Friday, 20 November 2020

దుంపల పచ్చడి.

 దుంపల పచ్చడి.



దుంపలంటారుగాని నేలలోపల పండేవన్నీ దుంపలే. వీటి అసలు పేరు చిలకడ దుంపలు. ఇవి రెండు రకాలు, తెల్ల దుంపలు, ఎర్ర దుంపలు. ఎర్ర దుంపలు కొంచం తియ్యగా ఉంటాయి, తెల్ల దుంపలకంటే. వీటిని తియ్య దుంపలని కూడా అంటారు.


ఈ దుంపల్ని తెచ్చుకుని నీళ్ళలో పడేసి శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు చేసుకుని వాటికి తగిన ఉప్పు, పసుపు చేర్చి, తగిన పోపు కూడా చేర్చి రోటిలో రుబ్బుకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా ఐపోయి రుచిపోతుంది. అందుకే హోటళ్ళలో ఇప్పుడు రోటి పచ్చడి హోటల్ అనేదో క్రేజ్. ఈ పచ్చడి సరిగా కనక చేసుకుంటే కొబ్బరికాయ పచ్చడిలా ఉంటుంది. 


ఈ దుంపలని సుగర్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా తినచ్చు. ఎందుకంటే వీటిల్లో కార్బ్ ఎక్కువగానే ఉన్నా, గ్లైసిమిక్స్ ఇండెక్స్ తక్కువ, రక్తంలో చక్కెర విడుదల జేయడానికి చాలా కాలం పడుతుంది, పీచు ఉంటుంది, కడుపు నిండినట్టూ ఉంటుంది. ఆధునికులు ఛీ దుంపలా అని ఈసడిస్తారు గాని గొప్ప ఆహారం.


కొస మాట:- ఈ దుంపని తరుక్కుని బెల్లం పాకంలో ఉడకబెట్టుకుని నాలుగు ముక్కలు సుగర్ వాళ్ళు కూడా తినచ్చు, అలా నోట్లో వేసుకుంటే రంగనారాజా! ఆహా ఏమిరుచి అనరా మైమరచి. 


మరో చిత్రం మన శరీరంలో ఉండే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే వృకం అనే పాంక్రియాసిస్ చిలకడ దుంపలా ఉంటుందిట. :)


దుంపలొచ్చే టైమ్ ఇదే


40 comments:

  1. చిత్రం చూస్తుంటే మీ దుంప మీరే తెంచేసినట్లు కనబడుతోందే☺️☺️

    అసలు ఈ రుబ్బుకునే శ్రమ ఎందుకు సార్. చక్కగా నీళ్లలో ఉడకబెట్టుకుని తింటే ఎలాంటి మాలబద్ధకమైనా మాయం అవుతుంది.
    నీళ్లు వాడకుండా ఇంకో టెక్నిక్ ఉంది. ఫోర్క్ తో అక్కడక్కడా పొడిచి, రాళ్ళమీద పెట్టి వేడి చేసి తింటే ఆ రుచే వేరు.

    ReplyDelete
    Replies
    1. సూర్యగారు, దుంప తెంపేసినట్టేనండి.మీరు చెప్పింది బాగుందిగాని మరీ ప్రినిటివ్ ఏమో :)

      Delete
  2. ఈ దుంపలను కట్టెలపొయ్యిలో కాల్చుకొని తినవచ్చును. ఇప్పుడు కాల్చుకొని తిందామన్నా కట్టెలపొయ్యిలు లేవు కదా.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు
      కట్టెల పొయ్యిలు,కుంపట్లు పాత కాలం మాటేనండీ

