వాక్కాయ పప్పు.
వాక్కాయ రేగుకాయకంటే పెద్దదిగా ఉంటుంది,కోలగా ఉంటుంది, ఊదారంగు,ఆకుపచ్చరంగులో కాని ఉంటుంది. ఒక కాయ మీద రెండు రంగులూ ఉండచ్చు. ఇది బహు పుల్లగా ఉంటుంది. కొస్తే గింజలుంటాయి, వాటిని తీసేసి నీటిలో ఉడకబెట్టి, తగిన ఉప్పేసి, చిటికెడు పసుపేసి, ఉడికిన పప్పులో కలిపేస్తే, తగిన పోపు పెట్టుకుంటే ఇంగువ వేసుకుని, మామిడి కాయ పప్పు కి సరిసమానం అనిపిస్తుంది.
ఈ కాయను ముక్కలుగా తరిగి ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు.
ఈ కాయ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు దొరుకుతుంది. ఈ కాయ అంటే ఎక్కువ మందికి భయం, దగ్గు వస్తుందని. ఈ కాయ కోసినపుడు తెల్లగా పాలు వస్తాయి. ఆ పాలలో దగ్గును కలగజేసే గుణం ఉందంటారు, తెలిసినవారు. ఇంత చెబుతున్న ఈ వాక్కాయలో ఉన్నదేమిటి?
ఐరన్
విటమిన్ సి
విటమిన్ ఎ
మెగ్నీసియం
పొటాసియం.
శరీరానికి కావలసిన వన్నీ ఇందులో ఉన్నాయి, ముఖ్యంగా ఐరన్. ఇది ఇనపగని. మా దగ్గర ఒక ఊరుంది వాకతిప్ప దాని పేరు, బహుశః వాక తుప్పలతో ఆ వూరికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఇది పల్లెటూరివారి ఆహారం :) పిజ్జాలు, బర్గర్లు తినేవారికి వీటి గురించి ఏం తెలుస్తుంది? సహజంగా శరీరానికి కావలసిన పోషకాలను రుచికరమైన ఆహారం లా ఉన్నవాటిని తినడం మానేసామా? ఎమో! కాలమే చెప్పాలి.
ReplyDeleteయాక్ :) వాక్కాయ తింటారా ! యాక్ యాక్ :)
వాక్కాయ పిజ్జా లో వేస్తే బాగుంటుందండి.
Deleteజిలేబి
Deleteతల్లితల్లి! వాక్కాయలు తినద్దూ! వీటినైనా మా లాటి బక్క ప్రాణులకొదిలైతల్లీ :)
బోనగిరిగారు,
Deleteవాక్కాయ జామ్ లు చేసి అమ్మేస్తున్నారు
పిజ్జాలకు టాపింగ్ (topping) గాను, బర్గర్లలో స్టఫింగ్ (stuffing) గానూ వాక్కాయ ముక్కలను వేయిద్దామండీ, శర్మ గారు. ఒకసారి తిన్నారంటే “యాక్” అనడం మానేస్తారు 😁😁.
ReplyDelete
Deleteఈ మాత్రం చెప్పడానికి ఏ షెఫ్ వద్దకు వెళ్లి అడగాలి? :)
సంజయ్ తుమ్మా గారు ఇటువంటి వెరైటి వంటలను అలవోకగా తయారు చేస్తారు. నా వాక్కాయ మసాల కూర బాగుంది. వంటలో శ్రీమంతులవ్వండి.. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి అంటారు. బిజిలే అమ్మణ్
Deleteవిన్నకోటవారు,
Deleteవాక్కాయలు పండితే తియ్యగా పుల్లగా బాగుంటాయి, వీటిని కోసి గింజలు తీసిపారేసి పంచదార పాకంపట్టి, తేనెలో వేసి అమ్మేస్తున్నారండి, మార్కెట్లో దొరుకుతున్నాయి.
