Monday 9 November 2020

కబంధ హస్తాలు


 

12 comments:

  1. హ్హ హ్హ హ్హ, అది రాయడం కూడా ఒత్తు లేకుండా 😀. అసలు ఏం చెబుదామనుకుని ఈ పదం వాడారు 🤔 ?

    ఈ వ్యాపారులు తమ బోర్డులు, కరపత్రాలు తయారు చేయించేటప్పుడు ఓ సారి ఎవరన్నా తెలుగు మాస్టారికి (ఆంగ్లంలో రాయిస్తే ఇంగ్లీష్ మాస్టారికి) చూపించి దిద్దించుకోవచ్చుగా? కానీ అలా చేయిస్తే చదివేవారికి వినోదం దొరకదుగా, కాబట్టి ఇలా అయితేనే సరదాగా ఉంటుంది 🙂.

    ReplyDelete
    Replies
    1. ఈసలహా టీవీఛానెళ్ళకూ వర్తిస్తుంది - స్క్రోలింగ్ తప్పులు విషయంలో. సినీమా వాళ్ళకూ వర్తిస్తుంది - పేర్లు డైలాగుల్లో తప్పులు విషయంలో.

      Delete
    2. విన్నకోటవారు,
      ఇది పూర్తి అమాయకత్వం. కబంధ హస్తాలంటే అవేవో గొప్పవనుకుని రాసి ఉంటారు, పాపం. మీరన్నట్టు చిన్న జాగర్త తీసుకుని ఉంటే బాగుండేది.నిజంగానే ఈ కరపత్రం ఆ షాప్ ప్రారంభించినవారు చూసుంటే ...

      Delete
    3. శ్యామలీయంవారు, టెల్గూ చానళ్ళ వారికెవరు చెప్పగలరు? పేర్లు డయలాగులు అలా మాట్లాడటం ఫేషన్ సార్.

      Delete
  2. "ఇక్కడ తలలు అందముగా నరకబడును"
    "ఘౌరీషంకర్ షైకిల్ ఠక్సీ"
    "You can change your husband here"

    ఇవన్నీ నేను చూసిన షాపులమీది బోర్డుల్లో, సైన్ బోర్డుల్లో కనిపించిన ఆణిముత్యాల్లో కొన్ని.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంవారు,
      ఇటువంటివన్నీ పూర్తి అమాయకత్వం తెలియనితనం.కొంతమంది కావాలనే రాయిస్తారిలా,అదో వ్యాపార రహస్యం

      Delete
  3. తెలుగూ సంస్కృతమూ వో
    వెలుగు వెలుగుతోంది,చూచి,వినుతించక, ఈ
    కలతవడుటలేలబుధులు?
    తలపండినపండితులకు తప్పుదొరలదా ?

    ReplyDelete
    Replies


    1. అవునండి రాజావారు

      కొందరు తప్పుల్ని వెదికేటందుకే చదివే బాపతు లాగున్నారు సుమండీ . ఏమిటో ఏమంటే ఏమి తంటా వచ్చునో అని నేను ఏమీ అనకుండా వున్నానండీ . ఏమంటారండీ మీరు రాజావారు ?



      జిలేబి

      Delete
    2. రాజావారు, రాయదంలో తప్పులు దొరలడం సర్వ సహజం. దానికి తప్పుపట్టక్కరలేదు, చూసి నవ్వుకోవడం, లేదా చెప్పడం చేయచ్చు. కాని ఇక్కడ ఆ ప్రారంభకుని చాలా దారుణంగా అవమానించినట్టవుతుందేమోనని కొంచం బాధ అంతేనండి.

