Monday 2 November 2020

కరోనా నడక


 కరోనా నడక


కరోనా తగ్గిందా? పోయిందా? తగ్గిపోయిందా??ఏమోగాని వాళ్ళని తీసుకెళ్ళేరు,వీళ్ళని తీసుకెళ్ళేరు, నలుగురు హౌస్ క్వారంటైన్ వార్తలు లేవు.మా ఊళ్ళో  ఒక కరోన ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీగానే ఉందని వార్త.పల్లెటూళ్ళలో పెద్దగా అలజడి లేదు. వర్షాలు వెనకబట్టేయి ఒక వారం నుంచి, చలి తిరిగింది కొద్దిగా. బడి తీస్తారట, కార్పొరేట్ల సంబరమేమో! ఏమో పిల్లలు కదా, భయంగానే ఉంది. ఒక తరం జారిపోతోంది, మారిపోతోంది.  


కరోన వార్తలకి లోటు లేదు. వారాలు, టెస్టులు, కరోన తెలియడం, ఏం లేదు మూడు రోజుల్లో అంతా ఫినిష్ ఒక వార్త, గుండెలవిసేలా, అదేం ఆనందమో. మరోవార్త ఇదంతా హంబగ్ చైనాను ఒంటరి చెయ్యాలనే ప్రయత్నం, అందులో మోడిగారు కూడా ఉన్నారు. పాపం చైనా ఎన్ని కష్టాలలో ఉందీ ఇది మరో వార్త. జర్మనీ,బ్రిటన్, ఇటలీ, France మళ్ళీ లాక్డవున్ అంటున్నాయి, మనమేమో ఓపెన్ అంటున్నాం, ఇదేంటీ. అదుగో వాక్సీన్ ఇదిగో, వాక్సీన్, అన్నీ సిద్ధం చేసుకోండి మరో వార్త. ఏదో ఒకటి అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలి, కొంతమంది తాపత్రయం. 

కరోనాకీ వలపక్షమే.ఎ బ్లడ్ గ్రూప్ వాళ్ళమీద పిలవకపోయినా వాలిపోతుందిట. బి గ్రూపంటే మొహమాటంట. ఎబి వాళ్ళంటే ముట్టదుట, ఒ గ్రూపంటే భయమేనట. సరే ఆడాళ్ళంటే మొదలే భయంకదా కరోన కి. ఇక కరోన వచ్చి తగ్గినవాళ్ళ గురించి ప్రచారమూ లేదు, వాళ్ళ సంగతీ తెలీదు. మరోమాట కరోన వచ్చి తగ్గిన పదిమందిలో ముగ్గురికి మాత్రం మానసికరోగం చిరస్థాయిగా ఉంటుందిట. కొంతమందికి దీర్ఘకాలానికి కొన్ని వ్యాధులు బయట పడతాయని కొందరి ఉవాచ. ఏంటో! అంతా విష్ణు మాయ.! ఏది నిజం పరమాత్మకీ తెలియదేమో! 


ఏదొచ్చినా బాలీ ఉడ్ వారికి వింతే. పోయేవాళ్ళు పోతున్నారు.పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పుట్టేవాళ్ళు పుడుతున్నారు.    బాలీవుడ్ కి చెడ్డకాలం సెలిబ్రిటీలు రాలిపోతున్నారు. కష్టజీవులకి, మురికివాడలవారికి కరోన రాదు, ఇదో రిసెర్చ్ రిజల్ట్, మరో వార్త, ఎందుకంటే వారి వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది, అశుభ్రమైన ప్రదేశంలో బతుకుతున్నారు కనక, ఎవరిష్టం వారిది, ఎవరివార్త వారిది. బలమైన జీవులే బతుకుతాయన్నది సైన్స్ వారి వార్త అంతేకాదు, ఇది ప్రకృతి చెప్పేమాట. Survival of the fittest. దీనికి కావలసింది రోగ నిరోధక శక్తి, అదెలా వస్తుందిబాబూ, ఎక్కడ దొరుకుతుంది,మార్కెట్లో దొరుకుతుందా?  డాక్టర్లని ఆశ్రయిస్తే విటమిన్ డి మాత్రలేసుకో అంటున్నారు.రోజూ నడవండోయ్! ఉదయంచిన సూర్యుణ్ణి చూడండొయ్! డి విటమిన్ చేరుతుంది, రోగ నిరోధక శక్తి అదేవస్తుందంటే, ఎండోపతీ అని నవ్వినవారున్నారు.పోనిద్దురూ ఎవరిష్టం వారిది కదా,లోకో భిన్నరుచిః. ఏడెనిమిది నెలనుంచి కాలు బయట పెట్టలేదు, నడకలేదు, ఇంట్లోనే మిడుకుతున్నామని నడక మొదలెడదామనుకున్నా, విజదశమిరోజు. ఆలోచనొచ్చేటప్పటికే సాయంత్రమయింది,మర్నాడనుకుంటే ఏకాదశీ సోమవారం, దగ్ధయోగమని మానేశా :) మంగళవారం మొదలెట్టేను.