జిలేబి,
Deleteఈ మాత్రం చెప్పడానికి ఏ షెఫ్ వద్దకు వెళ్లి అడగాలి? :)
మన్ కీయింగ్ :)
ఈ వాక్కాయ (వ్యాక్కాయ) ను కలిమ్ కాయ గాను, క్రేన్ బెర్రి గాను అంటారు. ఐతే అందరికి ఇది నచ్చకపోవచ్చు. రుచి పచ్చి టమోటాకి ఎక్కువ మామిడికాయకి తక్కువగాను ఉంటుంది. జరా సంభల్కే ఖానా పడేగా.. ఎందుకంటే చేదు, వగరు, పులుపు కలగలపి ఉంటుంది.. జిగటగా ఉండే దీని శ్యాప్ మూలాన దగ్గు వచ్చే సంభావన ఉండనే ఉంది.. నిలవ పచ్చడి సైతం కొంద మంతి పెట్టుకుంటారు.
ReplyDeleteశ్రీధరా!
ReplyDeleteదేన్ని ఏ టైమ్ లో ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటే బాగుంటుంది కదూ. కటిక్కాయలు బాగుంటాయా? దోరగా ముగ్గితే,పలకమారితే, పండితే....అదనమాట సం గతి.ఇక అమ్మణ్ణి ఆడింది ఆట, పాడింది పాట, చేసింది వంట. :)
Deleteఅమ్మణ్ణీ ఆడినదే
సుమ్మీ ఆటా! జిలేబి చుట్టినదే ఓ
లమ్మో పాటా! శ్రీధర!
కమ్మని దమ్మణ్ణి చేతి గరిటని వంటా :)
జిలేబి
ఆచార్య.. మీరడిగిన కటిక్కాయ అంటే తమిళులు కడుక్కై అని పిలిచే కాయలే కదూ. అవైతే నాకు తెలిసినంతలో మా నాయనమ్మ గారు అవి ఎండినాక దాని గింజను వేరు చేసి తక్కిన దానిని రుబ్బి కడుపు నెప్పి ఉపశమనానికై వాడేవారు. మా మాతృక లో దానిని హింగోరా అంటారు. ఆ కడుక్కై లేక హింగోరా నే తెలుగు లో కరక్కాయ అంటారు మరీ. నాకు తెలిసిన మరొక చిన్న కాయ ఉంది శర్మాచార్య.. వాటిని మేము రీంగ్‌ణీ అంటాము. చిన్నపాటి ముళ్ళ పొద, ఆకులపై కూడా చిన్న ముళ్ళు ఉంటాయి, తెల్ల లేద మసుము రంగు పువులు కాసి, చిన్న కాయలు కాస్తాయ్. అవి పండినాక తెంపి పచ్చడి చేసుకుని జొన్న రొట్టెలతో తింటే కడుపు నెప్పి అజీర్తి/ కొద్దిపాటి శ్వాస కు సంబంధించిన రుగ్మతలకు మందుగా ఉపయోగిస్తారు కూడా. హిందిలో కాంటాకరి అంటారుట. సోలానం సురాతెన్స్ అని సైంటిఫిక్ నేమ్ గల ముళ్ళ పొద అది. నల్లేరు గురించి అందరికి తెలిసిందే.
Deleteజిలేబి,
Deleteపద్యం బాగుందిగాని అయ్యరు గారికి చూపరాదా :)
శ్రీధరా!
Deleteకటిక్కాయ అంటే పచ్చి కాయ, పూపి అని అర్ధం. కటిక్కాయకి కరక్కాయ అని కూడా అర్ధం ఉన్నాదేమో తెలీదు. ఆయుర్వేదంలో ఉసిరికాయ,తానికాయ,కరక్కాయ మూటినీ త్రిఫలాలంటారు.మీరు చెప్పిన కాయను పోల్చుకోలేకపోయా, లింక్ ఉంటే ఇవ్వగలరు
శ్రీధరా!
Deleteఅమ్మణ్ణి గరిట తిరగేసిన బాపతేకాని గరిట తిప్పిన బాపతు కాదు.
మీరు చెప్పినది వెతికితే నాకు దొరికినదానిని రక్కీస,బల్ రక్కసి, వాకుడు అంటారు. ఆకులపైన కాయలపైన ముళ్ళుంటాయి. కంటి జబ్బులకు మందుగా వాడేవారు. ఇది మొక్క. గోదావరీ లంకలలో విస్తారంగా కనపడుతుండేది. కాయ పండితే పసుపు పచ్చగా ఉంటుంది. ఎండి విచ్చితే ఆవాలకంటే సన్నని గింజలుంటాయి. కాయలు పచ్చడి చేయడం ఎరగను.
