అదృష్టవంతుని చెరిపేవాడు
రాతిరి మూషికంబు వివరం బొనరించి కరండబద్ధమై
భీతిలి చిక్కి యాస చెడి వెద్దయు డస్సినపామువాత
సం పాతము జెందె దానిదిని పాము దొలంగె బిలంబుత్రోవనే
యేతఱి హానివృద్ధులకు నెక్కటి దైవము కారణం బగున్.
ఒకడు, ఒక తాచును పట్టుకుని బుట్టలో పెట్టి ఇంటవుంచాడు. పాము ఆకలితో నకనకలాడుతూ ఉంది. ఏమీ చేయలేక అసహాయoగా పడి ఉంది,ఆశ వదులుకుంది.ఆకలికి తోడు రేపేం జరుగుతుందో తెలీదు. ఇంతలో ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ, బుట్టకి కన్నం చేసి లోపలికి ప్రవేసించింది, ఆకలితో ఉన్న పాము ఎలుకను మింగి, ఆ ఎలుక చేసిన కన్నంలోంచి పారిపోయింది. ఇది దైవ వశాత్తు జరిగింది. అంటే అదృష్టవంతుని చెరిపేవాడు, దురదృష్టవంతుని బాగు చేయగలవారు లేరు, ఒక్క దైవం తప్పించి.అదృష్టవంతునికి అవకాశాలు కలసివస్తాయి.అననుకూల పరిస్థితులలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆపద నుంచి బయట పడటం దైవయోగమే!దైవయోగం లేకనే ఎలుక బలైపోయింది, అన్న వస్త్రాలకి పోతే ఉన్నవస్త్రాలే పోయాయి, ప్రాణమే పోయింది. తనపై విసిరిన ఇటుకలతోనే కోట కట్టుకున్నవాడు అదృష్టవంతుడు.నేటి కాలానికి ఉదాహరణ చెప్పగలరా?
భగ్నాశస్య కరణ్డ పిణ్డితతనో ర్ల్మానేనిన్ద్రియస్య క్షుదా
కృత్వాఖు ర్వివరం స్వయం నిపతితీ నక్తం ముఖే భోగినః
తృప్తస్త త్పిశితేన సత్వర మసౌ తేనైన యాతః పధా
స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్దౌ క్షయే కారణమ్...
మీ ఊళ్ళోను, ప్రక్క ఊళ్ళల్లోనూ ఈ నెల 26 వరకు సెక్షన్-144 విధించారని టీవీలో చూశాను. అంత సమస్యేమి వచ్చింది, సర్?
ReplyDeleteవిన్నకోటవారు
Deleteవడ్లగింజలో బియ్యపు గింజ.తల్లీ బిడ్డాన్యాయంగా తాజా మాజీ ఎమ్.ఎల్.ఎ లు ( ఇద్దరూ బంధువులే) మధ్య మాట పట్టింపొచ్చింది.అది సత్య ప్రమాణాల దాకాపోయింది.అభిమానులకు బాధ కలిగింది. పోలీస్ లకు భయం కలిగింది. ప్రజలకు 144 కలిగిందండి, మీడియా వారికి పండగొచ్చింది.
ఇంతకీ ప్రమాణాలు ఏం చేశారు? అవతలి వారు అవినీతిపరులనా లేక తాము నీతిపరులమనా?
DeleteGood question, Surya.
Deleteఇల్లాలికి చెప్పకుండా ఏ పనీ చెయ్యము అని శర్మ గారు అన్నారు కరక్టే (అందరిదీ అదే తంతు కదా 🙂) కానీ ... ఇప్పటికీ నాకు అర్ధం కానిది ఈ ప్రమాణాల కార్యక్రమంలో భార్య పాత్ర ఏమిటి అని? భర్త చేసిన సత్యప్రమాణాన్ని ఆవిడ second చేసినట్లో లేదా సాక్షి సంతకం చేసినట్లో అనుకోవాలా?
హేమిటో డ్రామాలు? ఇటువంటి వాటి గురించి ఆలోచిస్తే మన సమయం వృధా చేసుకోవడం అవుతుంది. శర్మ గారు కూడా అక్కడతో వదిలేద్దాం అన్నారుగా.
