పొన్నగంటి కూర |
ఆకు కూరలంటే గోంగూర,తోటకూర, గుర్తొచ్చినట్టు మిగిలిన కూరలు గుర్తురావు. బచ్చలి,కరివేపాకు,పొన్నగంటికూర,చింతచిగురు,షీకాయాకు, తూటి కూర,నెల్లి కూర ఇలాటివి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి ఉంటాయి. ఇక గల్జేరులాటివైతే ప్రత్యేకంగానే గుర్తు చేయాలి. ఇది తినడానికేం ఇదేమన్నా విషమా గల్జేరా అని అడిగేవారు. గల్జేరు వేళ్ళు పచ్చడి చేస్తారట. నిజంగానే బహు చేదుగా ఉంటుందిట, నేనెప్పుడూ తినలేదు.కాని గొప్ప ఔషధంగా చెబుతారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి ఇటువంటివే. నిత్య జీవితంలో వాడుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తి, వ్యవస్థ బలపడుతుంది. దానికేంగాని అదంతా ఎవరిష్టం వారిది. ఈ పొన్నగంటి కూర పచ్చడి బాగుంటుంది. పొన్నగంటి కూరని బాగుచేసుకుని మూకుడులో వేసి వేయించి తీసి ఉంచుకుని తగిని పసుపు ఉప్పు చింతపండు వేసి, పోపుతో రోటిలో రుబ్బుకుంటే బహు బాగుంటుంది. ఈ కూర పప్పులో కూడా వేసుకుంటారు. కంటికి మేలు చేస్తుంది.తోటకూర కూడా పచ్చడి చేస్తారు. ఆ పై మీ చిత్తం, మా భాగ్యం
అయ్యా శర్మ గారూ, గోంగూర పచ్చడి అన్నారు - మహత్తరం, తిరుగు లేనిది. సరే చుక్కకూర పచ్చడి అంటారు కొంత మంది - ఫరవాలేదు అనుకోవచ్చు. మరీ పొన్నగంటి కూరని కూడా పచ్చడి చేసుకోవచ్చు అంటారా 😳?
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteపల్లేటూరివాళ్ళం కదండీ! తూటుకూర పప్పులో వేస్తారు. కూర ఉప్పుగా ఉంటుంది. ఆట పాటలలో కూడా, వైద్యంలో ఉపయోగించే చికిలింత కూర గురించిన పాత పాట వినండి మధురం కదా! అరవై ఏళ్ళు పైబడిన పాట
చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు చినదాని మీది మనసు.
ఏ ఆకు కూరైతే ఏముంది వియన్నారాచార్య.. పాల, తోట, చుక్క, గోగి, పొన్నగంటి, నుణకి, రజాన్, మెంతి, కొత్తిమీర, కరివేప,వేప, మునగ, బచ్చళి.
Delete...... గరిక పచ్చడి 😀
Delete..దర్భము (గరిక) సైతం మంచిదే.. ;*)
Deleteవిన్నకోటవారు,
Deleteగరిక పచ్చడి అద్భుతం,
గరికెల మాన్యం కతే ఉందండి. చూడండి లింక్ లో
https://kastephale.wordpress.com/2014/11/07/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%97%e0%b0%b1/#comments
https://youtu.be/Z-QzqSlL49M?list=RDZ-QzqSlL49M
శ్రీధరా!
Deleteనుణిగి,రజాన్ వినలేదు సుమా!
నుణిగి కొంచం చుక్క కూర మాదిరే ఉంటుందాచార్య కాని ఇది పొట్టి కాపు. రెండు లేదా నాలుగాకులతోనే ఉంటుంది. పులుపుగా ఉంటుంది. ఆవాలు వంటి చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. నాటిన వారం రోజులకే మొలక వస్తది. ఆపై పది-పదిహేను రోజులకే వేర్లతో సహా (కొత్తిమీర లాగా) పీకి, ఆకులను శుభ్రంగా కడిగి పప్పులో వేసుకోవచ్చు.
