Monday 12 October 2020

కాపూ కరణం నా వాడైతే.........

  కాపూ కరణం నా వాడైతే.........


కాపూ కరణం నావాడైతే/నా వాళ్ళైతే/నామాటైతే/ నా వైపైతే ఇలా రకరకాలుగా ఈ నానుడిని చెబుతుంటారు తెనుగు నాట.....ఇదేంటొ చూదాం, అలా ముందుకుపోదాం.


నలభై సంవత్సరాల కితం దాకా పల్లెలలో ప్రభుత్వ అధికారులు అంటే ఇద్దరే, మునసబూ,కరణమున్నూ...చరిత్ర కనక కొంత చెప్పుకోవాలి..తప్పదుగా...టూకీగా చెప్పాలంటే మునసబు క్రిమినలు, కరణం సివిల్ వ్యవహారాలు చూసేవాడన మాట.మునసబుకి కరణం సహాయం రాత కోతలకి. మునసబుకి క్రిమినల్ వ్యవహారంతో పాటు, లా,ఆర్డర్, మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉండేవి. పల్లెలోకి వచ్చే బిచ్చగాడైనా మునసబుకి తెలియక అడుక్కోడానికి లేదు,”ఊళ్ళో అడుక్కోడానికొచ్చాను బాబయ్యా” అని కనపడాలి.పగటి వేషగాళ్ళు, జముకుల కత చెప్పేవాళ్ళు, మాట్లేసేవాళ్ళు,ఉప్పమ్ము కోడానికొచ్చిన వాళ్ళు ఇలా అందరూ మునసబుకి కనపడాలి,చెప్పాలి, వెళ్ళేటప్పుడూ కనపడాలి. ఒకప్పుడు ఆశీలు కూడా మునసబే వసూలు చేసేవాడు,   భూమిపన్నే కాక.  ఒక రకంగా చెప్పాలంటే పల్లెకి నియంత, మునసబు. ఏదైనా తగవు, జరగరానిది, ఆలు మగల తగువు నుంచి, కోట్లాట,హత్య, ఇలాటివి జరిగితే తన పరిధికి మించిన వాటికి,  మునసబు ఒక రిపోర్ట్ రాసి పోలీస్ కి పంపేవాడు. అప్పుడు పోలీస్ వచ్చేవారు. ఈ రిపోర్ట్ నే ”బకీరు” అనేవారు. ప్రాధమికంగా దీని మీద ఆధారపడి వ్యవహారం నడిచేది.  ఇది రాసేందుకు కరణం, మునసబుకి సహాయం. ఇక కరణం లెక్క,డొక్క,ఆదాయం ఇలా అంతా సివిల్ వ్యవహారం, ఇలా కాలం గడుస్తున్న రోజుల నాటి మాట.


అటువంటి రోజులలో ఒక పల్లెలో, ఒక జాయ,పతి, యువ జంట.అమ్మాయిది ఆ వూరేనో, పక్క ఊరో, ఏమైనా స్థానికురాలే. ఇక అబ్బాయి స్థితిమంతుడేగాని, కొద్ది మేదకుడు, అమ్మాయి జాణ.సంసారం గుట్టుగానే సాగిపోతున్నవేళ, ఒక రోజబ్బాయికి ఎందుకోగాని పట్టరాని కోపమొచ్చి, కొడతానేంటనుకున్నావో అని జాయని బెదిరించాడు. మేదకుడు కదా జాణతో వాదనలో నెగ్గలేక అశక్త దుర్జనత్వంగా అమ్మాయిని కొడతానని బెదిరించాడు. ఆ కాలంలో, ఆ కాలంఏం లేండి ఈ కాలం లోనూ భార్యను కొట్టే మూర్ఖులు ఉన్నారు, ముందు కాలంలో కూడా ఉంటారు.

అప్పుడు ఆ జాణ ”కాపూ కరణం నావాడైతే ఎట్లాకొడతావో కొట్రా మగడా” అని అన్నది.నిజానికి దారుణంగా ఎగతాళీ చేసింది, పతి చేతకాని తనాన్ని. అదేమీ గుర్తించని పతి ”ఏం ఎందుకు కొట్టలేను, ఆడదానివి, ఏం చేయగలవు” అనేసేడు. 

