Tuesday 8 December 2020

సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడు.

   సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడు.


సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడనిగాని సొడ్డిస్తూ బావగారు అడ్డెడూ చెల్లించాడనిగాని అంటుంటారు.


సొడ్డు అంటే చాలా చాలా అర్ధాలిచ్చింది ఆంధ్ర భారతి, లేవిడీ కొట్టడం, పేర్లు పెట్టడం, ఏదో తక్కువైందనడం,తప్పుపట్టడం అని చెప్పుకోవచ్చు, మరి కతేంటో చూదాం :) 


ఒక అల్లుడు అత్తింటికొచ్చాడు, సాయంత్రానికి, మరునాడు గారెలు వండుదామని అనుకుంటూ ''శేరు పప్పు పోయానా?'' అడిగింది అత్త పక్కనే ఉన్న కోడలిని.

''కాదత్తా మూడు తవ్వలుపోయండి మనం అల్లుడుతో కలిపి ఆరుగురం కదా! ఇంట్లో పనివాళ్ళు పాలేళ్ళు, వీళ్ళందరికి పెట్టాలిగా'' అంది కోడలు.

అక్కడేఉన్న ఆడపడుచు ''అమ్మా అడ్డెడూ పోసెయ్యవే,సరిపోదేమో, లేకపోతే ''అంది. 

ఇదివిన్న తల్లి అడ్డెడు పప్పూ నానబోస్తూ ''అమ్మాయీ మీ ఆయన గారెలు ఎలా ఐతే బాగ తింటాడే'' అడిగింది.

దానికా ఇంటి ఆడపడుచు ''అమ్మా! నీ అల్లుడుకి, నేతిగారెలంటే మక్కువ,  పాకం గారెలంటే ఇష్టం, ఆవడలు, మామూలు గారెలు, చిట్టి గారెలు, కారపు గారెలు, తోటకూర గారెలు అంటే బాగా ఇష్టం'' అంది.అల్లుడు కొద్ది తిండి పుష్టి వున్నవాడని తెలిసిన అత్త అడ్డెడూ పప్పూ నానబోసింది, రాత్రికి. 


 ఉదయం లేవడంతోనే ఆ ఇంటికోడలు నానబోసిన పొట్టు మినపపప్పుని కడగడానికి పట్టుకుపోయింది, నూతి దగ్గరకి. పొట్టు మినప్పప్పు కడగడానికి నడుములు పడిపోతాయి. ఎన్ని నీళ్ళు పడతాయో చెప్పలేం. నీళ్ళు తోడాలి, పప్పుగాలించాలి,పొట్టు తీయాలి. ఇంటికోడలుకదా, తప్పదు. మొత్తం పప్పుని నాలు భాగాలు చేసి ఒక భాగం కడిగి, రుబ్బురోల్లో వేసి రుబ్బడం ప్రారంభించింది, ఈ లోగా అత్త పొయ్యి వెలిగించి, నెయ్యి ఎసరు పెట్టి అరటాకు ముక్క కోసి తెచ్చుకుని కోడలు రుబ్బి ఇచ్చిన పిండితో గారెలు వెయ్యడం మొదలెట్టింది. ఈ లోగా ఇంటాడపడుచు రెండో వాయి పప్పు కడిగి వదినగారికిస్తే అదీ రుబ్బి అత్తకిచ్చింది. ఈ రెండు వాయిల్లోనూ ఉప్పెయ్య పోవడంతో గారెలేసి బెల్లంపాకంలో కొన్ని,పోపు పెట్టిన పెరుగులో కొన్ని వేసింది, ఆవడలుగా.ఆ తరవాత రుబ్బిచ్చిన పిండితో చిట్టి గారెలు, మామూలు గారెలు వేసింది. పొయ్యి దగ్గర కూచుని గారెలు వేసే ఆమెకూ నడుం లాగుతోంది. ఇంటికోడలు చెప్పే పనిలేదు తోట కూర కాడలా వేలాడిపోయింది. సరే ఇంటాడపడుచుకి తప్పదు భర్త కోసం కదా! పుట్టింట గౌరవం.  పాపం ఆ కోడలు నడుం పడిపోతున్నా మూడో వాయి కూడా రుబ్బిచ్చింది, ఆడపడుచు పప్పు కడిగివ్వగా. ఈ వాయ మామూలుగారెలుగానూ, చిట్టిగారెలు గానూ వేసింది ఆ ఇంటి ఇల్లాలు.  


