Monday, 26 October 2020

దుందుభి

 దుందుభి

దుందుభి రామాయణ కాలం నాటి వీరుడు. ఇతనికి యుద్ధం అంటే బహు మక్కువ. చాలా కాలంగా యుద్ధం ఎవరితోనూ చేయక చికాకుపడ్డ దుందుభి సాగరుని దగ్గరకెళ్ళి, యుద్ధం చేదాం రమ్మన్నాడు. దానికి సాగరుడు, నాలో అనంతకోటి జీవరాసి  బతుకుతోంది. వాటిని నిత్యం రక్షించే పని నాది, నీతో యుద్ధం చేయలేనని సౌమ్యంగా చెప్పాడు. ”పెట్టకపోతే పెట్టకపోయావు, పెట్టే ఇల్లైనా చూపమనట్టు, నాతో” యుద్ధం చేయగలవారెవరో చెప్పమన్నాడు.  హింవంతుడు బలశాలి ఆయన దగ్గరకెళ్ళు అని సలహా చెప్పాడు,సాగరుడు.


విన్న దుందుభి, హిమవంతుని దగ్గరకెళ్ళి యుద్ధం చేద్దామంటే ఆయన, ''నా పైన అనేక జంతుజాలం, వృక్షజాలం బతుకుతోంది. నానుండి అనేక నదులు పుట్టి ప్రవహిస్తున్నాయి. ఆ నీటితో ప్రజలు బతుకుతున్నారు. వీరందరిని వదిలేసి వచ్చి నీతో యుద్ధం చేయలేనని'' బ్రతిమలాడాడు. 


విన్న దుందుభి ''ఛస్! మీరంతా పిరికినాయాళ్ళు. యుద్ధం అంటే భయపడి ఛస్తున్నారు, పోనీ, నాతో యుద్ధం చేయగలవాడెవరో చెప్ప''మన్నాడు. హిమవంతుడు ఆలోచించి, వాలి కిష్కింధాపురి రాజు, మహా బలవంతుడు, నీలాగే యుద్ధం అంటే బాహు మక్కువ చూపేవాడు. నీ కోరిక తనే తీర్చగలడని చెప్పి పంపాడు. 


ఇప్పుడు దుందుభి వాలి దగ్గరకొచ్చి యుద్ధం చేద్దాం రమ్మన్నాడు. ''ఓరీ, నీవో బక్క ప్రాణివి. ఒక్క గుద్దుకు చచ్చేలా ఉన్నావు. నీకు నాతో యుద్ధమేంటి ఫో పొ''మ్మన్నాడు. అబ్బే దుందుభి వినలేదు. అంతట వాలి ''నేనెవరో తెలుసునా? నా బలమేంటో తెలుసుకునే నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావా?'' అని అడిగాడు. ''నువ్వు ఎవరైనా నాకు భయం లేదు యుద్ధం చెయ్యమని రంకెలేశాడు'' దుందుభి. 


నీ మంచి కోసమే చెబుతున్నా, నేనెవరో విను.

''రావణుడు తెలుసునా?''

''ఆయన రాక్షసరాజు, మా నాయకుడు'' 

''రావణుడికి నాతో తగని వైరం, నన్ను గెలవడానికి చేయని ప్రయత్నం లేదు.

ఒక సారి నేను సముద్రతీరంలో ఉదయ సంధ్యవారుస్తుండగా నన్ను గెలవడానికి నన్ను వెనకనుంచి పట్టుకున్నాడు. నేను నా బాహు మూలాల్లో తన చేతులు ఇరికించేటప్పటికి మూర్ఛపోయాడు. నేను తనని అలాగే పట్టుకుని సప్త సముద్రాలలో ములిగి సంధ్య వార్చేటప్పటికి చచ్చిన పురుగులా నా వీపున వేలాడేడు.. అలాగే బాహు మూలల్లో ఇరికించి తీసుకొచ్చి కోట ముందు చేతులు పైకెత్తా. పది తలల పురుగులా కిందపడ్డాడు. చాలా సేపటికి తెలివి తెచ్చుకుని, నా కాలికింద దూరి సంధి చేసుకుపోయాడు” అని చెప్పాడు. ”ఇప్పుడూ ఇంకా యుద్ధం చేయాలని ఉందా నాతో” అనీ అడిగాడు. విన్న దుందుభి పట్టు విడవక ”మా నాయకుణ్ణి గెలిచి ఉండచ్చు, నన్ను గెలవలేదుగా, అంచేత యుద్ధం చేద్దాం” అన్నాడు. సరేనని యుద్ధానికి తయారయ్యారు. వాలి పిడికిటి పోట్లతో రక్తం కక్కుకున్న దుందుభిని కాళ్ళు పట్టుకు విసిరితే  ఋష్యమూక

పర్వతం మీద పడింది దుంధుభి శరీరం. కోపించిన మతంగ మహాముని ఆ శరీరాన్ని విసిరినవాడుగాని, వాని స్థానీయులుగాని ఆ చోటుకి నాలుగు కోశాల దూరంలో అడుగుపెడితే చస్తారని శపించారు. అలా దుందుభి చరిత్ర ముగిసింది.

