Sunday 8 November 2020

దున్నబోతేదూడలలోకి...

 దున్నబోతేదూడలలోకి...


దున్నబోతే దూడలలోకి మెయ్యబోతే ఎడ్లలోకి అని సామెత. రైతులు పశువుల మందలనే మేపేవారు. పశువులు 4 రకాలు. చూలుగట్టి పాలిచ్చేవి,పనిజేసేవి, ఒట్టిపోయినవి,దూడలు.


చూలుగట్టి పాలిచ్చేవాటికి, పచ్చిగడ్డి, తెలగపిండి,జనపకట్ట, పిల్లిపెసర, ఇలా పుష్టికరమైన ఆహారం పెడతారు, పాలు బాగా ఇస్తాయి.


పని జేసే పశువులకి, పచ్చగడ్డి,ఎండుగడ్డి,జనప,పిల్లిపెసర,తెలగపిండి,కుడితి,పెడతారు. కొంచం ఇంచుమించు చూలుగట్టి పాలిచ్చేవాటికి, పనిజేసేవాటికి సమానమైన తిండి పెడతారు.


ఇక ఒట్టిపోయిన పశువులు. ఒకప్పుడు మహరాజభోగం వెళ్ళదీసినవే ఐనా వీటికి తిండి తక్కువ పెడ్తారు,ఇవి రిటయిర్ అయినవారి లాటివి ఎండుగడ్డిపడేస్తారు,ఇక దూడలు. 


దూడలు, లేగదూడలైతే పాలు, కొంచం పచ్చగడ్డిపెడతారు, పెయ్యదూడలు, కోడెదూడలకీ. వయసుపెరుగుతున్నకొద్దీ కోడెదూడలు తలగరేస్తాయి, చెప్పిన మాట వినవు.వీటికి పనిజేసేపశువులతో సమానంగా తిండి పెడతారు, ఎందుకంటే రేపన్న రోజు పనిజేసేవి ఇవేగనక.పెయ్యదూడలకి పాలిచ్చే పశువులతో సమానంగా తిండి పెడతారు, రాబోయే కాలంలో చూలుగట్టి పాలిచ్చేవిగనక.   కోడెదూడలు మెయ్యబోయినపుడు ఎడ్లలోకి జమవుతాయి, కాని పనికి మలిపేటపుడు దూడలలోనే జమవుతాయి,ఎడ్లతో సమానంగా పని చేయలేవుగనక.అందుకే ఈ సామెత పుట్టింది.

లోకంలో,మనుషులు పలురకాలు.ఎవరిటువంటివారో ప్రత్యేకంగా చెప్పాలా? 

 


26 comments:

  1. తెలుగులో గొప్పగొప్ప సామెతలు ఉన్నాయండి. జీవితానుభవాలలో నుండి, పరిశీలనలో నుండి పుట్టినవేగా సామెతలంటే.

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు,
      మనదంతా గ్రామం కేంద్రంగా సాగిన జీవనం. ఇందులోనే రకరకాల మనుషులు,ప్రవర్తనలు, వీటిని అధారం చేసుకుని కొన్ని, వ్యవసాయం ఆధారంగా చేసుకుని కొమ్మి, రామాయణ భారతాలను అధారం చేసుకుని కొన్ని జీవితానుభవాలే సామెతలుగా పుట్టేయండి. పనిచేయాల్సివస్తే మేధావులం, ఉత్తప్పుడు హాలికులం:)
      ఉట్టిగొడ్డుకి ఆర్పులెక్కువని సామెత :)

      Delete
    2. // "పనిచేయాల్సివస్తే మేధావులు ...." //

      హ్హ హ్హ, సామెతను అన్వయించి మంచి పోలిక తెచ్చారండి 😀.

      అయినా విశ్రాంతింజినీర్లు హాలికులైనమేమి 🙂👍.