ఇంటికోడలు ''నాలుగో వాయి ఇంక రుబ్బలేనత్తా నావల్ల కాదూ'' అనేసింది. దానికి అత్త ''అమ్మ కదూ కచ్చా పచ్చాగా రుబ్బి ఇచ్చెయ్యి చాలు, మెత్తగా రుబ్బక్కర లేదు, కారపుగారెలు, వడలుగా వేస్తాను, ఆ చేత్తోనే కొంచం పచ్చి మిరపకాయలు రుబ్బి ఇచ్చెయ్యి'' అని పురమాయించింది. కోడలు కాదనలేకపోయింది. మొత్తనికి అడ్డెడు పప్పూ గారెలయ్యాయి, పాకం గారెలుగా,ఆవడలుగా, గారెలుగా, వడలుగా, కారపు గారెలుగా. వీటిని వేరువేరుగా నిలవచేసింది.అల్లుడిని భోజనానికి లేవమని ఆహ్వానించారు. 


భోజనానికి కూచున్నాడు అల్లుడు. వడ్డిస్తున్న అత్తగారు, పాకం గారెలు వడ్డించింది, ''ఎలా ఉన్నాయల్లుడు గారూ'' అని అడిగింది, ''అత్తా గారెలు బాగున్నాయిగాని పాకం లేత పాకం ఐనట్టుం''దన్నాడు, మళ్ళీ వడ్డిస్తే మాటాడక తిన్నాడు. ఇక ఆవడలు వడ్డిస్తే మెత్తమెత్తగా తింటూ ''పెరుగు చిక్కగా లేదత్తా, గారెలు కొంచం గట్టిగా ఉన్నాయని'' అంటూనే మొత్తం పుచ్చుకున్నాడు. మామూలుగారెలు తింటు ''మెత్తగా లేవు మరికొంచం రుబ్బాలిసింది'' అని తిన్నాడు. మిగిలిన వడలు, కారపు గారెలు తింటూ ''కొంచం కారం వెయ్యాలిసిందని'' మొత్తం తినేసేడు. ఇలా వండిన వాటికి ఏదో ఒక వంక చెబుతూనే మొత్తం వేసిన గారెలన్నీ అల్లుడు చెల్లించాడు. ఇది చూసిన ఆ ఇంటి కోడలు కొయ్యబారిపోయింది,ఇంటి ఇల్లాలు అల్లుడు చర్యకి ఆశ్చర్యపడింది, ఇంటాడపడుచు మాటాడలేకపోయింది. ఎవరికి ఒక్క గారె కూడా మిగల్చకుండా తిన్న అల్లుని తిండి పుష్టికి అత్త ఆనందపడింది. మనకి ఈ నానుడి మిగిలిపోయింది...



35 comments:



  1. ఏదో లీలాప్యాలెస్ కెళ్లి‌ నాజూగ్గా రెండు కొరికి నాలుగు వదిలిపెట్టేసి బిల్లు అత్తగారికి అంటించకుండా ఇన్నేసి కష్టాలు పెట్టేడా ఇంటల్లుడు ? టూ బ్యాడ్ టూ బ్యాడ్ ;)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బామ్మా!
      అలా తినేవారు మరి. ఇప్పటికి పల్లెలలో వీశబూరెలని వేస్తారు, చూశావా ఎప్పుడేనా, తినిఉండవులే.ఆడబడుచు బిడ్డనెత్తుకుని అత్తారింటికెళ్ళేపుడు పెడటారు. వాటిని అత్తవారు ఊళ్ళో పంచి పెట్టుకుంటారు. వీటికీ లెక్క ఉంటుంది. అందరికి పంచిపెట్టరు, లెక్క ఇళ్ళు ఉంటాయి, ఈ వీశ బూరెలు పంచేవి. నేనూ ఆ లిస్ట్లో ఉన్నాలే. అప్పుడపుడు వీశ బూరెలు తెస్తుంటారు.
      మూడు మెతుకులు మూతికి రాసుకునేవాళ్ళకేం తెలుస్తుంది లే!

