Thursday, 12 November 2020

వామన చింతకాయ పచ్చడి.

 వామన చింతకాయ పచ్చడి.


చితకమతక చింతకాయ పచ్చడిలా కొట్టేసేరు బాబూ అంటుంటారు.చింతకాయ పచ్చడి చేయడమంటే ఊరికే బాదెయ్యడమేంకాదు. చింతకాయ పచ్చడి చెయ్యడమే కష్టం. ఎందుకనీ:) కాయ చితకాలి, గింజ చితక్కూడదు, అంటే దెబ్బ తగలాలి, కనపడకూడదు, పోలీస్ దెబ్బలాగనమాట. అదీ అసలు పాయింటు. 


నిలవ పచ్చడి పెట్టుకునీ చింతకాయలు అటుపండూ కాకూడదు, ఇటు పచ్చిగానూ ఉండకూడదు, దోరగా ఉండాలి. వీటిని రోటిలో వేసి చితకా ముతకాగా కొట్టాలి, చితకా మతకా కానే కాదు. అంటే కాయ చితకాలి, గింజ చితక్కూడదు. గింజ కనక చితికి పచ్చడిలో కలిసిపోతే పచ్చడి బాగోదు, వగరుగా ఉంటుంది. అందుకు చితకా, ముతకాగా తొక్కాలి. అప్పటికే ఐపోలేదు. ఈముద్దలో కాయమీద ఉన్న దొప్పలొస్తాయి వాటిని ఏరాలి తీసెయ్యాలి, గింజలు ఏరెయ్యాలి, ఉట్లు ఏరెయ్యాలి, ఇప్పూడు ఈ చింతకాయ ముద్దకి పసుపు చేర్చాలి, తగిన ఉప్పెయ్యాలి, మళ్ళీ తొక్కాలి మెత్తగా. చింతకాయ తొక్కు తయారయింది. దీనికి తగిన కారంతో పోపును చేర్చి మళ్ళీ తొక్కాలి. పచ్చిమిర్చీ వేసుకోవచ్చూ. ఈ తొక్కిన పచ్చడిని ఒక రాచ్చిప్పలో పెట్టాలి, దానిలో గుంట చెయ్యాలి, నూనె కాచి అందులో ఇంగువ వేసి మంచి వాసనొచ్చిన తరవాత దానిని రాచ్చిప్పలో ఉన్న పచ్చడి గుంటలో పొయ్యాలి, కొంచం పచ్చడితో గుంత మూసెయ్యాలి. రాచ్చిప్ప పైన గట్టి మూత పెట్టాలి. ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ వాడుకోడానికి. 


ఇదేంటి వామనచింతకాయ పచ్చడి చెబుతానని. వామన చింతకాయంటే మరేంకాదు, ముదరని గింజపట్టని చింతకాయని వామన చింతకాయ అంటారు. ఇవి చిన్నగానూ,పల్చగానూ ఉంటాయి. వీటిని మెత్తగా రోట్లో పచ్చడి చేయాలి, మిక్సీల లో పచ్చడి బాగోదు రుచిరాదు.చింతకాయ పచ్చడిలాగనే వామన చింతకాయ పచ్చడిన్నూ, ఇందులో తుక్కులు,ఉట్టిలు, పెచ్చులు,గింజలురావు, ఆ అవస్థ తప్పుతుందంతే. :) 


పాత చింతకాయ పచ్చడి పథ్యానికి పనికొస్తుంది.పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు అంటారు. అంటే పథ్యమైనమాట చెప్పకు అని కదా! లోకమింతే!పాతచింతకాయపచ్చడి పాత గుడ్డముక్క దొరకవు. అదేంటీ పాతగుడ్డముక్కా..అబ్బో దీని గురించి మరోసారి.

78 comments:

  1. శర్మాచార్య.. ఈ నిలవ పచ్చళ్ళు చేయటానికి సమయం పట్టినా గాని పచ్చడి నిండుకునే వరకు తినాలనిపిస్తూనే ఉంటుంది. నాకు మీరు వామన చింతకాయ అన్నపుడే రెండు లైట్లు వెలిగాయి.. ఒహటి ఎల్ ఈ డీ, మరోటి సీ ఎఫ్ ఎల్.. సీ ఎఫ్ ఎల్ ఏమిటంటే పితసెలోబియం డల్స్ పచ్చడి అనుకున్నా.. వంకర టింకర కాయ కు సైతం పచ్చడి నూరుతారనుకున్నా.. ఇహ రెండవది ఎల్ ఈ డీ లైట్ అంటే అపూడే కాసిన చింతకాయ..! మా నాయనమ్మ గారిని ఈ టపా ద్వార గుర్తు చేశారు.. ఆమే గతించి ఆరేళవుతోంది కాని చింతకాయ పొట్టు పలగగొట్టి, ఊట్లు తెంచి, గింజలను సునాయాసంగా దబ్బణం లాంటి ఒక ముట్టు తో తీసేవారు.. ఎంత కుప్పగా పోసినా ఆమే చేతిలో సాయంత్రానికి వాడుకోవటానికి రెడిగా ఉండేవి. అందులో సగం నిలవ పచ్చడికి ఉపయోగించేవారు.. ఆమెకి ఇష్టమైన పింగాణి జాడిలో.. ఆ ఘుమఘుమ చాలా బాగుంటుంది.
    *
    ఎల్ సీ డీ: లిథార్జిక్ కన్ఫ్యూజ్డ్ డైలెమా.. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే కాదు
    ఎల్ ఈ డీ: లెజిటిమేట్ ఈక్వివోకల్ డిడక్షన్.. లైట్ ఎమిటింగ్ డైయోడ్ కాదు.

