Thursday, 8 October 2020

ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.

 

కరోనా లాక్ డవున్ మొదటిసారి ప్రకటించేనాటికి, కితం సంవత్సరం రెండో పంట మాసూలుకి రెడీగా ఉంది. విదేశాలనుంచి దిగుమతి ఐన రోగం కనక మహాపట్టణాలలోనే కాలు మోపింది. అందుచేత లాక్డవున్ ప్రభావం పెద్దగా లేక రెండవపంట మాసూలైపోయింది, చక్కగా, పల్లెలలో. ఆ తరవాత ఏప్రిల్ చివరరోజులు మే ఎండల రోజులు గడచిపోయాయి, పల్లెలలకు కరోనా పెద్దగా సోకలేదు. జూన్ వచ్చేటప్పటికి పల్లెలలకి కరోనా  బాగానే అంటుకుంది. జూన్ రెండో వారం వర్షాలు మొదలయ్యాయి, గోదావరొచ్చింది.ఉన్న కొద్దిపాటి కూలీల తోనే,కరోనా తో సహవాసం చేస్తూ, దమ్ము చేసి విత్తనాలు జల్లేసేరు, వరసలలో ఊడ్చడం మానేసి. ఆ తరవాత చెత్తకోత, పిండి వెయ్యడం జరిగిపోయాయి, నెమ్మదిగా. చేలుబాగానే ఎదిగాయి, చీడ పీడలు లేక. కరోన చుట్టు ముట్టి బాధ పెడుతున్నా పల్లెలు జంకలేదు,నిజానికి వ్యాధి నిరోధక శక్తి పల్లెవాసులలోనే ఎక్కువ ఉంది. మరణాలు లేవనను కాని బహుతక్కువ.నిజానికి పల్లెవాసులే కరోనా ని జయించారు.  జూన్ మధ్యనుంచి నేటిదాకా వర్షం రోజూ పడుతూనే ఉంది. రోజు వర్షం పడటం మంచిదే.


మరో వారంలో పొట్ట తగులుతుంది. మరో వారం పైగా చేను ఈనుతుంది. ఈనితే కంకి/వెన్ను బయటికొస్తుంది. ఇక ఇప్పుడు వర్షం కనకపడితే పువ్వారం రాలిపోయి తప్పలు మిగులుతాయి.వర్షం కనక లేకపోతే తప్పలలోకి నెమ్మదిగా పాలు చేరతాయి. ఇలా తప్పలలో పాలు చేరడాన్నే చేను పాలుపోసుకోవడం అంటారు. ఇలా చేరిన పాలుతోడుకుంటాయి.  అలా తోడుకున్న పాలు బియ్యపు గింజ అవుతుంది. ఇలా పండిన చేను చూడడానికి ధనలక్ష్మి నేలపై పరచుకున్నట్టు ఉంటుంది. లక్షాధికారైన లవణమన్నమెకాని మెరుగు బంగారంబు మ్రింగబోడన్నట్టు, ఎవరైకైనా కావలసినవి ఆ పిడికెడు మెతుకులే! చివరికి కొడుకు/కోడలు పెట్టేవి కూడా మూడు ముద్దలే!


ఇంతకాలమూ చేలో మొక్క మొదట్లో నీరుండాలి, వర్షం పడకూడదు. వర్షం పడితే తప్ప, తాలు మిగులుతాయి.పండిన చేను మాసూలు చెయ్యడం ఆలస్యమైతే కొణిగిపోతుంది. రెల్ల రాలిపోతుంది.  కోతకి వారం ముందు, మిగులు,పెసలు,అలసందలు,జనుము,అవిశ ఇలా ఏదో ఒకటి జల్లుతాం నీరు, పూర్తిగా తీసేసి. నేలకి పైన ఒకడుగుదాకా మోడు ఉండేలా కోస్తాం.కోసిన వరిని పనలుగా మోళ్ళమీద వేస్తాం, మడమ పచ్చి ఉండేలా. మూడు రోజులు ఎండనిస్తాం.