Deleteఇక రజాన్ అంటారా.. దీనికి కాంబినేషన్ పచ్చ జొన్న రొట్టే.. ఆకులు తోటకూర మాదిరి ఉంటాయి.. కాకపోతే గోగికూర లా ఉత్త ఆకులనే ఉడక బెట్టాలి.. అనక ఉప్పు కారం నీరుల్లి కలిపి కచ్చా పచ్చాగా దంచి తింటే కాస్త బెండకాయ లా జిగురు జిగురుగా నోట్లో తగులుతుంది దాని టేస్ట్.. పచ్చ జొన్నలను పిండా ఆడించి నీటిని మరగ బెట్టి అందులో కొద్ది కొద్దిగా పిండిని కలుపుతు.. లేదా పిండిలోనే కొద్ది కొద్దిగా వేడి నీటిని కలుపుతు ఉండలు లేకుండ పిసుక్కోవాలి.. ఇలా పిసుక్కున్న పిండి నుండి ఓ ముద్ద తీసుకుని పార్చమెంట్ పేపర్ పై కాసిన్ని నీళ్ళు జల్లి ఉండను వేలితో ఒత్తుతు చదను అయ్యాక అరచేతిలో పట్టుకుని మునివేళ్ళతో ఒత్తుతు మెల్లగా సాగదీయాలి. అటు పిమ్మట కాస్ట్ ఐరన్ తవా పై ఈ ఆకారాన్ని నూనె, నేయ్యి, వెన్న లేకుండానే కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న రొట్టె ను రజానాకుకూరతో తింటే అమోఘమాచార్య.
కాస్ట్ ఐరన్ తవా లేకున్నా ఇటుక భట్టి మట్టి (క్లే) తో తయారైన మట్టి తవా లేద పెనం లేదా పెంకు మీదైతే ఈవెన్ హీటింగ్ తో మంచిగా కాలుతు కరకరలాడుతుంది పచ్చజొన్న రొట్టే..
Deleteశ్రీధరా!
Deleteరెండింటి ఫోటో లకోసం వెతికేను దొరకలేదు. వీలు కుదిరితే ఫ్ఃఓటో పెత్తండి లేదా లింక్ ఇవ్వగలరు.
ఎర్ర జొన్నల రొట్టి బాగుంటుందంటారు నిజమేనా? నేను మాత్రం ఎర్రజొన్న అన్నం పప్పుచారుతో, కొరివి కారంతో తిన్న అనుభవం మాత్రం ఉంది.
Deleteశర్మాచార్య.. వాటిని మా నాయనమ్మ వారు విరివిగా వారి పొలం లో చిన్న చిన్న మడులుగా చేసి వాటిలో పెంచేవారు. చాలా రుచికరంగా ఉండేవి. నేను వాటిని చూసిన, తిన్న దాఖలాలైతే ఉన్నాయి గాని ఫోటోలైతే ఏమీ లేవు.
Deleteఅలానే రెడ్ రైస్ గురించి విన్నాను, బ్రౌన్ రైస్ తిన్నాను, వైట్ సోర్ఘం తిన్నాను, యల్లో సోర్ఘం కూడా ఆరగించాను. మరీ ఈ రెడ్ సోర్ఘం ఎక్కడ పండుతాయో తెలియదు. షుగర్ కేన్ కు మల్లే వీటికి రెడ్ రాట్ డిసీజ్ వస్తదని తెలుసు. వీటితో ఎక్కువగా గడకలు, సంకటి ముద్ద, రవ్వన్నం, కుడుములు చేస్తారు.. అవన్ని చిన్ననాటి జ్ఞాపకాలే.. రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు వీటిని నా చిన్నతనం తరువాయి ఈ మధ్యే మరల చిరుధాన్యాల పేరిట వస్తున్నాయి ఆచార్య.
ఎర్రజొన్నలు బాగుంటాయి.తెలంగాణాలోనే బాగా పండుతాయి.