శర్మాచార్య.. లింక్ ఇదుగోండి.. మీరు చెప్పినదిదేమో పోల్చుకోండి. రీంగ్‌ణీ సోలానం జాంతోకార్పం
Deleteశ్రీధర్
Deleteమీరు చెప్పినదే కరక్టు. నేను చెప్పినది వేరు. అది కూడా ఈ కుటుంబంలోదే. మీరు చెప్పినకాయలు వంకాయల్లా ఉంటాయి, కిరీటం మీద ముళ్ళుంటాయి.వీటికేం పేరుందో చెప్పలేనండి
వీటిని మాప్రాంతంలో ముళ్ళొంకాయలంటారు .
Deleteకూరకు పనికిరావు . వైద్యం కోసం వాడుతారు .
వాక్కాయలను మేము వానకలేకాయలంటాము .
ఈ సీజన్లో వస్తున్నవి .
Deleteరాజావారు,
ఈ రకం కాయలు పసుపుపచ్చగా ఉంటాయి, ముళ్ళూ ఉంటాయి, కాయ చిన్నగా ఉండి మడుల్లో ఉపయోగిస్తారు. మరోమాట మాదగ్గర కేజికి ఒక కాయ తూగేరకం వయాక్య దొరుకుతుంది. దీనికీ ముళ్ళుంటాయి. కూర, పచ్చడికి బలే ఉంటుందండి. దీనిని జేగురుపాడు వంకాయ అంటాం.
// “ అమ్మణ్ణి ఆడింది ఆట, పాడింది పాట, చేసింది వంట. :) ” //
ReplyDeleteమొదటి రెండు కరక్టే గానీ ఆ మూడో పని చేస్తున్న దాఖలాలు లేవనుకుంటాను, శర్మ గారు 😁 ?
విన్నకోటవారు,
ReplyDeleteనిజమేనండి. దాఖలాలుండవు, పోలీస్ దెబ్బల ట్రైనింగ్ కదా
// “ పద్యం బాగుందిగాని అయ్యరు గారికి చూపరాదా :) “ //
ReplyDeleteఅయ్యరు గారు వంటింట్లో బిజీగా ఉన్నారేమో, శర్మ గారు ? 🙂
విన్నకోటవారు,
Deleteకిచెన్ లోకి పట్టుకెళ్ళి పద్యం చూపిస్తే పీక నొక్కుతారేమోనని భయపడుతున్నట్టుంది అమ్మణ్ణీ :)
అమ్మణ్ణీ ఎప్పుడూ గరిట తిరగేసిన బాపతే కాని గరిట తిప్పిన బాపతు కాదు కదండీ! కిచెన్ అయ్యరు గారి పేరడైజ్ :)
చూపించండీ అయ్యరు
మీ పీకను నొక్కగాను మించారెడు వం
టా పైన చేర్చు తంటా
సాపాటుకు గంటుపడగ చక్కబడు సుమీ :)
🙂🙂
Deleteశ్రీధరా,
Delete// “ మా మాతృక లో దానిని హింగోరా అంటారు” //
మీరు తరచుగా మీ భాషలోని పదాలను బ్లాగుల్లో మీ కామెంట్లలో వాడుతుంటారు. కుతూహలం కొలదీ అడుగుతున్నాను, మీ “మాతృక” పేరేమిటి, శ్రీధరా? ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుకలో ఉంది?