      Delete
  3. మా ప్రాంతంలో వీటిని 'గెనుసుగడ్డలు' అంటారు .
    మాకు విస్తారంగాపండేవి . ఇప్పుడు నీటివనరులు పుష్కలంగా ఉండడం బట్టి ఈ సాగుతగ్గి , వరిసాగు
    పెరిగింది . ఉడకబెట్టడం , తంపటెయ్యడం (తేగల)
    పధ్ధతిలో ఉడికించి తింటారు . చక్రాల్లా తరిగి , వంకాయలతో కలిపి పులుసు కూరల్లో వేస్తారు .
    ఎండు చేపల పులుసులో ఇవి రుచికరంగా ఉంటాయి .
    హైదరబాదు మార్కెట్లోకూడా విస్తారంగా దొరుకుతున్నవి .
    పరిశోధనలో ఈ గడ్డలు ,చేమగడ్డలు మధుమేహులకు
    మంచి ఆహారంగా ఇటీవల నిరూపితమైంది .
    కాని , రోటిపచ్చడి కొత్తవిషయం .


    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      మఎరక ప్రాంత వాసులకు ఒకప్పుడు ఇదే జీవనాధారం.గోజివాసులకు కూడా ఆనకట్టు వచ్చేదాకా ఇది కూడా ముఖ్య ఆహారమై ఉండచ్చు, జొన్నలు వగైరాలతో

      Delete
  4. మేము వీటిని సక్కర్ గంద్ అంటాము. గంద్ అంటే దుంపలని అర్థం.. సక్కర్ అంటే సూక్రోస్ మెటామార్ఫ్.. మా నాయనమ్మ వారు విరివిగా పండించేవారు వీటిని.. ఎర్రని దుంపల్లో రుచి అమోఘం.. నేనైతే పొట్టుతోనే ఆవిరిబట్టి ఆరగిస్తాను వీటిని. వీటి ఆకుల ఆకారం చక్కగా ఉంటుంది.. ట్రయాంగిల్ మాదిరి.. కాస్త ఉప్పు, కారం చల్లుకుని తింటే బాగుంటుంది. పచ్చిగా కూడా తిన వచ్చు కాని బాగా శుభ్రంగా కడిగిన తరువాతే.. లేకుంటే మట్టి ముద్దలు వేరులు నోటిలో తగులుతుంటాయి.. వేంకటేశ్వర స్వామి కోవెల వార్షికోత్సవ సమారాధన లో చిలగడ దుంప కలగలసిన సాంబరన్నం ప్రసాదంగా పెడతారు.
    నేటురల్ షుగర్ మన ఒంటికి మంచిదే.. ఫ్రక్టోజ్, ల్యాక్టోజ్ లాంటివి. ప్రాసెస్డ్ షుగర్, స్వీటెనర్స్ నిజంగానే దుంపలు తెంచేస్తాయి.. క్లోమ గ్రంధి ఆకారం లో ఉండే ఇవి నిజంగానే మధుమేహానికి ఉపశమనంగా పనిచేస్తాయి.. గ్లైసేమిక్ ఇండెక్స్ ప్రాసెస్డ్ షుగర్ లో, సచ్చారిన్, స్టీవియా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లో చాలా ఎక్కువ శాతం ఉండటం మూలాన క్లోమ గ్రంధి పనితీరుపై విఘాతం చూపిస్తుంది. ఫ్రూట్ షుగర్స్ (ఫ్రక్టోజ్), మిల్క్ షుగర్స్ (ల్యాక్టోజ్) మంచివి. ఐతే మిల్క్ షుగర్ తో మరికొంత జాగ్రత వహించాల్సి ఉంటుంది. ఈ మిలాక్ షుగర్ పాలు (చక్కర లేకుండ, వేడి చేసి థా [రూమ్ టెంపరేచల్, ప్రెషర్ కు చేరుకునేవి] చేసినవి) తాగినాక నీటితో పుక్కలించకుంటే ల్యాక్టిక్ యాసిడ్ పంటి ఇనామెల్, డెంటిన్ పై తీవ్ర ప్రభావం చూపి పిప్పికి దారి తీయ వచ్చు.
    రోటి పచ్చడి చాలా బాగుంటుంది.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      ఆవిరి మీద ఉడికించచ్చు,నిప్పుల్లో కాల్చచ్చు, తంపట వేయచ్చు, బెల్లపు నీళ్ళలో ఉడకబెట్టచ్చు, ఎలాగైనా బాగుంటుంది కాని నిప్పుల్లో కాల్చిన దాని రుచి దేనికి సాటి రాదు, తొక్కతో తింటేనే మంచిది రుచి కూడా. ఇది మధుమేహులకు మంచి ఆహారం, ఔషధం కూడా