కర్రపుచ్చుకు బయలుదేరినా, కాలు నిలవటం కష్టంగానే ఉంది. తేలిపోతానో,తూలిపోతానో,పడిపోతానో, తూలిపడిపోతానో అని నెమ్మదిగా కుంటుకుంటూ, గ్రవుండికి చేరా! అన్నీ ముసిలి తలకాయలే! రండి రండంటూ చేతులూపుతూ స్వాగతం పలికేసేరు. అందరికి పలకరింపు చేతులు ఊపేసి, నమస్కారబాణాలలా, ట్రేక్ కిదణ్ణం పెట్టి అడుగు ముందు కేసాను. కాళ్ళకి సూదులు గుచ్చినంత బాధ. వర్షాలకి  ట్రేక్ మీద గులక రాళ్ళు తేలాయి. అలాగే నెమ్మదిగా నడిచా! నాలువందల మీటర్లు నడవడానికి పదేను నిమిషాలు పట్టింది.పక్కనే ఉన్న పచ్చగడ్డి మీద నడిచా, బాగుందిగాని పల్లేరు కాయలు గుచ్చుకున్నాయి. కుంటుకుంటూ పక్కనే ఉన్న ప్లాట్ పాం మీదకి చేరా, బాసిన పట్టు వేసుకుని కూచుందామని. అబ్బే కాళ్ళు దగ్గరకి రావే! వామో! ఏదో ఐపోతోందనుకుని నెమ్మదిగా కాళ్ళు దగ్గరకి తీశా. కాళ్ళు  నొప్పులెట్టేశాయి. నెమ్మదిగా ఇoటికి చేరా. మర్నాడు నడవగలనా అనుమానమే వచ్చేసింది. ఏమైనా నడవాలని ట్రేక్ మీద నడిస్తే పదినిమిషాలు పట్టింది. ఫరవాలేదనుకుని కాళ్ళు నొప్పులున్నా నడక మానలేదు. ఆదివారానికి నాలుగువందల మీటరు నడవడానికి ఆరు నిమిషాలు పట్టింది. పచ్చ గడ్డి మీద 8 లూప్ నడక చేయడం మొదలెట్టా. బాసినపట్టు వేసి పావుగంట కదలకుండా కూచున్నా! సాధనమున పనులు సమకూరు ధరలోన!

మూడో రోజనుకుంటా పై చిత్రంలోలా రక్తపుముద్దలా భాస్కరుని దర్శనమైంది, ఫోటో తీసి నమస్కారం పెట్టుకునే లోపే ఫోన్ టింగ్ మంది, ఇంత పొద్దుటే ఎవరబ్బా! ఎవరూ ఇంకా మంచాలమీంచే దిగరుకదా అనుకుంటూ చూస్తిని కదా ఒ పజ్జం ఊడిపడింది :)       




45 comments:



  1. పజ్జానికి కరోన అనబడు జిలేబి (రెండూ జ గణములే ;))
    తగులుకొని రగులు కొంది కామోసు ఊడి , పడింది :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. రెండూ జగణాలేనా? జగడమేలే తల్లీ!ఉదయం నడకలో కూడా అమ్మతల్లి పజ్జాలు తప్పలేదా అని నవ్వొచ్చిందంతే:)

      Delete
  2. వామ్మో, నా రక్తం “A” గ్రూపేనే 😳😳? పోనీ దాంట్లోనే పాజిటివ్ వారికి గానీ, నెగటివ్ వారికి గానీ ఏమైనా మినహాయింపులు ఉన్నాయాండి?