    ~శ్రీధరనిత

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      పాతచింతకాయ పచ్చడి తినేవాళ్ళున్నారా ఇంకా? చింతకాయపచ్చడి, ఉసిరికాయపచ్చడి జాడీలు వేరే, వాటిని కడిగేసినా అందులో మరేం పెట్టరు.చింతకాత తొక్కు నిలవపెట్టుకుని ఆ తరవాత దానితో పప్పు, పచ్చడి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ చేర్చి ఎప్పటికప్పుడు తయారు చేస్తే ఓ! అమృతం కదూ. పిజ్జాలు బర్గర్లు తినేవాళ్ళకేం తెలుసు ???చింతకాయ పచ్చడి మజా>


      Delete
  2. వామనగుంటలు ఆటకు ఆ పేరు ఇలాగే వచ్చిందంటారా, శర్మ గారు?

    ReplyDelete
    Replies
    1. వామన గుంటలు పేరు అలా వచ్చిందేమో చెప్పలేనండి. కాని చింత గింజలతో

      ఇదో మంచిఆట. దీనికోబల్ల, చేయించేవారు, దానిమీద గుంటలు. ఈ ఆటలో ఉపయోగించే పదాలు, పుంజీ అంటే నాలుగు, కచ్చటం అంటే ఎనిమిది గుర్రం అంటే పదహారు. చాలా మరిచిపోయానండి, ఈ ఆటలో ఇల్లాలు మంచి ఎక్స్పర్ట్.


      Delete


    2. ఏమండోయ్ తాతగారు,

      మన రాజా వారి రమణుల క్రీడల పేరేమిటో‌ ఎంత ఆలోచించుకున్నా గుర్తు రాలే. మధ్యలో మీరేమో వామనగుంట పేరు వ్రాసేరు.

      ఆంధ్రభారతి వారు బాల్యక్రీడలకు ఈ క్రింది చాంతాడంత లిస్టు ఇచ్చేరు.

      ఈ ఆటలేమిటో వాటిని ఆడే విధానం ఏమిటో ఓ టపా రాద్దురూ రాబోయే కాలానికి నిలవ వుంటాయి ?/( I don't see any where explaining what game is what - it would be a great compilation with your expertise wisdom)


      అంజి, అందలము, అక్కిబిక్కిదండ, అచ్చనగండ్లు, అచ్చనగాయలు, అచ్చనగుండ్లు, అచ్చనలు, అత్తనకాయలు, అత్తకోడలియాట, అప్పచి, అప్పళము, అమ్మనములు, అల్లి, అల్లోనేరేడు, ఆకుపీకెలు, ఆలంకిగుడి, ఆలుమగలయాట, ఇఱికి, ఈనెగాజులు, ఈలకూతలు, ఉడ్లపల్లంచి, ఉద్ది, ఉప్పనబట్టెలు, ఉప్పుగుందము, ఉవ్వలపోటీ, ఊదుగ్రోవి, ఏలపాటలు, ఒక్కసికొక్కు, ఒడ్డువిడుపు, ఓటిల్లుచిందఱ, ఓమనగుంటలు, కంబాలాట, నలుకంబాలాట, నాలుగుకంబాలాట, కట్టెగుఱ్ఱము, కనుమూసిగంతలు, కన్నుకట్టు, కన్నులకచ్చి, కాలికంచము, కిఱ్ఱుగానుగ త్రిప్పుళ్లు, కీచుబుఱ్ఱలు, కుందికట్టు, కుందికాళ్లు, కుందెనగిఱి, కుందెనగుడి, కుందెనగుళ్లు, కు(చ్చె)(చ్చి)ళ్లు, కుప్పటగురిగింజ, కుప్పిగంతులు, కుప్పీలు, కుబేరాక్షము, గచ్చకాయలు, గ్రచ్చకాయలు, కుమ్మరసారె, కొండకోతి, కోతికొమ్మంచి, కోలక్రోతులు, కోలాటము, హల్లీసకము, కోలుకోలన్నలు, ఖంజపాదము, గంజనగాలు, గంగెద్దులాట, గట్టినబోది, గనికెకుండలు, గాలిపటాలు, గిలక, గీర(న)(నం)గింజలు, గుంటచాళ్ళు, గుజగుజరేకులు, గుజ్జెనగూళ్ళు, గుడుగుడు గుంచములు, గుఱ్ఱ(పె)(మె)క్కుడు, గూఢమణి, గూఢరత్నము, గూవనాలు, గొడుగు, గొబ్బిళ్ళు, గోటదొర్లుడుకాయ, గోడిపట్టెలు, గోరింపుబంతులు, చండ్రలాటలు, చక్రాలత్రిప్పుడు, చాకిబాన, చింతపూవు, చింతాకు, చిందఱ, చిందుపరువు, చిక్కనాబిళ్లలు, చిట్లపొట్టలు, చిట్లపొట్లకాయ, చిడుగుడు, చిడుగుడుపురుగులు, చిప్పచిప్పగోళ్ళు, చిమ్మనగ్రోవి, చిమ్మనబిళ్ళలు, చిమ్ముబిల్లలు, చిఱుతనగోడు, చిఱుతనబిల్లలు, చిఱ్ఱిపట్టె, చిఱ్ఱుబుఱ్ఱులు, చిల్లకట్టె, చీకటిమొటికాయ, చీకటిమొటికిళ్ళు, చుండ్రాళ్ళు, చుణుదులు, చెండు, చెండుగోరింపులు, చెఱుకులపందెములు, చేబంతులు, చొప్పబెండ్లమంచము, జాబిల్లి, జీరుకురాతి, జిల్లజీ(ర్కు)(డ్కు)లు, జీర్కుబండ, జీర్కురాయి, జెల్లెము, జోడురాలు, తగరులవిడుపులు, తన్నుబిల్ల, త్రొక్కుడుబిల్ల, తఱుముడుచెండు, తాటాకుచక్రాలు, తాటిచెట్టాట, తాటియాకులచిలకలు, తాళ్ళపాములు, తిరుగుడుబిళ్ళల త్రిప్పుళ్ళు, తుంపెసలు, తుమ్మెదరేపుళ్ళు, తూనిగ తానిగ, తూరనగోలలు, తూరనతుంకములు, దాండ, దాగలిమూతలు, కికురింతలాట, గుప్తకేళి, డాగనమ్రుచ్చిళ్ళు, డాగనమ్రుచ్చులు, డాగిలిమూతలు, డాగిలుమ్రుచ్చులు, డాగుడుమూతలు, డాగురింత, డాగురుమూతలు, దాగనమ్రుచ్చిళ్లు, దాగనమ్రుచ్చులు, దాగిలిమూతలు, దాగిలిమ్రుచ్చులు, దాగు(డు)(రు)మూతలు, దాట్రాయి, దాయాలు, గవ్వలాట, దోయము, దూచి, దూబూచి, దోపిడీ, దోపిడియాటలు, దోపిళ్ళు, నట్టకోతి, నాలుగుమూలలాట, నిట్టుక్కి, నీగ, నెటికతట్లు, నెట్టు, నెట్టుడుగాయ, పచ్చాకు, పత్తికాయ, పాడుపాతరమాళ్ళు, పాతరలు, పారపట్లు, పాఱిగంతులు, పింపి(ళ్ళు)(ళులు), పిల్లగిరులు, పిల్లగోరు, పిల్లదీవి, పుక్కటిల్లు, పు(ట)(ట్ట)చెండు, పు(డి)(ణి)కిళ్లు, పులియాట, పెంచులభేరి, పెనకువవితములు, పొళ్లులు, పోగిస, పోతుటీనెగుఱ్ఱములు, బండ్లకల్లులు, బంతిఆట, బందారుబసవన్న, బరిగాయపోటు, బిరిగాయలు, బిల్లగోళ్ళు, బిల్ల(బి)(వి)ద్యము, బుడికిస్సు, బువ్వంపుబంతి, బూచి, బేడిసతిరుగుళ్లు, బొంగరాలాట, బొట్టనగోలలు, బొమ్మరిలు, బొమ్మలపెండ్లిండ్లు, బోర్లపక్క, మంటిగూండ్లు, మూతపొడుపు, మేల్మచ్చులు, మోపిళ్లు, యక్షకేళి, యాలాకి, రామన్నాట, విండ్లమ్ములాట, వి(ద్దె)(దియ)ము, వెన్నెలకుప్పలు, వెన్నెలకూన, వెన్నెలపులుగము, వెన్నెలప్రోవు, వ్రేలుబొట్టగ, సింగన్నదాటులు, సిరిసింగణాలవత్తి, సిరిసింగనాలవృత్తి, సూడుపట్టె, సూళ్ళు, హరిణక్రీడనము.