      Delete
  2. “తిండి కలిగితే కండ కలదోయ్” అన్న గురజాడ వారి సలహాను బాగా పాటించే రకమేమో ఆ అల్లుడు గారు 😀 ? ఇక “సొడ్డిస్తూ” తినకపోతే అరగదని భయమేమో కూడా?

    ఏమిటో శర్మ గారు, “గారెలు”  “వడలు”  అంటూ మీరు వేరువేరుగా చెబుతున్నారు గానీండి ఈ కాలంలో సర్వం జగన్నాథం ....  “గారె” అనే మాట వినబడడమే అరుదై పోయింది, అన్ని చోట్లా “వడ” అనే అంటున్నారు ... హోటళ్ళలోనూ, కేటరింగుల్లోనూ, ఇళ్ళల్లోనూ కూడా.  “పులుసు” పోయి “సాంబారు” వచ్చినట్లు (ఒక విందులో కేటరింగ్ కుర్రాడిని పులుసు వెయ్యి బాబూ అని అడిగితే పులుసు అంటే ఏమిటండి అని తిరిగి అడిగాడు 😒).

    అవునూ, “తోటకూర గారెలు” అంటే ఏమిటి, శర్మ గారు?

    ReplyDelete
    Replies
    1. సొడ్డిస్తూ తినకపోతే దిష్టి తగులుతుందండీ. గారెకి చిల్లుంటుంది. వడకి చిల్లుండదు. అదీగాక వడకి పప్పు మెత్తగా రుబ్బక్కరలేదు. వడల్లో అల్లం, పచ్చిమిర్చి,వెల్లుల్లి వేస్తారు, కొంతమంది తోటకూర కూడా సన్నగా తరిగి వేస్తారండి.

      Delete
    2. వెల్లుల్లి కూడానా 😒? హుఁ, లోకో భిన్నరుచిః.

      గారె వడ మధ్య తేడా ఏమిటో ... ఏదో సినిమాలో అన్నట్లు "మీకు తెలుసు, నాకు తెలుసు", ఆ తరం వారికి తెలుసు. కానీ ఈ తరం వారికి తెలుగు కన్నా పరాయి భాషా పదాలే ముద్దు కదా, అందువల్ల వాళ్ళ దృష్టిలో గారె వడ రెండిటికీ ఒకటే పేరు "వడ" అని. వాటర్, రైస్, కర్రీ, చట్నీ, పాపడ్, సాంబార్, ఫ్రై, బాయిల్, కుక్, .... వగైరా వగైరా లాగా పరభాషా పేర్లంటేనే అధిక మోజు అన్నమాట.

      Delete
    3. తింటూనూ గారె అంటే సోక్కి సరిపోటం లేదేమోనండీ!
      ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి కదండీ! వడలే బాగా తింటారండి. వెల్లుల్లి అంటే ఏదో టన్నులకొద్దీ వేసెయ్యరండీ. కొద్దిగా వేస్తారు, వాసనకి అంతే! బాగుంటుంది. మీకు వద్దనుకుంటే వెయ్యం లెండి :)

      Delete
  3. కం. చిల్లొక్కటుండు గారెకు
    అల్లము వెల్లుల్లి మిర్చి యమరిన వడయౌ
    చిల్లక్కర లేదు మరియు
    అల్లన నీ తోటకూర యటనట నొప్పున్.

    ReplyDelete
    Replies
    1. ఇలాంటి పద్యాలు మహాసుళువుగా బరికెయ్య వచ్చు నుండీ. కాని ఎందుకు పనికి వస్తాయీ? ఒక పుణ్యమా పురుషార్ధమా వాటివలన?

      Delete


    2. చాన్నాళ్ల ( సంవత్సరాల ) తరువాయి శ్యామలీయం వారు జిలేబీ శతకానికి మరో కందాన్ని చేర్చేరు :)



      జిలేబి
      నారదా చూషావా మరి :)

      Delete

    3. శ్యామలీయం వారు.
      యదార్ధ వాదీ బంధు.లోక విరోధీ

      Delete
  4. జిలేబి
    నారదా చూషావా మరి :)
    బామ్మా! అంటు రోగ లక్షణాలు :)

    ReplyDelete
  5. కం. పాదాంతవిరామం బది
    యౌదల దాల్చగను దేశి యందం బెసగున్
    మీదట పదములు గణముల
    నాదిన్ పడుకొలది హెచ్చు నందము వింటే.


