ధనం-పరిశేషన్యాయం
దానం భోగో నాశ స్తిప్రో గతయో భవంతి విత్తస్య
యన్న దదాతి న భుజ్త్కే తస్య తృతీయా గతి ర్భవతి
ధనమునకు దానము, భోగము, నాశము అనే మూడు గతులు చెప్పబడుచున్నవి. మొదటి రెండునూ లేని ధనము మూడవ గతినే పొందును.
దానము, ఈ పేరు చెబుతేనే చేతులు మోరలు దిగిపోయి వెనక్కి పోతాయి. చూస్తూ చూస్తూ ఒక్క రూపాయి దానం చెయ్యలేము. ఎండలో చెమటలు కక్కుకుంటూ మనల్ని ఎండ తగలకుండా తీసుకొచ్చిన రిక్షావానికి నాలుగు రూపాయలకి గీచి బేరమాడి, చిల్లరలేకపోతే దానికోసం పంపి రూపాయి మిగుల్చుకునే వాళ్ళం.ఇదే ఒక్కరినో ఉద్దేసించక్కరలేదు. నేడు అందరం ఇలాగే ఉన్నాం, ఎక్కడో ధర్మాత్ములు కొందరున్నారు, వారి గురించిన మాట కాదిది. దానం చేయగలిగి చేయకపోవడమెంత తప్పో దానం చేయడానికి తాహతు లేక దానం చేయడమూ పొరబాటే. అన్నిదానములకన్న అన్నదానము మిన్న, కాదననుగాని విద్యాదానం మరింత మంచిది. ఇలా వ్యయమైన సొమ్ము సద్గతి పొందినదే.
ఇక రెండవది భోగం. అనుభవమే భోగం, ఎంత తగినంత. అంటే సౌకర్యమైన ఇల్లు, భోజనము, ఇతర సౌకర్యాలకి తగినంత, ఆడంబరాలు కాదు. తనకు తనవారి కొరకు ఖర్చు పెట్టని సంపాదన వ్యర్ధం. మొన్ననీ మధ్య ఒకరితో మాటాడుతుంటే, ధనం సంపాదనకే సమయం పూర్తిగా వెచ్చిస్తే అనుభవానికి సమయం ఉండదంటే! సంపాదించలేక, సంపాదించే వారిని చూసి అసూయ కొద్దీ అంటున్న మాటన్నారు. ఏమో! నాకైతే అనుభవించలేని ధనం ఎందుకు? అంకెలలో చూసుకోడానికా? బంగారం,వెండిలలో చూసుకోడానికా? ఇళ్ళు పొలాలలో చూసుకోడానికో తెలీదు. ధనం, పాడె కొమ్ములకి కట్టరు, కూడా రాదు,తీసుకెళ్ళలేం. గోరెడు మట్టి కూడా రాదు, అలా ఒక్కొకరు తీసుకెళ్ళగలిగితే ఈ భూమండలం ఉండేది కాదు. ఒకప్పుడు శవం మీద పువ్వులు రూపాయలు జల్లేవారు, తీసుకెళ్ళేటపుడు. శవయాత్రకి ముందు మంగళవాద్యాలు కూడా ఉండేవి, నేటి వారు నమ్మలేరు, కాని ఇది నిజం..ఇప్పుడదీ మానేశారు.ఇలా ఖర్చైన ధనమూ సద్వినియోగమే..
మూడు రకాలు చెప్పి మొదటి రెండూ కాదంటే మూడవదనే అర్ధం. దీనే పరిశేషన్యాయం అంటారు.
పై రెండు విధాలా ఖర్చుకాని ధనం చివరికి దొంగలకిత్తురో దొరలకవునో... ఎవరికి తెలుసు?కడుపున పుట్టిన బిడ్డలే, తల్లి తండ్రులను, హింసించినా,పరిహసించినా,అవమానించినా, వారికే తమ సొమ్మును ఇచ్చి పోయేవారి ధనం కూడా మూడో కోవకే చెందుతుందేమో! కలిగినంతలో దానం, అనుభవం ఆనందాన్ని కలగజేస్తాయి.
ఇది తెలియనివారెవరు? కాని సమయానికి మాయ తెర కప్పేస్తుంది.