Deleteఔనాచార్య ఈ తెలంగాణాంధ్రాయలసీమ తో నాకు అనుబంధం ఉంది.. తెలంగాణ నేను పుట్టిన రాష్ట్రం, ఆంధ్ర నేను పెరిగిన రాష్ట్రం, రాయలసీమ లో నా ఫేవరెట్ వేంకటేశ్వర స్వామి కొలువైన రాష్ట్రం. ఐతే జొన్నలు సైతం ఆరోగ్యానికి మంచి ఆహారమే..!
Deleteఎర్రజొన్నలనగానేమి? కమ్మూనిస్టుల ఆహారమా?☺️
Deleteసూర్య గారు.. ఎఱజండెఱజండెనియలో ఎఱ్ఱెఱ్ఱనిదీ జెండెనియలో.. నా జన్మరాష్ట్రమైన ఓరుకలు (సింగల్ స్టోన్ సిటి) లో దాదాపు ప్రతి మూడవ పల్లెలో ఏదో ఒక చోట ఈ కంకి కొడవలి, కొడవలి సుత్తి గల ఎఱ్ఱ స్తూపం కనిపిస్తు ఉంటుంది. వరంగల్.. కాజిపేట.. హన్మకొండ అంటే హెదరాబాదు.. సికిందరాబాద్..నామ్‌పెల్లి లెక్క.. వరంగల్:హైదరాబాద్::కాజీపేట:సికింద్రాబాద్.. అక్కడ మూసి వాహిని హుసేన్ సాగర్ లేక్ బండ్.. ఇక్కడ భద్రకాళి చెరువు, రామప్ప ఆనకట్ట, వడ్డేపల్లి లేక్ బండ్.. అక్కడ కులి కుతుబ్ హా.. అసఫ్ జాహి.. ఇక్కడ రాణి రుద్రమ ఏలిన కాకతియులు.. అక్కడ గోల్కొండ కిలా.. ఇక్కడ ఓరుగంటి కిలా.. అక్కడ చౌమహల్ల, ఫలక్ నుమ.. ఇక్కడ వేయి స్థంబాల రుద్రవిష్ణుసూర్యాలయం, భద్రకాళి.. జొన్నలలో మూడో వెరైటి వంగడం.. తెల్ల, పసుప్పచ్చ, లేత గేరువా.. ఇదే ఎర్ర జొన్నలనట్టు.. !
Delete~శ్రీత ధరణి
ReplyDeleteగల్జేరు అనకూడదండీ తాతగారు
గలిజేరు అనాలె. "పునర్నవ" అన్న దాని మరో పేరులోనే దాని విశేషాలన్ని ఇమిడి వుండాయి.
ఏమిటో ఈ పచ్చడి బడాయిలు.
ఈ పేరాలో ఆకు పేరు మారుస్తూ పోతే సో మెనీ పచ్చడీస్ వచ్చేస్తూ వుంటాయి యూ నో :)
డాష్ డాష్ డాష్ కూరని బాగుచేసుకుని మూకుడులో వేసి వేయించి తీసి ఉంచుకుని తగిని పసుపు ఉప్పు చింతపండు వేసి, పోపుతో.......
నారదా
పునర్నవా మహాత్మ్యాలు వినివున్నావా :)
జిలేబి
చదువుకోనివాడిని కదా అందుకు అలా చెప్పేసేననమాట. ఇలా మూస రాసేసుకునే "సంభావితాలు" ఉంటాయనుకోలేదు,పునర్నవ గురించి చెప్పరాదా మంగతాయారూ
Delete
Deleteసాంబా ! ఈ సంభావితాసంభావితాలు పెద్ద పెద్ద తలకాయలను గిర్రున లాగి కొట్టినట్టుందే !!?
పునర్నవ - పునః నవ!
