Friday, 30 October 2020

పనియే పరమాత్మ.

 

Courtyesy Whats app

 


పనియే పరమాత్మ. ఏదీ నీచమైనది కాదు.



40 comments:




  1. పనియే పరమాత్మ తెలుసు
    కొనవె చెలి కుదురుగ నడుచు కొనవె జిలేబీ
    విను నీచమటంచు పని భు
    విని నేదియు లేదు పడతి విదురుల పల్కౌ



    జిలేబి

    ReplyDelete
  2. ఎంత “ఏదీ నీచమైనది కాదు” అనుకున్నా, తన పనియే తనకు పరమాత్మ అనుకున్నంత మాత్రాన ... చెత్త వేసే డబ్బాని తీసుకొచ్చి ఒక ఆఫీసు షట్టరుకో ఇంటిగేటుకో అడ్డంగా పెట్టి పూజ చెయ్యడం ఏమిటి? 😡

    ReplyDelete
    Replies

    1. ఇక్కడ ప్రాబ్లెమ్ ఆ వెనుక కనిపించు లోగో బ్యాంకు ముందు" చెత్త డబ్బా " యని సింబాలిక్ గా పెట్టేడనాండి ? :)



      నారదా
      జిలేబి

      Delete
    2. మార్కెట్ కు వీరభక్తులు, ప్రైవేట్ రంగానికి అచంచల అభిమానులు ఇలా కాక మరింకేమిటంటారు లెండి.

      Delete


    3. అంత కినుక వలదు :) jk అంతే :) ఆ లోగో బ్యాంకే లేకుంటే ఇంకా ఎన్నో సంస్థలు మునిగి‌వుండేవి . అది మీ మా మనందరి " ఇంపీరియల్" బ్యాంకు.

      అందరి పాప పరిహారములనూ అదే భరిస్తున్నది .

      వైట్ ఎలిఫెంట్ . కామధేనువు‌. ఆర్బిఐ తరువాయి ఆర్బీయై.

      On a serious front, jokes apart, people and leaders are forgetting that if and when elephant collapses there is no rescue for Sreshta Bharat.

      Hope the leaders keep it in mind and utilize it judiciously.


      చీర్స్
      జిలేబి

      Delete
    4. విన్నకోటవారు,
      తన పని ముట్లకి పూజ్జేసుకున్నాదూ.బడాబాబులొచ్చే టైమ్ కాదని అక్కడ పెట్టేడు.

      అది బేంకీ యేనండి.ఎనక ధనలచ్మికి దణ్ణమెట్టినాడండి. బేంకోరికి కూడా గౌర్నవమేనుండి. ఆరూ సొప్పుకోచ్చు"చిన్నలకి పెద్దలకి అందరికి మేమే అధారం, అందరిని మేము గౌరవిస్తాం, ఆదరిస్తాం" అని ఏటంటారు బావులూ :)

      Delete
    5. బామ్మా! ఒకప్పుడు జపాను అగ్గిపుల్లవేగాని ఇప్పుడు నెబుకుపోయిన చుచ్చిబుడ్డి లెక్క. ఎలగటంలా

      Delete

    6. ఎలగటంలా :

      ఎలిగే దానికి లోగో బ్యాంకు కాడ ఏముంది తాతోయ్ :)



      జిలేబి

      Delete
    7. శర్మ గారు,
      // “ చిన్నలకి పెద్దలకి అందరికి మేమే అధారం, ” //

      Big or small, State Bank for all ✋🙂

      Delete
    8. హా.. అందుతే తదేటి భారతీయ రాజ్యాల కోశానికి అఁ.. అదే.. బంకా డి స్టాటో ఇండియానా ను బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియనూ అంతారు తదా.. శల్మాచాల్యవల్యా..

      Delete
    9. “జిలేబి” గారు,
      // “ అందరి పాప పరిహారములనూ అదే భరిస్తున్నది .” //
      “Yes” కదా మరి 🙂.
      —————-
      // “ if and when elephant collapses there is no rescue for Sreshta Bharat” //
      మీ సునిశిత పరిశీలనకు చప్పట్లు. నాయకుల విజ్ఞత గురించి, ప్రజల విజ్ఞత గురించి మీ ఆశాభావం వమ్ము కాకూడదన ఆశిద్దాం.

      Delete
    10. Sridhar

      అంతేగదబ్బాయా!

      Delete
    11. విన్నకోటవారు,

      ఓలమ్మో! ఏటీ స్లోగను పాద్దేనా! నానే సొప్పినాననుకుంతి.

      Delete
    12. బామ్మ బుర్రలో బలబుఎలగటంలా!
      కొట్టన కొబ్బరికాయ చేతిలో ఉన్నాది, ఎదురుగ్గా కప్పూరమున్నాది, ఎలగిందా? ఆపడిందా?