 కట్టేస్తాం, కుప్పేస్తాం. ఎందుకిదంతా తిన్నగా మాసూలు చేసుకోవచ్చుగా? దశలవారీగా ఎండ తగలనివ్వడమనమాట. ఆ తరవాత కుప్ప నూరుస్తాం. ఒక్కొకప్పుడు అర్జంటు అవుతుంది,వాతావరణం సరిలేక. అప్పుడు కొద్ది పొడి చోటు చూసి ఒక బల్ల వేస్తాం. కోసేవాళ్ళు కోస్తుంటారు, పనలు తెచ్చేలాళ్ళు తెస్తుంటారు. బల్ల కొట్టేవాళ్ళు కొడుతుంటారు. ధాన్యం పోగు చేసేస్తాం. ఇలా చేస్తే పచ్చి ఉంటుంది, పనలని కొంత ధాన్యమూ ఉండిపోతుంది.  

వర్షం ఆగి పంట పండి ఒబ్బిడయ్యేనా?ప్రపంచం మొత్తం మీదే ఆహారానికి కొరత వచ్చేలా ఉంది. పండిన పంట దాచుకోవాలని చూస్తున్నాడు నేడు జరిగిన రైతు.కరువొచ్చేలా ఉందని కంగారు పడుతున్నాడు. కాని దాచుకోడమెలా? కొన్ని పద్ధతులు చెప్పా! మరో సారి మరో టపాలో! 





52 comments:

  1. చాలా విరామం తరువాత వ్రాశారు, వెల్కం బ్యాక్. ఆరోగ్యం సవ్యంగా ఉందని ఆశిస్తాను.

    కాస్త అగ్రి భాషలో వ్రాశారు గానీ టపా ఆసక్తికరంగా ఉంది.

    “పల్లెలకు కరోనా పెద్దగా సోకలేదు” అని ఒక్క మాటలో ముగించేస్తే ఎలా సార్? ఎందుకు సోకలేదో ఒకటి రెండు వివరాలు చెబితే బాగుంటుంది కదా? (సరే, తరువాత “బాగానే అంటుకుంది” అన్నది వేరే సంగతి. అసలు మొదట్లో వల్లెలు ఎలా తప్పించుకున్నాయి అన్నది కుతూహలం కలిగిస్తున్న అంశం).

    “చివరికి కొడుకు / కోడలు పెట్టేవి కూడా మూడు ముద్దలే” ఆహా. జీవితసత్యం చెప్పారండి శర్మ గారూ.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      కరోనా విదేశాలనుంచి ఎగిరొచ్చింది. అది మహాపట్టణాలకే వచ్చింది, పల్లెలలకి కాదుగా! ఆ తర్వాత నెమ్మదిగా నడచి పల్లెలకొచ్చేటప్పటికి టైం పట్టిందండి.

      మట్టి మనుషులం కదండీ అందుకు భాష అందులోకి చేరిపోయిందండి, అటుపక్కకి చేరుతున్నాం కదా.

      జీవిత సత్యం అంతేనండి, చివరికొచ్చేటప్పటికి మూడు ముద్దలేనండి, ఎంతటివరైనా అంతే :)

      Delete
  2. కళ్లకు కట్టినట్లు వివరించారు సర్. పనలు, టపాలు, మాసూలు అనే పదాలు మొదటి సారి తెలిశాయి. రైతు పంట పండించడం, మాతృమూర్తి నవమాసాలు మోసి బిడ్డకు జన్మ నివ్వడం వంటి అద్భుత కార్యం అనిపించింది🙏🙏

    ReplyDelete
    Replies
    1. బుచికి గారు,

      ఈ మధ్య పల్లెల కేసి చూపు ఎక్కువ సారించడం జరిగిందండి. అందుకన్నీ పల్లె మాటలే వచ్చేసాయి. కొన్ని అర్ధం కావేమో అనుకున్నా కూడా.తల్లి బిడ్డని ప్రసవించడం ఎంతో రైతు పంట పండించడమూ అంతేనండి.

      Delete


  3. ఆ ! ఏంవాయ్! ఎంత కిలో?