    సోమవారం, అందులోనూ ఏకాదశి గనక అయితే పనులు చెయ్యడానికి మంచి రోజే అనుకుంటుండే వాడినే ఇంతకాలం! మీరేమో “దగ్ధయోగం” అంటూ భయపెడుతున్నారు మరి 😳?

    కొంతమందేమో మంగళవారం నాడు ఏ పని చెయ్యడానికీ ఇష్టపడరని నా పరిశీలన.

    సూర్యోదయం ఫొటో అద్భుతంగా వచ్చింది, సర్👌.

    “కరోనా” కదనకుతూహలం పెద్దగా తగ్గినట్లు లేదండి.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      బ్లడ్ గ్రూపుల గురించిచెబుతున్నారుగాని ఇది పూర్తిగా తేలిన సంగతి కాదనిపిస్తుంది.

      షష్టీ శనివారం (౬+౭)
      సప్తమి శుక్రవారం (౭+౬)
      అష్టమీ గురువారం (౮+౫)
      నవమీ బుధవారం (౯+౪)
      దశమీ,మంగళవారం(౧౦+౩)
      ఏకాదశీ సోమవారం (౧౧+౨)
      ద్వాదశి ఆదివారం (౧౨+౧)
      ఇవి దగ్ధ యోగాలు. తిధి,వారం,నక్షత్రం, యోగం,కరణం అనేవి ఐదూ కాలానికి, సంబంధించినవి అవే పంచ అంగాలు అదే పంచాంగం.తిధివారం కలిపితే పదమూడు వచ్చే వాటిని విసర్జించమన్నారు, అదే దగ్ధ యోగం. ఆ రోజున కొత్త పనులు మొదలుపెట్టవద్దన్నారు.

      షష్టీ కలహం అంటారు.
      అష్టమి కష్టం
      నవమినాడు మొదలుపెట్టిన పని పునః పునః మొదలుపెట్టలంటారు. పైవాటిని సామాన్యంగానే విసర్జిస్తారు. మిగిలిన తిధులకి పట్టింపు లేదు. నడకలాటివాటిని నవమినాడు మొదలు పెట్టచ్చు. :)
      ఫోటో అలా వచ్చేసిందంతేనండి.మంగళవారం శంక చాలామంది చెబుతారండి.
      పల్లెలలో అలజడి తగ్గిందండి.

      Delete
  3. మరేమో మా నాన్న గారిది ఏబీ రీసస్ పాజిటివ్, అమ్మ గారిది ఓ రీసస్ పాజిటివ్, నాదేమో బీ రీసస్ పాజిటివ్, నా ధర్మచారిణిదేమో ఏ రీసస్ పాజిటివ్, నా చిట్టితల్లి దేమో ఓ రీసస్ పాజిటివ్.. అవన్నీ రీసస్ పాజిటివ్ లు మాత్రమే.. కోవిడ్ ౧౯ దరి చేరకుండ ఉండటానికి శతవిధాల ఎవరికి వారమే శొంఠి పొడి, దాల్చిన చెక్క, లవంగం, ధనియాలు, వేపాకు, కరివేపాకు, మెంతులు, వాము, పసుపు ఇలా ఇన్ని ఆల్టర్ నేట్ డే వారిగా కషాయం చేసుకుని సేవిస్తు ఆరోగ్యం రోగనిరోధక శక్తి ని ఇనుమడింప జేస్తున్నాము. ఆ ఏడుకొండల వేంకట చలపతి చల్లని ఆశిస్సులు అందరిపై ఉండాలని మనఃపూర్తిగా కోరుకుంటు.