      Delete
    2. ఆఁ శర్మాచార్య.. మీరు "కాలూచుకోవచ్చు" అనగానే నాకు తాటి ముంజలు గుర్తుకు వచ్చాయి.. ఇక్కడ అప్రస్తుతమైనా నేను ప్రస్తుతికరిస్తున్నాను.. క్రితం మా నాయనమ్మ వారింటికి వేసవి మండుటెండలు రాగానే మా తాతగారు నాకోసమని కల్లుముత్త వారికి చెప్పి నాలుగైదు గెలల తాటిముంజలు తెప్పించేవారు.. వాటిలో మూడే ముంజలుంటాయిగా.. అలా.. ఒకసారి వేసవి సమయం మించిపోయినపటికి కూడా గెలలు తెప్పించారు.. అవేమో లైట్ గోల్డెన్ ఆరెంజ్ ఇన్సైడ్ డార్క్ బ్రౌనవుట్సైడ్ ఉండేవి. వాటిని మా తాతగారు కట్టేలు పోగుజేసి నిప్పుపెట్టి గంటన్నర కాల్చేవారు. ఇక ఆ ప్రాంతమంత ఒకలాటి అరోమా తో నిండిపోయేది. కాల్చిన తరువాయి చేతికి ఇస్తే ఆరేంజ్ కలర్ లో కాస్త తీయగా వగరుగా పీచు పీచుల నడుమ థిక్ జ్యూస్ వచ్చేది దానిని నోటితోనే చప్పరించుకునేవాళ్ళం.

      Delete
    3. శ్రీధరా!
      తాటి కాయల్లో సాధారణంగా మూడు ముంజలుంటాయి. వీటిని కాయలో ఉండగా కళ్ళు అంటారు. బయటికి తీస్తే ముంజ అంటారు. ఒక్కో కాయలో ఒకటే కన్ను ఉంటుంది, ఒక్కోదానిలో రెండు, సాధారణం గా మూడు. చాలా అసాధారణంగా నాలుగు కళ్ళు ఉంటాయి.

      తాటి ముంజలు వేసవిలో తినడం చాలా చిన్నతనం నుంచీ అలవాటేగాని, కొంచం ముదిరినవాటిని ఇలా మంటలో కాల్చుకుని తినచ్చని ఇప్పుడే తెలిసింది, కాని ఇప్పుడు కాల్చి పెట్టేవారెవరా అన్నది సమస్య :)

      Delete


  5. దుంప తెగ ! ఈ దుంపలు ఎట్లా వుంటాయో ఫోటో పెట్టకూడదండీ ? మా అయ్యరు గార్ని పురమాయించి తెప్పిద్దునూ ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీరసలు “తెలుంగులేనా”, జిలేబి” గారు? చిలగడదుంపలు ఎలా ఉంటాయో తెలియదా? ఫొటో చూపించాలా 😳 ? తెలుగుజాతికి ఇంత దరిద్రం పడుతోందా😟?

      Delete


    2. తెలియని వాటిని తెలియదని‌ చెబితే నామోషీ ఏముందండీ బాబోయ్! అన్నీ మనకే తెలియాలని ఏమన్నా రూలుందేమిటీ/?

      ఇంతకీ ఈ దుంప ఎలా‌ వుండును‌చూచుటకు అన్న దానికి తాతగారి ఫోటో లేదేమిటి ఇంకానూ ?