Become youngish again and again :)
జిలేబి
సాంబరు లో సాంబయ్య.. జరా గీ ముచ్చటేందో సూడరాదే.. సంభావం కాని వాటి సంభావ్యతను దెల్పే సందర్భోచిత సంభావన.. అసంభావితమైన వాటి సంభావ్యతను గూర్చి సంబోధించే సంభావన భావింపగ తగు సంభాషణలో భాషించే విధంబగు అసంభావ్యత పాళ్ళు సంభావన గల్గిన వారినే సంభళించుకూనే వీలు పడకనే సంభావ్యత ను సంభవించేదిగా సంబోధించ తగునా బిజిలే అమ్మణ్..!
Deleteఫీనిక్స్ అంటే పునః+నవ అనుకోవచ్చునా సెలవీయగలరు
ఘనసంభావన కిట్టిం
Deleteదనఘా ! తమపద్యములకు, తలగడుగులతో
పనివడి మొట్టించుకొనుట
ఘనులకు కడుతీపి యేమొ ! కాదా ? విహితా !
రాజావారు,
Deleteపనిబడి మొట్టించుకొనుట.....అలవాటైపోయిన ప్రాణం కదా! ఇంటి మీద రాయి వేసి తల ఒగ్గడం అంటే అదేగదా! కానివ్వండి, లోకో భిన్న రుచిః , మనం చేయగలది ఉండదేమోనని.
పున యనగా వీపున , నవ
Deleteయన జిల , యనఘా ! అదేమొ , అందదు బరకన్ ,
మునుకొని గోడకు చేర్చుక
అనయము రుద్దంగ కాస్త అణగు గదయ్యా !
Deleteభాష్యమంటే ఇదేకదా !
అదురహో !!!!
జిలేబి
శర్మ గారు, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. భలే. అదటుంచి, గలిజేరు అన్నపదానికి గల్జేరు అన్న రూపాంతరం సాధువే.
ReplyDeleteశ్యామలీయంవారు,
Deleteకొంతమందితో మాట్లాడకపోవటం తప్పు, కొంతమందితో మాట్లాడటం తప్పు. తమరికి తెలియంది కాదుగదా! తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు.......
అమ్మణ్ణీ మణి చెప్పింది కదా అలా గల్జేరు అనకూడదూ అని :) విని ఊరుకోవడం మంచిదని....
ధన్యవాదాలు.
Deleteతాతగారు చతురులు :)
శ్యామలీయం వారు విదురులు :)
రెంటికి మధ్య అసంభావితాలు మరీ యెక్కువ :)
మధ్య జిలేబి సంభావన
అరకాసు :)
అరకాసుకాదు నీది తిరకాసు. తెలిసిందా తాయారూ
Deleteవిదులు అనాలండీ తాయారమ్మ గారూ, విదురులు అని కాదు. మీకు తెలియకపోతే ఎవరన్నా చెప్తే డబాయిస్తారు! ఇప్పుడేమో జైగారు వచ్చి నాకు క్లాసు తీసుకుంటారు, భాష మారిపోతోందీ మీకే తెలీటంలేదూ అని. నిజానికి మారుతున్నది భాష కాదు చాలావరకు మనకే భాషమీద శ్రధ్ధతగ్గి అనేక పొరపాటు వాడుకలు చేస్తూ భాషని కంగాళీ చేసి కొత్తదనం అంటున్నాం. మీడియా పుణ్యమా అని తప్పులు ప్రచారంలో నికి వస్తున్నాయి. కల్మకల్మ.
Deleteశ్యామలీయం వారు
Deleteయదార్ధవాదీ బంధువిరోధీ అనిగ్తాని యదార్ధవాదీ లోక విరోధీ అనిగాని అంటుండం వింటుంటాను.