దానము భొగము నాశము
పూనికతో మూడు గతులు భువి ధనమునకున్
దానము భోగము నెఱుగని
దీనుని ధనమునకు గతి దృతీయమె పొసగున్.....లక్ష్మణకవి
ధనమును గూర్చి చక్కటి ఉహూ చిక్కటి టపా పెట్టినారు శర్మాచార్య. ఔనౌను నేనూ మీతో ఏకిభవిస్తాను.. మొదటిది చేసి ఒకరు నాశనం అయ్యాడట: దానవీర శూర కర్ణ, బలి చక్రవర్తి.. ఇహ రెండవది చేయకపోతే అసలు కే ఎసరు.. "నువ్వూ తినవు.. నీవారికీ పెట్టవు" అనే చందాన ఉంటుంది ఉదాహరణ.. రెండవది చేసి మరొకరు నాశనం అయ్యాడు అతనే దుర్యోధనుడు, రావణాసురుడు.. అనక మూడవది తాను రాత్రింబవళ్ళు అహోరాత్రులు నిద్రాహారాలు మానుకుని ఆర్జించిన సొమ్మును మంచి పుత్రుడుంటే దానిని సైతం కంటికి రెప్పలా కాచుకుని "నా తండ్రి సంపాదించిన ఆస్తి" అంటు దాచుకుంటాడు, చెడు పుత్రుడైతే.. "ఎలాగు నాకే దక్కాల్సిన ఆస్తే కదా అంటు బలాదూర్ ఖర్చు పెట్టేసి చివరాఖరున నాకు ఆస్తి సరిపడినంత కూడా ఇవ్వలేదని వాపోతు తండ్రినే చులకన చేసే రకం", అలా కాదని మంచి అల్లుడైతే "మామగారు తన కూతురి పేరిట ఇచ్చిన ధనమది తనకే చెందాలని" తన భార్య అవసరాల మేరకే తన మామ ఇచ్చుకున్న ధనాన్ని వాడుతు కాపాడుకుంటు వస్తాడు. అదే చెడ్డ అల్లుడైతే.. "ఇచ్చిన సొమ్మునంత తన పేరిట రాయించుకుని జల్సాలకు వాడుకుంటు తన భార్యకు ఆర్థిక అవసరం వచ్చినపుడు పుట్టింటికి పంపే రకం".. మంచి కూతురైతే.. "నాన్నగారు ఇచ్చిన సొమ్మును జాగ్రతగా వాడుకోవటానికి ఇష్టపడుతు" తనవారి ఆదరణ ను మెచ్చుకుంటుంది. చెడ్డ కూతురైతే "నాన్న ఆస్తి లో నాకు పావు వంతే ఇస్తాడా అంటు బ్లాక్ మెయిల్ చేసి మరీ తన భర్త తో షరతులు పెడుతు మీరెటు వెడితే నాకేంటి.. నన్ను మీ తర్వాత సాకేవాడు నా భర్త కనుక మరో అర వంతు నాకు తనకి రాసిచ్చిమంటు కన్న పేగును, తోడబుట్టిన వారికి ఆపదలను కొనితెచ్చిపెట్టే రకం."
ReplyDeleteఎవరో అనట్టు ఇది కలికాల మహిమ కాదు, కాలం ఎపుడు ఒకలానే ఉంది, మనిషికి స్వార్థం పెచ్చు మమీరే కొద్ది అసూయ, లాలూచి హెచ్చి తన వారి పట్లనే హేయంగా వ్యవహరిస్తారని..!
Deleteదుర్యోధనుడు,రావణుడు వీరిద్దరూ దురాశా పరులు. ఇక కర్ణుని దానం ప్రతిఫలం ఆశించినది. కర్ణుని గురించి ఎనిమిది టపాలున్నాయి,
శర్మ కాలక్షేపంకబుర్లు-అసూయ,ఆత్మన్యూనత
లింక్ మొదలుగా. బలి దానం, అధోగతి అవుతుందని తెలిసి కూడా చేసిన దానం. ఇక నేటి కాలానికి ధనమేరా అన్నిటికి మూలం...
ReplyDeleteధనమొక శక్తి జిలేబీ
మన కవసరమైనది సరి మన్నగ నిలలో
మనుగడకు మించి వ్యర్థమ
గును సద్వినియోగము సరి గూడక సుదతీ!
జిలేబి
నెత్తిన బెట్టుక పోయే
ReplyDeleteదుత్తిదనియు దెలుసు, గాని, ఒక్కండైనన్
సుత్తి కబుర్లాడక, ధన
మత్తెరగున ఖర్చుసేయు మాన్యులు కలరా!?
Deleteరాజావారు,
ఉన్నారున్నారున్నారూ ఈ లోకంలో
తరతరాలుగా రకరకాలుగా
తమ దారీ తీరే వేరుగా
నరులున్నారున్నారున్నారూ ఈ లోకంలో
మచ్చుకి తమరు నిత్యాన్నదానం చేస్తున్నారు, పోలేరు తల్లి గుడి కట్టిస్తున్నారుగా!
Deleteకలరా అంటే కలరం
డి! లెస్స గ జనాళి సేవ డిగనురుకులతో
డిలలో చేయుచు జీవిత
ములలో మార్పులను తెచ్చు మునిరాజన్నై !
జిలేబి
నేనెంతటివాణ్ణండీ !
Deleteమానితముగ గడ్డిపరక మాడ్కి , నావ
ద్దేనిధులూ లేవు,దెలియ
నేనందరలోకి చివర నిలుతు మహాత్మా !