Saturday, 7 November 2020

రైతన్న కష్టం

 









 

ఊరికెళ్ళేప్పుడు గుడ్డెండ ఉంది, తిరిగొచ్చేప్పుడు వర్షం, రైతన్నకిలా కష్టం.

7 comments:

  1. ప్రకృతి ఎలా మారుతుందో ఆ మలయ మారుతం ఎపుడేలా వీస్తుందో దానికంతటికి కూడా ఏదో మూలాన మనిషి ఇంటర్ఫియరెన్స్ ఉంది. ఎండలు వానలు గాలి భిభత్సాలు కరెంట్ కోతలు నీటి వరదలు తూఫాను వీటన్నిటిని తట్టుకుని నిలవ గలిగే ప్రకృతి కి వేనవేల దండాలు.

    ReplyDelete
  2. ప్రకృతి మీద ఆధారపడ్డ జీవులు కదా. మరి ప్రకృతి మూడ్ ఎలా ఉంటే అలా పాపం.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!,విన్నకోటవారు.
      కొన్ని చేలు పడిపోయాయి, కొన్ని కోతకున్నాయి,కొన్ని పనమీద ఉన్నాయి, కొన్ని కట్టేసి ఉన్నాయి, కొన్ని నూర్చి ఉన్నాయి ఎగరపోతకావాలి,కొన్ని ఎగరబోసిన ధాన్యం ఉన్నాయి వర్షం రావడంతో ఆదరాబాదరా ధాన్యం మీద గడ్డి కప్పుకోవలసివచ్చింది, మిగిలినవాటి పని నట్టడిపోయింది. ఒక్క వారం రోజులు వర్షం లేకపోతే పని ఒబ్బిడైపోతుంది. ఏం చేస్తాం, ఈ కష్టాలు అలవాటైపోయాయి.

      Delete
    2. తడిస్తే ఏమవుతుంది? ఒకరి మాట.

      పడిపోయిన చేనుమీద వర్షంపడితే కంకి నేలకి ఆనుకుని ఉన్నచోట కొన్ని వంగడాల్లో మొలకొస్తుంది, కొంత ధాన్యం మట్టిగొట్టుకుపోతుంది.రంగు మారిన ధాన్యానికి రేటు రాదు. కొయ్యని చేలు కొణిగిపోతాయి, నీరు దిగగొట్టుకోవాలి, అదనపు పని.
      ఇక పనమీదుంటే? పన ఒకరోజు ఆరనివ్వాలి ఒక రోజు తిరగెయ్యాలి అప్పుడు కట్టాలి, అదనపు పని కదా!
      కట్టేసి ఉంటే? కట్టేసిన మోపుల్ని విప్పాలి ఎండబెట్టాలి మళ్ళీ కట్టాలి, కుప్పెయ్యాలి, లేదా బల్ల కొట్టాలి.అలాగే ఎండిందనుకుని కుప్పేస్తే కుప్పలో ఆయి వస్తుంది, ధాన్యం పాయి పడుతుంది, రంగు మారుతుంది.
      మాసూలు చేసిన ఎగరపోతకి పొడి ప్రదేశం ఉండక పని నట్టడిఒపోతుంది.ఇక కుప్పపోసిన ధాన్యం తడవకచూసుకోవాలి. అదనపౌపనులు, ఖర్చు, పెట్టుబడులు పెరగడం అంటే ఇదే!

      సమయంకాని సమయంలో వర్షం పడితే సరుకు నష్టం, అదనపు పని,సమయం నష్టం.

      Delete


  3. ఆధారపడితిమి ప్రకృతి
    పై ధారగ కురియ దయయు, పైపెచ్చు సదా
    స్వాధీనములో కలమ
    మ్మా ధాత్రిని నమ్మి మేము మము కరుణింపన్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బామ్మా!
      ఎవరో దుక్కి దున్నారు, నీరుపెట్టారు,విత్తులేశారు, పంట పండించారు, మరెవరో కోశారు, కుప్పేశారు, నూర్చారు, మరెవరో మోసుకొచ్చారు, మరొకరు బియ్యం చేశారు, మా అయ్యరుగారు వంట చేశారు, ప్లేట్ లో పెట్టేరు, నీముందు పెట్టేరు, కీ బోర్డ్ వీరురాలివి కదా ముని వేళ్ళతో కలిపి నాలుగు మెతుకులు మూతికిరాశావు. అయ్యరు గారు బతిమాలి తినిపించారు. నీకెలా తెలుస్తుంది చెప్పు మా కష్టం, సీస్ మహల్లో కూచున్న నీదే కష్టం :)

      Delete


    2. దుక్కిని దున్నిన దెవరో
      చక్కగ నారమ్ము చేర్చి ససిపండింపన్
      మిక్కిలి నలత యెవరిదో
      మెక్కితి వయ్యరు జొనుపగ మెతుకుల వాయిన్!

      టెక్కీ వై పద్యముల చ
      టుక్కు‌న నల్లుచు నిటులనటుల తిరిగితివెం
      చక్కా నీకేమి తెలుసు
      నక్కా కష్టేఫలుల తనకలి జిలేబీ !


      జిలేబి

      Delete