Thursday 7 May 2020

జింకల పిండు


ADONI-BELLARY Road
Courtesy Whats app
లాక్ డవున్ సమయంలో చిత్రం 

11 comments:

  1. జింకల దండు అన్నమాట. మానవుల సంచారం గణనీయంగా తగ్గిపోయేసరికి జంతువులకు స్వేచ్ఛావిహారానికి అవకాశం దొరికినట్లుంది. మీకు భలే వీడియోలు వస్తుంటాయండీ👌🙂.

    లాక్-డౌన్ సమయంలో కూడా కొన్ని వాహనాలు హైవే మీద తిరుగుతున్నాయేమిటో 🤔?

    ReplyDelete
  2. విన్నకోట నరసింహా రావు,
    పిండు=సమూహము, ఉదా:- అచ్చర లేమల పిండు.నర సంచారం తగ్గితే అంతే కదండి. వాహనాల కదలిక గురించి నాకూ అనుమానమొచ్చిందండి.

    ReplyDelete
  3. థాంక్స్ సర్. “పిండు” అర్థం తెలుసు సర్. అదే అర్థంలో “దండు” అని ఓ పర్యాయపదాన్ని వాడాను.

    లాక్-డౌన్. భౌతికదూరం లాంటి వాటిని ఠలాయించి తిరిగే జనాలు ఎక్కువగానే ఉన్నట్లున్నారు. ఆ మోటర్ సైకిల్ మీద ముగ్గురు కూర్చుని మరీ వెడుతున్నారు. “కరోనా”కు ఫ్రీ హాండ్ ఇచ్చినట్లవుతోంది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      మనిషికి మూడు మాస్కు లు ఇచ్చింది ప్రభుత్వం. కట్టుకున్నవారు అరుదుగా కనపడ్డారు. డాక్టర్లు, నర్సులు, పోలీసు లు కట్టుకున్నారు. ఇక మందు క్యూలు సినిమా క్యూ ల లాగే ఉన్నాయండి. కరోనా కి ఫ్రీ హేండే

      Delete
    2. ఇంతకీ మామూలు రోజుల్లో బైక్ మీద ముగ్గురు వెళ్ళడానికి అనుమతి ఉందా?

      Delete
    3. సూర్య
      తెలుసుకోవలసిన పాయింటే సుమండీ :)

      Delete
  4. మీరు కూడా, శర్మ గారూ :) :) 😀

    సూర్య అడిగే ప్రశ్నలు ఒక్కోసారి tongue in cheek గా వుంటాయని తెలిసిన విషయమే కదా :) 😉

    seriously .... no, సూర్య గారు, అనుమతి లేదు ద్విచక్ర వాహనాల మీద (Section 194C of Motor Vehicles Act).

    ముగ్గురు వెడుతుంటారు, అది వేరే సంగతి .... కుర్రకారు అయితే ఒళ్ళుపొగరుతోను, మధ్యతరగతి కుటుంబీకుడు అయితే పొదుపు కోసమున్నూ.

    Triple-riding on 2-wheelers an offence in India

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు
      మన దేశంలో చట్టాలకి లోటా :) ఆమలు చేసేవారికే తెలీని చట్టాలున్నాయేమో కూడా.పెద్దవారి దగ్గర కొచ్చేటప్పటికి అమలు చేసేవారూ తక్కువ. చట్టం కలిగినవారి చుట్టం కదా. శాసనోల్లంఘనమే మే గొప్పవారి పని అని నేర్పిపోయారుగా :)



      పాత రోజుల్లో డబల్ రైడింగ్, సైకిల్ మీద నేరం. సైకిలికి లైట్ లేకపోతే రాత్రి నేరం. ఒక చిన్న కోడిగుడ్డు లైట్ లాటి లైట్ కిరోసినివి కూడా ఉండేవి గుర్తుందా? ఆ తరవాత కాలంలో డైనమో లైటొచ్చిందిగా!

      Delete
    2. ఆ రెండు రకాల లైట్లూ గుర్తున్నాయి సర్ 🙂. ఆ రోజులే వేరు.

      Delete
    3. నాకు తెలియకే ఆడిగానండీ బేసిక్ రూల్స్ ఏమిటని. ఈమధ్య చాలా పేపర్లలో ముగ్గురు నలుగురు బండెక్కి వెళ్తున్న ఫోటోలు వచ్చాయి. మామూలు రోజుల్లో పోలీసు పహారీ తక్కువ కానీ ప్రతి రోడ్డుమీద పోలీసులు కాపు కాస్తున్న ఈ రోజుల్లోనూ భయం లేకుండా అలా ఎలా వెళ్తున్నారా అని. తమ ప్రాణాలతో పాటు రోడ్డుమీద ఇతరుల ప్రాణాలనూ పణంగా పెట్టే ఇలాంటి వాళ్ళని ఏ అండమాన్ కో పంపెయ్యాలి.

      Delete