Tuesday 5 May 2020

తెలగపిండి వడియం

తెలగపిండి వడియం

కరోనా పేద గొప్ప దేశాలని పెద ధనిక వర్గాలని చూడకుండా జనాల్ని చిత్తు చేస్తోంది. అదేమో తెలియదుగాని మగవాళ్ళనే ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటోందిట. దీని మొహం తగలెయ్య! దీనికి మగాళ్ళంటే అంత ఇష్టమా? అందులోనూ పెద్దాళ్ళంటే మరీనుట, దీని ప్రేమ తగలెయ్య!!

ఆంధ్రాలో విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టలేకపోయిందిట. ఈ జిల్లాలలో అడుగు పెట్టలేకపోడానికి కారణం ఏంటీ? అని వాట్సాప్ యూనివర్సిటీ వారు పరిశోధన చేశారట. :)  హా! తెలిసెన్ కారణం అన్నారు. :)  ఏంటీటా?

ఏంటదీ?  తెలగపిండి వడియం. ఎలా తయారు చేస్తారు? ఆ ప్రాంతంలో విరివిగా పండేవి ఎర్ర నువ్వులు. నూనె తీయగా మిగిలిన తెలగపిండిలో ఉప్పు,వాము, పచ్చి మిర్చి కలిపి కుమ్మి, ముద్దకి దబ్బకాయ రసం కలిపి వడియాల్లా ఎండ బెడతారట. దానిని నంజుకుంటూ ఉదయమే గంజి తాగుతారట. అదీ రహస్యం అని బయట పడింది. తెలగపిండి వడియం తినిచూస్తారా?

29 comments:

  1. అవుడియా బాగానే ఉంది గానీ తెలగపిండి కొనడానికి బయటకు వెళ్ళే పరిస్ధితి లేదుగదా సర్ ?

    అయినా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా “కరోనా” పొడసూపిందట కదా? లేటెస్ట్ వార్త.

    ఎంతో వినోదాన్ని పంచిపెట్టే వాట్సప్ యూనివర్శిటీ జిందాబాద్. 🙂

    ReplyDelete
    Replies
    1. అదేంటో సార్ మందు షాపుల దగ్గర తప్ప మరెక్కడా క్యూ లు లేవు మా దగ్గర. అక్కడున్నవారంతా నిన్నటి దాకా అందరూ సాయం చేసినవారే!

      వాట్సాప్ యూనివర్సిటీ వారి మాటెలా ఉన్నా తెలగపిండి,వాము, ఉప్పు,మిర్చి అన్నీ మందులేసార్. మందు కాదు సుమా.కరోనా గురించి కాకపోయినా తప్పని సరిగా వాడుకోవలసిందే, ఈ వడియం, ఆరోగ్యానికి మంచిది.

      శ్రీకాకుళం జిల్లాలో పొడసూపిందిట.

      Delete
    2. అవును సర్. తెలగపిండి ప్రాశస్త్యమూ, రుచీ తెలిసినదే కదా? ఎప్పట్నుంచో దాన్ని తినే అలవాటు వుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ఏమన్నా దోహదపడుతుందేమో మరి? ఆ రకంగా ఉత్తరాంధ్రావారికి ఉపయోగపడుతోందేమో?

      Delete
    3. విజయనగరం జిల్లాలో కూడా మొదటి పాజిటివ్ కేసు నమోదయిందని ఇందాకటి టీవీ వార్తండి.
      కాదే వూరూ కరోనా నుండి సురక్షితం ??

      Delete
    4. చిన్నపుడు తెలగపిండి వడియాలు తిన్న గుర్తు.
      ఇక పాజిటివ్ కేసు విషయానికి వస్తే
      అంటించే వారు ఏ ఊరుకెళ్తే ఆ ఊరి రంగు మారుతుంది కదండీ. అంతా పాదమహిమ!!

      Delete
    5. హాస్పిటల్ కివస్తే టెస్ట్ పాసిటివ్ వచ్చిందిటండి.ఎక్కడంటుకుందో మరి ముసలమ్మగారికి.

      Delete
    6. సూర్య
      తెలగపిండి వడియం అంటున్నారుగాని, ఇప్పటికి దాన్ని తిన్నాను అన్నవారిని ఒక్కరిని చూశానండి. రొంబ సంతోషం :)

      Delete
  2. తెలగపిండి అంటే.. ఇంతకుముందు చక్కెర కలపి పిల్లలకు ఫ్రీగా గవర్నమెంట్ పంచిపిచ్చేది.. అదేనా?

    ReplyDelete
  3. Chiru Dreams
    ''ఇంతకుముందు చక్కెర కలపి పిల్లలకు ఫ్రీగా గవర్నమెంట్ పంచిపిచ్చేది.. అదేనా?''
    నాకు తెలీదండీ

    ReplyDelete
  4. ఆ లిక్కర్ ఏదో లాక్ డౌన్ మొదటి రోజు నుండే అమ్మడం మొదలు పెట్టి ఉంటే చాలా మంది తాగి ఇంట్లోనే పడి ఉండేవారు కదా!
    Stay home, stay safe అని మొత్తుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.