      జిలేబి

      Delete
    3. జిలేబీ చూచుటకు వర్షమున తడిచిన జంతిక వలె ఉండిననూ, దుంపలు చూచుటకు దుంపలవలెనే ఉండును!

      Delete
    4. నిన్న షష్ఠి నక్తం చేసావు కాదా! పొద్దుటినుంచి కనపళ్ళే! సాయంతరం భోజనం తరవాత కదా కనపడ్డావు, సాంబారు లో వేసిన ముక్కలు బాగున్నాయని లొట్ట లేసుకు తిన్నవి దుంప ముక్కలే!

      Delete
    5. విన్నకోటవారు,
      పాపం బామ్మ :)

      Delete

    6. O this is sweet potato !

      Yaaak yaak what a country guys eat potatos :)



      నారదా
      జిలేబి

      Delete
    7. శర్మ గారు,
      గెణుసుగడ్డలు ఏమిటనేవారికేమి చెప్పేది
      నారదోపాసకులను ఏమి పొగిడేది
      ఏమి చెప్పేది, వారినేమి పొగిడేది

      (గెణుసుగడ్డలు = చిలగడదుంపలు అన్నారు రాజారావు మాస్టారు)

      (మీ స్నేహితుడు రచించిన "ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది" పాట స్ఫూర్తితో)

      Delete
    8. విన్నకోటవారు,
      బామ్మకి ఇలా మాట్లాడి దీవెనలు పొందడమంటే ఆనందం. :) ఇది ఒక్కోకప్పుడి శృతి మించి రాగాన పడుతూ ఉంటుంది, అప్పుడే చిరాగా ఉంటుందంతేనండి :)
      ఇప్పుడి శృతి మించి రాగాన పడటం అంటే ఏంటీ అనీ అడగగలదు సుమా :)

      Delete
    9. అలవాట్లు అంత తేలికగా వదలవు కదా 🙂🙂.

      Delete


    10. అలవాట్లంత సుళువుగా
      జిలేబిని విడుచుననుట విచిత్రమె కష్టే
      ఫలి గారండీ ! నారదు
      ల లక్షణము నిండుగా గల సిత కదండీ!


      జిలేబి

      Delete


    11. తాతగారూ శృతి మించి... చెప్పరూ ఏమిటో?


      శృతిమించి రాగమున పడు
      ట! తెలుప వలె దీని కథ తటాలున తాత
      య్య! తెలుగు వారి ములుగు సా
      మెతలకు జాతీయములకు మించారగనన్!



      జిలేబి

      Delete
    12. శ్రుతి మించి రాగాన పడటం ఏంటో చెప్పరూ?

      చెప్పను, చెప్పనుగాక చెప్పను అందామనుకున్నా! పోనీలే ఈ పాలికిచెబుదారని అనిపిచ్చి...ఇనుకో తంగమ్మా!

      పాటకి, మాటకి శృతి, లయ ఉంటాయి. శృతి మంద్ర,మధ్యమ, తార స్థాయిలలో ఉంటుంది. లయ అనేది వినడానికి సొంపుగా పలకడాన్ని లయ అంటాం. దీనికి భాషలో చాలా అలంకారాలున్నాయి. ఇప్పుడు శృతిగురించి. ఎప్పుడు ఏ శృతిలో మాటాడాలో అదే శృతిలో మాటాడాలి, బాధలో అమ్మా అనేది అరుపులా ఉంటుంది. ఇప్పటికిది అర్ధమైతే మిగిలింది రేపు క్లాసులో చెబుతా, తెలిసిందా మంగతాయారూ!