    సోమవారం సంగతేమో గాని ఆచార్య, మంగళవారం రోజు సాయంత్రం దాటితే ఖర్చు చేయరాదని, శుక్రవారం ఎలాటి లావాదేవిలకు తావు ఇవ్వరాదని, బుధవారం నాడు బంగారం, గురువారం నాడు లావాదేవిలు మంచివని, శనివారం నాడు ఇనుము తదీతర లోహాల అల్లోయిలను లేదా నువ్వులు, నూనే కారకాలు, నెయ్యి వంటి ముడి సరుకుని కొనరాదని, అలాగే రాత్రి ఏడు దాటిన తరువాత పెరుగుని పొరుగింటికీ కూడా ఇవ్వకూడదని అపుడెపుడో మా తాతగారి మాట..!

    ఒకప్పుడు మనషులం మనదే మేయిన్ ట్రాక్
    శార్వరి ఉగాది నాటి నుండి కోవిడ్ లూప్ లైన్ లో వచ్చి మనషుల మేయిన్ ట్రాక్ ను బైపాస్ చేసింది.
    ఇపుడిపుడే మనషులు ఆక్జిలరి ట్రాక్ ఏర్పాటు చేసుకుని కోవిడ్ ట్రాక్ ఇంటర్సెక్ట్ కాకుండ తగు జాగ్రతలు తీసుకుంటూనే చలనం షురు.
    ఆ ఎఫెక్టివ్ ఎఫికసి ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినాకనే ఆక్జిలరి ట్రాక్ వదిలి లూప్ లైన్ మీదుగా మేయిన్ ట్రాక్ పై చలనం షురు గావాలని ఆశ..!

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      అన్ని బ్లడ్ గ్రూపులు గురించి పూర్తి వివరాలు లేవండి. ఇది కొద్ది మంది అబ్జర్వేషన్. ఇమ్యూనిటి కావాలన్నది మాత్రం నిజం. అశ్రద్ధ పనికి రాదన్నది సత్యం. మరో రెండేళ్ళ దాకా వ్వేక్సిన్ వచ్చే సూచనలు లేవని నా నమ్మకం.

      Delete

  4. చిమ్మచీకట్లు విడలేదు , నెమ్మదిగ మ
    హానుభావులు పాదవిహార హాళి
    కేగి , రచటను , నొకపద్య మెదురు వొడిచె ,
    భాస్కరోదయముకు మున్నె భాస్కరునకు .

    ReplyDelete
  5. రాజావారు,
    మాకు సూర్యోదయం ఆరు తరవాత రెండు మూడు నిమిషాలకి అవుతుంది. సూర్యుడు మరో పది నిమిషాలకి కాని కనపడడు. ఆయన కనపడే సమయానికి ట్రేక్ మీద చేరతాను. అది అలవాటు.నమస్కారం పెట్టుకుని నడక మొదలెడతానండి. ఆ సమయానికి అమ్మణ్ణి పద్యం ఊడి పడింది అదండి సంగతి :)

    ReplyDelete
  6. కందంబో కందోత్పల
    బంధంబో గాని ఘాఠ్ఠి పద్యమె తగిలెన్
    ముందుకొ వెనుకకొ తెలియని
    చందంబైనట్లు దోచె సారు స్థితిగనన్ .

    ReplyDelete
    Replies



    1. నీ నడక కరోనా మే
      లై నిలదొక్కుకొనెనకొ భళా తాతకు చె
      ప్మా! నీడను చూచి భయము
      తో నడకల కూడ చేయ తోసెనట సుమీ :)


      నారదా వింటున్నావా :)


      జిలేబి

      Delete
    2. రాజావారు,
      ముందుగా భాస్కరునికే నమస్కారం, ఆ తరవాతే బామ్మ పజ్జం

      Delete
    3. అమ్మణ్ణీ,
      మిడ్తంభొట్లు రోజూ చిక్కడు, చాలా జగర్తగా పజ్జం వేసావుగాని కుదరలా! కరోనాకి వీరకత్తివి ఐనా జాగర్తా!

      నేటిమాట
      గాల్లో కరోనా నిలుస్తుంది, వ్యాపిస్తుంది,
      కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడు, కరోనా కలిగేను ఖాయం.