Deleteజింగిలిమింగిలి :)
వియన్నారాచార్య.. ఈ మా మాతృక కు లిపి గాని పేరు గాని లేదు. ఇది మౌఖికం మాత్రమే. పీడీలు పీడిలు ఈ మాతృక ను మౌఖికంగానే మరో తరం వారికి అందజేస్తు వచ్చారు.. అందజేస్తున్నారు.. అందజేస్తారు.. అనట్టు బిజిలే అమ్మణ్ గారు అనట్టుగానే ఈ మౌఖిక మాతృకలో దాదాపుగా దక్షిణ భారతం లో గల పదాలు కొన్ని కలగాపులగమై ఉంటాయి.. అంచేతనే అపుడపుడు చిత్రవిచిత్ర వ్యాఖ్యలు ఉంటూ ఉంటాయి.. అలానే నా బ్లాగ్ లో కొన్ని మా మాతృక లో ఉంటాయి.. మచుక్కి ఇందులో హింది, సంస్కృతం, గుజరాతి, మరాఠి, ఉడియా, కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల పదాలుంటాయి.. ఎలా అంటే ఇంగ్లీషు వారు వారి పదాలలో కొన్ని ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, లాటిన్, గ్రీక్ వాడుతారు కదూ.. అలానే.. ఐతే సాంప్రదాయంగా మా మాతృక భారతావని న ఉద్భవించిన మౌఖిక భాష.. పరదేశం నుండి దిగుమతి చేసింది కాదు.. ఉదాహరణకు మరాఠి లో ఔననే దానిని హోయి అంటారు.. మేము హావ అంటాము.. సంస్కృతం లో అత్ర అంటే ఇక్కడ, కుత్ర అంటే ఎక్కడ.. మా మాతృక లో అత్త అంటే ఇక్కడ, కత్త అంటే ఎక్కడ.. మరి అత్త అంటే ఇక్కడ అంటున్నారు.. మేనత్త ను ఏమంటారని అడగచ్చు.. పూపి అంటాము.. ఇది హింది నుండి వచ్చిన పదం. అనట్టు ఈ బాహుబలి కిలికి భాష లాంటిదా అని అడిగితే "నిమ్ డా హర్త బుస్కా దూస్రాస్ టెల్మీ మోహేను సుకు.. లోకువే" అది మదన్ కార్కి గారికి తెలుసునట మరి..
Deleteశ్రీధరా,
Delete(1). // “ పీడీలు పీడిలు ..” // అనగానేమి?
(2). // “ఈ మా మాతృక కు లిపి గాని పేరు గాని లేదు.” // లిపి లేక పోవచ్చు గానీ పేరు లేకుండా ఎలా ఉంటుంది, శ్రీధరా, ఎంత dialect మాత్రమే అయినప్పటికీ?
(3). అలాగే, ఏ ప్రాంతంలో ఎక్కువగా వాడుకలో ఉంది అంటూ నేను వెలిబుచ్చిన మరొక సందేహాన్ని మీరు తీర్చలేదు.
(4). పైన ఆఖరులో మీరన్న ఆ “మదన్ కార్కి” గారెవరు?
(5). అలనాడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు “సవర” భాషకు లిపి, నిఘంటువు తయారు చేశారు గదా. అలాగే మీ భాషకూ అటువంటి సేవ చెయ్యడానికి ఎవరో ఒక మహానుభావుడు అవతరిస్తాడు అని ఆశిద్దాం. అసలు మీరే ఆ పనికి ఎందుకు పూనుకోకూడదు? ఇతరులైతే ముందు మీ భాషను నేర్చుకుని ఆ తర్వాతే రిసెర్చ్ పనికి దిగాలి కదా? ఆలోచించండి 👍.
Deleteపీడీ - पीडियां :)
వియన్నార్ ఆచార్య:
Delete౧. బిజిలే అమ్మణ్ గారు తెలిపినట్లు పీడి అంటే జనరేషన్/తరం.. పిడి గుద్దు అనుకునేరు.
౨. నాకు తెలిసినంతలో ఈ మా మాతృక కు నామధేయమనేది లేదనే అనుకుంటా.. ఉండి ఉంటే మా ఈ మాతృక ను పలికే వారు తెలిపే వారుగా.. ఇది ఫూల్ భాష ఐతే కాదు.. మౌఖికం.. అందులో ఒక ప్రాంతం వారు విరివిగా పలికేది.