ఎలా కొట్టలేవో చెబుతా విను, వినారా! సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను, అసలు వివరము చెబుతానని మొదలెట్టిందిలా.  


 ''నా పుట్టింటివారికి మునసబు కరణాలకి అవినాభావసంబంధం. ఏ ఒక్కరూ మా వాళ్ళ మాట కాదనలేరు, కాదు కాదనరు. నువ్వు చెయ్యెత్తి నన్ను కొట్టి చూడు, నా ఒంటి మీద దెబ్బ పడితే, నేను వీధిలో పడతా, నా మొగుడు నన్ను కొట్టి చంపుతున్నాడో అని. మన ఇంటెదురుగా ఉన్న గుడ్లగూబ,సూర్పణఖ, చుప్పనాతి, నువ్వు నన్నెప్పుడూ కొట్టలేదని కుళ్ళుకుంటూ, ఏడుస్తూ, నువ్వు నన్ను కొట్టడం కోసం ఎదురు చూస్తున్నది,  వెంఠనే మునసబుకి కబురు అందజేసేస్తుంది, కబురు అందజేసేదాకా నిద్రపోదు. శత్రువుని కూడా మన అవసరానికి ఉపయోగించుకోవడమంటే ఇదే. దానికెంత సంతోషం అంటే మునసబెక్కడున్నా ఈ కబురు అతనికి తెలియ జేయక ఉండలేదు. కబురు తెలిసిందో మునసబు ఇక్కడ వాలిపోతాడు. మునసబొస్తే కరణం రెక్కలుగట్టుకు వాలిపోతాడు. కబురు తెలిసి సాటివాళ్ళొచ్చేస్తారు, పుట్టింటివారూ వచ్చేస్తారు. పంచాయతీ జరిగిపోతుంది, నేను చెప్పే ఒక్క మాటతో. ఇంకేముంది కరణం బకీర్ రాస్తాడు, మునసబు సంతకం పెడతాడు, వెట్టి అది పట్టుకుని టవున్ లో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ తరవాత జరిగేది ఇంకా చెప్పాలా? దొరగారికి. ఇది చాలదా?” అని బెదిరించింది. వామ్మో కొడతానంటే ఇంత చెప్పింది, నిజంగా కొడితే...నా బతుకు... అనుకున్న పతి, నెమ్మదిగా


”ధనం, వరిధనం, వర్థనం ఎందుకే అంత కోపం, నేనేమన్నాననీ, నిన్ను కొట్టడమా? ఎదీ నేను, నిన్ను కొట్టగలనా? సాధ్యమా?ఊహలో కూడా కుదరదే!” అని కాళ్ళ బేరానికొచ్చేసేడనమాట. కాళ్ళ బేరం ఏంటని మాత్రం అడగద్దు.     




9 comments:

  1. బాగానే ఉంది కథ.
    “కాపూ” అన్నది మొగుడ్నా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      కాపు అంటే రక్షణ, కాపు కులమువాడు అని అర్ధాలు చెప్పుకోవచ్చండి. ఇక్కడ అమ్మాయి రక్షణ ఇచ్చేవాడు మునసబు,తరవాత వాడు కరణం,కాపూ, కరణం అంటే మునసబూ,కరణం అనగా ప్రభుత్వమే తన వెనక ఉన్నదని చెప్పిందండి

      Delete
    2. వియన్నారాచార్య.. కాపు అనేది "కాపల" కాచే వారని.. అందులో నుండి వచ్చిన పదం.. అందుకే కాపు కాయటం లాంటి పదాలు కూడా ఉన్నాయి.. ఒకలా మీరు అన్ని సబబు గానే ఉంది.. భార్య ను కాచుకునే వాడు అనగ యేలే వానిని కాపురాన కాపు కాచిన వాడని కూడా అంటారేమో.. శర్మ గారు చెప్పిన రీతిన "నువ్వేమీ పీకలేవు.. నా వేషాలు నావే.. నా వెనకన ఎవరున్నారో తెలుసుగా.. ఒక్క సారి ఇలా చివిన పెట్టానో నీ తాట ఒలిచేసి అదేదో మూవిలోలా మసిపూసి మాయచేసి గుండు గీసి సున్నం రాసి గార్ధభం పై ఊరేగిస్తారు ఏమనుకున్నావో ఏమో అనే అర్దం తో చెప్పింది." కాని తెలియాల్సిందేమంటే ఎంతటి గయ్యాళి భార్యైనా భర్త తోడు వీడితే లోకులే కాకులై పొడుస్తారని.. అది వేరే విషయం.. అప్రస్తుతం