    నలభై మేడమ్

    ముప్పై కిస్తావా ?



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి,

      కివ్వను.

      ఏభై చేసుకోండి.

      Delete


    2. ఆశ దోసె అప్పడం‌ వడ!

      గోధుమ పిండి కిలో ముప్పై‌ దాని కన్నా గొప్పా మీ పిండి కాని బియ్యము ? కుదరదు. ఇరవై అంతే .


      జిలేబి

      Delete
    3. ఏం వాయ్! కిలో ఎంత?

      నభై మేడం.

      ముఫై కివ్వవా?

      కివ్వను.

      ఏభై చేసుకోండి.

      అన్యాయం!

      ఈ పాలికి ఏభై చేసుకోండి. మల్లీ పాలికి అరవై తగ్గదు మేడం.

      కంప్లైంటిస్తా!

      మేడమ్! ఓ చిన్నూసు ఇనండీ! నీ లాటమ్మని కొడతానన్నాడంట ఓ చేతకాని మొగుడు. దానికావిడ.

      ”కాపూ,కరణం నావాడైతే ఎట్లా కొడతావు కొట్రా మగడా” అందంట.

      ఎంత దారుణం, ఎంత దారుణం.

      Delete
    4. ఏదో కొట్టిన పిండి.. ఈ పాలికిలా సర్దుకు పోదురు బిజిలే అమ్మణ్.. ఈ కోవిడ్ పరిస్థితుల నడుమ ఏ నిత్యవసర వస్తువైనా వందకి కిందికి దిగమంటున్నాయి.. స్థితి గతుల ప్రభావం.. బ్రేక్ ఈవెన్ పాయింట్.. డిమాండ్ సప్లై కర్వ్.. పీటర్ డ్రక్కర్.. ఏదో ఒకటి దక్కాలంటే మరోకటి కోల్పోక తప్పని పరిస్థితుల నడుమన యావత్ ప్రపంచం.. హ్మ్..
      పూరణం వరకే అర్దమయ్యింది శర్మ గారు.. ఆ లైన్ అర్దం విపులంగ విడుపున్నపుడు చెబుదురు. శుభరాత్రి శర్మ గారు. సిహి కనసుగళు బిజిలే అమ్మణ్

      Delete
    5. @ధరణి
      మీరేమో ఇట్లా అంటున్నారు. రిజర్వ్ బ్యాంకు వారేమో "అబ్బే! తిండిగింజలు అద్భుతంగా పండాయి. నాలుగో త్రైమాసికానికి ధరలు సన్నబడతాయి, అప్పుడు వడ్డీ రేట్ల నడ్డి విరగ్గొట్టేస్తాం" అంటున్నారు. ఈలెక్కన విత్తం విలువ తరిగిపోకుండా ఏ బంగారమో కొనుక్కుందామంటే "పరిమితికి మించి ఉంటే ఒప్పుకోమ్" అంటోంది ప్రభుత్వం.
      ఇవన్నీ చూసి కసితీరా తిట్టుకుందామని ఉన్నా సైబర్ క్రైమ్ వాళ్ళు మాకు ఆ చాన్స్ కూడా ఇచ్చేలా లేరు☺️☺️

      Delete
    6. సూర్య గారు.. దీనినే డోలు మద్దెల దరువు అంటారేమో.. అటు ఏది పెరిగినా (బంగారం, చమురు, నిత్యవసర సరుకుల ధరలు) లేదా ఏది తగ్గినా (స్టోరేజ్ కెపాసిటి, పర్ క్యాపిటా ఇన్‌కం, రెవెన్యు) జన సామాన్యానికే హడల్..! సైబర్ క్షేత్రానా బహుపరాక్, అవాక్కు చవాక్కుల కు టైప్ పారేసుకుంటే (నోరు పారేసుకుంటే కి డిజిటైజ్డ్ వెర్షన్) ఇహ అంతే దుర్గతుల్.. హా..! హ్మ్..!! ప్చ్ కూడా..