      పని పురమాయించు
      జిలేబి

      Delete
    3. బామ్మా! ఏంటో అన్నావు తెలియలా:)


      Delete
    4. ఈ "జిలేబి" గారు అసలు తెలుంగు వారేనా? అయ్యుంటేనూ, "ఆడువారు" అయ్యుంటేనూ, ఆంధ్రా ప్రాంతాల్లో బాల్యం గడిపి ఉంటేనూ తన చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి "ఒప్పులకుప్ప వయ్యారిభామ" ఆట ఆడే ఉండాలే? కాదూ "ఆడువారము" కాము మేం మగవారము అంటారా ... అయినా కూడా ఇంటి ఆడపిల్లలు, ఇరుగుపొరుగు ఆడపిల్లలు ఇంటి ముందరో పెరట్లోనో ఈ ఆట ఆడుతుంటే చూసే ఉండాలే? ఇప్పుడు ఏమీ తెలియనట్లు "ఇంతకీ ఈ క్రీడా విశేషము పేరేమిటండి ?" అంటూ అడగటం ... అమాయకత్వమా, గడుసుతనమా, కొంటెతనమా???

      కానివ్వండి "జిలేబి" గారూ, ఈ క్రింది విడియోలో ఆ ఆటను వీక్షించి ఆనందించండి.

      ఒప్పులకుప్ప వయ్యారిభామ

      Delete
    5. పదహారణాల ఆంధ్రులు
      పదపడి తూగోజివారు బ్రాహ్మణపురుషుల్
      ముదమట జిలేబులంటే
      చదురాడ ఘనీబులంట శర్మాజిహితుల్

      Delete


    6. ---బామ్మా! ఏంటో అన్నావు తెలియలా:)


      ఏమన్నా నా? ఇక్కడివారికి మీ తెలివేదీ అన్నా

      ఓ టపా కొట్టండి బాక్రీ పైన :)



      జిలేబి

      Delete
    7. నాకెందుకొచ్చిన కంచి గరుడ సేవ? :)

      Delete
    8. విన్నకోటవారు,
      బొహిరతొ :)

      Delete
    9. రాజావారు,
      ఆవిడ నిజం మిగిలినదంతా మాయ :)

      Delete


    10. మీలాంటి పెద్దవారే నాకెందుకీ కంచి గరుడ సేవ అంటే ఎట్లాగండి తాతగారు.

      విద్వన్మణులు మీరు అలా అనరాదు.
      మీ ద్వారా ఈ సేవ చేసి కంచి కామాక్ధి అనుగ్రహము పొందవలె.


