శకారః
అకారాంతః పుల్లింగో రామశబ్దః రాముడు.
ఇదేంటి? శకారుడన్నారు, వ్యాకరణం చెబుతారేంటి?
ఆ కారాంతః స్త్రీలింగో సీతా శబ్దః, సీతడు.
యస్యజ్ఞాన దయా సింధో
గోడదూకితే అదే సందో
సీతడు కాదూ సీతా అనాలి సీత కాదు. లలిత అనకూడదు లలితా అనాలి.
మీకేదో అయిందీవేళ.
ఆగండి సావీ :)
ఈ శకారుడు అనే కాణేలీ పుత్రుడు మృఛ్ఛకటికం అనే సంస్కృత నాటికలో ఒక పాత్ర. మృఛ్ఛకటికం అంటే మట్టిబండి. అనగా మట్టితో చేసిన ఆటబండి.
ఒక పాత్రకే అంత గొప్ప పేరా?
జేంస్ బాండ్ కి అంత పేరు రాలేదేంటీ? ఈయన విశేషం చెబుదురూ....
ఈ శకారుడు ఒక రాజుగారి రాణీ గారి తమ్ముడు. అదేంటి రాజుగారి బావమరదని చెప్పచ్చుగా? అలా చెప్పేస్తే గొప్పేంటీ? ఈ రాణీ గారి తమ్ముడు బలే వింత వింత అపభ్రంశం పనులు చేస్తాడు, నాటి కాలానికి నవ్వొచ్చేటట్లు వింతగానూ మాటాడతాడు. చేసేవన్నీ...వద్దులెండి అభిమానులకి కోపమొస్తుంది. వీరికి నేటికీ అభిమానులున్నారు మరి.
ఈ శకారుడు వసంత సేన అనే భోగప్పిల్ల వెనక పడ్డాడు. అదేమో ఛీ కొట్టింది, అంతతో ఊరుకుందా? మరో అందగాడిని ప్రేమించింది. ఇక అక్కడినుంచి మొదలవుతాయి, ఈ శకారుని వన్నెలు చిన్నెలూ! అసలే రాణీగారి తమ్ముడు,రాజుగారి బావమరదాయె, ఇతనిలో రాజ్యాంగేతర శక్తి కూడా బయటపడుతుంది. శూద్రక మహాకవిరాసిన ఈ నాటకాన్ని తిరుపతి వేంకట కవులు తెనిగించారు.శకారుని కొన్ని పలుకులు........
1.ఏల పోయెదు పాఱిపోయెదవు తొట్రు
పాటుతో, దయయుంచు చంపము లతాంగి
బొగ్గు నిప్పులలోబడ్డ పొలుసువలెనె
కాల్చుచున్నాడు నామది కంజశరుడు.
2.ప్రక్కపై నిద్రయైనను బట్టకుండ
నాకు మదను ననంగు మన్మధుని వృద్ధి
పఱచి,దశకధరునకు లోబడిన కుంతి
పగిది నెట కేగెదే తొట్రుపడుచు పడుచ.
3.నాణెంబులు హరించు నలినాస్త్రు వేత్రంబు
నంజుడు తినులంజ, నాట్యమాడు.
వెలది,చప్పిడి ముక్కు గలనాతి, వంశంబు
లడగించు కామిని,యవశురాలు,
పూవింటివాని సొమ్ములపెట్టె, విలువైన
భూషణములుదాల్చు పువ్వుబోడి
డబ్బిచ్చి చొరగనాటకంబుగల్గని
మేడగాపురమున్న వాడ వెలది
పడపుమగువల కెల్లర కొడయురాలు
నంచు బది మంచిపేర్లు కల్పించినాడ.
.4.గల్లురని నగల్ మ్రోయగ వెళ్ళెదేల
రామునకు జంకి పరువెత్తు ద్రౌపదివలె
హనుమ, విశ్వావసు చెల్లెలగు సుభద్ర
పగిది,నిను బల్మి హరియించువాడ జూవె
5.అడవిలో వేటకుక్కల కాడునక్క
యడలుగతి బల్మి మాచేత నభిసరింప
బడుచు బరువెత్తె దేటికే వడిగ వేగ
మూలముట్టుగ నా డెందము హరించి.
6.ఏను సుశ్శాసనువలె నిపుడు నీదు
కొప్పుదొరకొందు, జమదగ్ని కొడుకు భీము
సేను డేతెంచి యాపునో చాన కుంతి
కాత్మజుండగు న్దశకంఠు డాపగలడొ?
7.ఉత్తరింతువొ యీవాడికత్తి నీదు
కుత్తుకను బళ్ళుమన దలగొట్టి నిన్ను
జంపుదునో చావుమూడిన జనుడు బతుక
డెందు, నీవేల పాఱిపోయెదవు గోల
8.కటికచీకటిలోగన్ను గానకుండ
బోవుతఱి బూవుదండల తావివలన
నట్టెగుర్తించి కీల్జడ పట్టుకొంటి
యాజ్ఞసేనిని చాణుక్యుడట్లు నేను.
