Sunday 6 December 2020

ధైర్యగుణం

 కవర్ధిత స్యాపి హి ధైర్యవృత్తే

ర్న శక్యతేధైర్యగుణఃప్రమార్షుమ్

అధోముఖ స్యాపి కృతస్యవహ్నే

ర్నాధః శిఖా యాతి కదాచి దేవ


నియతిచేత గదర్దితుం యిన ధైర్య

వరుని ధైర్యగుణంబు మాన్పదరమె?

క్రింది సేయంగబడినట్టి కృప్మపధుని

కీల యెందైన మీదుగా గెరలుగాదె!


ధైర్యవంతునికి ఎట్టి దుఃఖము సాంభవించినను అతని ధైర్యము పోగొట్టుట సాధ్యము. అగ్నిని తలకిందులు చేసినను అగ్ని జ్వాల ఊర్ద్వముగానే ప్రసరించును కాని అధో ముఖముగా ప్రసరించదు. 


ధైర్యవంతుని ఎన్ని కష్టాలు వచ్చినా, తెచ్చి పెట్టినా ధైర్యము చెడగొట్టలేరు. తను చేయదలచుకున్న పనిని చేసి తీరుతాడు.కష్టాలు నీటి అలలలాటివి వచ్చిపోతుంటాయి. కష్టాలు కలకాలం కాపురం ఉండవని సామెత, అలాగే సుఖాలూ కాపురం ఉండవని తెలుసుకోవాలి.అగ్ని జ్వాల ఎప్పుడూ పైకే ఉంటుంది, అగ్నిని తలకిందుకుచేసినా ఏం చేసినా జ్వాల పైకే ఉన్నట్టు ధైరవంతుని ధైర్యం కూడా ఎప్పుడూ నిలచి ఉంటుంది, ఎప్పుడూ ఎవరూ చెడగొట్టలేరు. 

12 comments:

  1. శర్మ గారు,
    ఒక రాజు గారి కథ ఉంది మీకు తెలుసుగా. ఆయనకు దరిద్రం పట్టి ఉన్న సంపద, వైభోగం అంతా పోతోందట. అప్పుడు ఆయనింట్లో నుండి అష్టలక్ష్ములు ఒక్కరొక్కరుగా వెళ్ళిపోతున్నా ఆయనేమీ బతిమాలలేదట గానీ ధైర్యలక్ష్మిని మాత్రం వెళ్ళద్దంటూ - నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ధైర్యాన్ని కోల్పోయి ఏమీ సాధించలేను, ధైర్యం తోడుగా ఉంటే చాలు పోయినదంతా తిరిగి సంపాదించుకోగలను, అందువల్ల నువ్వు మాత్రం నన్ను విడిచిపోవద్దు - అని వేడుకున్నాడట (ఏదో గుర్తున్నంత వరకు వ్రాసాను).

    ఆ రాజు గారి మాట నిజమే కదా, ధైర్యం కోల్పోతే డీలా పడిపోయి కూర్చుండి పోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు.

    పైన మీరు ఉదహరించిన పద్యం ఎవరిది, శర్మ గారూ?

    ReplyDelete
    Replies
    1. ధైర్యం చెడితే సర్వం చెడినట్టే కదండీ
      ఇది భర్తృహరి సుభాషితం, లక్ష్మణ కవి తెనుగు పద్యం

      Delete
    2. ధృతి యారోగ్యము నిచ్చును
      ధృతి యుజ్వల లక్ష్మిదెచ్చు , ధృతి కీర్తి సము
      న్నతుజేయు .....

      Delete
    3. ధృతియె సర్వస్వంబౌ

      Delete


  2. వదలడు ధైర్యము కడగం
    డ్లు దిట్టతనమును సడలుకొలుప జోదు భళా
    కుదురుగ నగ్ని నెగయు దా
    ని దెసను తల క్రిందు చేయ నేమి జిలేబీ!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తప్పు సవరించాను జిలేబీ గారు :-)
      ==================== సరిగ్గా రాసిన పద్యం ========
      వదలడు ధైర్యము కడగం
      డ్లు దిట్టతనమును సడలుకొలుప జోదు భళా
      కుదురుగ జుట్టిన జిలేబి దా
      ని దెసను ఎటు పక్కకు తిప్పిన జిలేబీ!

      Delete
    2. DG గారు,
      జిలేబి కే తప్పులు చెప్పుటా? జిలేబికి హింసించుట, పరిహసించుట తప్ప మరేదియును తెలియదే! తప్పులు దిద్దుటా? హా హతవిధీ! ఎంత సాహసమెంత సాహసము. :) పెద్ద పెద్ద గురువులే సాహసింపలేదే :)

      Delete


    3. తప్పైన తప్పు సవరణ :)


      వదలడు ధైర్యము కడగం
      డ్లు దిట్టతనమును సడలుకొలుప జోదు భళా
      కుదురగు జిలేబి భళి దా
      ని దెస నిటునటు నెటు ద్రిప్పనేమి చెనటియే!


      జిలేబి

      Delete

    4. * తప్పుగా సవరించిన తప్పుకు సవరణ :)

      Delete
  3. ధైర్య సాహసే విజయలక్ష్మి
    ధృతి సర్వత్ర విరాజమానం

    ReplyDelete
    Replies
    1. సాహసం శాయరా డీంభకా! రాజకుమారి లభిస్తుందిరా!! :)
      (పాతాళ భైరవి)

      Delete