      Delete
    13. శృతి మించి రాగాన పడటమంటే అదేదో మూవిలో చాటంత చేయబోతే చాపంత ఔతుందని వాపోతుంటాడు అలా అనమాట.. మరోలా ఐతే చిన్న చినుకులే కదా తిరిగొచ్చే లోపు తగ్గిపోతుందనుకుని గొడుగు తీసుకెళ్ళకుండ కాలు మోపితే చూస్తూనే అది చినుకుల ధారాపాతమై, మెరుపులతో కూడిన చిరుజల్లులుగా మారి ఆపై తూఫానై వరదతో ముంపు తెచ్చిపెట్టినట్టు.. అనట్టు ములుగు అనేది వరంగల్ జిల్ల లో ఒక చిన్న ఊరు.. లక్నవరం చెఱువు కు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ లక్నవరం చెఱువులో గల తూగుడు వంతెన లాటివి కర్ణాటక శివపుర లోను, శృంగేరిలోను కనిపిస్తాయి.. అలాగే కాకినాడ సమీపంలో హోప్ ఐలాండ్ కి చేరువలో కొరింగా అభయారణ్యము మడ అడవులతో ఉంటుంది, బిజిలే అమ్మణ్

      Delete
    14. @"Yaaak yaak what a country guys eat potatos :)"
      ఏంటమ్మా యాక్ అంటున్నారూ. ఆ పొటాటో ముక్కలతో కలిపి కొడుతున్నారు కాబట్టే మెక్ డోనాల్డ్ కే ఎఫ్సీ డొమినోస్ సబ్వే మొదలుగా గల దుకాణాలు ఫుల్లుగా లాభాలు వెనకేసుకుంటున్నాయి.
      ఆలుగడ్డా గెనుసు గెడ్డా ఉప్పుగడ్డా.. హీనంగా చూడకు దేన్నీ! రుచిమయమేనోయ్ అన్నీ!

      Delete
    15. సూర్యగారు,
      ''సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడని'' సామెత.
      ఆచ్చి, యాక్ స్వీట్ పొటేటో నా అంటుంది, దీనికి చక్కటి పేరు చిలకడ దుంప అని ఉంది,తెనుగులో. అమ్మవారికి పొటేటో తప్పించి మరేం తెలీదాయె. ఐనా యాక్ అంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారండి. :)
      కంట్రీ గైస్, ఈ తల్లి మరే కంట్రీలో పుట్టిందబ్బా! ఈవిడా ఈ కంట్రీ గయ్యే :)

      Delete

    16. అట్లా కంట్ర్రీ ... అనకుండా వుంటే శృతి .. + సొడ్డిస్తూ .. గట్రాలు బయట పడేవా అని ? :) ఇంతకీ ఈ కొత్తా సొడ్ది... కత ఏమిటో‌ శృతి తో బాటు చెబ్దురూ :)



      జిలేబి

      Delete
    17. తేగంటే తేగంటి బిడ్డ కావాలన్నట్టుంది వ్యవహారం కందమ్మా! :)
      శృతి లయ గురించి కొంత చెప్పేను. ఏమర్ధమయిందో చెప్పకుండా మిగిలింది ఎలా చెప్పను :)
      ప్రతి పాటకి, మాటకి ఒక శృతి ఉంటుందనుకున్నాం కదూ! అది పలకడంలో, అనడంలో ప్రత్యేకత, ఎలా వస్తుంది? అది అనేవారిని బట్టి ఉంటుంది, ఈ ప్రత్యేకతనే ”టింబ్రే” అంటారు. ఇది అందరికి ఒకలా ఉండదు. అందుకే కందమ్మ బాడితే బాగుంటుంది అని చెబుతారు, మరొకరు పాడితే ఎందుకు బాగోదు,సుబ్బు పాడితే? అద్భుతం, ఇదిగో ఇదే కారణం. ఇదంతా సైన్సులే నీకొద్దుగాని :) పాట,మాట సైన్సులే :)

      మాట గాని పాటగాని మనం ఎంచుకున్న శ్రుతిలోనే చివరదాకా కొనసాగించాలి. మరీ శృతి మించి రాగాన పడటం ఏమని ప్రశ్న. అది శృతి మించి రాగాన పడటం కాదు, శృతి మించి రాగాన పాడటం. శృతి మించి రాగాన పాడితే అందంగా ఉండదు, అర్ధమయిందా మంగతాయారూ :)
      సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడనే ది ఒక చిన్న కత. తరవాత జెపుతాలే :)

