Wednesday, 11 November 2020

ఎగిరి ఎగిరి దంచినా

 ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి :)

వంక దొరకనమ్మ డొంక పట్టుకుందని ఏడ్చింది.

పనివాడు పందిరేస్తే పిచికిలొచ్చి పడగొట్టేసేయి.

కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది

10 comments:



  1. ఎగిరెగిరి దంచిన భళా
    యెగరక దంచినను కూలి యేమో యొకటే
    తగినట్టి వంక దొరకని
    జగడాలమ్మి సరి డొంక చాలదనెనుగా !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జగడాలమ్మి మరో పేరు బాగుందండోయ్!

      Delete


    2. జగడాలమ్మి! జిలేబి వ
      లె గడుసు పేరాయె సూవె లెస్సగ యమ్మో
      జగణపు రమణీ పదముల
      ను గడగడా గుచ్చితివి వినూత్నంబయెగా


      జిలేబి

      Delete


  2. పనివాడు పందిరేయం
    గను పిచికలు వచ్చి చక్కగా పడ గొట్టెన్
    తను కొండనాలికకు మం
    దును వేయగ వున్న నాల్క తూచ్ పోయెనుగా


    జిలేబి

    ReplyDelete
  3. // “ ఎగిరి ఎగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి :)” //

    ఈ పాలసీని అమలు పరిచే జనాలు కొందరు చాలా ఆఫీసుల్లో తగులుతుంటారు. వృద్ధిలోకి వస్తుంటారు కూడా.

    ReplyDelete
    Replies
    1. వీరిదేనండి రోజు :)

      Delete
    2. ఆఫీసుల్లో అంటారా, ఒళ్ళొంచి దంచినా ఒకటే కూలి - ఒళ్ళొంచినట్లు నటించినా ఒకటే కూలి అనేదే మంచిసామెత అండీ. అచ్చో మరింత మంచి సామెత ఉందండి "వడ్డించే వాడు మనవాడైతే కడపంక్తిని కూర్చోవచ్చు" అని - అలా భోగం అనుభవించే వాళ్ళు ఉంటారక్కడ మరి.

      Delete

    3. శ్యామలీయంవారు,
      ఎగిరి ఎగిరి దంచుతున్నట్టు నటించేవాళ్ళవే రోజులండి ఆఫీసుల్లో. వడ్డించేవాడు మనవాడైతే కడబంతిని కూచున్నా ఫరవాలేదంటరు కాని కడ బంతిని కూచోడమే మేలు.బంతిలో వాళ్ళకి కొద్దికొద్దిగా వడ్డించి, బుట్టలో ఉన్నదంతా మనకే పడేసి ఉట్టి బుట్ట పుచ్చుకుపోతాడు.


      Delete
  4. కారును లో టార్క్ గేర్ పై నడిపినా, హై టార్క్ గేర్ పై నడిపినా అది పయనించే దూరం రెంటిలో సరిసమానమే.. ఫ్యూయేల్ లో మాత్రమే వచ్చేది తేడా.., అందితే అటక అందకుంటే సొరంగం.. కాని జారి పడటమో ఊపిరి సలపకపోవటమో ఖాయం.. శ్రమకోర్చి సంపాదించిన సంపదనంత సంతానం ముక్కలుగా చేసి పంచుకునే తీరు.. సెంట్రిఫ్యూగల్ పంప్ కు వాటర్ తో రివర్స్ సిఫనింగ్ చేస్తుంటే ఓవర్ లోడై స్టెపప్ ట్రాన్స్‌ఫార్మర్ పేలినట్టు..!

    ~నానుండి నానుడి~

    ReplyDelete
    Replies
    1. నిజము నుడివితిరికదా శ్రీధరా

      Delete