Friday 13 November 2020

ఎంచుకుంటే.....

 ఎంచుకుంటే మంచమంతా కంతలే

జంతిక చక్కిలాన్ని ఎక్కిరించినట్టు

తనదిపాలికిచ్చి తను కూలికెళ్ళినట్టు.

చేతకాని మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు.




7 comments:

  1. ఔరా..! ఎన్నెన్ని సామేతలు.. మరిన్ని నానుడులు
    జరిగిన వాటి నుండి డెడ్యూస్ చేసినవి కొన్ని
    అడపాదడపా అందిపుచ్చుకున్నవి మరి కొన్పి

    ఏది దొరికినా వంకలు తీయరాదని సూక్తి.. వంకలు లేని వారు లేదా వంకలు లేని వస్తువు ఏది ఐడియాలిస్టిక్ గా ఉండవు.. ఆలోచన తప్ఫ.. అందుకే ఇది బాలేదది బాలేదంటే ప్రతి చిన్న వాటిలో ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది..

    జంతిక కరకర లాడేదే.. చక్కిలము అంతే.. ఎవరి గుణగణాలకు వారికే పెట్టింది పేరు.. రోకలొచ్చి డోలుకు.. డోలొచ్చి మద్దెలకు చెప్పుకుందంట బాధ.. ఎంత వెక్కిరించినా చక్కిలం చక్కిలమే జంతిక జంతికే.. జహాంగరి జహంగరే జిలేబి జిలేబియే.. కాకినాడ కాజా కు ఉన్న ప్రత్యేకత తాపేశ్వర కాజా కు లేదుగా ఐనను అది అదే ఇది ఇదే.
    తన ఆస్తిలో ముప్పావు వంతు కూతురు~అల్లుడికే దానమిచ్చి తాను మాత్రం లోన్ తాలుకు ఈయమ్మై కడుతు ఇటు రోజువారి ఖర్చులతో అటు వేసారిన ఆశల వైపు అయోమయంగా చూస్తు.
    వేలం వెఱ్ఱి ఎక్కువైన కూతురి చేష్టలు పరాకాష్టకు చేరి చివరకు ఆ కూతురు తెచ్చి పెట్టిన వాడికే కట్టబెట్టి.. బాధను దిగమింగుకుని ఉన్నపళాన ఎటు తేల్చని అనిశ్చితిలో అడిగితే సినిమా చూపిస్తా అంటు చుక్కలు చూపించి అనక వేశాలేస్తే చెప్పినా అంతే చెప్పకున్నను అంతే అంటు మౌనం దాల్చగా..

    శర్మాచార్య మీ నానుడుల నుండి నేను డెడ్యూస్ చేశిన తాత్పర్యాలు..!

    ReplyDelete
    Replies

    1. 1.లెక్కపెట్టడం మొదలెడితే సమాజం నిండా తప్పులే కనపడతాయి సుమా!
      2.తనకున్నది భాగస్వామ్యానికి అనగా పాలుకి ఇచ్చి తను కూలికి వెళ్ళడం అంటే స్వతంత్రంగా బతకడం మానేసి అస్వతంత్రతకి గురి కావడం స్వల్ప లాభం కోసం.
      3.జంతికకి ఒళ్ళంతా చిల్లులే అలాగే చక్కిలానికీ ఉంటాయి, కాని తక్కువుంటాయి. జంతిక చక్కిలాన్ని నీ ఒళ్ళంతా చిల్లులే అని ఎగతాళి చేస్తే ఎలా ఊంటుంది?
      4.చేత కానివాడు వాడు మొగుడైతే ఉండే కష్టాలు. చెడ్డమొగుడైనా సద్దుకోవచ్చు కాని చేతకాని మొగుడుతో కాపరం కష్టం.

      Delete
  2. కంతలతో కందాలతొ
    చింతలతో జీవితాలు జీవించేద్దాం
    వింతేముందిందున ఆ
    వంతయు స్వార్థాన్ని విడనివాళ్ళము గనకన్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు, జీవితం అలా అలవాటయిపోయిందండీ :)

      Delete


  3. ఎంచు కుంటేను మంచమెంతేను కంత
    లేను! జంతిక చక్కిలాన్ని భళి యెక్కి
    రించినట్లు! తనది పాలికిచ్చి తాను
    కూలి కెళ్ళినట్లు, జిలేబి కువలయాక్షి,
    చేత కాని మొగుడరరె చెప్ప గాను
    వినడు, కొట్టగానిక వెక్కి వెక్కి యేడ్చు!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. వీటిని షట్పది చేసేరా! బాగు బాగు

      Delete


    2. దీనిని షట్పది చేసే
      రా నవ్య జిలేబి బాగు! రాధనమాయెన్
      మీ నేటి క్రీడ బామ్మా
      వేనోళ్ళ పొగిడెద మిమ్ము విద్యాబాలా!


      జిలేబి

      Delete