      Delete

    3. విన్నకోటవారు,
      ఇది మా పెనవలూరు సామెతండీ :)పొట్టలో చుక్క సామెథ గుర్తొచ్చిందా? :)
      ఈ టెకీగారు సింగపూర్ నుంచి చెన్నై ఆపైన బెంగలూరు, చివరికి పత్తర్ఘట్టి చేరేరు, మీపక్కనే ఉన్నారిప్పుడు.
      మరంతే కదండీ పనిచేయలేం. పనిచేయాల్సొచ్చినపుడు మేధావులం, ఉత్తిరోజుల్లో హాలికులం అదేలెండి ఆల్కహాలికులం :)

      Delete


    4. పని చేయవలసి వస్తే
      మనమే మేధావులము సుమండోయ్! లేదం
      టె నలుగడ తిరుగు హాలికు
      లనవచ్చును మనలను లలలా లల లలలా :)


      జిలేబి

      Delete
  2. // "పొట్టలో చుక్క సామెథ" // 😀😀

    సారూ, తప్పించుకు తిరిగే మిత్రులు పత్తరఘట్టిలో ఉన్నా ఒకటే, పారిస్ లో ఉన్నా ఒకటే. "జిలేబి" గారి దర్శనభాగ్యమూ, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి ఫొటో కనబడడమూ ... రెండూ దుర్లభాలే, వాటి కోసం మనం చేసేవి వృధా ప్రయత్నాలే అవుతాయి, కాబట్టి నేను పట్టించుకోవడం మానేశాను.

    ఇటువంటివి మరీ పట్టించుకుంటే "ఆల్కహాలికులు" అవుతామేమో, అంతకన్నా హాలికులుగా ఉంటేనే సరిపోతుంది 😀😀.

    ReplyDelete
    Replies


    1. పారిస్సైనను మైలా
      పూరైన‌ను బెంగళూరహో పత్తర్ఘాట్!
      సారూ తప్పించుకు తిరి
      గే రమణుల వెన్క పరుగులిడిన ఫలితమే?


      జిలేబి

      Delete
    2. విన్నకోటవారు,
      అంతేనంటారా? ఐతే ఓకే:)

      Delete
  3. నాకిదీ వేరే విధంగా అర్థమయ్యింది శర్మాచార్య, అంటే వాటిని దున్నటానికని పట్టుకెళ్ళాలనుకుంటే మాకెందుకు మేము దూడలమే కదా అని దున్నటం నిరాకరించి మొరాయిస్తాయని.. అదే మేపటానికి ఐతే అవి ముందే ఉంటాయని..

    మా మాతృకలో ఓ పిట్ట కథ కూడా ఉంది..

    లూణ్ మర్చా లారే తిమ్మ కతో మర్చా బళేగా అమ్మ
    ధాన్ సిజాడ్లా తిమ్మ కతో హాత్ తాత్తో చూంట్ జాయే అమ్మ
    ఖో వరా తిమ్మ కతో థాళి నాన్కీ క మోట లాఁవూ అమ్మ కోకచ

    అంటే
    ఉప్పు కారం తేరా అబ్బి అనంటే చేతులు మండుతాయమ్మ అన్నాట్ట
    అన్నం వండుకు రారా అబ్బి అనంటే చేతులు మంటలో కాలిపోతాయమ్మ అన్నాట్ట
    వంట అయ్యింది వడ్డిస్తా అబ్బి అనంటే పళ్ళెం పెద్దది తేనా చిన్నది తేనా అన్నాట్ఠ..

    కాళిదాసు సైతం అంతేగా..
    కాళికా మాత ప్రత్యక్షమైతే ఒక చేతిలో పాలు మరో చేతిలో పెరుగు ఉంది ఏదో ఒహటి తీసుకో వత్సా అంటే పాలు పెరుగు రెండు కావాలి అన్నాట్టా.

    వియన్నారాచార్య మీ వంతు.. మల్లాది వేఙ్కట కృష్ణమూర్తి గారి ఫోటో విజయవాడ లో వారింటిలో ఉండి ఉండవచ్చు.. ఏడు పదుల వయసువారు కనుక.. మరొకటేమిటంటే ఈ ఇథైలల్కహాల్, బ్లెండెడ్ స్కాచ్ విస్కి, బుద్వీజర్, ట్యూబార్గ్, టీచర్స్, సిగ్నేచర్, మెక్డవెల్, రాతడ్ శిశి, ఓల్డ్ మాంక్, ఆఫిసర్స్ చాయిస్, ఇంపీరియల్ బ్లూ, బ్యాగ్ పైపర్, వోడ్కా, టెకిలా, మార్టిని ఇవన్ని ఎందుకు.. చక్కగా పాలు పెరుగు నెయ్యి, జున్ను ఉండగా.. !