      Delete
    7. బంగారం ఎంతేనా కొనుక్కోవచ్చండి. కడ్డీల లా ఉండకూడదు. ఆభరణాలలా ఎంతేని ఉండచ్చు. కొన్న సొమ్ము ఎలా వచ్చింది లఎక్కలు మాత్రం కావాలి. బంగారం లో పెట్టుబడి మంచిదే. లాభం తక్కువుంటుంది. మోతాదుకి మించి ఉండడమూ మంచిది కాదు. Electronic gold funds ఎంతేనా ఉండచ్చు.

      Delete
    8. ఒకింత ఇది నిజమే శర్మ గారు. ఒకప్ఫుడు బంగారాన్ని పైకమున్నప్పుడల్ల ఆభరణాల రూపం లో ఎంతైన కొనచ్చనేది ఉండింది. కాపోతే ఈ ౨౦౧౬ ఉంది చూశారు.. అటు పిమ్మట సీబీడీటీ అనగ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ వారి సౌజన్యం మూలానా ఆర్ బీ ఐ అధ్వార్యం లో కొన్ని నియమ నిబంధనల మేరకు అనగ పెళ్ళైన పడతి దగ్గర ఆభరణాల రూపేణ అరకేజి పుత్తడి వరకు, మరియు పెళ్ళి కాని పడుచు దగ్గర పావు కేజి పుత్తడి వరకు, పెళ్ళైనా కాకపోయిన మగని వద్ద వంద గ్రాముల వరకు ఎటువంటి కరములు వర్తించవు. ఈ పరిమితి దాటితే వాటికి ఋజువు లేనిచో ఆయా ఆభరణాలను జప్తు చేస్తారని లోకోక్తి. పైగా ఆ మధ్యనే ట్రాంచ్ రూపేణ గోల్డ్ సావేరిన్ బాండ్లు డీమ్యాట్ లంటు తెచ్చారు.. మీరు పేర్కున్నట్టు. ఏదైనా ఈ బాండ్స్ వలన ప్రభుత్వ ఖజానా కే లాభం కొంత మేరకు.. ఎనిమిదేళ్ళ లాకిన్ పీరియడ్ వలన.

      Delete
    9. బంగారం మీద టపా చూడండి
      https://kastephale.wordpress.com/2019/11/13/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-n-log-%e0%b0%ac/

      Delete
    10. దినినే.. "పంపర పనస ముందు నారింజ నాట్యం" అంటారేమో ఆచార్య.. సర్వజ్ఞులు మీరు.. ఏదో.. జిజ్ఞాస కొద్ది వాఙ్మయం చెంది విస్మయానికి లోనైతి.. 😄 శ్రీత ధరణి

      Delete
    11. సర్వేశ్వరుడొక్కడే సర్వజ్ఞుడు. ఈశ్వరః సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం.....బ్రహ్మాధిపతి.....

      Delete
  4. ఈ రంగంలో ఆటోమేషన్ (స్వయంచాలితం)కి చాలా అవకాశాలున్నాయి.

    ReplyDelete
    Replies
    1. సూర్య,

      ఈ రంగంలో ట్రాక్టర్ ఎక్కువగా ఉపయోగిస్తాం.దమ్ము, చేళ్ళు (నీరు పోయే మార్గాలు) వేసుకోడాన్కి ట్రాక్టర్ ఉపయోస్తాం విత్తడానికి ఇబ్బంది లేదు.ఎటొచ్చి మొదటి పంట కోత,కట్టేత, నూర్పు ఇబ్బంది. చేలో దిగితే చీలమండ పైగా కాలు కూరుకుపోతుంది, మొదటి పంట టైమ్ లో. ఏ యంత్రం పనికి రాదు,కూరుకుపోతుంది. రెండవ పంటలో కోత యంత్రం ఉపయోగిస్తాం. నేల స్వభావం అటువంటిది, దీనికి మార్గం దొరక లేదు.

