Saturday, 17 October 2020

పొణక-పాతర.

ఇప్పుడు ఆహార ధాన్యాలు దాచుకోడానికి పెద్ద పెద్ద గొదాములు, వాటిలో పెద్దపెద్ద ప్లాట్ఫారాలు, వాటి మీద బస్తాలలో పట్టి కుట్టి బస్తాబందీ చేసిన వాటిని నెట్టు కట్టి, వాటి మీద టార్పాలిన్ లు పరుస్తున్నారు. పాత రోజుల్లో ఇవన్నీ లేవుగా, అప్పుడు ఆహార ధాన్యాలు దాచుకో లేదా? ఎలా చూదాం.


 ఒకప్పుడు పల్లెలలో ఏ ఇంటికెళ్ళినా ముందు వసారాలో,ముందు దొడ్డిలో ఒక పొణక  అనే జల్ల కనపడేది. పొణకేంటని అనుమానం కదా!. వెదురుతో ఏడు, ఎనిమిదడుగుల ఎత్తున నాలుగైదు అడుగుల కైవారంలో బుట్టలా అల్లేవారు. దీనిని రెండడుగుల ఎత్తున్న నాలుగు బండరాళ్ళ మీద పెట్టేవారు. బంకమట్టి బయట మేగేవారు. ఆతరవాత పేడతో అలికేవారు. ఇందులో వేపరొట్ట వేసేవారు, ఆపైన గడ్డి వేసేవారు, ధాన్యం పోసేవారు. పైన మళ్ళీ వేపరొట్ట వేసి, ఆపై గడ్డి వేసి మెత్తటి మట్టిమేగేవారు. దీని చుట్టూ ఖాళీ ఉండేలా చూసుకునేవారు, రోజూ చూసేవారు. అవసరం వచ్చినపుడు తీసుకునేవారు. ఇలా సంవత్సరమూ ధాన్యం నిలవ ఉండేవి.ఇలా పాతిక కాటాల దాకా నిలవ చేసుకునేవారు, ఇంతకంటే ఎక్కువ నిలవ కావాలంటే?


పాతర...దొడ్డిలో మెరక ప్రాంతంలో, నీరు చేరని చోట, నీరు ఊరని చోట ఎనిమిదడుగులలోతు వరకు గొయ్యి తీసేవారు. గోతి వ్యాసం పైకొచ్చేకొలదీ ఎక్కువ ఉండేలా చేసుకునేవారు.గోతిని ఆరనిచ్చేవారు, ఆపై వేపరొట్ట పైదాకా పెర్చేవారు, కింద, పక్కల. ఆపై గడ్డి వేసేవారు పక్కల, కింద. గడ్డి మీద కుదిరితే పాత గోనె సంచులు కలిపి కుట్టిన బరకం వేసేవారు పైదాకా. దీనిలో ధాన్యం పోసేవారు. బరకం అంచులు ధాన్యం మీద కి మధ్యలోకి చేర్చేవారు. పైన వేపరొట్ట వేసేవారు,గడ్డి పరచేవారు. ఆపైన మట్టిని ముద్దలుగా చేర్చి పేర్చేవారు. దీనిమీద పక్కలా కూడా పేడ నీళ్ళు జల్లేవారు. ఈ గోతి చుట్టు పక్కల నిత్యం చూసేవారు, పందికొక్కు తవ్వుతోందేమోనని. చినుకులొస్తే నీరు నిలవకుండా చూసుకునేవారు. అవసరమనిపిస్తే తాటాకులు పరచేవారు. సంవత్సరంలో అవసరాన్ని బట్టి తవ్వి తీసుకుని మళ్ళీ కప్పేసేవారు. ధాన్యం మిలమిలామెరుస్తూ బాగుండేవి.ఇలా దాచుకోడాన్ని పాతర వేయడం అంటారు. మనదేశం లో మానేసారుగాని ఇదింకా అఫ్రికా దేశాలలో అమలు లో ఉంది. ఈ ధాన్యం బియ్యం రుచిగా ఉండేవి. 

ఒకప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలుండేవి. బియ్యం ఏరుకోవడం ఓ పెద్ద పనిగా ఉండేది, ఆడవారికి. కాలం మారింది ఆ తరవాత పలుకురాళ్ళు వచ్చేవి బియ్యంలో. వీటిని ఏరుకోవడం కష్టంగా ఉండేది. తరవాత కాలంలో నూటికి ఐదు బస్తాల మట్టిబెడ్డలు కపలడానికి బెడ్డల ఫేక్టరీలు పుట్టేయి, సరే పలుకు రాళ్ళ కి కూడా ఫేకటరీలుండేవి. కాలం మారింది, మట్టి బెడ్డలుండటం లేదుగాని ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారట, నేడు. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం ఎలా వేరు చేసుకోవాలో తెలియక ప్రజలు తలలు పట్టుకునే రోజులు ముందున్నాయిట. కలికాలం. 