      మరోమాట మేధావుల్ని బుద్ధిజీవుల్ని కరోన ఎత్తుకుపోతోందిట ఒక స్టడీ, దీనిలో ఆడ మగ తేడా లేదట. నేను భయప్డుతున్నా! జాగర్త చెబుతున్నా నీ ఇష్టం ఎదురెల్తానంటే!

      Delete


    4. మనమంతా మేధావులూ బుద్ధిజీవులము కాము కదండీ కృషీవలులం. సో ఓకె :)



      జిలేబి

      Delete
    5. బామా! మా పెనవలూర్లో ఓ సామెజ్జెపుతార్లే :)

      Delete


    6. ఎవిటా సామెత ఏవిటాకతా ?

      ఉత్సుకతో మీ టపా కై వేచి యుంటిమి :)



      ఇట్లు
      సా, మేథ

      జిలేబి

      Delete

    7. పొట్టలో చుక్క ఎక్కువై పోయింది :)

      Delete
    8. పొట్టలో చుక్క ఎక్కువైపోయెనా హి
      తా ! మరంతగా చుక్కను తగదువోయ
      లివరు పాడగునందురు రేపు మొదలు
      చుక్క తగ్గించ మనవి మామ్రొక్కు 🙏 వినుడు .

      Delete
    9. సా (రంపం).. మేధ (కౌశలం).. ధ పొట్టన దిష్టి చుక్క ఎక్కువై పోతీ థ కానవచ్చే..

      శ్రీత ధరణి

      Delete
    10. బామ్మా!
      పొట్టలో చుక్క ఎంత పని చేసిందీ :)
      పొట్టలో చుక్క ఎక్కువైతే నిజాలు తన్నుకొస్తున్నాయి కదూ :)
      ప్రయాణం లో ఉండిపోయా నిన్న, లేకపోతే పొట్టలో చుక్క మరికొంచం పోసేవాడినేమో సుమీ :)

      Delete
    11. మనమంతా మేధావులూ బుద్ధిజీవులము కాము కదండీ ''కృషీవలులం''. సో ఓకె :)
      బామ్మా!
      దుక్కి దున్నేవా?
      నీరు పెట్టేవా?
      నారు నాటేవా?
      కోత కోసేవా?
      నూర్పు నూర్చేవా?
      ఏది మన కృషి :)
      మనం కృషీవలులం :)

      Delete
  7. కోవిదులూ కోవిడ్లూ
    భావింపగ నొకటెజాతి బాధించుటలో
    కోవిదుడు గుండెజీల్చును
    కోవిడు లంగ్స్ జీల్చు , రెండు - కొంపలుగూల్చున్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అంతేనంటారా?

      Delete
  8. శర్మ గారు,
    ఇంతకూ అంత పొద్దుటే ఊడిపడిన ఆ “జిలేబి” గారి పద్యమేమిటో చెప్పనే లేదు మీరు.

    ReplyDelete
    Replies
    1. అరె!చోలెగాచి :)

      Delete
    2. చలేగోచ అంటే మా మాతృక లో వెళ్ళినాడు.. అదే చలేగీచ అంటే వెళ్ళినది.. (జెండర్ సెన్సిటివ్ డయాలెక్ట్ కూడాను).. మీరు బంగ్లా లో చెప్పినారా లేక ఉడియా లో పల్కినారా శర్మ ఆచార్య

      Delete

    3. సోనార్ బంగ్లా అనుకుంటానండి

      Delete
  9. శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐

    ReplyDelete
    Replies

    1. మిత్రులు బోనగిరిగారు,
      ధన్యవాద శతాలు

      Delete
  10. మీకు జన్మదిన శుభాకాంక్షలు, శర్మ గారు 🌹🌹

    శతమానం భవతి

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఆనందం అర్ణవమైతే
      ధన్యవాదాలు.

      Delete
  11. శర్మ ఆచార్య వారికి పుట్టిన రోజు శుభాభినందనలు.. ఈ రోజు మా పాపాయి ఏడాదిన్నర పడిలో అడుగిడుతోంది కూడాను.. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ ఏడుకొండల వేంకటేశ్వరుణ్ణి కోరుకుంటు..

