తిరుమల ఘాట్ రోడ్డు
జీర్ణతృణంబు మేయునే?
క్షుత్సామో ఽ పి జరాకృశో ఽ పి శిధిలప్రాయో ఽ పి కష్టాం దశా
మా పన్నో ఽ విపిన్న దీధితిరసి ప్రాణేషు నశ్యత్స్వపి
మత్తేభేన్ద్ర విభిన్న కుమృపిశితగ్రాసైకబద్ధస్పృహః
కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసరః కేసరీ
గ్రాసము లేక స్రుక్కిల జ రాకృశమైన విశర్ణ మైన సా
యాసము నైన నష్టరుచి యైనను బ్రాణభయార్తయైన ని
స్త్రాన మదేభకుంభ పిశి తగ్రహలాలసశీలసాగ్రహా
గ్రేసరభాసమాన మగు కేసరి జీర్ణతృణంబు మేయునే?.....లక్ష్మణకవి
శూరాగ్రణియగు సింహము ఆకలిచే డస్సినను,ముదిమిచే జిక్కినను, కష్ట స్థితిబొందినను, కాంతి విహీనమైనను, ప్రాణములు పోవుచున్నను,మదించి ఏనుగు కుంభస్థలము చీల్చి అందలి మాంసము భుజించునే కాని, ఎండుగడ్డి మేయునా?
సింహం ముసలిదైనా అంటే గోళ్ళు కోరలు ఊడిపోయినా,,ఆకలిచేత డస్సినా,కష్టంలో పడినా, ప్రాణం పోతున్నా ఎండు గడ్డి తినదు కాదు తినలేదు. సింహం ఉండే చోట చాలా ఎత్తుగా గడ్డి పెరుగుతుంది. సింహం తినదు, తినే జంతువులు సింగానికి భయపడి తినడానికిరావు. సింహం శరీర నిర్మాణం ఎండుగడ్డి తినడానికి అనువుగా సృష్టింపబడలేదు. అందుచేత సింగం మాంసమే తింటుంది, కాదు మాంసపు ముద్దలు మింగుతుంది. సింగం వేటాడుకుంటే గాని ఆహారం దొరకదు, ఎవరూ పిలిచి ఆహారం పెట్టరు. సింగం పడుకుని నిద్రపోతే జంతువులు వచ్చి సింహం నోట్లో జొరబడవు. సింహం వేట చేయాల్సిందే. అందుకే గోళ్ళు కోరలు ఇచ్చాడు. గోళ్ళు కోరలు పోతే ఎవరూ సింగాన్ని లెక్క చేయరు, అందు చేత తన ఆయుధాలైన గోళ్ళు కోరలు రక్షించుకోవాల్సిందే!వేటాడుతుంటేనే, వాడుకలో ఉంటేనే బాగుంటాయి.
ఎంతైనా సింహం సింహమే కదా, సర్ 🙂.
ReplyDeleteఏనుగు లక్ష్మణ కవి గారు మనకు అందించిన భర్తృహరి సుభాషితాలు ప్రతిదీ ఆణిముత్యమే 🙏.
విన్నకోట నరసింహా రావు sir,
Deleteసింహం గోళ్ళు, కోరలు ఊడిపోయి వేటాడలేకపోతే, ఆకలితో చచ్చిపోతుంది.ఎండుగడ్డి తినదు.
కంకణలోభః పథికః అని సంస్కృతం లో ఓ పాఠం ఉండేది. అందులోను ఇంతే.. నా గోళ్ళు కొరలు మెత్తబడి పోయాయి అంచేత దాన ధర్మాలు చేస్తూ ఈ ఊట లో ఓ రోజు స్నానమాచరిస్తుంటే ఈ బంగారు కంకణమొకటి నాకు చిక్కింది. నేనా ముదుసలి వ్యాఘ్రాన్ని.. అంచేతనే ఎవరైన దారిన పోయే దానయ్యకు ఇచ్చి పుణ్యం కట్టుకుంటా అందిట ఓ వెఱ్ఱి వెంగళప్ప కు. ఆ మాటలు నమ్మి ఏది చూడని అది బంగారమేనా కాదా.. లేదంటే నాకు వద్దు అని సమాధానమిచ్చాడుట.. కావలిస్తే నువ్వే ఇక్కడికి రా నా కాళ్ళు కూడ చచ్ఏఉబడి ఈ బురదలోనే చొచ్చుకుపోయాయందట ఆ సింబం.. అంతే ఏముంది అమాంతం గుటకాయ స్వాహా..
ReplyDeleteశర్మాచార్య మీ కథ కు తాత్పర్యం: ఎవరికి ఏ అలవాటు అబ్బుతుందో అది ఎన్నటికీ మారదు. సాధు జంతువు కర్కష మృగం కాలేదు ఏనాటికిని.
అంతే కదండీ
Delete
Deleteమాడర్న్ డేస్ కంకణలోభి పథికుడు :)
కంకణలోభి పథికునికి
టెంకణ మిడుచు భళి మార్కెటింగ్ కుర్రోడా
ఢంకా మ్రోగించి క్రెడి
ట్టింక దెపుడనంగనే తృటిని పడె గోతిన్ :)
జిలేబి