Thursday, 26 November 2020

రామాయ స్వస్తి.....

 రామాయ స్వస్తి....


రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అనే మాట అంటుంటారు. ఏంటి దీని అర్ధం? రామునికి శుభం, రావణునికీ శుభం. ఇదెలా సాధ్యం? 


రామునికి నమస్కారం పెడితే శుభం కలగజేస్తాడు. నమస్కారం పెట్టకపోయినా ఏమీ అనుకోడు, అశుభం కలగజేయడు. రావణునికి నమస్కారం పెట్టకపోతే కోపం తెచ్చుకోవచ్చు,అశుభం కలగజేయచ్చు (భయం). 


అంచేత రామాయ స్వస్తి రావణాయ స్వస్తి అనేవారే ఎక్కువ :)

14 comments:

  1. అసలుకి రావణాసురుడు జయ విజయ లలో ఒకరు అని అంటారు. ఏదో కారణం చేత (నాకు తెలియదు మరి) వారిరువురికి విష్ణువు ఒక వరం లాటి శాపమో, శాపం లాటి వరమో ఇస్తాడు. ఆ కారణం చేతనే రావణుడు, కుంభకర్ణుడు/కంసుడు, శిశుపాలుడు/హిరణ్యాక్షుడు, హిరణ్యకసిపుడు మొదలగు ఏడు వైరి జన్మలు ఎత్తి స్వామి చేతనే వధింపబడి వారి తప్పును చక్కదిద్దుకుంటారని విన్నాను.

    మీ నానుడికి రమారమి ఉదాహరణ:
    కాళ్ళు తిమ్మిరెక్కితే కాస్తంత రెస్ట్ తీసుకుని నడక ప్రారంభించ వచ్చు.. అదే కాలు విరిగితేనో..!

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      మీరన్నమాట నిజమే! జయ విజయులే రావణ కుంభకర్ణులు, ఒకరిచ్చిన్న శాపం, హరి ఇచ్చిన వరం కలిపి రావణ కుభకర్ణులుగా జన్మిస్తారు.

      ఈ నానుడి నమస్కారం, శుభం చెప్పకపోతే రాముడేం చెయ్యడు, అశుభం కలిగించడు కాని అలా స్వస్తి చెప్పకపోతే రావణుడు మాత్రం శిక్ష వేసే అవకాశాలు మెండని భయం. అందుకు ఒక నమసకారం పారేస్తే పోలా, దుష్టుడికి అనేదే లోక రీతి :)

      Delete
  2. అంతేగా అంతేగా, శర్మ గారు.
    మీకు తెలియనిదేముంది, ఉద్యోగంలో ఉన్నప్పుడు యూనియన్లో సభ్యత్వం తీసుకోవడం కూడా ఒక్కోసారి ఈ ఉద్దేశంతోనే (ఆఫీస్ బేరర్స్ ని బట్టి కూడా ఉంటుందనుకోండి). వాళ్ళు మేలు చేసినా చెయ్యక పోయినా మనకు అడ్డు పడి హని చెయ్యకుండా ఉంటారనే ఆశతో.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      యూనియన్ల గురించే చెప్పేరా?ఎప్పుడూ కింగ్ మేకర్లమేనండి, కింగ్ లం కాలేదు. మేమూ నమస్కారాలు పెట్టేవాళ్ళలోనే ఉండేవాళ్ళం.
      అదేమోగాని వీళ్ళ మాటే వినేవారు ఆఫీసర్లు కూడా. వాళ్ళూ వాళ్ళూ ఒకే రకం అనుకుంటానండి.
      యూనియణ్ దుష్టుడికొక నమస్కారం, ఆఫీసర్ దుష్టుడుకి మరో నమస్కారం పారేసి బతుకుతూ ఉండేవాళ్ళం. :)

      Delete


  3. రామాయ స్వస్తి ! చతురుడ
    వై మానవ రావణాయ స్వస్తి యనదగున్!
    త్వామనురజామి యనవ
    య్యా మానకు వందనమ్ములనుట నెవరికిన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి
      ముందుగా తమకు నమస్కారం.రావణుడికే ముందు స్వస్తి చెప్పమన్నారు, ప్రమాదం రాకుండా. ప్రమాదమొస్తే కాలో చెయ్యో పోయిన తరవాత ఏడిచి ఉపయోగం ఉండదు కదా! అందుకు ముందే నమస్కారం పారేస్తే మంచిది. ఇదిలా ఉండగా ఒక శతకకారుడు, శకారుడు కాదు లెండి, తమరు శకారాభిమానులుగదా! తమకో నమస్కారం, తమ శకారునికి రెండు నమస్కారాలున్నూ!
      శతకకారుడికి నమస్కారం, ఆయనమాట తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు....అన్నాదు, ఇది రాసేలోగా కరంటు పోయింది, మూడు సార్లు, కరంటోళ్ళకి నమస్కారం.శతకకారుడు, ఆయనేమో ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో మాటాడే మేధావి కాదు, మేధావులకు నమస్కారం. అంతెందుకులెండి, నమకమే ఉంది కదా, తస్కరాయనమః, మయస్కరాయనమః ఎవరు కాదు నమస్కారానికి అర్హులు మరో మేధావి మాట, ఆయనకూ నమస్కారమ్ :)దుష్టులకు నమస్కారం చెప్పమందండీ నమకమ్, అంచేత తమకు మళ్ళీ ఒక నమస్కారం, కనపడినప్పుడల్లా నమస్కారం.ఆయ్