      Delete
    2. సమస్య: చేలో దిగితే కూరుకుపోతుంది.
      పరిష్కారం: చేలో కింద కాలు మోపకుండా లంక దాటే హనుమంతుడిలా ఎగురుకుంటూ కోసేసే యంత్రం. ఈ టెక్నాలజీ ని ఈమధ్య iron man వాడాడు కానీ అది కూడా భారతీయులు కనిపెట్టిందే. పూర్వం ధర్మరాజు వారు తమ రథాన్ని కింద మోపనీయకుండా యుద్ధం చేసింది ఈ టెక్నాలజీతోనే!

      Delete
    3. ఆ యంత్రం వివరాలు చెప్పి పుణ్యం కట్టుకుందురూ

      Delete
    4. శ్రీధరా!

      //పూరణం వరకే అర్దమయ్యింది శర్మ గారు.. ఆ లైన్ అర్దం విపులంగ విడుపున్నపుడు చెబుదురు.//

      ఏంటో అర్ధం కాలేదు. :)

      Delete
    5. శర్మ గారు.. అదే.. ఎలా కొడ్తావురా అని ఏదో నానుడి రాస్తేను.. వివరణ అడిగాను తెలియ రాలేక..

      Delete
    6. ఒకరిని తప్పించుకున్నా! మిమ్మల్నీ తప్పించుకోవాలని ప్రయత్నం చేశా! తప్పలేదు :)

      Delete
  5. Direct from Farm.. I mean Farm Fresh attracts No GST.. If the same is Processed, it attracts 18-24% GST. Moreover, Price Tag on Cereals and Grains are decided by a particular body, but not by the farmers. Even then every morsel of food is mandatory for Survival of Any Human Being at all times and in all Conditions, Whatsoever, Sharma Sir..
    Hope You are fine.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      ఏన్ని డబ్బులిచ్చినా గిద్దెడు గింజలు దొరికే సావకాశాలు మూసుకుపోతున్నాయన్నది నాబాధ. కరోనాతో బాధ పడుతూ కూడా రైతుకి వ్యవసాయం తప్పలేదు. ఏది ఏమన్నా జరిగేది జరక్కమానదు.బండి నడుస్తూ ఉన్నదబ్బా!ధన్యవాదాలు.

      Delete
  6. శర్మ గారు,
    మరీ పైన సూర్య గారు చెప్పిన "ధర్మరాజు రథం" కాకపోయినా కొన్ని ఆధునిక సుళువులు ఎక్కడో కొంతమంది కనిపెట్టినట్లున్నారు 🙂. ఈ క్రింది లింక్ చూడండి 👇.
    ఇది మీ 18-July-2020 నాటి "కరోనాతో వ్యవసాయం" అనే టపా క్రింద కూడా కామెంట్ గా పెట్టాను.

    వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు

    https://www.facebook.com/groups/1146332668726421/permalink/4772061549486830/?sfnsn=wiwspwa&extid=l3b1BLbOHJPK00KQ&d=w&vh=i

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారు,

      మంచి పద్ధతులు ఉన్నాయిగాని మాసమస్యకు పరిష్కారం దొరకలేదండి

      Delete
    2. అంటే ఆ వీడియోలో చివర్లో ఒకతను మోటర్ సైకిల్ మీద కూర్చుని కాళ్ళు తడవకుండా పొలంలో తిరుగుతుంటాడు గమనించారా .. ఆ పద్ధతేమన్నా పనికొస్తుందేమోనని 🙂.

      Delete
    3. నాలుగు నెలలనుంచి నీరు నిలబడి ఉండే భూమి కదా! పెరుగు కలిపిన అన్నం ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, నీరు తీసేసినా. ఎండలు ఉండవు. భూమి ఆరదు. ఇదే భూమి వేసవిలో మూడడుగులలోతు నెఱలు తీస్తుంది. రెండవ పంట కోతకి మిషన్ ఉపయోగిస్తాం.

      Delete
    4. ఇంకొన్నేళ్ళు కాస్త ఓపిక పట్టండి. అలాగే కాస్త రొక్కం కూడా రెడీగా ఉంచుకోండి. పొలాల్లో దిగి కోతలు కోయడమే కాదు, ఆ సందర్భానికి తగిన అచ్చ తెలుగు పాటలు కూడా పాడే రోబోలు వచ్చేస్తాయి

      Delete
    5. సూర్య,
      ఆరోజు రావాలిగాని, మీ నోట్లో పంచదార పొయ్యనూ( పంచదార ఫేక్టరీ లేదు కదా!)