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా,
      మీ చిన్నారికి యేడాదిన్నర నిండిన సందర్భంగా నా ఆశీస్సులు. శతమానం భవతి.

      Happy Birthday

      Delete
    2. ధన్యవాదాలాచార్య.. మీ ఆశిస్సులను నా చిట్టితల్లికి తప్పకుండ తెలియజేస్తాను.

      Delete
    3. శ్రీధరా!
      అనురాగం అంబరమైతే

      చిరంజీవి చిట్టితల్లికి మీ దంపతులకు అశీస్సులు.
      శతంజీవ శరదో వర్ధమానా, ఇత్యపి నిగమో భవతి, శతమేన మేన శతాత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి.
      దీర్ఘాయుష్మాన్భవ
      దీర్ఘసుమంగళీ భవ
      శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తి రస్తు.

      Delete
    4. చిట్టి తల్లికి మరోసారి,
      దీర్ఘాయుష్మాన్భవ

      Delete
    5. మీ చల్లని ఆశిస్సులకు ధన్యుడిని ఆచార్య.. మా దంపతులు, నా చిట్టితల్లి తరపున ప్రణవిల్లుతు.. !

      ~శ్రీత ధరణి

      Delete
  12. ఆయురారోగ్యభాగ్యసౌఖ్యాలదేలి
    జయ శతాధికవత్సరచయము మనుచు
    అమ్మదయజేసి మన్నన లందుగాత
    జన్మదిన శుభాకాంక్షలు, శర్మ గారు

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే.
      శతాధికవందనాలు.
      ధన్యవాదాలు.

      Delete
    2. ఆశీర్వదించు చేతులు
      ఈశునకేగాని యొరుల కిటు వందనముల్
      లేశంబును సేయ దగదు
      రాశీభూతాంతరంగరాజిత విబుధా !



      Delete
    3. పెద్దలమాట శిరోధార్యం

      Delete
  13. కలత నలత.. మనసు కి వ్యథ
    సుఖం దుఃఖం
    జీవితం లో భాగం
    అంతం అనంతం
    గతి గమనమెఱిరిన భావాతిరేకం..

    మజ్బూర్ హోనా పడతా హై
    కభి కభి దిల్ కే దర్మియాఁ
    రుఖే పలోఁ మేఁ మజ్బూరన్ లమ్హోఁ మేఁ మిఠాస్ భరనా హోతా హై అన్చాహే హి సహి
    మన సే మన్మాని కైసి మగర్ బేబునియాది పలోఁ మేఁ ఖోయే పల్కోఁ మేఁ ఖోయే

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      అన్నీ జీవితంలో భాగాలే. అన్నీ అనుభవింపక తప్పదు. ఏడుపు వచ్చినప్పుడు తనివితీరా ఏడవక తప్పదు కదా :) ఆ ఏడుపుతోనే ఉండిపో కూడదు. :)ప్రయత్నంతో నైనా దానినుంచి బయట పడాలి. :)
      ధన్యవాదాలు.

      Delete
    2. తల్లి సీతమ్మ కన్నీరు ధరణి బడియె
      భాష్పముల రాల్చె రాముడు భార్యగనక
      కనుచు కంటికి నిండ లక్ష్మణుడు బొగిలె
      విధిని తప్పించ తరమె ? భావించి చూడ 🤔.

      Delete
    3. తప్పకుండ ఆచార్య.. చిన్న పిడత తయారవటానికి మట్టి ముద్ద నలిగినట్లు.. చిన్న ఇనుము పనిముట్టు వేడిమిని తట్టుకుని నిలిచినట్టు.. బంగారం వేడి తాకి స్వచ్ఛతను సంతరించుకున్నట్లే.. జీవితాన సైతం అపుడపుడు కలహాలు, అలకలు.. వాటిని దిగమింగి ముందుకు సాగితేనే అది అలా అలా సంద్రపు అలలా సాగుతు ఉంటుంది.. కోపతాపాలు సహజం..

      Delete