      పద్యంలో చివరాఖరు వారెదురవుతారు జీవితంలో అప్పుడేం చెయ్యాలో చెప్పలేదు శతకకారుడు, ఏం చేయాలో తెలీక దిక్కులు చూస్తుంటే ఒక పెద్దాయన ఈ మాటనేసి పోయాడు. అర్ధంకాలేదు, ఇప్పుడు తమరు చెబితే తెలిసింది అందరీకిన్నీ నమస్కారాలు పెట్టేసుకో బతైకెయ్యీ, అని.
      వందనం అభినందనం...సుందరీ పాదాభివందనం :)

      Delete
  4. ఈ వందనాల వందలు
    కేవలమా మామికేన ? కృతపండితమత్
    శ్రీవల్లభులకు కూడా
    నా ? వఝ్ఝల భాస్సరార్య !నానాగతులన్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      కందమ్మకే ముందు పెట్టాలి నమస్కారం. ఆ తరవాతే ఎవరికైనా...ఉన్నావా అసలున్నావా? అనేవాడికి చివరికి పెడితే పెట్టచ్చు పెట్టకపోయినా పట్టించుకోడు :)

      Delete


    2. కందమ్మకేను ముందుగ
      వందారనవలెను రాజ వారూ ! ఉన్నా
      డందురు గా వాడికి మీ
      వందన మిడిన మిడకున్న పట్టింపుల్లేవ్


      జిలేబి

      Delete
    3. కొందరికి ఎంత చేసినా తక్కువే..

      జన్మ పొందినపుడు అందరు అజాత శత్రువులే
      కాని కాలక్రమేణ పర్యావసనాల మూలాన ఎవరో ఒకరో ఎపుడో అపుడు ఏదో విధంగా దెప్పి పొడవటం చేత మంచి చెడు తెలియకనో క్రమేపి రిపుల సంఖ్య హెచ్చ వచ్చు..!

      పెంచి పోషించిన తల్లిదండ్రులను నమస్కరించినా నమస్కరించకున్నా ఏమీ అనుకోరు.. వారి ఆశిస్సులు సదా వారి సంతానానికి ఉంటుంది.. కాని పిల్లనిచ్చిన అత్తమామలకు నమస్కరించకుంటే "మా అల్లుడికసలు మానం మర్యాద సాంప్రదాయం సంస్కారం ఏమి లేదం"టు సమాజాన ప్రచారం చేసేస్తారు. ఒకవేళ నమస్కరించినా.. "మా అల్లుడికి తెలివే లేదు. మేము ఎక్కడ కనిపించినా అదేపనిగా నమస్కరిస్తు ఉంటాడు. అతి వినయం ధూర్త లక్షణమని తెలియదా ఇంత వయసొచ్చింది. అసలు మా అమ్మాయిని ఇలాంటి వాడికి ఇచ్చి ఆమే జీవితం నాశనం చేశామేమో" అనుకునే ప్రభుద్ధులు లేకపోలేదు.

      శర్మాచార్య.. మీరు ఇచ్చిన నానుడికి, వియన్నారాచార్యగారి ఉదాహరణకి దగ్గరగా ఉండాలనే ఉద్దెశ్యం తో వేసిన వ్యాఖ్య ఇది.

      Delete
    4. మీరు చెప్పిన మరోక ఉదాహరణ బాగుంది, శ్రీధరా 😀😀.

      Delete
    5. శ్రీధరా!
      మీ మాట నిజమే కాని అనుభవమున్నవారి మాట పట్టించుకోవాలేమో కదా :)

      దుష్టులకు ఒంటరిగా ఉండగా నమస్కారం పెట్టద్దు, పది మంది ఉన్నప్పుడు నమస్కారం పెట్టాలి, మరచిపోకూడదు, వీలైతే పొగడాలి. :) వారి వంది మాగధులతో పోటీ పడి మరీ పొగడాలి. ఇదీ సూత్రమని పెద్దల మాట

      Delete
    6. మీరు చెప్పిన మాట నిజమే ఆచార్య.. దుష్టులకు ఒంటరిగా నమస్కారం పెట్టనే కూడదు.!

      Delete


    7. ఒంటరి గా నా దండా
      లంటూ దుష్టుల కెడన్ సఖా పోమాకోయ్!
      కంటకు డై దొక్కి యతడు
      మింటికి నెగరేయు నిన్ను మేవడికాడా!


      జిలేబి

      Delete