లిఖేత సుఖతాసు తైలమపి యత్నతఃపీడయన్
పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః
కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి
పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః
కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి
తివిరి ఇసుమునతైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి.
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి.
కష్టం మీదనయినా ఇసుకనుంచి నూనెను పిండచ్చు,ఎండమావిలో నీళ్ళు తాగచ్చు, వెతికి వెతికి కుందేటి కొమ్మునూ తెచ్చుకోవచ్చు కాని మూర్ఖుని మనసును రంజింపచేయలేము అన్నారు కవి.
ఇసుకనుంచి నూనె తీయడం,ఎండమావిలో నీళ్ళు తాగడం,కుందేటికి కొమ్ము మొలిపించడం అసాధ్యాలని కవిగారి మాట. వారిదే చివరిమాట మూర్ఖుని రంజింప చేయడానికి ప్రయత్నం చేయద్దన్నారు. ఇది అర్ధం చేసుకోడం కష్టమే.
మన దవడ మీద దోమ వాలి కుడుతోంది, అసంకల్పితంగానే మన చేత్తో మనమే మన దవడ మీద ఛెళ్ళుమని చరుచుకుంటాం. దోమ చావచ్చు లేదా ఎగిరీ పోవచ్చు కాని మన చెంప మనమే ఛెళ్ళూమనిపించుకోవడం మాత్రం ఖాయం కదా!
అలాగే మూర్ఖునితో వాదం,సంవాదం, ప్రతివాదం ఏది చేసినా మన చెంపని మనమే ఛెళ్ళుమనిపించుకోడంతో సమానం అన్నారొక మిత్రులు. ఇంతటి గొప్ప ఉపమానం చెప్పిన మిత్రులకు వందనం.
ReplyDeleteరంజింపజేయ చూడకు
ముంజేతిని చాపకోయి మూర్ఖుని తో స్నే
హం జంజాటమ్ము! వినవె
కంజముఖి జిలేబి తాత గారి పలుకులన్!
జిలేబి
జిలేబి చిత్తం మా భాగ్యం
Deleteభర్తృహరి సుభాషితాని లోగల ఈ శ్లోకమును మా మాతృకలో:
ReplyDeleteకేలతో ఉస్కే మాయితి నచోన్ తేల్ కాడ్లేవాసు (వేని పణ్)
కేలతో తరసేతి రజన ఉస్కేర్ ఛాయా మాయితి పాణి పీయేవాసు
కేలేన్ డూఁడ్ లావతో సస్యార్ సీంగ్ సదాయి మళేవాసు
లపణ్ ఏక్ మూర్ఖ్ మనక్యాన కత్రా సికావతోయి అత్రాజ్ చూఁచాఁ
మూర్ఖత్వం, ధూర్తం స్వనాశిని.. కదా ఆచార్య
నాకు మీ భాష తెలియకపోయినా బాగా అనువాదం చేశారని పించింది. ఇలా చేస్తూ పొండి. వీటిని దాచి ఉంచండి, పిల్లలకి నేర్పండి. అదే మీరు భాష కి చేయగల సేవ.
Deleteచెవిటోని ముందు శంఖమూదటం.. పందికి పురాణం వినిపించటం అనే నానుడులను పోలియున్నదే ఈ కథ కమామిషు.. ఒహప్పుడు శివభాస్కరనే నా బాల్య స్నేహితుడు అంతే.. ఏ మాట చెప్పినా దానికి ఒక సామేతనో నానుడులనో దెచ్చి మరల బోర్లించే వాడు.. వాడిని నేను చివు అని పిలిస్తే ఏమిట్రా చెవికోసిన మేక అనుకున్నావా చివు అంటావని అనే వాడు..!
ReplyDeleteచేరక మూర్ఖుల వద్దకు
ReplyDeleteనేరిమితో దొలగవచ్చు , నేర్పరులైనన్
కారణరహిత విరోధము
వారక పండితులవలన వచ్చుం దెలియన్ .
రాజా వారు,
Deleteఅకారణ ద్వేషం,వైరం రెండూ పనికి రానివే. కాని లోకాన్ని ఇవే ఏలుతున్నాయి.
"జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు" : దీనర్థం "రంజింపజేయలేము"అనా లేక "చెయ్యగలిగినా చెయ్యకూడదు"అనా?
ReplyDeleteసూర్యగారు,
Deleteరంజింప జేయకు అని నిశ్చయంగానే చెప్పేరండి కవిగారు. అంటే ఆ ప్రయత్నం కూడా వ్యర్ధం, అన్నది కవిగారి మాటని నా భావమండి.
ప్రయత్నిస్తే ఏం జరుగుతుందన్నది టపాలో మాటండి :)