      ఇట్లు
      వినమ్రత తో
      విన్నకోలు
      సమర్పించుకొను
      జిలేబి
      వ్రాలు‌

      Delete
    11. “విన్నకోలు” ఏమిటి, “జిలేబి” గారూ? ఏమిటా పదం? నా ఇంటిపేరు గానీ వ్రాద్దామనుకున్నారా ఏమిటి?

      Delete
    12. విన్నకోలు అంటే మీ ఇంటి పేరూ కాదనుకుంటాను వియనారాచార్య అలా అని చెర్నకోలు కాదు.. విన్న పాలునే విన్న వించుకుని వినయంగా వినమ్రతతో వెలువడిన పదమై ఉంటుంది లెండి. వ్రాలు అంటే వాలిపోవటం ఎంత మాత్రము కాదు. దస్తూరిలో ఐతే చేవ్రాలు అని ఉండేది. కాని ఇది డిటిటల్ వ్రాలు అనట్లు. బై ది వే.. ఆమె "దిసీజ్ ఏ కంప్యూటర్ జెనరేటెడ్ కమెంట్ యాండ్ రిక్వైర్స్ నో ఫిజికల్ సిగ్నేచరూ హెన్స్ కమెంట్ వెరిఫైడ్ యాండ్ అప్రూవ్డ్" అనట్టు..

      Delete
    13. ఒకానొక సమయాన స్వయాన ఆ గరుడారుఢునికే తప్పలేదు.. కంచి కామాచి పలుకు మదుర మీనాచి పలుకు బెజవాడ కనకమ్మ పలుకు త్రింకోమలి శాంకరి దేవి పలుకు.. అంటూ ఆకాశ రాజు నింట జేరి పద్మావతి అనగా అలమేలు తల్లి ని తన హృద్మందీరాన పునః ప్రతిస్ఠించుకోవటానికి.. డొర్కుణ ఈఠ్వంఠి ఛేవా.. చ్లీ కిత్నాల్పణోం ౺

      Delete
    14. // “ విన్నకోలు అంటే మీ ఇంటి పేరూ కాదనుకుంటాను వియనారాచార్య“ //
      ————

      ఎంత మాత్రమూ కాదు, శ్రీధరా. నా ఇంటి పేరు వ్రాయబోయి స్పెల్లింగు తప్పు చేశారేమోననే సందేహంతో నా కామెంట్లో అలా అన్నాను. వారు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు కదా, అందుకని అడిగానన్నమాట.

      Delete


  3. హేవిటో ఈ పెద్దాయన చాదస్తాలు!

    కాయ చితకాలి, గింజ చితక్కూడదు, గట్రా గట్రా కష్టాలూ కతలున్ను .


    మోర్ కో రిలయన్స్ కో వెళితే బోలెడన్ని వెరైటీ బ్రాండు చింతకాయ పచ్చళ్లు. జస్ట్ యు నో పదో పరకో.


    ఆ పాటి దానికి ఇదేదో పెద్ద బెమ్మ విద్దెలా ఆయ్ నాట్‌ దట్ ఈజీ యు నో అంటూ....... దీర్ఘాలున్నూ :)


    నారదా
    నీకేమైనా సమజయ్యిందా ?




    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎట్ల సమజైతది బుల్లెమ్మా! పాతకాలపోల్లం. :)నీకేటి ఎరికైనాదా?రిలయన్స్ కెలితివా? దొరికినాదా? :)మమ్మీ డేడీలు కూడ దొరుకుతరు మాల్స్ లో కొనరాదె :)








      Delete
  4. జిలేబి జీ, మీకు జిలేబి చెయ్యడం అయినా వచ్చా?
    లేకపోతే అది కూడా ఆన్ లైన్ లోనే నా?

    ReplyDelete
    Replies
    1. మిత్రులు బోనగిరిగారు,
      ఆవిడ నుంచి సౌండ్ లేదండి. :)
      వారిదంతా ఆన్ లైనే :)

      Delete


    2. సౌండెపుడూ లేదండీ !
      బండారమ్మాన్లయనని పల్కిరి ప్రముఖుల్
      కొండాట్టపు రమణి నిజము
      చెండాడుటయు నిజము మరి చేడియె మాయా!


      జిలేబి

      Delete

    3. ఎవరు పెట్టేరోగాని పేరు గొప్పగా పెట్టేరు, వీరతాళ్ళెయ్యాసిందే :) బండమ్మాయి :)

      Delete
  5. // “విన్నకోటవారు,
    బొహిరతొ :) “ //
    ——————
    శర్మ గారు బొంగ్లా లోనో, ఒడియా లోనో ఏమిటో అన్నారు, బోధపడలే 🤔.

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు,
      బంగాలీలో బొహిరొతొ అంటే బయటివారు, స్థానికులు కానివారని అర్ధంటండీ, మొన్ననే నేర్చుకున్నానీ మాట. :) ఎక్కడ ప్రయోగించాలంటే ఇక్కడ సావకాశం దొరికిందండి :)

      Delete
    2. ఈ మధ్య మీ మాటల్లో అప్పుడప్పుడు బెంగాలీ పదాలు దొర్లుతున్నాయి. “బంగారు బొంగ్లా” భాష నేర్చుకోవడం మొదలెట్టారా ఏమిటి? పుస్తకం సాయంతోనా, ఆన్-లైన్ లోనా?

      నేర్చుకుంటే మంచిదే లెండి. రొబీంద్రొ సాహిత్యం, శరత్ సాహిత్యం ఒరిజినల్ లోనే చదువుకోవచ్చు ... విజయ మూవీస్ వారి చక్రపాణి గారి లాగా 👍🙂.