      Delete
    18. శ్రీధరా!
      కాకినాడ మడ అడవుల్ని, కోరంగి మడ అడవులు అంటారు. ఇవి చాలా అందంగా ఉంటాయి. లోపలికంటా నడచి వెళ్ళేందుకు, కాలిబాటలాటి వంతెనలుంటాయి. ఈ అడవుల్లో చాలా ప్రత్యేకమైన మొక్కలు, జీవరాశులు ఉన్నాయి. చూడవలసినదే. బోటనీ, బయాలజీ వాళ్ళు తప్పని సరిగా చూడవలసినవి.

      Delete


    19. తాతగారి బుర్ర సామెతల పుట్ట జాతీయాలకు పట్టుగొమ్మ! ఇప్పుడు ఈ తేగంటి ... గట్రా ఏమిటండోయ్ ం?

      రెండు బకాయిలు - సొడ్డి తే గంటి :)



      జిలేబి

      Delete
    20. మూగాడి ముందు ముక్కు గోక్కోడం భయం :)

      Delete


    21. ముక్కే లేనమ్మ ముక్కుపుడక కెగిరినాదట :)
      ఈ మూగాడి కత ఏమిటండి‌ తాతోయ్ ?



      జిలేబి

      Delete
    22. ముక్కు పుడక కాదు బామ్మా!
      ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది. ఉట్టి కొంచం ఎత్తులో చేతులు పైకి జాపైతే అందేలా ఉంటుంది, అది కొంతమంది కొంచం ఎత్తులో కడతారు. దాన్ని అందుకోడానికి కాళ్ళు ఎత్తి ముని వేళ్ళ మీద నిలబడి అందుకుంటారు. ఇలా ముని వేళ్ళమీద అందుకో లేని తల్లి కాళ్ళ మీద నిలబడి స్వర్గం అందుకుంటానందిట. :)

      తేగంటే తేగంటి బిడ్డ కావాలంది.ఒక కడుపుతున్నమ్మకి తేగ ఇచ్చారు తినడానికి. తొక్క తీసి తేగని చేత్తో పట్టుకున్నామె తన బిడ్డ కూడా తేగలా పొడుగ్గా నున్నగా ఉండాలందిట :) ఏది కనపడితే అదే కావాలనుకోడం అనమాట.

      మూగైవాని ముందు ముక్కు గోక్కో భయం :)
      మూగివానికి వినపడదు, మాటా చెప్పలేడు. ఇటువంటివారి ముందు మాటాడుకుంటే నా గురించే మాటాడు కుంటున్నారనుకుని పోట్లాటకి వస్తారు. అందుకు ఇటువంటివారితో గాని ఇటువంటివారి సమక్షంలోగాని మాటాడుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

      Delete


    23. మీ కత,కతనం మాకు నచ్చింది 👏👏👏


      :)
      జిలేబి

      Delete
  6. చిలకడ దుంపలని కుంపట‌్లో బొగ్గులపై కాల్చితే చక్కటి రుచి వస్తుంది. ఉడకపెడితే చప్పగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,
      నిప్పులలో కాల్చినదాని రుచి మరి దేనికి రాదండి. సూపరంటే సూపరే :)

      Delete
  7. దుంపల బడి గురించి కూడా చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,

      దుంపలబడి గురించేం చెప్పనండీ :)

      దుంపలు నేలలో పండుతాయి,బతకడానికి ఇదే ఆహారం కొంతమందికి. ఈ దుంపలు తినేవాళ్ళు కూడా మట్టి మనుషులే, మాలాటివాళ్ళే :) మరి వీళ్ళూ చదువుకోవాలిట కదండి. వీళ్ళకి ఒక బడి, ఓ బతకలేని బడిపంతులుగారు,( పాత కాలంలో మాట లెండి) పడిపోతున్న గోడలు, కప్పుతో ఉన్న భవనం, ఏదో నేర్చేసుకోవాలి, పెద్దాళ్ళం ఐపోవాలి, కడుపునిండా తిని, ఒంటినిండా బట్ట కట్టుకోవాలనే. ఆతృత మేధ కలిగిన బక్క చిక్కిన విద్యార్ధులూ, ఇవి దుంపలబడి కి ముఖ్య లక్షణాలుటండి.

