Tuesday 22 December 2020

మూడు తెనుగు ముక్కలున్న పద్యం./మూడు తెనుగు ముక్కలున్న తెనుగు పద్యం

 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

ఈ పద్యం మనుచరిత్రలో రెండవ ఆశ్వాసం లోది. మను చరిత్ర తెలియని తెనుగువారుంటారనుకోను. చిత్రమేమంటే ఈ పై పద్యంలో మొదటి మూడు మాటలు తప్పించి తెనుగు లేదు. ఆ మాటలు అట జని కాంచి అన్నవే! మిగిలిన పద్యమంతా సంస్కృతం అంటే నమ్మలేం. నిజానికి మనం మాటాడే తెనుగులో చాలా సంస్కృత పదాలే ఉంటాయి, ఉన్నాయి. నేడు ప్రపంచం  సంస్కృతం వెనక పరిగెడుతోంది, ముఖ్యంగా జర్మనీ, అంటే నమ్మేలా లేదు కదూ, కాని ఇది నిజం.మనం మాత్రం సంస్కృతం అంటే మృత భాష అనేస్తున్నాం. చిత్రం మృత అన్నది కూడా సంస్కృత శబ్దమే.  కంపూటర్ కి అనువైన భాష సంస్కృతం అంటే నమ్మలేరు. మరో సంగతి కూడా సంస్కృతం ఇంగ్లీష్ కీ బోర్డ్ మీద టైప్ చేయడం సులువు. 



ఈ పై పద్యంలో మాటలు తెలిసినంత వరకు విడదీయండి. అట, జని,కాంచె, ఇవి తెలుగనుకున్నాం కదూ. ఇక సంస్కృతం మాటలు చూడండి. అంబర, చుంబి, శిరః, పటల, ముహుర్ ముహుర్, తరంగ,మృదంగ,నిస్వన,, పరిఫుల్ల, కలాప, కలాపి, చరత్, కరేణు, కర,కంపిత, సాలము, శీత, శైలము.ఈ మాటలన్ని తెనుగు నిఘంటువులో అర్ధాలు దొరుకుతాయి. :) కొన్ని పదాలకి నిఘంటువు కూడా చూడక్కరలేదు కదూ
ఇది తెనుగు పద్యమా? సంస్కృత పద్యమా?

అట జని కాంచె అన్నవి రెండు గణాలుగా విడదీస్తే అటజ మూడు లఘువులు నగణం జకాంచె లఘు,గురువు,లఘువు మధ్య గురువు జగణం. అంటే పద్యం నడక నజభజజజర అనేగణాలతో నడుస్తుందని తెలిసిపోతోంది. దీనికో పేరు పెట్టేరు అదే చంపకమాలా వృత్తం. 

లఘువు ఒక మాత్ర, గురువు రెండు మాత్రలు సమయం పట్టేది. ఈ లఘు గురువులకు బైనరీ తో సంబంధం చెప్పచ్చు, అలాగే నేటి డిజిటలైజేషన్ కి ఇదే మూలం అంటే కూడా నమ్మకం కలగకపోవచ్చు. మాటల్ని గణాలుగా విభజించడం పద్యంగా చేయడం పెద్ద కష్టం కాదు. కాని అందమైన, అర్ధవంతమైన, కాలానికి నిలిచే పద్యం రాయడమే కష్టం.

ఈ సారి తెనుగు మాటలతో పద్యం రాయండి.  
 ప్రేరణ:విన్నకోటవారు. ధన్యవాదాలు.

14 comments:



  1. తాతగారు కూడా గణాల ఎన్నిక కొచ్చేసారోచ్ :)

    అటజని నాలుగు లఘువులు
    గాంచె గురువు లఘువు

    సరసిజ నాభ సోదరికి సాటి జయంతి జిలేబి యే సుమా :)


    జిలేబి

    ReplyDelete
  2. // “ ప్రేరణ:విన్నకోటవారు.” //

    🙏

    ReplyDelete
  3. తెనుగు తేనే ననుచు నెరక్కు నేర్
    గునుగు నాగున్నాది గున్నేనుగును
    నురుగ నెరపేటి నునుగు మీసఁబునకు
    నెరసిన కేశమునకు పూసేద ఇండికా టెన్ మినిట్ డయి కలర్

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      ఇదే అసలైన తెనుగు పద్యంలా ఉందే అర్ధం కాక. :)

      Delete


    2. అసలైన తెనుగు పద్యపు
      మసాల కలదయ్య పద్యమందు జిలేబీ
      దెస తిరిగి దండమిడి వ్రా
      య,సులభముగ నేర్వ గలవయా శ్రీధరుడా!

      ప్రోత్సాహమే పూర్తి బలము
      జిలేబి

      Delete
  4. ఈ సారి తెనుగు మాటలతో పద్యం రాయండి.
    ప్రేరణ:విన్నకోటవారు. ధన్యవాదాలు.

    విన్నకోటవారి ప్రేరణతో రేగి
    పెద్దనార్యు పెద్ద పద్దెము గొని
    మమ్ము దిట్టినారు దిమ్మ దిరిగిపోయె
    పద్యమన్న నింక భయము సారు !🙏.

    ReplyDelete
    Replies
    1. రాజావారు
      మూడే మూడు తెనుగు ముక్కలు అగపడ్డాయి. దీన్ని తెనుగు పద్దెం అనేసేరు. అసలు తెనుగు పద్దెం ఎలాగుంటది అని అనుమానమొచ్చింది సారూ! అంతే మరేం లేదు.

      Delete


  5. అటజని గాంచె - వ్యక్తిత్వ వికాసము - గరికిపాటి వారి విశ్లేషణ -

    https://youtu.be/VGg-9DfZ1qE


    Enjoy :)
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. "అట జని" పద్యం మీద గరికపాటి వారి ఊహాగానం మరీ పరుగులిడుతూ కాస్త అతి అనిపించడంలా?

      Delete


  6. కనబడె మూడంటే మూ
    డన తెనుగు పదాలు సూవె! డాంబికముగ పె
    ద్దన సంస్కృతభూయిష్టమ
    గు నడక నలరించెను గునగున పరుగులతో !


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కనబడు మూడే బ్లాగులు
      తెనుగున మొదటిది జిలేబి తియ్యనిపద్యాల్ ,
      ఘన కష్టేఫలి కబురులు ,
      వినబడు మూడోది శ్యామ వినుతుల గీతాల్ .

      Delete


    2. కనబడును కవివరుల దా
      రణి, పేరడి బండివరుల రావడియు , భళీ
      మన రాజారావు టపా
      లనఘా లలితమ్మ చెణుకు లా జ్యోతిషము‌న్ :)


      జిలేబి

      Delete
    3. రాజావారు,
      మీ అభిమానం సార్!

      Delete


  7. https://facebook.com/BashaaBharathi/photos/a.368490523299208/758985704249686/?type=3

    ReplyDelete