    ReplyDelete
  6. కం. అక్కరములు గణములలో
    కుక్కగ పద్యంబు గాదు కుకవులు దీనిన్
    చక్కగ నెరుగరు వారల
    కొక్కరు తెలుపగను చాల రుర్విని కంటే.

    ReplyDelete
    Replies


    1. బొక్కల వెతికెడు సామీ
      చక్కగ వ్రాయంగనెవరు శ్యామల రాయా
      మక్కువ మీరగ చెప్పిన
      మిక్కిలి వి‌న్నాణమునకు మీకివె ప్రణతుల్


      జిలేబి

      Delete
    2. బామ్మా!
      ఉన్నమాటంటే ఉలుకెక్కువని మా పెనవలూరులో సావెత జెప్తార్లే :)

      Delete
    3. శ్యామలరాయా!
      ఏమనుకోవద్దూ! ఒకప్పుడు ఈ జిలేబికి పద్యాలు రాయడం నేర్పింది మీరేనేమో! :)
      ఆ తరవాత శంకరాభరణం లో దున్నెయ్యడం మొదలెట్టి బాగుంది నుంచి భేష్ దాకా ఆపైదాకా ఎదిగిపోయి, ఇటుకలు పేర్పు బాగా నేర్చేసుకుంది కదూ! బామ్మా ఏమనుకోకూ!
      బోడి చేతికి శనగలు తినడం నేర్పేరా :)
      ఏమనుకోవద్దూ!

      Delete
    4. బాగుంది నుంచి భేష్ వర
      గాగముగా కందపద్య ఘనవిజయపతా
      కా గడియించుట గొప్పే,
      ఈగడిలో తిక్కయజ్వలెవ్వరు? విహితా !

      Delete


    5. బోడి చేతికి శనగలు తినడం నేర్పేరా :)

      భస్మాసుర హస్తమని వూరికే అన్నారా తాతగారు :)


      నారాయణ !


      జిలేబి

      Delete
    6. మిత్రులు శర్మ గారు,

      కం.ఇటుకల పే ర్పిల్లగునా
      చిటికెలకే మనకు కార్యసిధ్ధి కలుగునా
      గుటకల కాకలి చనునా
      పటమునగల పాము కరచి ప్రాణము చనునా

      పోనివ్వండి.

      Delete
    7. రాజావారు,
      జిలేబి పద్యాలు కట్టడం లో ఘనతేదో తమలాటి పద్యం కట్టగలవారే చెప్పాలి లేదా శంకరాభరణం లాటివారు చెపుతారని దానిలో గ్రేడులుంటాయని తమరి మాట. మా లాటి పామరులకేమి ఎరుక :)

      Delete
    8. శ్యామలరాయా!
      కాని కాలంలో ”తాడే పామై కరుస్తుందన్నది” నానుడి కదా! :)
      ఏమీ చేయలేనపుడు ”గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం” ఇది మరో నానుడి.

      Delete
    9. బామ్మా
      బామ్మ అంటే ఏంటో తెలుసా :)
      బాపూబొమ్మ-పూబొ=బాపూబొమ్మ :)
      నీది భస్మాసుర హస్తమేలే :)

      Delete
    10. బాపూ బొమ్మ-పూబొ=బామ్మ

      Delete



    11. అకటా కకావికలయిరి
      ప్రకటము గా మా గురువులు బందు ప్రభావ
      మ్ము కనబడెనీ దినమ్మున
      టకటక పద్యమ్ము లిచట టైంపాసాయెన్ :)


      బా (పూబొ) మ్మ

      తా(తతా)త :)