౩. నేను పుట్టింది అన్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ (ఇపుడు తెలంగాణ) లోని ఓరుగల్లు (వన్ స్టోన్ సిటి.. రుద్రమదేవి) పెరిగింది వైజాగాపటం (విశాఖపట్నం), ఉంటోంది (గత నెల రోజులుగా) హైదరబాద్ నుండి నార్తీస్ట్ నూట ఎనభై కీ.మీ. లోగల మా సొంత ఇంట్లో. అడపాదడపా తిరిగింది గుంటూరు, విజయవాడ, ఆదిలాబాద్, ఉట్నూరు,జైనాథ్, బాసరా, హయత్ నగర్, బాచారం, వెస్ట్ మారెడ్ పల్లి, ఏయస్ రావు నగర్, కాప్రా, మౌలాలి, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కోకనాడ, తిరుపతి, షొళింగనళూర్, పోనమలే హైవే, టీ. నగర్, మైసూరు, బెంగళూరు, పోర్ట్ బ్లేయిర్, కోలకాత, భూవనేశ్వర్, పూరి, ముంబై. అంచేత మా మాతృక దక్షాణి భారతావని పై ఎక్కువగా పలుకుతారని తెలిసే.
౪. బాహుబలి మూవి కోసమని కాలకేయ పాత్ర కోసం విభిన్నమైన భాషను కనుగోనమని కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి గారు తమిళ డైలాగ్ కమ్ లిరిక్ రైటర్ గారిని అడిగారట.. అతడు ఈ కిలికి భాషను తయారు చేసి వ్యాకరణమును సైతం కనుగొనినారని వినికిడి.. అతనే మదన్ కార్కి.
౫. లిపి లేని భాష.. కాని వ్యాకరణ శుద్ధిగా మెమోరిలో పెట్టుకుని ఉచ్ఛారణ తప్పిదం లేకుండా పలకగలిగే వారమే కాని.. అంటారు కదా కొందరు ఆ పాత మూవియే బాగుండేది.. రీమేక్ చేసి లేదా డబ్బింగ్ చెప్పి అసలుకే ఎసరు పెట్టెశారని..ఈ భాష కోసం లిపిను కనిబెట్టే వారు బహుశ భావి తరాల కే చెల్లుబాటౌనో ఏమో.. బహుశ అందుకేనేమో నేను డబ్బింగ్ సినిమాలు చూడను.. "శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పించు గాడ్జిల్లా" కు బదులుగా నేను స్ట్రేయిట్ ఆ ఇంగ్లీషు మూవినే చూస్తా.. ఎందుకో తెలుసా మీకు.. మచుక్కి ఈ యూ టర్న్ పాట ను తెలుగులో మీరు వినే ఉంటారు యూట్యూబ్ లో.. ఇదే పాటను తమిళ్ వర్షన్ పెట్టి అపుడు సబ్-టైటిల్ తెలుగు పెట్టి చూడండి.. డబ్ తెలుగు వర్షన్ లో పాటకు, తమిళ్ పాట కు తెలుగు క్లోజ్ క్యాప్షన్ కు గల వ్యత్యస మీకే తెలుస్తుంది.
யு- டர்ந் கர்மா
యూ-టర్న్ కర్మ
అంచేతనే దేని ఒరిజినాలిటి దానికే..! ఏమంటారు శర్మాచార్య, బిజిలే అమ్మణ్, వియన్నారాచార్య.. ఇదుదా సరిదానా ఇల్లేయా..?
తామెల్లరికి దసర శుభాభినందనలు.
రీసర్చ్ జేయనికి మా భాషల ఏమున్నది, గిపడ్ సంది గీ భాషను పల్కి పల్కి రిసెర్చి మీద రీసర్చ్ జేసిండ్రు మా పూర్వికుల్.. మస్తుగా పలుకుతం.. భావం తెల్వదా ఎంది.. దెల్వకుంటే మరీ మంచిది.. అట్లని తిడతుండో లేదు ఎట్ల తెలుస్తద్.. జెప్పు బిడ్డ అంటిరా.. ఏమో మరి నాకైతే అంత ఘనం తెల్వది.
Deleteరీసర్చ్ చేయటానికి ఈ భాషలో ఏముంది, ఇప్పటి వరకు ఈ భాషను పలికి పలికి రీసర్చ్ మీద రీసర్చ్ చేశారు మా పూర్వికులు.. బాగా పలుకుతాం.. భావం తెలియనిదా ఏమిటి.. తెలియక పోతే మరీ మంచిది.. అలా అని తిడుతున్నారో లేదో ఎలా తెలిసేది మరీ.. చెప్పు అంటారా.. ఏమో మరీ నాకైతే అంత బాగా తెలియదు.