సూర్యగారు,
Deleteఎక్కడైనా కత ఒకటేనండి, చెప్పడంలో తేడాలేమోగాని.
వినపళ్ళా :)
విన్నకోటవారు,
Deleteసపత్నీం. అన్నిటికి అమలు చేయడాం మా అలవాటండి, కష్టంలో సుఖం లో ఆమె సగం, దానిని మనసా,వాచా,కర్మణా నమ్ముతాం.అదండి తిరకాసు.
ఉరుమురిమి మంగలం మీద పడింది అన్న సామెతలాగా ఉంది.
ReplyDeleteఇందాక ఓ టీవీ చానెల్ ఏదొ బ్రహ్మోత్సవాలు చూపించినట్లుగా చూపించింది మీ ఊరిలోని / బిక్కవోలు లోని తతంగం అంతా. ఆ రిపోర్టర్ కి నోటెంబడి నురగలు రావడం ఒకడే తక్కువ, కామాలు ఫుల్-స్టాపులు లేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు.
ReplyDeleteబిక్కవోలు గణపతి గుడి దగ్గర "టెన్షన్ .... టెన్షన్" అనీ, సరే భారీ పోలీసు బందోబస్తు అనీ, బయలుదేరిన ఎమ్మెల్యే / మాజీ ఎమ్మెల్యే, ఆలయానికి జేరుకున్న ఎమ్మెల్యే / మాజీ ఎమ్మెల్యే ... అంటూ రన్నింగ్ కామేంటరీ. టీవీలు పండగ చేసుకున్నట్లున్నాయి.
అసలు సత్యప్రమాణం చెయ్యడం ఏమిటి? అది కూడా భార్యాసమేతంగానా? పాపం, మధ్యలో వాళ్ళేం చేసారు? పేకాట క్లబ్బులు, ప్రభుత్వ భూములు, పట్టాలు ... అంటూ ఏమిటేమిటో అన్నారు.
ఇంతకీ ప్రమాణాం చేసిన ఫలితంగా మాకేమీ భూమి కంపించలేదే, ఆకాశం గర్జించలేదే, నదీజలాలు అల్లకల్లోలం అవలేదే (కోస్తా ప్రాంతంలో కెరటాలు ఎగసి పడ్డాయా?) .... మీ దగ్గరేమన్నా అటువంటివి కనిపించాయా?
ఎందుకొచ్చిన డ్రామాలండీ? అందులోనూ కరోనా సమయంలో? జనాల్ని వెర్రివాళ్ళను చేయ్యడం, కొన్ని గంటల సేపు జనజీవనాన్ని అస్తవ్యస్తం చెయ్యడం తప్ప? దీనికి తోడు పోలీసుల సమయాన్ని వృధా చెయ్యడమా? అసలు ఇవాళ్టి ఆ బందోబస్తు ఖర్చు ఆ ఇద్దరు నాయకుల వద్ద నుండి వసూలు చెయ్యాలి పోలీసు శాఖ.
>>రిపోర్టర్ కి నోటెంబడి నురగలు రావడం ఒకడే తక్కువ
Delete😆😆😆😆😆
మా ఊరికి పది కిలో మీటర్లలో ఉన్నది బిక్కవోలు,బహు పురాతన గ్రామం,మండలం/గ్రామం మా నియోజకవర్గంలోదే!
Deleteమా గోజిలకి రాయలసీమ కళలు కొన్ని వస్తున్న సూచనలు కనపడుతున్నాయి. రాయలసీమలో కాణిపాకం వినాయక ఆలయం ప్రసిద్ధి, అక్కడ చేసిన ప్రమాణం సత్యమని నమ్మిక. మా బిక్కవోలులో, ఇరవై సంవత్సరాల కితం ఒక రైతు పొలంలో వినాయక విగ్రహం దొరికింది,చాలా భారీగా ఉంది, పూర్తిగా తవ్వలేక రైతు వదిలేస్తే అక్కడే ఔత్సాహికులు గుడి కట్టేసేరు. ఈ విగ్రహం సరిగా కాణిపాక ఆలయం విగ్రహం లా ఉంటుంది. రెండూ నేను చూశాను. ఇక బిక్కవోలు అన్నది బిక్కినవోలు, ఇక్కడ పురాతత్త్వశాఖవారి ఆలయాలున్నాయి, మొన్న జరిగిన షష్టి సుబ్రహ్మణ్య ఆలయం అటువంటిదే! బహుశః సత్య ప్రమాణాలు ఇలా మొదలై ఉంటాయి. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు.మనం ఇక్కడితో ఆగిపోదాం :)
ఇక మీడియావారికి పండగేనని మొదటే శలవిచ్చాను కదా!