      జిలేబి

      Delete
  7. ఈ కత నాకు వేరే కతను గుర్తుకు తెచ్చిందాచార్య.. ఆ కతెంటంటే.. ఓ ఇంటికి పండక్కని అల్లుణ్ణి రమ్మంటారు.. అతనేమో ఆ ఇలాఖాలో పెరొందిన వారి జాబితలో ఒక్కడినని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్ఛి ఉంటాడుట.. ఐతే అతని కోసమని ఆ పల్లెలో పండుగ వాతావర్ణానికి ధీటుగా ఏర్పాట్లవి చేస్తారుట.. తీరా ఓ రోజు.. ఆ ఇంటికి ఆమడ దూరం ఒకరికి టెలిగ్రామ్ వస్తే దానిని పట్ఠుకొచ్చి ఇతని చేతిలో పెట్టి ఏముందని అడుగుతారు.. ఇక చూడండి.. అతను ఆ టెలిగ్రాం వైపు చూడటం.. అందరి వైపు చూడటం.. తలాడిస్తు భోరు మన్నాడట.. ఇంకేముంది.. ఏదో ఘోరం జరిగి ఉంటుందని ఊరూరంత ఘోల్లు మంది.. అపుడు అటేపుగా వెళుతున్న నేను ఏమిటిదీ ఏమై ఉంటుంది.. ఊరంత ఇలా ఏడుస్తోందేవిటని ఆరా తియ్యగా ఒకతను కళ్ళు తుడుచుకుంటూనే ఆ టెలిగ్రాం నాకిచ్చాడు. అందులో "HEARTY WISHES FOR THE FESTIVAL, ARRIVING SOON, SEE YOU ALL." అని ఉంది. ఇదీ విషయమని చెప్పి చల్లగా జారుకున్నాను. ఇహ అక్కడేమి జరిగుంటుందో మీ ఊహా శక్తికే వదిలేస్తున్నాను ఆచార్య.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      మంచి కత చెప్పేరు.
      పండిత పుత్రుడు

      Delete
    2. శర్మాచార్య.. ఇలాటిదే మా బాబాయి చేస్తుంటారు.. మా తాతయ్య వారి సంతానం ముగ్గురు.. వారిలో పెద్ద మా నాన్న.. అతనికి ఇద్దరు తమ్ముళ్ళు.. ఐతే మా చిన్న బాబాయి కి మా మరో బాబాయికి పక్కనే ఉండే టేకు అడవి (ఒకప్పుడు ఆ ఊరంత అందులోనే ఉండేది.. టేకడవి లో పెంకుటిళ్ళు.. ఇపుడు కాంక్రీట్ జంగల్ నడుమ అకడో ఇకడో ఎకడో ఒకటో రెండో టేకు చెట్లు ఉంటాయి) నుండి పొయ్యిలో కని ఆకులు కర్రలు కొట్టి తెమ్మని పురమాయిస్తే "ఎవరెల్తారమ్మ.. ఆ చెట్టు ఎక్కి పడిపోతేనూ.." అని ఆ బాబాయి అనేసి ఊరుకునేవారుట.. మా నాన్న, చిన్న బాబాయి ఇరువురు తెచ్చి ఇచ్చేవారట.. అపుడు పొయి అంటించిన నానమ్మ గారితో ఈ బాబాయి అనేవారట.. "ఎంత సేపు వంట చేస్తావమ్మ.. ఆకలేస్తోంది" అని.. మొన్నటికి మొన్న నేను బాబాయి షాప్ కు వెళితే.. "బాబాయి పెరుగు ప్యాకెట్ లీటరు తీసుకో" అని చెబితే.. "ఎవరు తింటార్రా అబ్బాయి.. పదా" అంటు ఊరకున్నారు.. సరికదా మరో దఫా నేనే వెళ్ళి తీసుకొచ్చుకున్నానా.. అపుడు అన్నం తింటు నా దగ్గరకొచ్చి.. భాస్కరా* ఏది పెరుగు తెచ్చానన్నావ్.. నాకు కొద్దిగ పెట్టు." అంటు పావు కేజి పెరుగు తినేశారు.

      *
      మా తాతూరిలో నా పేరు పలకటం ఎవరికి రాదాయే.. అంచేత మా తాతగారు సుడోనిమ్ పెట్టారు భాస్కర్ అని. సరిదర్ అంటారు అక్కడి జనాలు.. శ్రీధర్ అనమంటే.. అంచేత జాతక రిత్య పేరు శ్రీధర్ కాని మా నాయనమ్మ ఊరిలో అందరు నన్ను భాస్కర్ గానే పిలుస్తారు ఇపుడు కూడా.. ప్చ్.. ఐనా భాస్కర్ అంటే సూర్యనారాయణుడే.. శ్రీధర్ అంటే లక్ష్మీ నారాయణుడే.. అందుకే సొల్ప అడ్జస్ట్ మాడి.. ఇహ పెళ్ళైన నాటి నుండి మాయావిడ నన్ను తన కొంగుకు కట్టేసుకుంటూనే నా పేరూ అంది.. పనిలోపనిగా తన పేరుని పోర్ట మాంటేయు గాంచి ధరణి జేసినాను.. బ్లాగ్ లో పెన్ నేమ్ అదేగదా

      Delete
    3. శ్రీధరా!
      లోకం లో బహు విధాల మనుషులు కదా!మాటకి సామెత చెప్పే చిన్ననాటి మిత్రుడిని గుర్తు తెచ్చానా? ధన్యోస్మి.