      నిన్న సాయంత్రం నుంచి ఒకటే వర్షం, తుఫాను నరసాపురం-విశాఖ మధ్య తీరం దాటే సావకాశం, అంటే మా దగ్గరనమాట, ఈ రోజు రాత్రికి ముహూర్తం. పన్నెండు నుంచి పదహారు సెంటీ మీటర్ల వర్షం పడే సూచన, గాలి లేదు అదే అదృష్టం.ఏమో! ఏమి జరుగునో...

      Delete
    6. తుఫాను కన్నుకి (eye of typhoon) మీ ప్రాంతం కుడివైపు ఉన్నదా ఎడమవైపు ఉన్నదా అనే దాన్ని బట్టి ఉంటుందట. కుడివైపు ఉన్న ప్రాంతాలపై ప్రభావం బలంగా ఉంటుందట. (జ్యోతిష్ష్యులు కాదండోయ్ సైంటిస్టులు చెప్తున్న మాట)

      Delete
    7. ఎలా తెలుస్తుందబ్బా!ఏ పక్కనున్నా ఎంతో కొంత దెబ్బ తగలక తప్పదనిపిస్తూండి.

      Delete
    8. దెబ్బ తగలక తప్పదండీ. కాకపోతే ఆపక్కనున్నవాడితో పోలిస్తే ఈపక్కనున్నవాడికి మరింత ఛెళ్లున తగులుతుంది.

      Delete
    9. శర్మ గారు,
      మీకు మరీ దగ్గరగా కాకినాడ వద్ద తీరం దాటిందట కదా ఈ రోజు తెల్లవారు ఝామున? బీభత్సంగా ఉండుంటుందే ప్రస్తుత పరిస్థితి?

      Delete
    10. ఈ చిలికి చిలికి గాని వాల మునుపటీ హుద్ హూద్ ఐతే కాకూడదు సుమి. అక్టోబర్ ౧౨, ౨౦౧౪ లో ఆ తూఫాన్ చేసిన భీభత్సం అంతా యింతా కాదు.. నేనే ప్రత్యక్ష సాక్షి. ఒకే ఒక రోజు కోట్లలో నష్టం. ప్రకృతి విలయ తాండవం అనే మాట వినటమే తప్పితే ఆ రోజే కళ్ళార చూసిన దాఖలాలు.

      Delete
    11. సూర్య,శ్రీధర్,విన్నకోటవారు,

      ఈ తుఫానుకు చినుకేగాని, గాలి లేదు. తగిలినది పోలీస్ దెబ్బ నెమ్మది మీదగాని తెలీదు,ఎలాగో చెబుతా.

      ఆదివారం మధ్యాహ్నం మబ్బేసింది, ఎలా? చీకటైనంతగా,రాత్రేమో అనిపించేటంతగా,భయమేసింది. చినుకు చిన్నగా మొదలయింది. చూస్తుండగా, డ్రైను రోడ్డు ఏకమైపోయాయి, నీరు కిందకి లాగుతున్నా. దొడ్డిలోకి నీరు రోడ్డూ మీదనుంచి తన్నుతోంది. అమ్మో! ప్రమాదం అనుకున్నా. కొంత సేపటికి చినుకు తగ్గింది, నీరు మొత్తం లాగేసింది. గాలి లేదు. రాత్రికి చినుకు మొదలయింది,మరి వదలలేదు. సోమవారం ఉదయానికి నీళ్ళు,నీళ్ళు. ఎండొచ్చింది, నీరులాగింది, చినుకు తగ్గింది, మధ్యాహ్నం మూడయ్యింది, చినుకు మొదలయింది, గాలి లేదు, కరంటు వస్తూపోతూనే ఉంది, సాయంత్రం నుంచి. రాత్రి వర్షమే, మంగళవారం పొద్దుటికి ఎర్రటి ఎండొచ్చింది, కరంటొచ్చింది, బాగుందనుకున్నా. ఇదెంత సేపు. మబ్బు మూసేసింది, అడపాదడపా చినుకులు, కరంట్ పోయింది. ఫోన్ పోయింది. బయట ఏం జరుగుతోంది తెలీదు. ఎక్కడేం జరిగిందో తెలీదు. వార్త లేదు. మధ్యాహ్నన్నికి కరంటొచ్చిపోయింది, మళ్ళీ వచ్చి మళ్ళీపోయింది, వాళ్ళ బాధఏంటొ తెలీదు. కరంట్ అదేపనిగాపోడం తో కమ్యూనికేషన్ మొత్తం షట్డవున్ అయింది. సాయంత్రానికి కొద్ది నిలబాటైతే, ఒకటే వార్తలు, ఊరంతా నీరే, చీలమండ దాటి నీరుంది, లాగుతోంది నెమ్మదిగా.