      Delete


    13. ఆపళ్లే :) వినరా వారు ఖుషీ ఐపోనారు గదే మాకు ఖుషీ కీ బాత్ :)



      జిలేబి

      Delete
    14. పాతదే, శర్మ గారు 🙂. అలాగే Let us come closer అనే మరొక స్లోగన్ 🙂.

      అయినా మరేం ఫరవాలేదండీ. మీరు చేసిన తెనుగుసేత కూడా తెలుగు రాష్ట్రాలలో అడ్వర్టైజ్మెంట్ కు మహా బాగా పనికొస్తుంది ఈనాటికీ కూడా 👌🙂.

      Delete

    15. ఉపనయనం లేదా బామ్మా!
      ఖుష్ రఖో ఖుషీభి రహో

      Delete
    16. విన్నకోటవారు,

      రెండో స్లోగనా! ఒకప్పుడు స్టేట్ బేం ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఎస్.ఎల్.నరసింహం అనే ఆయన ఉండేవారు గుర్తుందా? ఆయన మాకూ ప్రెసిడెంట్ ఆరోజుల్లో ఎప్పటిమాటా? అరవై ఏళ్ళకితం మాట. ఆ రోజుల్లో బయటివారే ప్రెసిడెంట్లుగా ఉండెవారు. వీరిది నరసాపురం,ప్రాక్టీస్ లేని లాయరు. ఐ.ఎ.ఎస్.కి రిజక్ట్ అయ్యారు, చూపు తక్కువని.

      Delete
    17. బామ్మా! లేచావా?? ఉపనయనం అంటే తెలీలేదా? దీనికో కతుంది, ఇప్పుడు కాదులే మళ్ళీ అడుగు చెబుతా.
      వియత్నాం ని టైఫూన్ ముంచిందిట. రాత్రి వచ్చిన వీడియో భయంకరంగా ఉందిలే.ఎక్కడున్నావు?

      Delete


    18. మళ్లీ అడిగానండి ఉప నయా నామ్ ఏమిటండి ?

      పొర్ణమి కదా టైఫూన్ రాకుంటే ఎట్లా ?


      మైలాపూర్ మామి ఎక్కడుండును ?


      నారదా
      జిలేబి

      Delete
    19. ఎన్ ఏ సీ జ్విలరికి పెట్టింది పేరు మైలాపూరు.. నా చిన్నపుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది.. జీ టీవి, జెమిని టీవి మాత్రమే ఉన్న రోజులవి.. అపుడు మా ఇంట్లో ఆప్టోనికా (ఇపుడు షార్ప్) బ్లాక్ యాండ్ వైట్ టీవి, ఏ యమ్ రేడియో రెండు ఉండేవి.

      నాతేలా ఆంజనేయిలు చెట్టి యాండ్ సన్నాసి జ్విలరి
      మైలాపూరు, టమిల్ నాడు అని.

      Delete
    20. క్షమించాలి అది నాతేలా ఆంజనేయిలు చెట్టి యాండ్ సన్నాసి కాదు నాతేలా ఆంజనేయిలు చెట్టి యాండ్ సన్స్.

      Delete


  3. మనమెంతోతోపయినను
    ననవసరపు విషయముల మన తలను దూర్చం
    గను సుదతీ తప్పదు వెత
    లనుమానములేదు సూవె లావణ్యవతీ :)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మనమెంత ఘనులమైనా ,
      తనరదు పరపాత్రమందు తలదూర్చుట , యే
      లన ? నెంతగింజుకొన్నను
      చనదు విడిచి , బొప్పిగట్టు , చాలవు ఘనతల్ .

      Delete
    2. రాజావారు,

      మెకం తోపే! ఏటైపోనాది, బుర్ర బిందిలో దూరిపోనాది, అమరూడినాదు

      Delete


    3. ఇది టెల్గూనా ?

      Delete
    4. మరేటి తలితల్లి సెప్పుమీ

      Delete
  4. ఘనపారిశుధ్యకార్మిక
    జన ' ఆయుధపూజ ' వహ్వ ! సన్నుతి జేతున్
    కన , విజయదశమి నాటి ఘ
    టనగా దలతును నమామి 🙏 ' యన్న ' కు సారూ !

    మేమంతా ఉన్నతులం
    భూమినిగల తక్కినోళ్ళు పోలరు మాతో
    ఈ మాది రహంకారులు
    ధీమంతులుకారు , తీరు తీరుల నీచుల్ .

    రాయంచ అందచందము
    గాయని కోకిలకు లేదుగానీ, గళమం
    దాయమ తీయందనములు
    రాయంచకు రావు తాను రాయిడివడినన్ .