      Delete
  2. "ఆ కాలంలో, ఆ కాలంఏం లేండి ఈ కాలం లోనూ భార్యను కొట్టే మూర్ఖులు ఉన్నారు, ముందు కాలంలో కూడా ఉంటారు"

    మన దౌర్భాగ్యం

    ReplyDelete
  3. నేను అడిగిన దానికి టపా రూపంలో మరిత విపులంగా వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు శర్మాచార్యవర్య.. కాని నా భావమేమంటే.. వివాహ బంధాన ముడిపడి నటువంటి ఇద్దరు జీవితంలో ఏది పంచుకున్నా సరిసమానంగానే పంచుకోవాలి.. అటువంటపుడు భార్య చేసే చిన్న చిన్న తప్పులను మందలించి ఏది మంచి ఏది చెడు అని బోధిస్తే మరల ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలకు తావుండదని నా విశ్వాసం. మరోక మాట.. మననే నమ్మి జీవితాంతం మనకోసం మన శ్రేయస్సు ను అమ్మ తర్వాతి అమ్మ లాగా కాచుకునే జీవిత భాగస్వామి ని హేళన చేయటం మంచిది కాదని అంటాను.
    గయ్యాళి భార్య ఐతే తన జోలికి వెళ్ళక పోవడమే అందరికి శ్రేయస్కరం. ;)

    ReplyDelete
  4. ఓన్ ఏ లైటర్ వీన్..

    "ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి.. కన్నైనా కొట్టవే జిగేలు రాణి"
    ముద్దేమో మునుసబుకి.. కన్నేమో కరణానికి.. ;*

    వియన్నారాచార్య..

    శర్మ గారికి క్షమాపణలతో.. అసందర్భోచితమైన సందర్భోచిత వ్యాఖ్య గా పరిగణించాలని వినతి మనవి ప్రణతి..

    ~శ్రీధరణిత

    ReplyDelete
  5. ఆశీలు అంటే అదో రకం కరం అదే ట్యాక్స్ లెండి.. అందుచేతే ఇశాపటం లో ఆర్టీసి కాంప్లెక్స్ ఎదురు రోడ్డు ఎస్వీటి రోడు వేమన మందీర్ మార్గ్ పక్కనే మరోటి ఆశిలుమెట్ట అని ఉంది. సీయమ్మార్ గ్రాండ్, కళాంజలి, జోయలుక్కాస్ మొదలగు వాణిజ్య వ్యాపారిత్యాదులన్ని ఆ రోడు ఇరుపక్కలే.. అలానే ముందుకెడితే కెనేడియన్ బెప్టిస్ట్ మిషనరిస్ కంపౌండ్ ఉంటుంది. వైజాగాపటం లో ఉంటున్న ౪౩% మందికి సీబీయం కాంపౌండ్ అంటే అదేనని తెల్వదు. ఆ ముందుకెడితే సిరిపురానికి దీనికి నడుమన కరాచి బేకరి.. సిరిమాలేలో.. ఆకాశవాణి, దూర్ దర్శన్ దాటితే దత్త్ ఐలాండ్.. ఆర్కే మిషన్.. ఆ కిందనే పాండురంగపురం.. బీచ్ రోడ్.. ;)

    ReplyDelete
  6. అయ్యో పాపం. మొగుడికెంత కష్టం!!

    ReplyDelete
  7. //కాళ్ళ బేరానికొచ్చేసేడనమాట. కాళ్ళ బేరం ఏంటని మాత్రం అడగద్దు.//

    ఆ..
    అడగం లేండి ఆచార్య..

    అంటే లబోదిబో మంటు కాళ్ళా వేళ పడినాడు.. దానినే తేనుగమ్మ తేనుగు.. అచ్చమైన తేనూగు నాట ఇట్టా నానుడి లో హెచ్చరిక జారి చేశేరు.. ;)

    ReplyDelete