Saturday, 14 November 2020

మొండివాడు

 మొండివాడు రాజు కంటే బలవంతుడు

ఊరుకున్నవాడిని ఊరేమీ చేయలేదు.

ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదు.

కచ్చలో నిప్పుపడ్డా కచేరీలో కాయితంపడ్డా నష్టం జరిగి తీరుతుంది



.




9 comments:



  1. వాడు మొండివాడయె బలవంతుడాయె
    రాజు కన్నను! ఊరుకున్నట్టి వాణ్ణి
    చేయ జాలదూరేమియు! చీకు లేక
    ఊరుకున్నంత గా మరి ‌ ఉత్తమమ్ము,
    బోడి గుండంత గా సౌఖ్యము భువిని మరి
    వేరు లేదు! కచ్చను నిప్పు వేయ, కాయి
    తమ్ము పడను కచేరిలో, తప్ప దోయి
    నష్టము జిలేబి మాట వినవె శుభాంగి!



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఎనిమిది పాదాలు, రెండు పద్యాలా? ఏమి ఈ ప్రక్రియ,
      పేరేమి ఊరేమి ఓ జవరాలా?

      Delete
  2. ఎనిమిది పాదాల వివర
    మనఘా ! తమ గుప్పిటుంది , అరచేయి విడన్
    ఘనతల్ వెలువడు , నంతకు
    మనమీ విపరీత గరిమ మరిమరి కనమే !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      దీనికి రగడో,బొగడో ఏదో పేరు చెప్పచ్చు, లక్షణమూ చెప్పచ్చు. వేచి చూదామండి!


      Delete


    2. దీనిని తేటగీతి అంటారని‌ మన రాజా లాంటి వారు చెప్పగా విని వున్నానండి.

      దానినే కొందరు ఫ్యాక్టరీ పద్యమని అనడం కూడా కద్దండి.

      ఈ రెండింటిలో ఏదో ఒహటో లేక రెండున్నూ అయి వుండొచ్చండి :)



      జిలేబి

      Delete
    3. జిలేబి
      సెబాషు...సెభాషూ...భేష్..భేష్..
      లక్షణం...? లచ్చనం..?


      Delete


    4. లక్షణంలో లక్ష వుందండి.
      అలాగే ణ వుందండి.ణ అనగా దీనితో తెలుసుకొనబడునది అట అండి.

      లకారంతో తెలుసుకొనబడునది స్టాకు మార్కెట్టండి.

      కాబట్టి ..... :)




      జి లే బి.




      Delete
    5. లక్షలమీదే చూపుంటే అనుభవించడానికి టైమ్ ఉండదు. అక్షరం మీద కూడా చూపుండాలి బామ్మా!

      అది సరేగాని సెభాషు, సెభాషూ రెండు మాటలు ఒక సారి వాడటం లో తిరకాసేంటంటావ్, చెప్పుకో చూదాం. :)

      Delete

    6. - లక్షలమీదే చూపుంటే అనుభవించడానికి టైమ్ ఉండదు

      - జవాబు - అందని ద్రాక్ష పండ్లు పుల్లన :)

      - సెబాషు సెభాషూ రెండు మార్లు

      - జవాబు తెలియదు :)



      జిలేబి

      Delete