    కోకిల గళ మాధుర్యము
    కాకికి లే , దైన కాకి ఘనమాతృత్వం
    కోకిలకు రాదు , ఘనతల్
    లోకంబున వివిధగతులు , లోకువ తగునా ?

    ReplyDelete
  5. ఆంధ్రులకందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు (నవంబర్ 01) 🌹🌹🌾🌾🌷🌷

    ReplyDelete
    Replies

    1. తెలగాణకు అప్లికబుల్ కాదాండి తెలియక అడుగుతున్నానంతే :)

      Delete
    2. ఎర్స్-ట్వైల్ "ఆంప్ర" ఐతే అప్లికేబల్ బిజిలే అమ్మణ్.. ఇపుడు తెలంగాణాంధ్రాయలసీమ కదా.. వారికి నవంబర్ ఫర్స్టూ.. వీరికి జూన్ సెకండు హా..టమిలియన్లు మిలియన్లు దాటి ఏప్ రీలు పదు నులాగును

      Delete
    3. తెలీ కడుగుతారు. తెలిసెందు కడుగుతారు :)

      Delete
  6. ఎందుకు అవుతుంది “జిలేబి” గారు? నేనూ తెలియకే అడుగుతున్నానంతే :(

    ReplyDelete


  7. తెలగాణులు ఆంధ్రులు కాదుటండీ ?
    ఏదో తెలియక చెబ్తున్నా నంతే :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అలా అని మీరూ, నేనూ అనుకుంటే సరిపోతుందా “జిలేబి” గారు?

      Delete


    2. ఇంకా "ఎవరెవరు" అను కొన వలె నండీ :)

      Delete
  8. శ్రీధరా,
    // “ టమిలియన్లు మిలియన్లు దాటి ఏప్ రీలు పదు నులాగును” //
    ————
    “టమిలియన్లు” ఏప్రిల్ 14 న జరుపుకునేది తమిళ కొత్త సంవత్సరం (వారి ఉగాది), అంతే గానీ వారి రాష్ట్రావతరణ దినోత్సవం కాదు.


    తమిళులకు రాష్ట్రావతరణ దినోత్సవం అంటూ జరుపుకునే ఆనవాయితీ ఉందో లేదో, అసలు వాళ్ళు ఏ రోజుని తమ రాష్ట్రావతరణ దినంగా పరిగణిస్తారో ... “జిలేబి” గారు చెప్పాలి. లాజికల్ గా చూస్తే అంతకు ముొందున్న బ్రిటిష్ పాలన నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి స్వతంత్ర భారతంలో 1953 అక్టోబర్ ఒకటిన ఆంధ్ర, తరువాత 1956 నవంబర్ ఒకటిన మైసూరు, కేరళ ప్రాంతాలు రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. ఒకప్పటి ప్రెసిడెన్సీలో ఇక మిగిలినది తమిళ ప్రాంతం మాత్రమే కాబట్టి నవంబర్ ఒకటి ఫక్తు “మద్రాస్ రాష్ట్ర” ఆవిర్భావ దినం గా అనుకుంటే అనుకోవచ్చు (తరువాత చాలా కాలానికి “తమిళనాడు” అని పేరు మార్చడం మాత్రం జరిగింది లెండి, మైసూరు రాష్ట్ర పేరును “కర్ణాటక” అని మార్చినట్లుగా).

    ReplyDelete
  9. ఔనవునాచార్య.. మరిచితి..

    ReplyDelete
  10. ఇప్పుడు నవంబర్ 1 కి అర్ధం ఉందని నేను అనుకోవడం లేదు. అప్పుడు కలిసిన ప్రాంతాలు ఇప్పుడు కలిసి లేవు. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాలనుకుంటే అక్టోబరు 1న జరుపుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అక్టోబర్ ఒకటికు మారితే కొన్ని కొన్ని అప్రియమైన ఆనవాళ్ళను వదుల్చుకున్నట్లవుతుంది.

      అలాగే రాష్ట్రం పేరు కూడా “ఆంధ్ర ప్రదేశ్” అని కొనసాగించడం కూడా అనవసరమని నా అభిప్రాయం. “ఆంధ్ర రాష్ట్రం” Andhra State (1953 లో లాగా) అని మారిస్తే బాగుంటుందని నేను ఏపి ముఖ్యమంత్రి గారికి ఒక మెయిల్ పంపించాను పోయినేడు. కనీసం acknowledgement కూడా రాలేదు. ఈ సలహాను సమర్థించే వారు కూడా అలాగే cm@ap.gov.in కు మెయిల్ పంపమని నా మనవి.

      Delete