రీసర్చ్ కరేన ఈ భాష మా కాఁయి ఛ. అబ్బేతాణి ఈ భాషన బోల్ బోలనజ్ రీసర్చ్ ఏపర రీసర్చ్ కర్నాకే హమార్ పేనార్ బూడిబుడా.. యాన్ బోలాఁచా.. భావం మాలం వేరోకోనిక కాఁయి.. మాలమ్ నవతో అజ్జి ఆచోజ్.. హను కేన్ భాండరేవతో కూఁ పచ.. కేనిర ఛ్వారా.. కో మన లపణ్ అత్రా జాపా మాలమ్ ఛేని.
రీసర్చ్ కర్నే లాయక్ ఇస్ భాష మేఁ క్యా ఖాసియత్ హై. హమారే పూర్వజోఁ సే లేకర్ ఆజ్ తక్ ఇస్ భాష కో మౌఖిక్ తౌర్ పర్ బోల్ కర్ రీసర్చ్ పర్ రీసర్చ్ హో గయా హై, సాఫ్ బోలా కర్తేఁ హైఁ, తాత్పర్య పతా చలా నహి.. తో కోయి బాత్ నహి.. మగర్ యది కోయి కిసికో డాఁట్ రహా హోగాతో తభీ క్యా.. బతాదో చలో.. యది ఆప్ ఐసే కహేఁగే తో సిర్ఫ్ మైఁ ఇత్నా హి కహ్ పావుంగా కి ముఝే తో ఇత్నా జ్యాదా పతా నహి..
// “ రీసర్చ్ జేయనికి మా భాషల ఏమున్నది, ” //
Deleteశ్రీధరా,
లిపి లేని భాష అని మీరే అన్నారు కదా. ఎవరైనా లిపి తయారు చెయ్యకపోతారా అని నేనన్నాను. మరి లిపి, నిఘంటువు తయారు చెయ్యాలంటే మీరు వాడే పదాలు, పదగుంఫనాలు, ధ్వని వగైరాల గురించి పరిశోధించాలి కదా? ఆ పరిశోధననే ఆంగ్లంలో రిసెర్చి అన్నాను. పోనీ స్టడీ (study) అనుకోండి.
“ రీసర్చ్ జేయనికి .. ఏమున్నది” అంటే ఇదే ఉన్నది బ్రాడ్ (broad) గా చెప్పాలంటే. భాషా పరిశోధనకు సంబంధించిన విషయం అది. సరియా?
సరదాగా వ్రాశాను, వియన్నారాచార్య.. డోంట్ టేక్ ఇట్ టు దీ హర్ట్.. బట్ యస్ ఇట్ ఇజ్ ట్రూ దట్ దిస్ డియాలెక్ట్ రియల్లి డజెంట్ హావ్ ఏ ప్రీడిఫైన్డ్ స్క్రిప్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్.. వీ యుసువల్లి యూజ్ దీ ప్రివలెంట్ డామిసిల్ ల్యాంగువేజ్ స్క్రిప్ట్ టూ కన్వే ది సేమ్. మరోలా అనుకోవద్దని మనవి..! ఏదైనా తప్పుగా అనిపిస్తే మణ్ణికుణుం.
Deleteఫరవాయిల్ల ✋.
Delete
Deleteజింగిలి మింగిలి భాషం
డంగట లేదండి స్క్రిప్టు దానికి డాండాం !
చెంగున దొరికిన దాంట్లో
టంగున వ్రాస్తాము మేము టకటక వినరా !
జింగిలి మింగిలి
జిలేబి :)
శ్రీధరా!
Deleteమీ భాష మీ ఇష్టం కాని ఒకమాట.
ఏ భాషకైనా జనపదం ఉంటుంది. అందులోనూ లోరీ (లాలిపాట) లేని భాష ఉండదు. మీ భాషలోని ఒక అందమైన లాలిపాటని ఇక్కడ రాయండి, అర్ధంతో. మీ అరవైకేజిలబంగారాన్నడిగినా చెప్పచ్చు, అమ్మ, మామ్మలనడిగినా చెబుతారు. అమ్మమ్మ ఐతే తప్పక చెబుతారు. తప్పించుకోకండీ :)