వాద ప్రతివాదాలు సహజమే ఇవి నేటివీ కావు, తర్కంలో ఉన్నవే, ఐతే నాటికాలంలోనే కొన్నివాదాల్ని నిరసించారు, అవేవో చెప్పేరు కూడా. ఛలవాదం, వితండవాదం నేటికాలంలో ఎక్కువగా కనపడుతున్నాయి. కాలమహిమ. చూసి,విని నవ్వుకోడం తప్పించి చేయగలది లేదేమోనని నా ఊహ. తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవచ్చు. కావాలని తప్పు చేస్తే......... స్వస్తి
Deleteతాయారమ్మ! విదురులన
కోయి!"విదుల" నవలె తెలుసు కొనవమ్మ జిలే
బీయమ్మా ! శ్రీ శ్యామల
రాయలు "విదులు" సరికాదు వ్రాయుట విదురుల్ :)
ఇదేదో కొత్తగా వుందే :) బావుంది "విదులు", కో- విదులు :)
కోతి చేతికి చిక్కిన కొత్త బోండాం :)
విదులు :)
జిలేబి
"ఇప్పుడేమో జైగారు వచ్చి నాకు క్లాసు తీసుకుంటారు"
Deleteమీకు క్లాస్ తీసుకునేంత లెవెల్ నాకు లేదండీ. జస్ట్ మాస్టారి దగ్గర మాక్సిమం నేర్చుకుందామన్న తపనతో సిల్లీ డౌట్లు అడిగే విద్యార్ధిని.
మనలో మనమాట శర్మ గారు, మీరు మీటపాకు సంబంధంలేని గడబిడ లన్నీ ఎందుకని approve చేసి ప్రకటిస్తున్నారో బోధపడటం లేదు. పోనివ్వండి, అదొక వినోదం అనుకుందాం. ఓకే, ఓకే. కానివ్వండి.
ReplyDeleteశ్యామలీయం వారు,
Deleteనేనూ చాలా కాలం మీరన్నట్టే టపాను మించిన మాటలుకి స్థానం ఇవ్వలేదు.కొంత బాధ పడిన మాట కూడా నిజం. కాలం గడచింది. బ్లాగుల్లో మిగిలినవారు,అందరూ కలసి మొత్తం పది మంది లేరు. ఎవరి మాటవారిది పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా! మరొకరిని ద్వేషించని, అసూయ చెందని, తిట్టని, అవమాన పరచని,విషయానికి సంబంధించిన వాటిని కూడా ప్రచురిస్తూ వస్తున్నా! రాయడం అన్నది తగ్గిపోయింది. నిజానికి రాస్తున్నది కూడా చెత్త అంటే అనుమానం లెదు. కొద్ది రోజుల్లో ఇది కూడా తగ్గిపోయే సూచనలౌ కనపడుతున్నాయండి. నా వల్ల పొరబాటుంటే మన్నించండి.
శ్యామల్ రావు సర్, శర్మాచార్య..
ReplyDeleteనే వ్రాసే వ్యాఖ్యలు ఒకింత వినోదాత్మకంగా ఉండాలనే రీతిలో వ్రాస్తాను. ఎవరిని కించ పరచాలనో లేదా దూషించాలనే దురాశ నాకు ఎంతైన లేదు. భావ ప్రకటన కు విఘాంతం కలగనీకుండ, ఆ టపా యొక్క అంతర్లీనమైన భావం అంతర్ధానం కాకుండ ఉండేలా వ్యాఖ్యానిస్తానే తప్పితే అసందర్భోచిత అనుచిత వ్యాఖ్యలకు తావు ఇవ్వను. ఒకచమటికి రెండు మార్లు సరి చూసుకున్నాకనే వాటిని పబ్లిషింగ్ కొఱకు సెండ్ చేస్తాను. శర్మాచార్య వారు, మీరు వాటిని ఆమోదించినాకనే అవి ప్రచూరితమౌతాయి. ఒహవేళ నే వ్రాసే వ్యాఖ్యలు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎవరినైన నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి.
మా ప్రాంతంలో ఈ 'పునర్నవ'అనే ఆయుర్వేద మూలికను
ReplyDelete'అటికమావిడి'అంటారు . చిన్న చిన్న గులాబీరంగుపూలతో
ఒకరకం , తెల్లటిపూలతో ఒకరకం . తెల్లటిపూలరకం పప్పుతో కలిపి వండి తినడం మాపల్లెల్లో ఉంది .