      ఈ లెక్కన చూస్తే పొట్టి వరివంగడాలు చేలు ములిగి ఉంటాయి, కొంత పొడుగైనవి నీళ్ళలో నానుతుంటాయి.నీరు తియ్యడానికి మూడు నాలుగురోజులు పట్టచ్చు. ఈ రోజు ఏకాదశి, అమాస ముందు గనక సముద్రం నీరు లాక్కుంటుంది. ఇక చినుకు రాలకపోతే కొంత నష్టం తో బయటపడతాం, లేదూ, కుళ్ళిన చేలే....నీరు లాగేటపుడే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఏమయిందీ నెమ్మది మీదగాని త్౬ఎలీదు, పోలీస్ దెబ్బ కదా

      Delete
    12. అంత సద్దు మణుగుతుందనే అనుకుందామాచార్య.. ప్రకృతి కదా.. దైవాధినం.. ఈరోజు తెలవారు ఝాము ఐదు గంటల మొదలు ఒహటే చినుకు ధార, పదిన్నరకు కరెంట్ కోత రెండున్ బావు కు వచ్చి, మరల మూడింటికి పోయిన విద్యూత్ సాయంత్రం ఆరున్నర కు, మరల ఎనిమిది గంటలకు కోత కోసి పదిన్నర కు దోమలతో పలకరించింది. ఏతావాత తెలియకుండానే మబ్బు కుండ కు పెద్ద చిల్లే పడినట్లుంది. ఇది ఓరుగల్లులో హన్మకొండ పరిస్థితి..

      Delete
  7. వరికోతమిషన్లవిగో
    వరుసగ నూరూర , ధాన్యవారాశులు మా
    సరసన , రోడ్లంటవిగో
    వరుసగ లారీలు , పంట పండె భలేగా .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      చల్లటి మాట చెప్పేరు. మా దగ్గర పంట కొంత ఆలస్యం

      Delete
  8. వేరుశనగకాయ విరగబండెను భళా!
    సజ్జ గంటకట్టి సాగి బండె
    వడ్లు గనగ తరమ ? గుడ్లు తేలగబండె!
    రైతె మకుటధారి రకరకముల .

    పుష్కలముగ నీటి వొనరులున్నవి కడున్
    కోతకోయగానె వేత మొదలు
    యేటి కేడు పనులె యెందు ఖాళీలేదు
    పంట వెంట పంట బహుపసందు .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      కడుపులో చల్ల పోసేరు. ఎంత ఆనందం. నిజమే ఈ సంవత్సరం నీరు బహు పుష్కలం.వాతావరణమూ బాగుంది. మరి కొంత కాలం వాతావరణం కరుణిస్తే పంటలకి లోటు లేనట్టే.

      Delete
  9. పోలేరు పరంజ్యోతికి
    శ్రీలలితకు దుర్గకు కడుచెన్నగురీతిన్
    ఆలయము కట్టదలచితి
    మేలుగ దీవించుడయ్య,మిత్రులు ప్రణతుల్🙏.

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      శ్రీ మాత్రేనమః. అమ్మ మిమ్మల్ని లక్ష్యం దిశగా నడిపిస్తుంది.విజయోస్తు. మేము కూడా పాలు పంచుకోడానికి వీలుంటే తెలియజేయగలరు.

