Tuesday, 1 December 2020

మూర్ఖత్వానికి మందు లేదు.

 


జగత్సర్వం శివమయం


నిన్న సాయంత్రం నడకకు వెళుతుంటే ఒక ఇంట కనిపించిన దృశ్యం. నమశ్శివాయ.


శక్యోవారయితుం జలేన హుతభుక్చత్రేణ సూర్యాతపో

నాగేన్ద్రో నిశితాజ్క శేన సమదో దణ్ణేన గార్ధభః

వ్యాధి ర్భేషజనజ్గ్రహైశ్చ  వివిధైర్మన్త్ర ప్రయోగైర్విషం

సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధమ్


జలముల నగ్ని ఛత్రమున జండమయూఖుని దండతాడనం

బుల వృషగర్ధభంబులును బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం

జెలగెడురోగ మౌషధముచే విషముం దగుమంత్రయుక్తి ని

మ్ముల దగ జక్కజేయనగు మూర్ఖుని మూర్ఖతమాన్పవచ్చునే......లక్ష్మణ కవి


అగ్నికి నీరు,ఎండకు గొడుగు, మదగజమునకు అంకుశము, ఎద్దు గాడిద మొదలగు జంతువులకు కఱ్ఱ, రోగమునకు మందులు, సర్వవిషంబులకును పలు విధములగు మంత్రములు నివారకములుగా చెప్పబడుచున్నవి కాని మూర్ఖుని మూర్ఖత్వమును  పోగొట్టే మందు ఎక్కడా చెప్పబడలేదు.

 

”నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు”.  మరీ మూర్ఖంగా ఉందా? కొంచం సున్నితమైనది చెప్పుకుందాం "తా వలచింది రంభ, తా మునిగింది గంగ" ''నైజగుణానికి లొట్టకంటికి మందు లేదని'' సామెత,అలాగే మూర్ఖతను తొలగించే మందు లేదు





15 comments:

  1. తివిరి ఇసుమున దైలంబు దీయవచ్చు
    దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
    దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
    జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ||

    అన్నాడు కదా ఏనుగు లక్ష్మణ కవి (భర్తృహరి సుభాషితాలు). అది అన్ని కాలాలకూ అన్వయిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఇది చాలా సార్లు ఉపమానాలతో చెప్పుకున్న మాట కదండీ

      Delete
    2. ఎవరి నుపమించి చెబితిరి ?
      కవులన ? పండితులన ? ఘనకామెంటేటర్
      ధవులన? వివరించిన, మా
      కవి దెలిసి, మసలుకొనంగ గాదే , సారూ !

      Delete
    3. మిత్రులొకరు చెప్పిన ఉపమానం చెప్పుకున్నానండి.
      చిత్తగించండి

      http://kasthephali.blogspot.com/2019/10/blog-post_28.html

      Delete


  2. రాయి యైననేమి విభుని ప్రాభవమ్ము
    లేని స్థలమేది నుతులివె లెస్స గాను
    నాదు దైవము నాదుగాన! గలడాత
    డిచట రుబ్బురోలున టబ్బు డిబ్బు లోన!


    జిలేబి

    ReplyDelete
  3. రుబ్బురోలు శివునిరోలు పోషించెను
    సరి జిలేబి విష్ణు చక్రమయ్యె
    పొరక లక్ష్మిదేవి ఫోజున విలసిల్లె
    మ్రొక్కులిడగరాని మూర్తి లేదు .

    ReplyDelete
    Replies


    1. సింధుకన్య చూడ చీపురాయె మదిని
      తట్టి నట్టి పొడ చిదాత్మ గాదె!
      విష్ణు చక్ర మాయె వింతయైన జిలేబి
      రాజు గారి పద్య రాజమందు


      జిలేబి

      Delete
    2. ఇందుగలడందు లేడను
      సందేహము వలదు చక్రి సర్వోపతౌం
      డెందెందు వెదకి చూచిన
      అందందే గలడు డానవాగ్రణి వింటే

      వెదుకుడీ దొరకును.

      Delete
  4. ನೇಟಿ ಲೋಕಂ ತೀರು
    ಮೆಕ್ಕೇ ವಾರು ಎಕ್ಕುವ ಮೋಕ್ಕೇ ವಾರು ತಕ್ಕುವ

    ಶುಭ ಸಾಯಂತ್ರಂ ಶರ್ಮಾಚಾರ್ಯಾ (ಶುಭ ಸಾಂಜೇ ಶರ್ಮಾ ಆವರೇ)

    ReplyDelete
    Replies
    1. సమజ్ గాలా

      Delete
    2. గిందులో సమజ్ గానికి ఏమున్నది శర్మాచార్య.. గిది గిప్పట్ కాలం ముచ్చెట.. "నేటి లోకం తీరు జర గిట్లుంది.. మెక్కనికి మస్తు ముందుగాల ఉంటరు జనాల్.. మొక్కనికి జరా సోచాయిస్తరనట్టు".. ఇగో నే సెప్పే దేవిటంటే ఆచార్య.. ఆస్తి ఉన్నదనుకో ఆ ఇంట్లనే ఎవులెవులికెంతెంత గావలో తుక్డాల్ తుక్డాల్ జేస్కుని మంచిగ వురుకుతరు.. గదే ముచ్చట పెద్దలంకు మొక్కండ్రి.. వారే నైకుంటే మనమూ లేము తదా అంతే.. ఓ మాకేమ్ జేసిండ్రు అంతారని చెప్పనికే అట్ల.

      Delete
  5. విష్ణు రూపే శివం శివరూపాయ విష్ణవే
    ఇయమ్ కార్తీకం ఉపాస్మహే శివకేశవ హరిహరం

    ReplyDelete
    Replies
    1. విశ్వం విష్ణుః
      సర్వం విష్ణుమయం జగత్
      సర్వం శివమయం జగత్
      శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
      ఇదే అద్వైతం

      Delete