రాజావారు,
Deleteపునర్నవను, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారనుకుంటా. దీనిని మా ప్రాంతంలో గల్జేరంటారని వినికిడి :) దీనిని కడుపులో పెరిగే పరాన్న జీవులను చంపడానికి వాడతారని గుర్తు. రెండు రోజులు తినిపించి మూడో రోజు సునాముఖీ ఆకు చారు తాగించేవారు, పాములు పడేవి :)
సార్ ,
Deleteఇది ఆయుర్వేద మూలికనీ , దీనికి పునర్నవ అనే పేరుందనీ , అమోఘ ఔషధమనీ మా పల్లెటూరి వాళ్ళ కస్సలు తెలీదు .
కూర కేదీ లేదనుకోండి , దొడ్లోకెల్లి(పట్టణవాసులకు వేరే
అర్థమొస్తుందేమో , పెరడు అనడం తెలీనోల్లం) ఏ ఆకు దొరికితే ఆ ఆకు కొసి , పప్పులో కలిపి వండుకు
తినడమే . అన్నీ రుచికరమే . అన్నీ ఆరోగ్యప్రదమే .
మొన్న శనివారం మా శివాలయంలో వివిధ ప్రసాదాలతో
150మందికి తృప్తిగా వడ్ఢించేను . సాయంత్రం చెఱువులో కార్తీక దీపాలతో శివారాధనున్నూ . నమస్సులు .
మొన్న సోమవారం , 23 న
Deleteశనివారం పొరపాటు .
రాజావారు,
Deleteమీరన్న మాట నిజం. పెరట్లోని ఏ ఆకైనా తెచ్చుకుని పప్పులో ఉడకేసుకుని తినేవారం. నేటి కాలానికి అన్ని సూకరాలైపోయి..ఏం చేయలేకున్నాం. కొన్ని ఆకుల కూరల పేర్లే తెలియవు నేటి వారికంటే వింత కాదు. మనది అశక్త దుర్జనత్వం అనిపిస్తూందండి అప్పుడప్పుడు.
Deleteపెరటి లోని ఆకు పేర్మియెవరికెరు
కా జిలేబి ? మందు కాని ఆకు
లేని దెక్కడా! భళీ పునర్వవ! ఔష
ధ మహిమయు గలిగినదమ్మ వినవె!
జిలేబి
అంద , రంతొ యింతొ, అరగొర ఙ్ఞానులే ,
ReplyDeleteఅన్ని దెలిసినోళ్ళు అసలులేరు ,
తెలివికంటె ఘనము తీరుగా నుడువుట ,
అన్ని దెలియు నన్న అహము చనదు .
రాజావారు,
Deleteఉన్నమాటంటే ఉలుకెక్కువని సామెత కదా! :)
HYDERABAD: If you are planning to prepare dishes like vepudu, pappu or podi using the green leafy vegetable Ponnaganti kura, better avoid using the vegetable, as under the guise of Ponnaganti kura, many vegetable vendors in Hyderabad are selling alligator weed, an invasive alien plant species containing toxic concentrations of lead, cadmium, manganese, zinc and iron. Alligator weed is an invasive alien aquatic plant species native to South America that grows abundantly in polluted lakes in and around Hyderabad and as a result absorbs toxic elements from the polluted water which gets distributed across the plant’s root, stem and leaves.
ReplyDeleteIt bears the scientific name of Alternanthera philoxeroides and its leaves closely resemble the Indian Ponnaganti kura which has scientific name of Alternanthera sessilis.
A study conducted by botanists from University of Hyderabad (UoH) for which they took samples of alligator weed being sold as Ponnaganti kura at different locations in the city, has reported concentration of Lead in the weed to be as high as 230 milligrams per kilogram(mg/kg). The maximum permissible limit(MPL) for lead in vegetables as per international organisations is 0.3mg/kg. Lead toxicity is associated with health problems like cardiovascular diseases, decreased kidney functioning and anaemia.
I totally agree with bonagiri gaaru.