      Delete

    3. రొబీంద్ర షొంగీత్ తో బాటు రొషగుల్లా, మిష్ఠీ దోయ్ వదిలేసారేమిటి :)

      Delete
    4. విన్నకోటవారు.
      బహిర్గత అన్నది సంస్కృతంటండి, బొహిరొగతొ అన్నది బంగాలీటండి, మమతమ్మగారి చలవండి. ఈ ఒక్క ముక్క మననం చేయలేక గ మింగేసేనండి. అదండి నా బంగాలీ చదువు, వేంకటేశం ఇంగ్లీషు చదువులాగా :)
      రసగుల్లాతో పాటు జిలేబి చెప్పలేదని కుళ్ళు :)

      Delete
    5. Hha hha hha hha 😁
      “ “జిలేబి” మేడ్ ఈజీ “ పుస్తకం సంపాదించి దాని సహాయంతో బెంగాలీ భాషను అభ్యాసం చెయ్యండి, శర్మ గారు👍😁. ఆ భాషలో తనకు ప్రవేశమున్నట్లు తరచూ బిల్డప్ ఇస్తుంటారుగా వారు 😁😁.

      Delete
    6. 'జిలేబీ మేడీజీ' ఇంకా ఎవరూ విడుదల చేసినట్లు లేదుడీ. 'టెల్గూ మేడ్ డిఫికల్ట్' అని జిలేబీ గారి పుస్తకం ఒకటి దొరుకుతోందని చెప్పుకుంటున్నారు నెటిజనులు.

      Delete


    7. "డిఫికల్ట్లీ మేడ్ టెల్గూ
      ప్రొఫీషియన్సీ" జిలేబి పూబోడిదటా
      ముఫతున దొరకునటా చది
      వి ఫెడేల్మని నేర్చుకొనుచు విదురులు కండీ :)



      జిలేబి

      Delete

    8. విన్నకోటవారు, శ్యామలీయం వారు.

      ఏభై దశకంలో హై స్కూల్ లో చదువుకున్నవారికి గుర్తుండి ఉండచ్చు. వేకట సుబ్బారావు మేడ్ ఈజీ, కుప్పు సామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్ అనే రెండు గైడ్ లు ఉండేవి, ఇంగ్లీష్ భాషకి. ఆ సమయం లో నే five పండిట్స్ అనీ ఆ తరవాత eight పండిట్స్ అనీ గైడ్ లు వచ్చాయి, ఇంగ్లీషుకే. ఆ తరవాత కాలంలో అంటే చాలా కొద్ది సమయం తేడాలోనే తెలుగు భాషకి, సైన్స్ కి, సోషల్ కి వీరిలాగే గైడ్ లూ వచ్చాయి. అలా తెనుగుకి జిలేబి మేడ్ డిఫికల్ట్ దొరుకుతున్నట్టే ఉందండీ. వీరి భాషా సేవకి మెచ్చి ఏదేని ఒక బిరుదు ప్రసాదిస్తే బాగుండీలా ఉందండి.

      Delete


    9. ఏబై దశకమ్ములలో
      ప్రాబల్యము నొందినట్టి భాషా గైడుల్
      బాబయ్య! ఈజి డిఫికల్ట్
      గా బారులు తీరెను పిలకాయల కొరకై


      జిలేబి

      Delete


  6. మేడీజి జిలేబి యనెడు
    పీడీయెఫ్పొత్తమునిక వెనువెంటనె డౌ
    న్లోడొనరిచి బంగ్లా భా
    షా డిండిమ సంఘటింప సాధించండీ! :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తెనుగు భాషా హింసా డింఢిమ బిరుదు ఎలా ఉందంటావ్ బామ్మా:)

      Delete


    2. భాషా హింసా డిండిమ
      యే షోకగు బిరుదు నీకు యెంకటలచ్చీ
      శోషించితి వీవు తెనుగు
      భాషాయోషను విడువక బామ్మ ! జిలేబీ !


      జిలేబి

      Delete
    3. హమ్మయ్య.. మొత్తానికి బిజిలే అమ్మణ్ గారి అసలు పేరు వారి ద్వారనే తెలియ వచ్చింది.. వేంకట లక్ష్మీ గారు ట.. అదేదో ఎందుకంటే ప్రేమంట మూవిలో లా "...సువిశాల సారథి" రేంజిలో "తెనుగు భాష ప్రావిణ్య భాషా హింసా డిండిమ యెంకట లచ్చి బిజిలే అమ్మణ్ గోరికి" సాహో హోసా

      Delete
    4. // ” హమ్మయ్య.. మొత్తానికి బిజిలే అమ్మణ్ గారి అసలు పేరు వారి ద్వారనే తెలియ వచ్చింది..” //

      హ్హ హ్హ, అంత తేలికా శ్రీధరా 😁?
      మిమ్మల్ని ఏమార్చడం చాలా సులువు అనుకుంటానే 😁😁?

      Delete
    5. కేలస్తో వేజాకూఁ.. అత్రాయి వ్యాండో కోని.. అటాయోగ..

      Delete
    6. బాబూ శ్రీధరా, మీ భాష మాక్కూడా నేర్పించరాదూ? మీరు మమ్మల్ని పొగుడుతున్నారో, తెగడుతున్నారో తెలియాలి కదా.

      Delete
    7. పెద్దలను తిట్టేంత కుసంస్కారిని కాను నేను వియన్నారాచార్య..!

      Delete
    8. బాస నేర్చుకునేందుకు నేనూ వస్తానూ...కందమ్మని జేర్చుకుంటే రానుబాబూ...:)


      Delete
    9. కం. నేనును నేర్వగ వత్తును
      కానీ ఆ ఒకరు వచ్చి గడబిడ చేయన్
      నేనొప్ప వారు వచ్చిన
      రానే రానన జిలేబి రాదా యేమీ!!