    ReplyDelete
    Replies
    1. కత బాగుందండీ.మల్లాది వారికంత సిగ్గెందుకో ఎనిమిదో దశకంలో కూడా :)

      శ్రీధరా VAT 69 లేదా? తెలీదా? :)
      పాలు పెరుగు మీగడ,వెన్న,నెయ్యి, జున్ను అమ్మో కొలస్ట్రాలు ముడియాదప్పా :)

      Delete


    2. వలదు వలదోయి శ్రీధర!
      వలదోయ్ పాలుపెరుగులిక వలదోయ్ నెయ్యీ
      వలదోయ్ జున్నూ మీగడ
      వలదు కొలస్ట్రాలు వెన్న వలదు జిలేబీల్ :)


      జిలేబి

      Delete
    3. వేనామ్ టెన్షన్ ఆచార్య..అవి హోర్డింగులు, టీవిలలో కాన వచ్చే యాడ్స్ మాత్రమే.. గత ముప్పది ఐదు వత్సరాల నుండి గాని రాబోయే కాలం లో గాని ఈ నార్కోటిక్స్ జోలికి వెళ్ళకూడదని నా చిన్నతనంలోనే అనుకున్నా..!

      అదదా.. అల్కాహాలు స్మోకింగ్ వేపింగ్ ఈజ్ టోటల్లి ఇంజూరియస్, హార్మఫుల్ యాండ్ డిస్ట్రక్టివ్ టూ హిపాటోబిలియరి కమ్ పల్మనాలజికల్లి హజార్డస్ కదా.. వాటితో పోల్చితే హెడిల్ లోడిల్ లిపోప్రోటీషన్స్ మంచిదే గా ఆచార్య.. నాణ్ చొల్లమాటే.. సరిసరి..!

      Delete
  4. శ్రీధరా,
    మల్లాది గారి గురించి నా పాయింట్ సరిగ్గా చెప్పలేక పోయానా? వారి ఫొటో విషయం తెలుగు నవలాపాఠక లోకంలో అందరికీ తెలిసినదే గదా, పైన నా కామెంట్లో ప్రత్యేకించి విడమర్చనక్కర లేదులే అనుకున్నాను.

    వారి ఫొటో వారింట్లో తప్పక ఉంటుంది లెండి, అక్కడ ఉండక ఏమవుతుంది. అసలు సంగతేమిటంటే మల్లాది వారు తన ఫొటోని తనంత తానుగా పాఠకులకు చూపించరు, మరొకరిని ప్రచురించనీయరు. ఒకానొక కాలంలో (1970, 1980, కొంత 1990 ల దశకాల్లో) ఇదొక విశేష చర్చనీయాంశంగా వెలిగింది. బిడియమో లేక తానొక ప్రచ్ఛన్న రచయితగా గుర్తుండి పోవాలని వారి పోలసీయో ... తెలియదు మరి. ఈ విషయం గురించి ఇప్పుడెవరూ పెద్దగా ఉత్సుకత చూపిస్తున్నట్లు లేదు లెండి. carrying it too far లాగా అయిపోయినటువంటి మిస్టరీని ఎవరు ఎంత కాలం పట్టించుకుంటారు గనక?

    ఇక పలు రకాల బ్రాండ్ల పేర్లు చెప్పి ఆపైన // "పాలు పెరుగు నెయ్యి, జున్ను ఉండగా ..!"// అని పైన మీరన్న లాంటి సారాంశమే "ఆల్కహాలికుల" అన్న నా కామెంటులోని భావం కూడా ... అవే పదాల్లో కాకపోయినా.

    ReplyDelete
  5. మ.వెం.కి ఫోటో గురించి బానే చెప్పేరు,బానే అర్ధమయింది, మరీ బిగిస్తే తెగిపోతుంది, ఏదైనా అంతే. మొన్నీ మధ్య భండారు వారి బ్లాగ్ లో చూశా ఆతరవాత గాయబ్.

