నిద్ర
ఆహార నిద్రా భయ మైధునాలు సర్వ జీవులకు సమానం అన్నారు, పెద్దలు.ఇవి ఎవరివి వారే అనుభవించాలి, మరొకరిని అనుభవించమనడం కుదరదు. ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం.నిద్ర గురించి చాలా కతలున్నాయి,భారతంలో,రామాయణంలో పాత చింతకాయ పచ్చడి చెప్పను.నేటి సినీ కవి మాట.
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు
చెప్పడమే నాధర్మం వినకపోతె నీ ఖర్మం
నేటి కాలంలో నిద్ర లేనివారు,నిద్ర లేని రాత్రులే ఎక్కువవుతున్నాయి. కారణాలు చూస్తే,
ఇరవైనాలుగు గంటలలోనూ ఎక్కువ భాగం బ్లూ స్క్రీన్ చూడ్డం.అవసరం ఉన్నది లేనిది అనక అన్ని విషయాలనూ బుర్రలో కుక్కెయ్యడం.దాంతో పీతబుర్ర కాస్తా పిగిలిపోతోంది, పగిలిపోతోంది.పరిస్థితి ఎలా తయారయిందంటే ఈగ ఇల్లలుకుతూ పేరు మరచిన చందమయింది.నీ పేరేంటీ? అంటే ఆగు గూగుల్ ని అడిగి చెబుతా అంటున్నట్టు ఉంది.ఇక మరొకటి తినకూడనివి తినకూడని సమయాల్లో తినడం.దీనికి విరుగుడు లేదా? పాము విషానికే విరుగుడుందే!
నిద్దర పట్టటం లేదా? ఇది దీర్ఘరోగానికి సంకేతం కావచ్చు సుమా. ఈకింది విధం గా చేసి చూడండి, అవసరాన్ని బట్టి డాక్టర్ ని కలవండి.
చేతుల బొటన వేళ్ళు ముడవండి, ఆపై మిగినవేళ్ళు ముడవండి. ఇది అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం అందరం ఉపాసన చేసినదే. అందుకే దీనిని ఆదిముద్ర అంటారు. ఇలా ముడిచిన చేతులతో ఎడమవైపుకు తిరిగి పడుకోండి, ఎడమచేయి తలకింద పెట్టండి, కుడి చేయి కూడా అదే పోస్ లో పెట్టి పడుకోండి.ఊపిరి నెమ్మదిగా పీల్చి వదలండి. ఊపిరి తిత్తులు ఖాళీ చేయండి, నెమ్మదిగా నాలుగంకెలు లెక్కిస్తూ ఊపిరి పీల్చండి. ఏడంకెలు లెక్కించేదాకా ఊపిరి బిగబట్టండి, ఆ తరవాత ఎనిమిది అంకెలు లెక్కెట్టే టైమ్ దాకా ఊపిరి వదలండి. దీనిని నాలుగైదు సార్లు చేయండి. కళ్ళ మీదకి నిద్ర వస్తుంది. బుర్రలోంచి ఆలోచనలు తుడి చేయండి. అది మీవల్ల కాదు లెండి. ప్రయత్నించండి.నిద్రకి ఉపక్రమించండి. ఇది సింపుల్.
అబ్బే మేం ముదిరిపోయాం ఇలా కుదరదంటారా?
వెల్లకిలా పడుకోండి. ఆది ముద్రపట్టండి రెండు చేతులా, ఈ చేతుల్ని బొడ్డు కింద ఉంచండి, ఒక దాని గుప్పెళ్ళు మరొక దానికి తగిలేలా. చివర వేళ్ళు రెండు చేతులవీ వదలండి. ఒక చేతి రెండు వేళ్ళని రెండవ చేతి వేళ్ళ దగ్గరగా ఉంచండి. నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండండి.దీన్ని శక్తి ముద్ర,మాతంగి ముద్ర అంటారు. కళ్ళు మూసుకోండి, ఊపిరి ఎక్సర్సైజ్ చేయండి, ఆలోచన తుడి చెయ్యండి. నెమ్మదిగా నిద్ర వస్తుంది.
అబ్బే మేమింకా ముదురు అంటారా? చారెడు జీలకర్ర తీసుకోండి, చిన్న స్పూన్ చక్కెర తీసుకోంది. రెండిని కలిపి నమలండి, పై చెప్పినవి చేయండి, నిద్ర వస్తుంది. అబ్బే మేము మరీ ముదురు
ఐతే పై చెప్పినవి ఆచరిస్తూ పడుక్కోడనికి ఒక గంట ముందు, వేడిగా పాలు తాగండి. పైవి చేయండి కమ్మటి నిద్ర మీ సొంతం. ఇవన్నీ ఎప్పుడో అమలు పరచేసేం, ఏం పని చేయలేదంటారా? మీకు మాత్రలేగతి డాక్టర్ని చూడండి...ఇక చెప్పను.