      మీ పేరుకేమండీ :) బహు చక్కటి పేరు. పిలిచేవాళ్ళకి ఎలా కుదిరితే లా పిలుస్తారు. :) మీ పేరులో ఆమె పేరు కలుపుకున్నారా? అసలు మీకు పేరెక్కడుందో చెప్పండి. మీ పేరుకి అర్ధం శ్రీని ధరించినవాడూ అని కదా! శ్రీ లో ధరణి ఉన్నది కదా! ధరణిని ధరించినవాడు. అవునా అంచేత ఆమె పేరు మీరు వేరుగా కలుపోనక్కరలేదని నా ఊహ :)

      Delete


    4. తాత గారి లా చిక్కుల ముందు ఎవరైనా దిగదుడుపే! ‌అదురహో లంకె ఎక్కడి‌నుండి ఎక్కడికి!



      జిలేబి

      Delete
    5. పెళ్ళి కాక మునుపు ఆడపిల్ల పుట్టినింట ఉండటమే గౌరవప్రదం, శుభసూచకం
      వివాహానంతరం భర్త సాంగత్యమే తనకి గౌరవప్రదం, ఆనందదాయకం; సందర్భోచితంగా పుట్టినింటికి చుట్టం చూపుగా వెళ్ళి రావటం ఆమెకు శుభప్రదం కదా బిజిలే అమ్మణ్..!

      Delete
  8. అత్తకు నడుమట్టిందిట
    అత్తరి కోడలికి చేతులా పడిపోయెన్
    గత్తరవడె నాడబడుచు
    హత్తెరి! అడ్డెడు మినుముల నల్లుడు దినియెన్ .

    ReplyDelete


  9. ఏమండీ తాతగారూ,

    రైతును నేను అంటున్నారు‌.
    దేశంలో అగ్రి రిఫార్మ్ బిల్లు పై కస్సుబుస్సులు పెరుగుతున్నాయి‌. అంతటా అయోమయం.

    రైతన్న గా మీరు విడమరిచి విశదీకరించ వలసినది మా లాంటి నో గ్రౌండ్ అనుభవం వున్న వాళ్లకొరకు.


    ఇట్లు
    విన్నపాల బామ్మ
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బామ్మా!
      చట్టాలలో ఏముందో తెలిస్తే చెప్పరాదూ!

      Delete


    2. అది తెలియకనే కదా అడుగుతూంట
      త్వమేవ శరణం మమ!
      అన్య తాత శరణం నాస్తి !
      అనన్య తాత శరణం నా ఆస్తి !



      జిలేబి

      Delete
    3. బామ్మా!
      నాకూ చట్టాలలో ఉన్నది తెలీదు.
      రైతులు కానివారు రైతులగురించి తెగ మాటాడేస్తున్నారు.
      దళారీ లేకపోవడం ఎక్కడేనా అమ్ముకోడం మంచివే.
      కాంట్రాక్ట్ ఫార్మింగ్ మంచిదే. ఇప్పటికే దేశంలో ఉన్నదీ
      దీనిలో కొన్ని ఇబ్బందులున్నాయి. దేశంలో చక్కెర మిల్లులతో చేసేది కాంట్రాక్ట్ ఫార్మింగే, చాలా చోట్ల మిల్లులు రైతుల నెట్టిన చెయ్యి పెట్టేమాటా నిజమే.బంగాళాదుంప రైతులకూ ఒక పెద్ద కంపెనీకి తగువొచ్చి పరిష్కారం అయింది కూడా.సమస్యల పరిష్కారానికి వ్యవస్థ కావాలి. ఇంకా ఏమున్నాయో తెలీదు.పని లేని పార్టీలు జొరబడి ఉద్యమం అస్తవ్యస్తం చేస్తున్నట్టుంది.

      Delete