Tuesday 10 November 2020

చింతకాయ-గోంగూర.

 చింతకాయ-గోంగూర.

వాళ్ళిద్దరూ చింతకాయ,గోంగూరలాటివాళ్ళండి బాబూ అంటుంటారు. ఏంటి తిరకాసు? :)


చింతకాయ పుల్లటిది, గోంగూరా పుల్లటిదే!రెండిటికీ ఉప్పూ కారాలతోనే స్నేహం.రెండిటినీ పచ్చడీ చేస్తారు ఎక్కువగా! రెండూ నిలవా ఉంటాయి. రెండూ రుచిగానే ఉంటాయి, కాని రెండిటికీ పడదు. అందుకే చింతకాయ గోంగూర అంటారు. ఇన్ని పోలికలున్నవి రెండూ కలిసి ఎందుకుండవూ? తిరకాసదే కదా!!! 


చింతకాయ పచ్చడి నిలవున్నకొద్దీ పథ్యం. గోంగూర పచ్చడి సంవత్సరం దాటి నిలవుండదు.అసలు తిరకాసు చింతకాయ చలవ చేస్తుంది, గోంగూర వేడి చేస్తుంది. అంచేత చింతకాయ గోంగూరలకి ఎన్నిపోలికలున్నా, కలిసుండలేవంతే!!! అర్ధమయితే !!!Like poles repel :)






31 comments:

  1. బాగుందండీ నానుడి.
    అయితే పాతచింతకాయ పచ్చడి ఎంత పథ్యం అయినా చింతకాయను కూడా సంవత్సరం దాటి నిలవుంచుతారంటారా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      సంవత్సరం దాటినా పాతచింతకాయపచ్చడి బానే ఉంటుందండి, సాధారణంగా ఉంచరు. అంతపాతది దొరొకితే గొప్పే, గొప్ప పధ్యం. ఆ తరవాత పనికిరాకపోతే అంట్లు తోముకోడానికైనా పనికొస్తుందండి, గోంగూర అలాకాదుగా :)

      Delete
  2. చింతకాయ చెట్టు వలన చింతలు ఎక్కువ వస్తాయని మా బామ్మ గారు చెబుతుండేవారు. పెరడులో ఓ మూలాన ఉంటే పరవాలేదు కాని ఇంటి ఆవరణలో అదీ ఆనుకుని ఉంటే ఏదో ఒక చింత మనసుని మెలిపేడుతూనే ఉంటుందనేవారు.
    ఇహ గోంగూర అంటే నిలువ పచ్చడికి బదులు నీళ్ళలో ఉడకబెట్టి రోట్లో ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చి మిర్చితో కచ్చా పచ్చగా దంచి పెడితే ఆ రుచే వేరు.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      మామ్మగారు చెప్పినమాట నిజం. పెరటి చింత చింతలకే కారణం.
      ఇహ గోంగూర అంటే నిలువ పచ్చడికి బదులు నీళ్ళలో ఉడకబెట్టి రోట్లో ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చి మిర్చితో కచ్చా పచ్చగా దంచి పెడితే ఆ రుచే వేరు.
      అదుర్స్ కదా

      Delete
    2. వెల్లుల్లి కూడా కలిపా 😳😳?

      Delete


    3. వెల్లుల్లిలేని వంటయు
      చళ్లను కారమ్ము లేని చట్నియు వినరా
      ముళ్లొంకాయపులుసు నా
      వొళ్లంత జిలేబి లేని ఫుడ్డొక ఫుడ్డో :)


      నారదా
      జిలేబి

      Delete
    4. విన్నకోటవారు,
      ఇక్కడ ఉల్లి అంటే నీరుల్లి, వెల్లుల్లి కాదు. నీరుల్లిని నంజుకుంటూ గోగూరపచ్చడీ అన్నం తింటారండి. గోంగూరపచ్చడిలో వెల్లుల్లి వేస్తారు కాని నిలవ పచ్చడిలో వేయగా చూడలేదండి.

      Delete
    5. జిలేబి
      కళ్ళని కారమ్ములేని చట్నియు కలదే! :)ముళ్ళొంకాయ బండపచ్చడి, నీరుల్లితో వండర్ ఫుల్
      యాక్! జిలేబి ఫుడ్డా :)

      Delete
    6. భాషండీ "జిలేబి" గారూ, భాష.
      "చెళ్ళను" అని వ్రాయాలి కదా.

      Delete
    7. విన్నకోటవారు,
      పండితమ్మన్యుల భాషలో అవాచ్యాలా? ఎటులెటుల? :)
      వారేమైనా అనగలరు లెండు :)

      Delete
    8. నిక్కము నిక్కము, శర్మ గారు.
      పైపెచ్చు ఓ కామా పెట్టుకోండని ఓ సలహా కూడా పడేశారు (తన బ్లాగులో). కామా పెట్టినంత మాత్రాన ఆ పదం అర్థం ఎలా మారుతుందో నా బోటి పామరులకు బోధపడడం లేదు🤔.
      కానివ్వండి, పండితమ్మన్యుల మాట కదా, శిరోధార్యం 😟.