ReplyDeleteహైదరాబాదులో మా ఇంట్లో పొన్నగంటాకు అనుకుని కొనుక్కొచ్చినప్పుడు ఇది ఏమిటని అడిగాను. పొన్నగంటాకు అన్నారు. అలా లేదే అన్నాను (కోస్తాలో దొరికే పొన్నగంటి రూపురేఖలు చూసిన అనుభవం ఉంది కదా). ఏదో ఆకు తీసుకొచ్చేసి అమ్మేస్తున్నట్లున్నారు అని కూడా అన్నాను. అప్పటి నుండి ఈ కూర విషయంలో నాకు చేతనైనది చెయ్యడం మొదలెట్టాను - అంటే ఆ కూర తినడం మానేశాను.
హైదరాబాదులో పొన్నగంటి పేరుతో అమ్మే ఆకుకూర ఏదో తేడాగా ఉందని ఎప్పుడూ అనుమానపడుతూనే ఉన్నాను గానీ మరీ బోనగిరి గారు చెప్పినంత దారుణం, Lead concentration అనుకోలేదు. బహుశః ఆకుకూరలకు డిమాండ్ పెరగటంతో దాన్ని క్యాష్ చేసుకుందామనే ఆశతో అడ్డమైన ఆకు కోసుకొచ్చేసి అమ్మేస్తున్నట్లున్నారు (వినాయక చవితికి ఏవేవో ఆకులు తీసుకొచ్చి పత్రి పేరుతో అమ్మేస్తారు చూశారా, అలాగన్నమాట). కొనేవాడి ఆరోగ్యం గురించిన చింత అమ్మేవాడి ఉండదు కదా?
జాగ్రత్త వహించండనే మాట చెప్పిన బోనగిరి గారికి ధన్యవాదాలు.
ఇక్కడ విషయం, ఒక కూర బదులు ఏదో పిచ్చి కూర అమ్మడం.
Deleteకాని అసలు కూరే అయినా నగరాల్లో పండించినవి తినక పోవడమే మంచిది. ఎందుకంటే మేము దిల్లీ లో ఉండేటపుడు యమునా నది తీరాన పండించే కూరలని తినవద్దని అక్కడి వాళ్ళు చెప్పేవారు. అక్కడ యమునా నది ఎంత కలుషితంగా ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ పండించే కూరల్లో కూడా భార లోహాల అవశేషాలు చేరతాయి. వీలైనంత వరకూ పల్లెల్లో పండినవే తినాలి.
బోనగిరి గారు,
Deleteఏదో పిచ్చి కూరని పొన్నగంటి కూరని అమ్మెయ్యడం, అలాగే కనపడే దానిని కొత్తి మీర అని అమ్మెయ్యడం దారుణాలేనండి.ఎప్పుడూ పొన్నగంటి కూర మొహం కూడా చూడని మగమ్మగార్లూ ఉండచ్చు కదండీ :) నదుల పక్కన పెరిగే కూరలన్నీ ఈ రోజుల్లో భార లోహాలతోనే ఉంటున్నాయండి. పల్లెలలో కొంత మేలు.
బోనగిరి గారు, విన్నకోటవారు.
ReplyDeleteఏ మనుకోకండీ!నిజానికి దారుణాలే జరుగుతున్నాయండి. కలికాలం అనుకున్నాగాని మరీ ఇంత దారుణమా? ఆకలికాలం ఐపోయిందే. పొన్నగంటి కూర కల్తీ, చిన్నమాట కొత్తిమీరిలో మరో ఆకు అలాగే ఉండేది కలిపి అమ్మేస్తున్నారట. మరో ముఖ్యమైనమాటే హైదరాబాద్ పరిసరాల్లో దొరికే ఆకుకూరలన్నిటిలోనూ జింక్ మరి ఇతర భారలోహాలు ఎక్కువగానే ఉంటయటండి, కారణం, మురుగు నీటితో పండించడమని అంటారు. మురుగు నీటితో పెరిగే అన్ని ఆకు కూరల్లోనూ భారలోహా అవశేషాలు ఎక్కువ ఉంఆటాయట,ఏమనుకోకండీ