తాజా,మాజీ ఎమ్.ఎల్.ఎ లు ఇద్దరూ బాగా చదువుకున్నవారే,బంధువులు కూడా. ఒకరు డాక్టరైతే మరొకరు ఇంజనీరు.భార్యలతో అని కదా తమ అనుమానం,మాకో అలవాటు ఏపనైనా భార్యకి తెలియక చేయం, అందుకే సపత్నీ...
ReplyDeleteఉరుము ఉరుమి అంటే ఇదే కామోసు :)
మధ్యలో " మా " రాయల సీమను అదిన్నూ ~ మా కాణిపాకం గణపతయ్య ని లాగటమెందుకు ? మా సామి దగ్గిర సత్తె పెమానం సత్తె పెమానమే.
జిలేబి
కాణిపాకం గణపయ్య కాలం వాడే మా గణపయ్య, ఆ ప్రాంతంలో పెద్ద శివాలయం ఉంటుందని పెద్దల మాట. తవ్వకాలు జరగలేదు.
Deleteమీకు లాగే మాకూ ఓ గణపయ్య ఉన్నాడు, మేమూ సత్తెపెమాణాలు చేసుకుంటాం, మీరేకాదని చెప్పడమే.అక్కడా గణపయ్య సత్తెమే ఇక్కడా సత్తెమే
"జిలేబి" గారు రాయలసీమ వారెప్పుడయ్యారు, తూగోజీ వారు కాదా?
ReplyDeleteఅనపర్తి సత్యప్రమాణాల ధోరణి ఇతర చోట్లకూ కూడా వేగంగా వ్యాపిస్తున్నట్లున్నదండీ. ఇందాక టీవీలో చూశాను - వైజాగులో టీడీపి MLA మీద ఆరోపణలు చేసారట, ప్రమాణం చెయ్యాలని డిమాండుట, ప్రమాణం చేస్తానని MLA గారు అన్నారట.
ReplyDeleteఆధునిక భారతంలో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అపహాస్యం చేస్తున్నట్లు అనిపిస్తోంది. మన జీవితకాలంలోనే ఇటువంటి తమాషాలు చోటు చేసుకుంటాయని, మనం చూడాల్సి వస్తుందనీ ఏనాడూ అనుకోలేదు.
వోరి డ్రామాలో 😒 !
విన్నకోటవారు,
Deleteఅటు గుంటూర్ నుంచి కాణిపాకనికీ ఇటు శ్రీ కాకుళం నుంచి బిక్కవోలుకీ ప్రమాణాల కేంద్రాలుగా ప్రకటించేస్తే! ఎంత సౌలభ్యం:) ఎంత బాగుంటుంది, టూరిజం డేవలప్మెంటూ, హిందూత్వం పెరిగిపోయిందనచ్చూ, ఎన్ని ఉపయోగాలు, ఎవరేం చెప్పిన విని వూరుకునే మధ్యవర్తీ, ఎవరికి వారు సత్యమని ప్రకటించుకోవచ్చూ. ప్రమాణాలలో భాషలో తిరకాసులకి లాయర్లకి పనీ. ఎంత అభివృద్ధి చెప్పండి. మీరేదో కోప్పడితే ఎలా :)
🙂🙂
Deleteకరక్టే, శర్మ గారు. ఇటువంటి అర్ధం లేని సవాళ్ళు, ప్రమాణాలు ఇక ఎలాగూ ఆగవు కాబట్టి మీరన్నట్లు వాటిని వాడుకుని ప్రభుత్వం టూరిజO వగైరా అభివృద్ధి చేసుకోవడం ఉత్తమం 😀😀.