      Delete


    9. ఎవరూ పుట్టించక పదాలెలా పుడతాయి ?


      మాకో తాడేయండి సూక్షి లా ఇది మరో పదమన్న మాట :)

      రాబోవు కాలంలో ఆంధ్ర భారతి లో ఈ పదాన్ని చేర్చి కొచ్చెను మార్కు పెట్టి వుంచెదరు. అప్పుడు భాష్యకారులు‌ వచ్చి ఆ పదమునకు ఉత్పత్తి అర్థము తో సహా ఓ వేయి పేజీల బృహత్ జిలేబీయం‌ కూడా రాసి పడేయుదురు ~:)



      జిలేబి

      Delete
    10. నిజంబు నిజంబు నిజంబని నీకు సాక్ష్యమిప్పించెద :)

      Delete


    11. నిజము నిజమ్ము జిలేబీ
      నిజమని సాక్ష్యమ్ము నిత్తు నీకు వెస వెసన్
      ప్రజలను విడువక చళ్లని
      గజగజ వణికింప జేయకమ్మ నెలతుకా !


      జిలేబి

      Delete
    12. వీరతాళ్ళు మరొకరు వేసేదేంటీ, నువ్వే వేసేసుకో కందాచ్చీ :)

      Delete
    13. అది గురుదేవునిపని , వా
      రి దయకు కర్సగును కొంత , రేటుగల , దటన్
      కుదరదు కేవల కందము
      విదిలించినమాత్ర మెంత విదురులకైనన్ .

      Delete
    14. రాజావారు,
      అంతుందా:) ఇదంతా తెనుగు సేవే అనుకుంటి :) కందమ్మకి కష్టమే :)

      Delete


    15. కష్టమేముంది ?

      కష్టేఫలి వారి కేరాఫ్ సంభావనాభాండాగారముండగా :)



      నారదా
      జిలేబి

      Delete
    16. కందాచ్చీ!
      మీలా చెప్పుకోం!
      నోటితో లేదనేది చేత్తో లేదంటాం. అది మా అలవాటూ అంతే :)

      Delete


  3. పాత చింతకాయ పచ్చడి పథ్యమ
    గును జిలేబి తాత గువ్వకొనెడు
    బ్లాగు లోన చెప్పె వరలెడు గోంగూర
    యున్ను మేలు కాని యునికి పడదు



    గోంగూర
    జిలేబి :)

    ReplyDelete
    Replies
    1. బామ్మా నీ గొప్పే గొప్ప. నిలవుండనిది పథ్యమా:)

      Delete


    2. బామ్మా నీ గొప్పే గొ
      ప్పమ్మా! నిలవుండనిదిక పథ్యంబగు? చె
      ప్పమ్మా బుర్రెట్టి జిలే
      బమ్మా ! గోంగూర చింతపచ్చడి యగునే ?



      జిలేబి

      Delete
  4. గోంగూరమటను కూర్మా
    బంగారపు చింతచిగురు పక్కెలయిగురున్
    రంగగు రొయ్యల వేపుడు
    సంగతి విన్నార , టేస్టు సాహో సారూ !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అన్నీ తెలీవుగాని చింతచిగురు రామలు గురించి మాత్రం నా స్నేహితుడు నరసింహారావుగారు బహుగొప్ప చెప్పేవారు. ఎప్పటికైనా మీచేత తినిపిస్తా కదా అనీ అనేవాడు. ఆయన కోరిక తీరకనే చెల్లిపోయాడు, రిటయిర్ అయిన మరుసటి నెలలోనే

      Delete
  5. అయ్యో! జిలేబివా రేం
    దయ్య! కోవిదులుగద! పండితమ్మన్యులరా?
    చయ్యన కందోత్పలములు
    తియ్యగ రచియించి మించు తెనుగుంగవులే!


    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      పండితమ్మన్యులన మాన్య పండితులని తంగాచ్చి అర్ధం చెప్పిన గుర్తనుకుంటా సార్

      Delete
  6. పండితమ్మన్యులనగా
    దండిగ శుంఠలనిగద పదార్థము , సభలో
    మండిత గురుదేవుల కడ
    నిండుగ ధనమిచ్చి వారు నేర్చిన దిదియా ?

    ReplyDelete
    Replies
    1. నిజమేనండోయ్.
      “జిలేబి” గారిని పొగిడే తొందరలో ఆ మాటే మరచితిమి 😁.

      (“పండితమ్మన్యుడు” అనగా “తనని తాను పండితుడిగా భావించుకొనెడివాడు” అని “ఆంధ్రభారతి” చెబుతోంది. కాబట్టి ఏదైనా ఫరవాలేదనుకుందాము 😁😁😁)

      Delete
    2. Confirmed? Lock kiyaa jaayai :)

      Delete
  7. రాజావారు,
    తిగంగరాచ్చి బహు చెయి చిక్కని మనిషి, వారిని వీరిని ప్రోత్సహించి గురువుకి ధనం ఇప్పించి యుండనోపు. గురువులు తగినంతగానే నేర్పియుండనోపు. :)

    ReplyDelete