తక్కువ ఖర్చుతో ఆహారం నిలవచేసుకునే అలవాట్లు వెనకబట్టేయి.      17 comments: 1. What a pity!/ బియ్యం తింటున్నారా ఇంకా!
  వాట్ ఎ పిటీ! పిజ్జా పాస్తా బర్గరులుండగా ఈ పాత , పాతర బెట్టిన బియ్యాల్తో సర్దేసుకుంటున్నారా ! వాట్ ఎ పిటీ :)  జిలేబి

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పిన పాతర చదువుతుంటే ఫ్రై ఆనియన్ లేయర్ బిరియాని దమ్ చేసినట్టు గా చెప్పేరు. ఎంతైనా ఆ కాలపు అలవాట్లు, మనుషులు, తిండి.. ఇవన్ని ఈ ఈ కాలం లో ఆర్కివ్ గా మారి దర్శనం ఇస్తుంటాయనటం లో కొంత బాధ కొంత ఆశ్చర్యం కలగక మానవు.

   Delete
  2. Zilebi
   పిజ్జా పాస్తా బర్గరు ఏ దేశం లో పండుతాయి?

   Delete


  3. అబ్బే మాకట్లాంటి ఇన్ ఫర్ మే షన్లు అవసరంలే
   అలెక్సా తే అంటే ఇంటి ముందు వాలిపోతాయి.


   నారదా
   జిలేబి

   Delete


  4. What a pity what a pity ! Alexa తెలియని ఫోక్స్ ఉన్నారా ఇంకా ! వాట్ ఎ పిటీ :)

   Delete
  5. Yes. I don't know what is burger pasta, pizZa and Alexa etc. I aware

   Delete
  6. I affirm I do not know all these things

   Delete
  7. అలెక్సా అనేది అమెజాన్ వారి అన్-లైన్ అసిస్టెంట్ (కస్టమర్ల కోసం) అని విన్నాను, శర్మ గారు. బహుశః .... మనకేంకావాలో వాడితో ఆన్-లైన్లో చెబితే వాడు ఆయా రెస్టారెంట్లకు ఆర్డర్ పెట్టి మన అడ్రస్సుకు డెలివరీ చెయ్యమని చెబుతాడేమో? అందుకే // “ అలెక్సా తే అంటే ఇంటి ముందు వాలిపోతాయి.“ // అని “జిలేబి” గారు అనడంలో కవిహృదయం ఇదే అయ్యుంటుందని నేను అనుకోవడం.

   కానీ ఈ అలెక్సుడి ఫుడ్ డెలివరి సేవలు ఇంకా ఇండియాలో మొదలయ్యాయా అన్నది తెలియదు. బహుశః సింగపూర్ లో ఈ సౌలభ్యం ఉందేమో, అందుకే “జిలేబి” గారు ఆ జపం చేస్తున్నట్లున్నారు ??🙂

   Delete
  8. విన్నకోటవారు,
   పిజ్జా బర్గర్ అలెక్సా అంటే ఏవో ఆహారధాన్యాల పేరలనుకున్నానండి.మన దేశపు ఆహారధాన్యాలు కదనుకున్నానండి. ఇవి ఎవరో వండిన ఆహారాన్ని సరఫరా చేసే కంపెనీలా,(చద్దికూటి మంగళారం కంపెనీలా) మన దేశంలోనే ఇన్ని ఉన్నాయా? :)

   Delete
 2. ఆ శర్మాచార్య ఆ పోణక నే మేము గుమ్మి అంటాము. వెదురుతో అల్లి ఉంటుంది. ఇక పాతర వంటి దానిని గాబ్ అంటాము. ఇందులో చిరుధాన్యాలు చిన్న చితక వస్తువులు పెట్టేవారు. గాబ్ ను మట్టితోనే తయారు చేయించే వారు. ఇది గంగాళానికి మట్టి వర్షన్. మా తాతయ్య నాయనమ్మలు కాలం చేసినాక ఈ గాబ్, గుమ్మీలన్ని డమ్మిలుగా మారిపోయాయి..!

  ReplyDelete
 3. Sri[dharAni]tha

  గుమ్మి అనేపదం కూడా ఎరిగినదే వాడుక తక్కువ. గాబు అనేది గంగాళానికి వాడటం అలవాటే. గాబు సిరమిక్ తో చేయడం ఎరుగుదును, మట్టితో ఎరగను. గంగాళం ఇత్తడితో చేస్తారు.

  ReplyDelete
 4. పొణక నేను వినలేదండి.
  పొణక అంటే గాదె అనుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. బోనగిరిగారు,
   పొణక,గుమ్మి, పొణ్కబుట్ట, గాదె, చుట్టుగాదె ఇలా వాటి కారాలను బట్టి తయారు చేసిన వానిని బట్టి సైజును బట్టి కూడా పేర్లండి. గాదెలనేవి వేప చెక్క కూర్పుతో పైన తడక అల్లికతో పెద్ద పెద్ద చావిళ్ళతో ఉండేవి, వీటిలోనే దంపుళ్ళ చావళ్ళూ ఉండేవి.


   Delete
 5. అలెక్సా అంటే జిలేబి గారి ఆంతరంగిక పరిచారిక.

  ReplyDelete
  Replies

  1. బోనగిరిగారు,
   జిలేబిగారి పరిచారిక కాకపోతే చెలికత్తె కావచ్చు


   Delete