      ఈ బడిలో చదువుకుని ఆటపాటల్లో, విద్యలో పైకొచ్చినావారు చాలామందేనండి. వీధి దీపాల కింద చదువు కున్నవాళ్ళు, పుస్తకాలు లేక మిత్రుల పుస్తకాలు తెచ్చుకుని చదువుకున్నవాళ్ళు, దానధర్మాలతో చదువుకున్నవాళ్ళు, ఒక పూట తిని,వారాలతో చదువుకున్నవాళ్ళు. వీరికి లెక్కాలేదు జమా లేదండి.

      Delete
    2. అన్నింటికన్నా ఉండాల్సిన ముఖ్య లక్షణం.
      ఆ బడి ముందు ఓ ముసలావిడ ఉడకబెట్టిన చిలగడ దుంపలు, తాటి తాండ్ర, పిప్పరమెంట్ బిళ్ళలు, తేగలు మొదలగు వస్తువులను ఓ గోనె సంచిమీద పరచి అమ్ముతూ ఉండాలి. దుంపలబడికి ఆవిడే బ్రాండ్ అంబాసిడర్!
      నేను గొప్పవాడిని అవ్వలేకపోయానుగాని చదువుకున్నది దుంపలబడేనండి!
      సినిమాల్లో విలన్ల లాగే బడిలో కొందరు ఆకతాయి పిల్లలు ఉండేవారు. వాళ్ళు "మామ్మా ఈ దుంప ఎంత, అదెంత?" అని కొనేవాడిలా పోజు పెట్టి దుంపని చేత్తో పరీక్షిస్తూ అదను చూసి దుంపని పిసికి ముద్దచేసి అక్కడే పడేసి తుర్రుమనేవారు. పాపం ఆ ముసలావిడ వీళ్ళని తిట్టుకునేది.

      Delete
    3. సూర్యగారు,
      మరచిపోయానండీ.చల్లపుణుకులు, చల్లారిపోయిన మసాలా వడలు ఇంకా చాలా చాలా ఉండేవి. నేనెప్పుడూ వీటి జోలికి పోలేదు. మడి లెండి :) డబ్బులుండేవి కావు. రోజూ ఎవరు ఇప్పిస్తారు? ఎప్పుడేనా మా సుబ్రమణ్యం లాంగ్ ఫెలో తీసుకెళ్ళి తినారా బాచీ అనేవాడు,వాడితోపాటు. ఏదో బాధగా ఉండేది, వాడు డబ్బులిస్తుంటే, నేనెప్పుడూ ఇవ్వలేక. రెండు క్లాసులకి కలిపి ఒక డ్రమ్ములో మంచినీళ్ళు ఉండేవి, ఎప్పుడూ వేడెక్కిపోయి ఉండేవి. ఇంటర్ వెల్ లో పక్క తూర్పుపేటకి మరొకళ్ళని తీసుకుపోయి, నూతిలో నీళ్ళు, తాటాకు చేదతో తోడుకుని, దోసిటపట్టి తాగి వచ్చేవాళ్ళం. ఈ అవసరం తీర్చడం కోసం, ఉద్యోగం లో చేరేకా , ఒక మంచినీళ్ళ టేంక్ కట్టించానండి. మరిది దుంపలబడేనంటారా? దుంపలబడిలో చదుకున్నా గొప్పవాణ్ణి కాలేకపోయానండి, పొట్టకూటికి లోటు లేక జీవితం నడిచిపోయింది, ఇది చాలు.జీవితానికి తృప్తి మిగిలింది :)

      Delete