దుందుభి కొడుకు పేరు మాయావి. ఇతనికి వాలికి మధ్య ఒక స్త్రీగురించిన తగువు. ఒక రోజు వాలి కోట ముందు అల్లరి చేస్తుంటే శిక్షించేందుకు వాలి బయలుదేరాడు. వెనక వాలి తమ్ముడూ నడచాడు. వీరిని చూచి మాయావి పరుగుపెట్టేడు.

పరుగెట్టిన మాయావి  ఒక గుహలో దూరాడు.వాలి తమ్ముని గుహ ముందు కాపుంచి లోపలికి దూరాడు. లోపలి నుంచి అలికిడి లేదు. చాలా కాలం తర్వాత లోపలనుంచి భీకర ధ్వనులు రక్తపుటేరులు రావడం, సుగ్రీవుడు నిగ్రహించుకోలేకపోయాడు, అన్న బలం తెలిసినా. ఒక బండరాతిని గుహకి అడ్డంగా పెట్టి రాజధాని కొచ్చేశాడు. వాలి మాట తెలియలేదు. మంత్రులు రాజు లేకుండా రాజ్యం ఉండకూడదని బలవంత పెట్టి పట్టాభిషేకం చేశారు. కొంత కాలానికి వాలి తిరిగొచ్చి తమ్ముణ్ణి తరిమేసి రాజ్యం ఆక్రమించుకున్నాడు. బలశాలి వాలి, దుందుభిని అతని కొడుకునీ కడతేర్చాడు,రాముని చేతిలో మరణించాడు, రావణునిలాగే.

నదీనాం సాగరో గతిః





24 comments:



  1. ఈ కాలపు దుందుభి వాలి యెవరండీ మరి :)

    ReplyDelete
    Replies
    1. కరోనా ఈ కాలపు దుందుభి. వాలిగా ఎవరు తెరపైకి వస్తారో చూడాలి :).

      Delete

    2. జిలేబి,
      ఇందుగలరందు లేరని
      సందేహమువలదు వీరు సర్వోపగతులు
      ఎందెందు వెదకి చూచిన
      అందందేగలరు దానవి అగ్రణి వింటే!

      Delete
  2. ఔనౌను ఆచార్య.. ఎంతటి పొడువు నది ఐనా.. ఏ శిఖరాల నుండి హిమఝరులై సాగినా.. సివరాఖరున సంద్రపు ఒడి చేరాల్సిందే..

    దుందుభీ అంటే ఏదో బాక వంటిదని విన్నాను.. ఈ పేరు గల రక్కసుడొకడుండేవాడని తెలిసే.. పైగా వాలి చేతిలో గుహలో బండరాయ కథ తెలుసు గాని ఆ అసురుని పేరు ఇదేనని తెలియ రాలేదు..

    దీనినే కావాలనే కయ్యానికి కాలు దువ్వడమంటారు.. అంతేగా వింతేగా.. అసలుకి శబరి మాత ఋష్యశృంగముపై వాలి పేరునే మొదట ప్రస్తావించాలి.. తనకి సైతం తెలుసు అతను మహోన్నత బలశాలని.. ఐతే.. వాలి చేసిన పోరబాటు అల్లా ఒక్కటే తన తమ్ముని భార్యను బంధించి ఏలుకోవటం.. అంచేతనే అంతటి బలశాలికి రాముని చేతిలో దుర్గతి.. అచ్చు దేవసేన భల్లాల దేవ బాహుబలి లా.. ప్చ్ ప్చ్ ప్చ్.. ఆడవారి ఉసురు తగల కూడదని అంటారు పెద్దలు.. బహుశ ఇదేనేమో దానికి నిలువెత్తు తార్కాణం. సీతను అపహరించి రావణ బ్రహ్మ మట్టి కరిచాడు.. ధర్మ పత్ని త్రికరణ శుద్ధిగా అంగీకరించిన మగని వెంట ఉంటేనే తనకి శ్రీరామ రక్ష.

    యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతః

    ReplyDelete
  3. శ్రీధర్,
    వాలి చరిత్ర ఇంకా చాలా ఉన్నట్టే వుందండీ. అ తరవాతేదో చెప్పేరు బాహుబలి వగైరా తెలియరాలేదు. :)

    ReplyDelete
    Replies
    1. అదే ఆచార్య.. బాహుబలి లో కూడా ఆ వాలి లానే భల్లాల దేవ, తన తమ్ముడు అమరేంద్ర బాహుబలి భార్య దేవసేన ను సంకెళ్ళతో బంధి చేస్తాడుగా. అదే చెప్పదలిచాను నేను..

      Delete
    2. ఇది సినిమా గురించా! బాహుబలి సినిమా చూడలేదు, చూడను కూడా, సినిమాలూ చూడ్డం మానేసి నలభై ఏళ్ళపైమాటే, ఏమనుకోవద్దూ!