ఇలా ఈ శకారుని పద్దేలు తిరుపతికవులు రాశారు.చాలా ఉన్నాయి కొన్నే నేను ఇక్కడ ఇవ్వగలిగేను. ఇక ఇతనో రాజ్యాంగేతర శక్తి, కాణేలీ పుత్రా అని పిలిచేవారితనిని.ఇక ఇతను రాష్ట్ర శ్యాలకుణ్ణి చెప్పుకునేవాడు. ఇంతటి ఘనుడు బోగం పిల్ల ఛీ కొడితే పీక నులిపేడు, చచ్చిందని కంగారు పడ్డాడు, హత్య చేసేననుకుని హత్యను బోగంపిల్ల ప్రియుడి మీద నెట్టేసేడు. ఇదీ ఈ శకారుని వృత్తాంతం, కొద్దిగా. ఇంతకీ ఏమిటితని గొప్పా? రాజుగారి రాణిగారి తమ్ముడు. ఇతనేం రాజు కాదు మంత్రి కాదు, సేనాపతికాదు, చివరికి భటుడు కూడా కాదు, దర్పం, అధికారం వెళ్ళబోశాడు. ఇటువంటివాడే మరొకరు....ఇంతకంటే ముందువాడే అతనే దుర్యోధనుడు.
దుర్యోధనుడు రాజు కాదు, రాజు ధృతరాష్రుడు, యువరాజా కాదు యువరాజు ధర్మరాజు, మంత్రా? కాదు, సేనాపతా? కాదు చివరికి భటుడు కూడా కాదు. ఇంతకీ ఇతనెవరు రాజుగారి పెద్దకుమారుడు. ఏ అధికారమూ లేదు కాని అధికారం వెళ్ళబెట్టి చివరికి యుద్ధానికి కారకుడై తొడలు విరిగి చచ్చాడు. నేటి కాలానికి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయా? ఎవరేనా గుర్తొచ్చారా? అస్తు.
ReplyDeleteఏమిటీ ఈ మధ్య తాతగారు పజ్జేల మీద పడ్డారు వరసెట్టి :)
వెల్ కమ్ బెక బెక శంకరాభరణమునకు :)
జిలేబి
బుజ్జమ్మా!
Deleteఎవరి మీదా పడే ఓపిక లేదు :)
ఏది శంకరాభరణమా? ఎక్కడా మీకు నిత్య పూజ జరుగుతుంది అదేనా?
అలనాటి మన జానపద సినిమాల్లో రాజనాల లాగా ఉన్నాడే ఈ శకారుడు?
ReplyDeleteఆధునిక కాలంలో మన దేశంలో నాకు గుర్తున్నంత వరకు సంజయ్ గాంధి ఇలాగే రాజ్యాంగేతరశక్తిగా చెలాయించాడు ... చివరకు విమానప్రమాదంలో మరణించేటంత వరకు.
మన బ్లాగులోకంలో "జిలేబి" గారు శకారుడి fan అనిపిస్తారు 🙂 🙂.
విన్నకోటవారు,
Deleteరాజనాల పాత్రలు శకారును వారసులేనండి :)
ఎంతమాటెంతమాటెంతమాట బుజ్జమ్మకి బిరుదిచ్చేశారా? :)
ReplyDeleteతాత శకారుని తలచె! ప్ర
దాతగ పూరణలు కైపదములకు చేర్చం
గా తాత వలె భళా చే
యూత నిడును క్లిష్టమైన యూహలకు సుమీ !
జిలేబి
బుజ్జమ్మా!
Deleteమరి ఆలీసెం ఎందుకు? దున్నెయ్యి :)
మృచ్ఛకటిక.. శకరః.. వసంతసేన.. ఈ కథ ఒహప్పుడు సంస్కృతములోని అధ్యాయనం.. ఐతే ఆ శకరః కు "జగదేవీరునికథ" లో రాజనాల పాత్ర చేసే హడావిడి కనిపించింది.. అతను "హే బాదరాయణ ప్రగ్గెడా" అని పిలవటం.. ఇతను "హే రాజన్" అనటం.. పైపెచ్చు ఆతను ఆ రాజుగారి రాణిగారి తమ్ముడు కావటం.. అక్క ఏదైనా అడిగితే తమ్ములం గారు "నేనున్న కదేటని" రాజ్యాకాంక్షతో విర్రవీగటం.. ఇట్ల చెపుకుపోతే మరో శివశంకరంతటి పాట ఔతోంది. హింది ముహావరా లాగ "ధోబికా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా"
ReplyDeleteశ్రీధరా!
Deleteమృఛ్ఛకటికం చదివారన మాట. శకారుడి అసలు గోలంతా వసంతసేన ఛీ కొట్టిన దానికంటే, బోగప్పిల్ల దరిద్రుడు చారుదత్తుణ్ణి ప్రేమించినందుకు కలిగిన అసూయ కారణం. ఓహో కాణేలీ పుత్రా:) ఏమి నీ సోకు
చారుదత్త చరితమనే అధ్యయనం లో మృచ్ఛకటిక, వసంతసేన, చారుదత్తల గూర్చిన సంగతి యుండేది ఆచార్య..!
ReplyDelete~శ్రీ