      Delete

    10. శ్యామలీయంవారు
      మీరూ వస్తారా బళ్ళోకి? జిలేబి జగడాలమారి (భజ గణాలు?)మనసు తంగం కదండీ? వెనక బెంచీలో కూచో బెట్టేద్దాం. :)

      Delete
    11. శ్రీధరా,
      పొగుడుట తెగడుట .... అనేవి పూర్తిగా కాకపోయినా ఒక రకంగా కలిపి చేసే పదప్రయోగం అనచ్చు. దాంట్లో సంస్కారాల ప్రసక్తికి తావు లేదు. పోనీ మంచి మాటే అయినా మీరన్నదేదో అర్ధమవ్వాలి అనే కుతూహలం కదా? అందుకనన్నమాట మీ భాష నేర్పించండి అన్నది.

      అందుకే, చూ"షా"రా మరి, పెద్దలు శర్మ గారు కూడా మీ భాష నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు -- షరతులకు లోబడి ("conditions apply" అన్నమాట 😀)

      Delete
    12. విన్నకోటవారు,
      అసందర్భమే ఐనా విషయం చెబుతున్నా! ఇదెవరిని కించపరచడానికి కాదు. నాకో మిత్రుడు,ఉద్యోగ సహచరుడు, చచ్చరభాష మాట్లాడగలడు, ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు, ఎన్నో సార్లు అడిగా, భాష నేర్పూ అని, నేర్పనుగాక నేర్పనన్నాడు, నీవు కాకపోతే మరొకరిదగ్గర నేర్చుకుంటా అని బెదిరించా. అది నీవల్ల కాదు, మా వాళ్ళెవరూ నీకా భాషలో ఒక ముక్క కూడా నేర్పరు, ఎవరూ నీదగ్గరికే రారు. భాషే మా అయుధం, ఇంతకు మించి చెప్పను అన్నాడు.నేర్చుకోలేకపోయా!
      ఈ భాషకీ లిపి లేదు

      Delete
    13. శర్మ గారు,
      లిపి లేకపోతే మన లిపిలో వ్రాసుకోవచ్చు గానీ అసలు నేర్పనే నేర్పను అనేవారితో ఏం అనగలం?

      Delete


    14. శ్రీధర వీళ్లెవరికి మీ
      దౌ ధరణిన్ చెన్ను భాష "తప్పితవరి" నే
      ర్పే ధర్మము చేయకుడీ
      సాధించి మరి తవరికె యెసరు పెట్టెదరోయ్ :)


      నారదా
      జిలేబి

      Delete


    15. హస్త భూషణ మిది జిలేబమ్మ దండి
      భగ్గు మను సుమండీ మ్యాచు బాక్సు మరియు
      అగ్గిపుల్ల వలెను సుర్రుమంచు చేయి
      కాల్చు శ్రీధర వినరా నిఖార్సు మాట!


      జిలేబి

      Delete
    16. ఓ తప్పకుండ..
      రంగులలో కలవో.. అంటు రంగులతో మొదలు పెడదాం
      కాళో: నలుపు: కాళోకట్: మబ్బులా నల్లనైన
      ధ్వాళో: తెలుపు: ధ్వాళోసప్: పాలలా తెల్లనైన: ధవళ మెటామార్ఫ్
      పీళో: పసుపుపచ్చ: పీళోజరద్: జర్దాలా పసుపైన
      నీలో: నీలి: నీలోగచ్: ఆకాశమంత నీలమైన
      హరో: ఆకుపచ్చ: హరోకచ్చన్: అడివంత పచ్చనైన
      రాత్డో/లాలో: ఎరుపు: లాలోచటక్: కుంకుమంత ఎర్రనైన
      భూరో: గోధూళి: భూరోభట్: రాయంత గోధుళియైన

      మీ పేరేమిటి: తమార్ నామ్ కాఁయి: బంగ్ల మెటామార్ఫ్ ఆఫ్ తోమార్ నామ్ కీ

      ఇంటరాగేటివ్స్:
      ఎక్కడ: కత్త
      ఎప్పుడు: కన్నా
      ఎవరు: కూణ్
      ఎందుకు: కసన్
      ఎలా: కూఁ
      ఏమిటి: కాఁయి

      యానిమల్స్:
      ఆవు: గావ్డి: సాంస్క్రిటైజ్డ్ మెటామార్ఫ్ ఆఫ్ గౌ
      గేదే: భ్యాంసి: స్త్రీలింగం; భ్యాంసా: గేదేపోతు: పురుష్
      గొర్రె: గోర్లి: స్త్రీ; గోర్లా: గొర్రెపోతు
      ఛేళి: మేక: స్త్రీ; ఛేళా అనుకున్నారు కాని కాదు బకరా: పు
      :
      :

      Delete
    17. అటులనటులే బిజిలే అమ్మణ్.. భస్మాసురుని వలే శంకరునికే ముప్పు వాటిల్ల జూపినను కావగ శ్రీహరియే మోహిని అవతారము దాల్చి కడ భస్మము గావించే కదా.. రంగులు, జంతువులు ఇంటరాగేటివ్స్ వరకే చెబితినమ్మ..! మాట ఆడి తప్ప కూడదనే నియమము తోడ..! థోడా కుచ్.. ఔర్ ముఝే కభీ మేరే భాష పర్ గర్వ్ నహి మహసూస్ హుఆ కర్తా హై.. పీడియాం హమారి బరసోఁ సే ఇసే ఐసేహీ దేతే ఆ రహే హైఁ.. శుక్రీయా.. శర్మా జీ ఆప్కో ఔర్ నృసింహ జీ కే దియే బాత్ కో టాలే బగైర్ మేరే మాతృక్ భాష కే చంద్ పదోఁ కా పరిచయ్ దిలాయా హూఁ.