ఒక్కటి గుర్తుంచుకోండి,రోజులో,కనీసం రెండు గంటల పాటైనా మీ శరీరానికి సూర్య రశ్మి తగలాలి, ఎప్పుడూ ఏ.సి లో కూచుని ఉంటే ఇంతే సంగతులు. రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణమై ఉండాలి,అప్పుడే మీ శరీరం విశ్రాంతిని కోరుతుంది. తిన్న వెంటనే పడుకుంటే రోగమొస్తుంది. అంటే తిన్న తరవాత కనీసం రెండు గంటలదాకా నిద్రకి ఉపక్రమించద్దు. ఆ పై మీ ఇష్టం శరీరం మీది కదా!
నిదురా రావమ్మా
రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నుల్లో
నిదురా రావమ్మా
రావే నిండారా రావే
నిద్ర జీవులకు నిత్య ప్రళయం
ReplyDeleteఇంత కష్టపడాలా నిద్ర పోవడానికి !
ఓ నారదుల వారి కామింటు కొట్టేసి చక్కా జారుకుంటే సరి నిద్ర దానంతటదే క్షణాల్లో వచ్చేస్తుంది :)
జిలేబి
అస్తు.
Deleteనిదుర స్ట్రెస్ లవన, ఎక్జాషన్ మూలాన, యాంగ్జైటి కారణంగా ఓ పట్టాన రాదు. ఆకాశం తారావృత్తమైనా, చంద్రుడు నెలవంక ను దాటి పున్నమి రిసార్ట్ వరకు జిగేల్ జాబిలి మన్నా.. మస్తిష్కాన నానా ఆలోచనలతో సతమత గందరగోళాన తారాడే కన్నులకి కునుకొక కల లాటిదే.. రెమ్ స్లీప్ గంటైనా చాలు బొర్లించిన నేమి వదనంబుని అని ఉవాచ [గంగి గోవు పాల్..!]
ReplyDeleteగంగిగోవు పాలు గరిటడైనను చాలు,నిజమే ఆ గరిటడైనా ఉండాలి కదా
Delete"నిదుర పోరా తమ్ముడా" అనే పాట, "సో జా రాజకుమారీ" అనే సైగల్ గారి పాట పెట్టుకుని వింటుంటే నిద్ర రావచ్చు బహుశః ... ఆ విషాదం భరించలేక
ReplyDelete🙂🙂.
నిదురపోరా తమ్ముడా (సంతానం చిత్రం)
సో జా రాజకుమారీ సో జా (1940 హిందీ చిత్రం "జిందగి" లోని సైగల్ గారి పాట)
లత పాడిన ఆ పాట ఏదో పట్టేసినట్టు ఉంటుందండి, ఉఛ్ఛారణ. ఇక సైగల్ పాట పాత కాలపుదే,నిజంగా. అసలు హిందీ పాట సి.రామచంద్ర కాలం నుంచే చాలా పాపులర్ అయిందనుకుంటా. :)
Deleteచాలా చక్కని మాటలు ....
ReplyDeleteఇళయ రాజా.... సాంగ్స్ కోసం మా web ని సందర్శించండి
here
Deleteధన్యవాదాలు.
తాత గారు,
ReplyDeleteజ్ఞాపకశక్తి పెరగడానికి ఏదన్నా మార్గం చెపుదురూ...
Deleteకిరణ్ ప్రసాద్,
బాగున్నారా? చాలా కాలమైంది.
మరిచిపోతాననుకున్నది ముందు గుర్తు పెట్టేసుకోండి. :)
మెయిలిస్తా చూడండి.
ఈ శక్తి ముద్ర ఎక్కువ కాలం పడితే బద్ధకం పెరుగుతుంది :)
Deleteఅయ్యయ్యో! మెయిల్లో సీక్రెట్లా!/ ఆ మతిమరుపు పోయే చిట్కాలు చీక్రెట్లు బ్లాగులో పంచుకుంటే మాకూ కొంత వుపయోగం వుంటుంది కదండి పరహిత తాతగారు ?
జిలేబి
తాత గారు,
ReplyDeleteబాగున్నాను.నా కూతురికి పేరు మీరు suggest చేసినందుకు ధన్యవాదాలు.ఇప్పుడు అది ఐదు వత్సరాల వయసు ..కాలం చాలా వేగంగా పరిగెత్తుతోంది.
మీ mail చూసుకోలేదు..
@జిలేబి గారు మీరు మంచి కొరికే కోరారు..తాత గారు ఒక మంచి బ్లాగ్ రాస్తారని,ఆ విషయం మీద, ఆశిస్తున్నా...
కిరణ్ ప్రసాద్
Deleteమీ కుటుంబానికి ఆశీస్సులు. దీర్ఘాయుష్మాన్భవ.
ఐదేళ్ళ తరవాత కూడా నన్ను గుర్తుపెట్టుకున్నావుగా? నీకు మరుపెక్కడబ్బా?
జిలేబి మేధావి బాబూ!