      Delete
  4. ఒక సదరు కర్రి పాయింట్ బోర్డు పై ఇలా రాసుంది:
    ××× Master Special France Fry,
    Paneer Peace Mashalla, Violent Brinjal Vepud

    ముందు అర్ధం కాలేదు.. తర్వాత తెలిసింది అది రొయ్యల వేపూడని Prawns కి బదులు ఏకంగా ఓ దేశాన్నే దించేశాడా పేయింటర్ ఎవరో. అందరు శాంతి కోసం పోరాడుతుంటే ఇతనేమో పనీర్ లో శాంతిని మేల్కొల్పుతున్నాడని అనుకున్నా.. అవి పచ్చి బఠాణిలుట.. తెల్ల, నల్ల, పచ్చ వంకాయలు చూశా కాని మరీ హింసాత్మక వంకాయేమిటి చెప్మా అంటే అది వైలెట్ వంకాయట.. అలానే ఆర్టీసి బస్ లో డిపో కి Depot అని ఉండకుండ Deopt అని వ్రాశాడు. ఒక బోర్డేమో మరీ మితిమీరిపోయి Apostrophe సైతం పెట్టకుండా Anu's Beauty Parlour అని వ్రాశాడు మరీ.. ఆ అపాస్ట్రపి లేని బోర్డుని చూసి ఎంత మంది ఆ పార్లర్ కు వెళ్ళారో తెలియదు గాని నాకైతే వికారంతో పాటు వాంతులు అయోమయం విస్మయం అన్ని ఒకేసారి వచ్చి పడ్డాయి ఆ బోర్డ్ ను చూశాక.. హ్మ్.. ఇలా చెప్పుకుంటు పోతే చాలానే తప్పులు ఎక్కడో ఒకచోట మనకు దొరుకుతూనే ఉంటాయి.. హేళన కోసం కాదు అవహేళన అంతకంటే కాదు.. కాని ఇవి నేను నా కళ్ళార చూశినవే..
    మాకు దగ్గరలో Soviet Complex వుండేది శర్మాచార్య
    అక్కడికి ఇక్కడి వారు అమ్మటానికని వెళ్ళేవారు, కొందరు వాళ్ళతో ఇలా సంభాషించేవారు..
    Mommy Daddy, Banana Dozen 30. Sir/Madam పలకటం రాక..! Viktor Bugoy అని Thyazpromexport నుండి వుండేవారు.. నాకు రషియన్ భాష కొద్దిగ నేర్పింది అతనే.

    ReplyDelete
  5. ఎవరో ఒకతను ఇంకొకరిని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఒక లెటర్ రాసి ఉరిఖంబం ఠాణ కు పంపుతాడట అందులో ఇలా ఉంది.. "Hang him, not leave him". అది చదివిన జైలర్ తలారికి సైగ చేస్తాడు.. కథ తారుమారైపోయింది. అసలికి ఒక (,) అతని ప్రాణాలకే హానికరమయ్యింది.. అసలుకి "Hang him not, leave him". అని ఉండాల్సింది.

    అలానే ఎవరో ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దేవుణ్ణి మెప్పించి తీరా వరం కోరుకోమంటే ఆతను "ఇంద్ర శత్రు వధస్వ" అనాట్టా.. తథాస్తు స్టాంప్ పడిన వెంటనే ఆ అసురుడే అసువులు బాసినాడట.. అసలుకి "ఇంద్ర శత్రు వర్ధస్వ" అనాల్సిందట.. ఇట్ల ఒక్కోకరిది ఒకాకో తప్పిదం.. టూ ఎర్ర్ ఇజ్ ఏ హ్యూమన్ అన్నారు.. తప్పులు అపుడపుడు జరిగితేనే ఒప్పుల విలువ తెలిసొచ్చేది. అలా అని తెలిసి తప్పులు చేయదల్చితే అది మొదటికే మోసం.. కదా శర్మాచార్య

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      ఇంగ్లీషు ఇతర భాషలలో చాలా చిత్రాలే కనపడతాయనుకోండి. తెనుగులో ఇబ్బంది గురించే :)ఇటువంటివి మరీ ఇబ్బంది పెడతాయి కదండీ. మరేం కాదు ఏవనుకోకండీ :)

      Delete