      Delete


    18. కెపకెప వేజకు అత్రా
      యిపకు తమార్! వ్యాండొకోని యీ నీలోగచ్
      చపకుచపక్ భూరోభట్
      టపటప ధన్ ధన్ చిటపట ఢంఢంఢడ తుస్!



      జిలేబి

      Delete
    19. అగ్గిపెట్టే చూడు బహు మిన్నకుండు
      అగ్గిపెట్టి చూడు చురుక్కున మండు
      పుల్లలందు అగ్గిపుల్ల తీరే వేరయ
      సరాసరి రామ నిప్పు రాజేయకు శ్యామ

      ఫినైల్ పాలు పెరుగు కల్లు
      రంగులతో కాకోయి ఖంగు
      రుచి చూసి అనుకోకు భంగు
      సివరి సుక్కకే తేలిపోతుంది ఠంగు

      Delete


    20. నచ్చినందుకు, మెచ్చినందుకు,
      సంతోషం కూరి/డి/న కృతజ్ఞతలు శ్రీధరనిత 🙂🙏 ...

      :)

      జిలేబి

      Delete

    21. బామ్మ మామూలు అగ్గిపుల్ల కాదు. జపాన్ అగ్గిపుల్ల.
      రెండవ ప్రపంచ యుద్ధం ముందు మనం అగ్గిపెట్టెలని దిగుమతి చేసుకునేవారమట, అదిన్నీ జపాన్ నుంచి. ఆ అగ్గిపెట్టెలకు పక్క రాసే నల్లమందు కూడా ఉండేది కాదుట. అగ్గిపుల్లని పచ్చ భాస్వరంతో తయారు చేసేవారట. ఇది ఏ మాత్రం ఒత్తిడి కైనా అంటుని మండిపోయేదట.

      Delete


    22. మామూలు అగ్గి పుల్లా?
      మామి జపానగ్గిపుల్ల ! మాటినకుంటే
      సామీ భగ్గుమను జిలే
      బీ!ముప్పికతప్పదు గజిబిజి తప్పదయా!


      జిలేబి

      Delete
    23. ఎంత గొప్ప అగ్గిపుల్లైనా ఒక సారే వెలుగుతుంది, అది జపానగ్గిపుల్లైనా, జర్మని అగ్గిపుల్లైనా .... ఆ తరవాత

      శ్రీమద్రమారమణ గోవిందో హరి

      Delete


    24. ఎంత గొప్ప అగ్గి పెట్టిని పుల్లైన
      నొక్క మారు మాత్రమోయి వెల్గు
      జర్మనీ యయినను జప్పాను పుల్లైన
      నూ జిలేబి తాత నుడివినారు


      జిలేబి

      Delete
    25. పేరు గొప్ప అగ్గి పెట్టెలో పుల్లైన
      తడిచిన తన తీరు తారుమారె
      కమ్మని రుచిగల జిగట జిలేబీలైన
      చల్లబారిన తమ చవులు వోవు .

      Delete


    26. రాజావారు,
      అసలు సిసలు మాట చెప్పేరు. తడిసిపోయిన అగ్గిపుల్ల ఎండబెట్టుకుంటే పనికొస్తుంది, ఒక్క సారికైనా. పులిసిపోయిన జిలేబి ఛీ! యాక్కులారీ :)


      Delete


    27. ఈ రోజు గురుపంచమి అని ఈ జిగట జిలేబి నామస్మరణ లేలండీ :)



      జిలేబి

      Delete
    28. గురుపంచమి రోజు జిలేబిని తలుకుకోబద్దన లేదే :)తీపి జిలేబి తంగం మాదిరి :)

      Delete
  7. తాతా మనవ ళ్ళిరువురు
    ఏతావాతా ఘనీబులే యెందైనన్
    చేతులు జోడించి వినుటె
    మా తలరాతయ్యె నిజంబు మాత్రము రాదే !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      నేను గరీబునే, అమ్మణ్ణి మాత్రం అమ్మోరు తల్లే :)

      Delete
    2. అయ్యోసారూ తమతో
      కయ్యానికి రానుగాని కందయ్య(మ్మ) కతేం
      దయ్యా గుప్పిట విప్పిన
      చయ్యన మింబొగిడి పద్యచంపక 🌹 మిత్తున్ .

      Delete
    3. రాజావారు,
      కందమ్మ హైదరాబాదు ఎంకటలచ్మిట :)


      Delete
    4. ఆఁ యేముందండీ ! యే
      బాయమ్మైతే మరేమి ? పని మాకేమీ ,
      మాయామర్మము లెరుగని
      మాయందున తమకుగల్గు మన్నన 🙏 చాలున్ .

      Delete
    5. రాజావారు,
      అన్నన్న ఎంత మాట! తమరంటే ఎప్పుడూ గౌరవమే! తంగమ్మకీ మీరంటే ఎంత అభిమానమో, చెప్పలేను.

      Delete
    6. శ్రీధరా!

      ధన్యవాదాలు అనడానికి ఏమనాలి? దొన్యవాదో అంటారా?

      Delete
    7. ఉహూ కాదు ఆచార్య.. మా మాతృకలో ఇపటిదాక సరియగు పదము లేని పదాలూ ఉన్నాయి వాటిలో ఇవి:
      ప్రేమ, ధన్యవాదాలు, ఇంకా ఉండి ఉంటాయి.. నాకు తెలిసి వీటికి లేవు.