    ReplyDelete
    Replies
    1. bonagiri
      నిజమేననిపిస్తూందండీ

      Delete
    2. ఇంకో ఎడ్వాంటేజీ ఏమిటనంటే ఫుల్లుగా తాగినోళ్ల దగ్గరికి ఎవరూ రారు కాబట్టి సామజిక దూరానికి ఢోకా లేదు.

      చావడానికే నిశ్చయించుకున్న మందుభాయీలు ఒకరికొకరు హాయిగా అంటించుకున్నా ఇతరులకు ఇబ్బంది రాదు.

      jk

      Delete
    3. Jai Gottimukkala.
      నా ఇల్లు నా ఇష్టం తగలబెట్టుకుంటానంటే కుదురుతుందందంటారా? :)
      In front crocodile festival :)

      Delete
    4. గురువు గారూ, "ఒకరు తాగితే (మరొకరు) చావగలరు, ఒకరు చస్తే (మరొకరు) తాగగలరు" అన్నాడొక తోక పీకిన కపివరేణ్యుడు.

      We are like this only!

      Delete
    5. ఇప్పుడే అందిన సమాచారం: తెలంగాణాలోనూ రేపటికెల్లి మద్యం లొల్లి షురూ

      Delete
    6. Jai Gottimukkala

      Liquor being open in every part of India and in other countries also. I hope it is a process of immunizing masses. We have to observe the results in two weeks.

      Delete
    7. ఇమ్యూనిజమూ లేదు పాడూ లేదు. అవసరం అలాంటిదండి. ఉన్న సొమ్మంతా కరోనా సేవకు వాడేసాక రోజులు గడపడానికి ప్రభుత్వానికి మాత్రం సొమ్ము ఉండొద్దూ?
      మోదీ ఫోన్ చేసి "శర్మగారూ.. దేశం చాలా కిష్టపరిస్థితుల్లో ఉంది. అంచేత బ్యాంక్ లో ఉన్న మీ బ్యాలెన్స్ మొత్తం వాడేసుకున్నా ఏమనుకోకండేం" అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి. కయ్ మనరూ?! మిగిలిన దారి పెట్రోలు, మందు ఎక్కువ ధరకు అమ్ముకోవడమే. లాక్ డౌన్ కారణాన పెట్రోలు మీద పెంచినా పెద్దగా రాబడి ఉండదు. ఇక మిగిలింది మందు బాబులే!

      Delete
    8. సూర్య
      పాత కాలం వాడిని కదండీ అలా అనేసుకున్నాననమాటండి. ఇప్పుడు తెలిసింది ,మీ మాటే :)

      Delete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. Pelalatho kooda vadiyalu pedatharu andi akkadi vallu. Ruchikaram gaa untayi.

    ReplyDelete
  7. Chaitanya
    పేలాల వడియాలు ఇదే మొదటిసారి వినడమండి. ఎలా పెడతారో తెలిస్తే చెప్పండి.

    ReplyDelete
  8. పేలాల వడియాలు మా ఇళ్లలో కూడా కామన్

    ReplyDelete
    Replies
    1. Jai Gottimukkala
      గోజిలలో పిండి వడియాలు పెట్టే అలవాటుంది,సగ్గుబియ్యంతో వడియాలు పెట్టే అలవాటూ ఉంది. ఇలా పేలాల వడియాలు పెట్టే అలవాటు లేదు. ఎలా పెడతారో ఊహించగలను కాని తెలుస్కుంటే మంచిది కదా! చెప్పరాదూ! పొరబాటు కొంచం ఇంట్లో కనుక్కోరాదూ :)

      Delete
    2. పేలాల వడియాలు అమ్మమ్మ పెట్టేదండీ. అమ్మ నేర్చుకోలేదనుకుంటా, అడిగితే దాటేసింది. She went into a long rambling about old times blah blah without coming to the point!

      Delete
    3. https://youtu.be/OCVR_ZDKCZw

      Delete
    4. Jai Gottimukkala
      ఉప్చ్! తెలుసుకునే అదృష్టం లేకపోయె! :)

      Delete
    5. Chiru Dreams

      లింక్ లో చూపినవాటిని మరమరాలు లేదా బొరుగులు అంటారండి ఇక్కడివాళ్ళు. పేలాలు వేరండి.శ్రమతీసుకున్నందుకు ధన్యవాదాలు.

      Delete
    6. నాకు తెలుసండీ శర్మగారూ! వరిపేలాల ప్లేసులో.. నువ్వుల పేలాలు పెట్టుకోండి.

      Delete