ఎత్తుగడ కావచ్చు.జీవ జంతువులతో విలయం సృష్టి కావచ్చు. ఇవి దండుగా ఎగురుతోంటే ఆకాశం లో సూర్యుడే కనపడకపోవచ్చు. ఏమవుతుంది ఇవొస్తే ముందు పచ్చని ఆకు కనపడదు. ఉన్న ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ తరవాత ఆహారానికి కరువొస్తుంది. అదుపు చేయండి, ఎలా చిన్న చిన్న మంటలేయండి, అందులో దూకి చస్తాయి. పైర్లమీద పచ్చదనం మీద వేప కషాయం చల్లండి, అవి వేప కషాయం చల్లిన వాటిని తినలేవు. ఒక వేళ తింటే చనిపోతాయి, పునరుత్పత్తీ చేయలేవు. బహుపరాక్, మనదేశంలో మహా రాష్ట్ర,రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ మొదలైన ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది, ఈ మిడత, రేపు మనదీ అదే పరిస్థితి కావచ్చు.... 

ఇక్కడొక పెద్ద కథ చదవండి...మిడత మూలంగా
https://kastephale.wordpress.com/2013/06/11/  ఈ రోజు రెండు టపాలున్నాయి, గమనించగలరు.
https://kastephale.wordpress.com/2013/06/14/

https://kastephale.wordpress.com/2013/06/17

3 comments:

  1. మిడతల దండు పవర్ అలాంటిదన్నమాట మీ పాత బ్లాగుటపాలల్లో చెప్పినట్లు !

    పైరు తినేసి వెళ్లిపోవలసిన మిడతలు పైన విడియోలో ఇళ్ల మీద వాలేయేమిటండీ ?

    మంట పెట్టడం ఒక మార్గం అన్నారు మీరు. వేరొక బ్లాగర్ వాటిని పట్టుకుని ఆహారంలా వాడుకోవడం ఒక మార్గం అంటున్నారు. మిడతల్ని కూడా భోంచేస్తే చైనా వాళ్లం అయిపోతామేమో 😳😳?

    ReplyDelete
  2. VNR sir
    శబ్దాదిభిః పంచభిరేవ పంచ
    పంచత్వమాపుహుః స్వగుణేన బద్ధాః
    కురంగమాతంగపతంగమీన
    భృంగా నరః పంచభిరంచితః కిమ్. ......ఆది శంకరులు
    పతంగం అంటే శలభం అనగా మిడత. దీని ప్రలోభస్థానం రూపం అంటే నిప్పు. ఇవి ఇక్కడా అక్కడా అని లేదు ఎక్కడేనివాలతాయి, నిప్పులో కూడా.ఇవి రోజుకి నూట ఏబై కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయగలవు.మజీలీ గా భవనాలు ఆక్రమించుకుంటాయి కూడానండి.వారు చెప్పినది కూడా నిజమే, అది కూడా ఒక మంచి మార్గమే. చైనా వాళ్ళు ఎప్పుడూ ఎల్లప్పుడూ తింటూనే ఉంటారు, మనం అలా చేయం కదా. ఇప్పుడు సావకాశం వచ్చింది కనక దాన్ని ఉపయోగించుకోడమే కదు సార్ :)

    ReplyDelete
    Replies
    1. హ్హ హ్హ హ్హ హ్హ , అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటారా? బాగా చెప్పారు 😁

      Delete