      Delete
    8. అడక్క అడక్క ఆ పదమే అడిగేను చూడండి, :)
      మీ ఇష్టం ఒక మంచి మాట చెప్పండి.భాషలో ఉన్న ఒక లాలిపాటరాసి అర్ధం చెప్పమని కోరేను, మళ్ళీ అడుగుతున్నాను. కాదనకండి. లాలిపాట లేని భాష ఉండదు.

      Delete
    9. భాంది బాటి దిని సీఖ్ అస్మాన్ వళ రేని అనే నానుడి ఉంది మా మాతృక లో.. అనంటే.. సద్దన్నపు మూట, ఇచ్చిన మాట కలకాలం ఉండవు..

      లాలి పాట విషయానికొస్తే..
      రాత్ వేయి చాలి.. సద్రేసి సోజో జో లాలి జో.. ళోళోళో..
      చాంద్ సదాయి శీలోఖళ్ వేయి చాలో.. ఆంఖి భరన్ నీంద్ లేల సోజో లాలి జో.. ళోళోళో..

      రాతిరాయే త్వరగా బజ్జో లాలి జో.. ళోళోళో ఆయి.. దాయమ్మ దాయి
      చంద్రుడు సైతం చల్లగా మారిపోయే.. కనుల నిండుగ నిదుర పో లాలి జో.. ళోళోళో ఆయి.. దాయమ్మ దాయి

      Delete
    10. శ్రీధరా!
      చద్ది మూట ఎండెక్కకుండా తినెయ్యాలి లేకపోతే పాడైపోతుంది, ఇచ్చినమాట కూడా నెరవేర్చుకోవాలి, మరచిపోకుండా, మంచిమాట చెప్పేరు.
      లాలి పాట బాగుంది. ఏ తల్లి కైనా తనబిడ్డంటే పరమానందం. ఆ బిడ్డ సుఖం కోసం తల్లి ఆలాపన....నిద్ర సుఖం కదా! మీ భాషలో మాధుర్యాన్ని అందించినందుకు సంతసం, అభినందన.
      మీ భాషని తరతరాలుగా కాపాడుకొస్తున్న పెద్దలకు వందనం చెబుతూ, మీ భాషను ఇలాగే కాపాడుకోవాలని కోరుతున్నా, ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూ. లిపి పుస్తకాలూ భాషను బతికించలేవని నా అభిప్రాయం. సవర భాషకు గిడుగు లిపి చేకూర్చారు,ఎంతమంది నేర్చుకున్నారు?ఈ భాషమీద అ తరవాత పరిశోధన జరిగిందా? ఏమి అభివృద్ధి జరిగింది? ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. అవసరం భాషను నేర్పుతుంది. మరొకరికి అవసరం లేకపోయినా మీ భాషను మీరు రక్షించుకుంటారు, అది మీ జీవనాడి, తరతరాలది. అది కొనసాగాలని కోరుతూ...
      దీర్ఘాయుష్మాన్భవ

      Delete
    11. మీ ఆశిస్సులకి సదా కృతజ్ఞుడిని ఆచార్య. భాష అనేది భావాన్ని ఒకరికి మరొకరు తెలుపుకునే వారధి లాంటిది. భాష ఎపుడు గోడ కానే కూడదు. తరతరాలుగా మౌఖికంగానే తరలి వస్తున్న మా మాతృక లాంటి భాషలు లిపి లేకున్నా దాని ఆంతర్యాన్ని కేవలం గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాయి, ఉంటాయి.. కొన్ని భాషలు చారిత్రికతను సంతరించుకున్నాయి.. కొన్ని కాలక్రమేణ కాలగర్భాన కలసిపోయాయి.. వారసత్వ సంపదగా భాషను కాపాడుకుంటు.. అలానే ప్రాంతీయ భాషలతో అన్వయించుకుంటు అలానే భాష యొక్క పటిమను కాపాడుకుంటు. మీరు కూడా చల్లగా వర్ధిల్లాలని మా ఇలవేల్పు వేంకటేశ్వరుణ్ఢి మొక్కుకుంటు..

      Delete

  8. కంద చంపకము

    మెటమార్ఫ్! కత్తా కన్నా
    నట! టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చి
    ట్పట బుస్సు తుస్సు తుస్ కూణ్
    గుట!కాయి కసంచ ఛేళి గుటు కాళోకట్!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అమ్మణ్ గారు మీ కందమాల ప్రక్రియలో మా మాతృక పదాలను చేర్చినందుకు ధన్యవాదాలు.. ఐతే ఇపుడు మీరు కట్టిన ఆ చంపకమాల తాత్పర్యాన్ని అచ్చుకుమచ్చు తెలియజేస్తాను చూడండి..

      పరివర్తనం! ఎక్కడా ఎప్పుడు
      నట!టపటప ధన్ ధనాధన ఢఢంఢఢ చి
      ట్పట బుస్సు తుస్సు తుస్ ఎవరు
      గుట!ఏమిటి ఎందుకుంది మేక గుటు కాటుకంత నల్లన!

      (బహుశ దీపావళి నాటి రాత్రీ అల్లినారేమో ఈ పద్యాన్ని.. చాలా వరకు కాకరపువొత్తులు, రాకెట్లు, చిచ్చుబుడ్లు, మతాబుల చపుళ్ళే ఉన్నాయి.. స్టాటుటరి హజార్డ్: ఎయిర్ పొల్యూషన్ కమ్ సౌండ్ పొల్యూషన్ ఇజ్ హజార్డస్ టు ఎన్విరాన్మెంటల్ ఇకాలజి)

      Delete