      Delete
    3. "ఇంకెప్పుడూ సినిమా చూడకూడదు"అని మీకు అనిపించేలా చేసిన ఆ సినిమా ఏమిటో చెప్పండి ప్లీజ్!

      Delete
    4. అయయ్యో శర్మాచార్య.. నేనేమనుకుంటాను.. ఏమీ అనుకోను.. ఏమో ఆ సినిమా చూసుంటారని అనుకున్నానంతే.. పర్లేదుగా.. అందులో కథ కూడా కాస్తో కూస్తో ఈ వాలి సుగ్రీవుల కథ మాదిరిగానే ఉంటుందని చెప్పటానికి ఉదహరించవలసి వచ్చింది అంతే..

      Delete
    5. సూర్యగారు,
      చాలా కాలం కితం మాట కదా గుర్తులేదు :)

      Delete
    6. శ్రీధర్!
      అంటే రామాయణం ముక్కేననమాట :)

      Delete


  4. ఈ కాలపు దుందుభి యౌ
    రా కరొనా యనెడు చీని రాకాసి సుమీ !
    యేకంగా దేశమ్ముల
    మూకుమ్మడిగాను తాకె ముద్దుగుడుచుచున్ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పజ్జం బావుంది :)

      Delete
  5. గురువు గారు
    కధ బాగానే ఉంది కానీ తప్పులో కాలు వేశారు. దుంధుభి ని వాలి అక్కడికక్కడే చంపి వాడి శరీరాన్ని దూరంగా విసురుతాడు. అది మతంగ ముని ఆశ్రమం సమీపంలో పడుతుంది. ఆయన వాలిని శపిస్తాడు. గుహలో దూరే రాక్షసుడి పేరు మాయావి. వాడు దుందుభి కొడుకు. సరి చూసుకుని దిద్దగలరు.

    ReplyDelete
    Replies


    1. DG గారు,
      పొరబడ్డాను.రామాయణం లో ఈ భాగం చూసి టపా సరిచేస్తాను.

      Delete
  6. గురువు గారు
    కధ బాగానే ఉంది కానీ తప్పులో కాలు వేశారు. దుంధుభి ని వాలి అక్కడికక్కడే చంపి వాడి శరీరాన్ని దూరంగా విసురుతాడు. అది మతంగ ముని ఆశ్రమం సమీపంలో పడుతుంది. ఆయన వాలిని శపిస్తాడు. ఈ దుంధుభి శరీరాన్నే రాముడు కాలి బొటనవేలితో ఎత్తి చాలా దూరం పడేలాగ చేసినా సుగ్రీవుడికి నమ్మకం కుదరదు. అప్పుడు ఒక బాణం వేసి ఏడు చెట్లలోంచి దూసుకుపోయేలాగ కొట్టి హమ్మో అనిపించుకుంటాడు. గుహలో రాక్షసుడి పేరు మాయావి. వాడు దుందుభి కొడుకు. సరి చూసుకుని దిద్దగలరు.

    ReplyDelete
    Replies
    1. DGగారు,
      టపా సరిచేశాను, గమనించండి. పొరబాటు సరి చేసినందుకు
      ధన్యవాదాలు.

      Delete
    2. పోస్టులో మీరు చేసిన మార్పు చూసానండి. అయితే మాయావి అనేవాడు దుంధుభి కి తమ్ముడు అని ఒక వెబ్ సైట్ లోనూ, కొడుకు అని మరోచోటా ఉంది. వాల్మీకి రామాయణం లో ఏమి ఉందో నేను చదవలేదు. అందువల్ల కొడుకు అనే నేను అనుకుంటున్నాను - వాలి ఇద్దర్నీ చంపడానికి వ్యవధి ఉంది.

      ఋష్యశృంగం అన్నారు కొంద పేరు. అది ఋష్యమూకం అని గుర్తు. ఋష్యశృంగుడు ముని - ఈయన రామాయణంలో పుత్రకామేష్టి ముందు వస్తాడు కథలో.

      Delete
    3. DG గారు,
      ఋష్యమూకమే కరక్టు, సరి చేశాను. మాయవి దుందుభి కొడుకేనని రామాయణం మాట.

      Delete
  7. బహుకాల దర్శనం, DG గారు. పునఃస్వాగతం.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడే ఉన్నానండి. బ్లాగులన్నీ చదువుతున్నాను కానీ వ్యాఖ్యలు పెట్టడం లేదు. స్వాగతించినందుకు ధన్యవాదాలు. ;-)

      Delete
  8. ఇక్కడ ఏమి రెప్లై రాసినా అది కనిపించడం లేదు. ఎందుకో తెలియదు కానీ ఓ అరగంట పోయాక కనిపించవచ్చు. అందువల్లే రెండు మూడు సార్లు వ్యాఖ్య రాసాను.

    ReplyDelete