      ఇఛ్ఛాశక్తి,జ్ఞాన శక్తి, క్రియా శక్తిస్వరూపిణీ

      Delete
  10. శ్రీధరా!

    మంగళవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు అనగా తెల్లవారితే బుధవారం తెల్లవారుగట్ల నాలుగు వరకు అడపదడపా జల్లు పడుతూనే ఉంది. పడిన జల్లు గట్టిగానే ఉంది. రాత్రి నుంచి కరంట్ నిలబడింది.పల్లెలనుంచి వార్తలు లేవు. కమ్యూనికేషన్లు దెబ్బతిని ఉండచ్చు, కరంటూ పోయి ఉండచ్చు. ప్రాణ ప్రమాదాలు జరిగే సావకాశం తక్కువ. నిడదవోలు స్టేషన్లో ట్రాక్ మీద రెండదుగుల నీరు ప్రవహిస్తోంది.ప్రతి ఊళ్ళోనూ నీరు నిలబడింది.

    ఏటికి కోడుకి మధ్య ఐదు కిలో మీటర్లైనా దూరం ఉంటుంది. ఇలా కురుసిన నీరు కోట్లోకే లాగాలి. అదొక్కటే దారి, అన్నీ సవ్యంగా ఉండాలి, నీరు నిలబడదనుకో. ఇప్పటికి మూడు రోజులుగా చేలు నీటిలో ఉన్నాయి, ఇప్పటికి నీరు లాగితే సరి, లేకపోతే చేలు కుళ్ళిపోతాయి. ఎవరూ ఏమీ చేయగలదీ లేదు.

    పాట బిల్డింగ్ లు పడిపోవచ్చు, పెద్ద చెట్లు కూడా పడిపోయే సావకాశం.జాగ్రత్తలు తీసుకోవాలి.ఆరోగ్యాలు జాగ్రత్త తీసుకోవాలి. అనవసరంగా ఎక్కడికి కదలద్దు, చిన్న చిన్న పనులు వాయిదా వేసుకోవడం మంచిది

    ReplyDelete
  11. శర్మ గారు,
    “ అక్రమ మైనింగ్ ........” అంటూ మీ ఊరి గురించి ఓ టీవీ ఛానెల్ లో క్రింద స్క్రోలింగ్ లో కనిపించింది. పూర్తిగా చదివేలోపే జరజరా వెళ్ళిపోయింది. ఆ స్క్రోలింగ్ మళ్ళీ తిరిగి తిరిగి రావాలంటే ఏళ్ళూ పూళ్ళూ పట్టేసినంత పనవుతుంది.

    ILTD కంపెనీ వారి పొగాకు కార్యక్రమాలలో మీ ఊరు కూడా ప్రముఖంగా నిలిచేదని తెలుసు గానీ మీ ఊళ్ళో మైనింగ్ కూడా జరుగుతుందని వినలేదు. ఏ రకం మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుంటాయి, సర్?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      నేనెరిగి గనులు లేవండి
      కొత్తగా ఏమైనా బయట పడ్డాయేమో :)

      Delete
    2. 🙂🙂
      ఒకవేళ క్వారీలు అని టీవీల కవిహృదయమేమో, సర్ 🤔 ??

      Delete
    3. చెప్పలేను సార్ :)

      Delete


  12. కుశలమా ?


    జిలేబి

    ReplyDelete
  13. ఉన్నాం ఉన్నాం నీటిలో ఉన్నామండి! నిండా ములిగితే చలేంటీ?

    ReplyDelete
  14. ఉన్నాం ఉన్నాం నీటిలో ఉన్నామండి! నిండా ములిగితే చలేంటీ?
    నిన్న ఉదయం నుంచి చినుకు లేదు అడపాదడపా జడి తప్పించి. వచ్చిన జడి పెద్దదే ఉంటోంది. కముకు దెబ్బల నెమ్మదిగా వాస్తాయి. :)

    ReplyDelete