    ReplyDelete
    Replies
    1. అవును శర్మ గారు. భండారు వారు తన బ్లాగులో ఆ మధ్య మల్లాది వారి ఫొటో ప్రచురించారు (ఏదో సభా వేదిక మీద నలుగురితో ఉన్న ఫొటో). మీరన్నట్లు అది మూణ్ణాళ్ళ ముచ్చటగా కూడా నిలవలేదు. ఆ సంగతి తెలుసుకున్న మల్లాది గారు భండారు వారికి ఫోన్ చేసో లేక మెస్సేజ్ ఇచ్చో ఫొటో తీసెయ్యమని అడిగారట. భండారు వారు అలాగే తీసేశారట. ఈ మాట భండారు వారే తన బ్లాగులో తరువాత పోస్టులో చెప్పారు. ఆ రకంగా ఆ ఫోటో అక్కడ నుండీ కూడా మీరన్నట్లు "గాయబ్" అయింది. నేను ఇందాక అన్నట్లు carrying it too far అంటే ... ఇదేనేమో?
      కానివ్వండి, వారి ముఖారవిందం వారిష్టం.

      Delete
    2. సారూ!
      ఏవనుకోకండీ! ఆయనొక మంచి రచయిత. ఆయన ఫోటో చూడాలనుకోడం మానవ సహజం. కాదనుకోవడం ఆయనిష్టం. మరో చిన్నమాటా ఏమనుకోవద్దూ :) ఆయనేం గ్రేటా గార్బోనా,బ్రిట్నీ స్పియర్సా, మార్లిన్ మన్రోనా? ఫోటో దాచేసుకోడానికి, ఓ మగాడు..ఉట్టి తెలుగు మగాడు అంతే

      Delete
  6. ఇందరు ఘనంఘనులు కడు
    చిందర వందరవడుట జిలేబుల గూర్చా ?
    ఎందరి ప్రశంస వచ్చెను !
    కందాచ్చి వివర మొకటియు కనులబడందే !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      మీకు తెలియందా! కందాచ్చి కత నేడు కొత్త కాదుగా :)

      Delete
    2. శర్మాచార్య.. నేనూ తంగాచ్చి విన్నా చెల్లే అని.. తంగం కూడా విన్నా బంగారం అని.. ఈ కందాచ్చి ఎవరు..?

      Delete
    3. కామాక్షి కంజదళాయతాక్షి..కదా! ఇక ఈ తంగాచ్చి, కందాచ్చి, ఆచి,అరవ పాటి, కంగాళాచ్చి అందరు ఒకరేనండీ జిలేబాచ్చి. :) పొద్దుటే పజ్జాలతో కొడుతుంది చూడండీ, నేడే చూడండి. :)

      Delete
    4. హాహాహా.. నేడే చూడండి.. ;)

      Delete


    5. కందాచ్చి యెక్కడే బస?
      బిందాసుగ తిరుగుతావు విపణి వరుసలన్
      కిందా మీదా పడి మా
      కందమ్మున దేలినావు కంద జిలేబీ :)


      జిలేబి

      Delete
  7. డబ్బు కై ఆరాటమే ప్రతి ఒక్కరిది కాని దానిని ఎపుడు ఎలా ఎందుకు ఎక్కడ ఖర్చు పెట్టేదాని మీదే ఆధార పడి ఉంటుంది అసలైన వ్యత్యాసం.. ధారాపాతంగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే ఉన్నది కాస్తా గోవిందా.. ఆచితూచి ఖర్చున్న చోటునే విదిలిస్తే ఆ ధనలక్ష్మీ కటాక్షం ఎల్లపుడు ఉంటుందనేది నిత్య సత్యం.. నూటికి నూరు పాళ్ళు

    ReplyDelete
    Replies
    1. డబ్బు అనేది అవసరం. ఇరుసున కందెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ! సొమ్ము సంపాదించాలి, అవసరంగా ఖర్చూ చెయ్యాలి. ఎక్కడ ఎంత అవసరమో తెలుసుకోవడమే గొప్ప.
      ప్రకృతియైనమః
      వికృతియైనమః
      విద్యయైనమః
      సర్వభూత హితప్రదాయైనమః
      శ్రద్దాయైనమః
      ఇవన్నీ లక్ష్మీ దేవి పేర్లు.విద్య లక్ష్మి,ప్రకృతి లక్ష్మి, వికృతి లక్ష్మి, శ్రద్ధ లక్ష్మి....అందరికి హితవును కలిగించేది లక్ష్మి...శ్రద్ధ,విద్య లేని చోట లక్ష్మి నిలవదు.

      Delete