Monday 14 December 2020

తాడిచెట్టు నీడా కాదు

 తాడిచెట్టు నీడా కాదు


ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధనాంగుడై

త్వరతోడవ బరువెత్తి చేరి నిలిచెవ దాళద్రుమఛ్ఛాయ ద

చ్చిరముం దత్ఫలపాతవేగమున విచ్చెవ శబ్దయోగంబుగా

బొరి దైపోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్.....లక్ష్మణకవి


అసలే బట్టతల ఆ పై మధ్యాహ్న ఎండకి తల  మాడుతుండగా నీడకోసం తాడిచెట్టు మొదలుకి చేరాడు.. 

 అప్పుడే తాటి పండు ఒకటి రాలి, బట్టతలపై పడింది. తల పగిలింది.    ”తాడిచెట్టు నీడా కాదు,ఉంచుకున్నోడు మొగుడూ కాదని ” సామెత. తాడి చెట్టు నీడెంత? చాలా తొందరగా నీడ జరిగిపోతుంది.అటువంటి నీడ కోసం పోతే తాటి పండు రాలి తలపగిలింది, దీన్నే ”దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురొచ్చిందని” సామెత చెబుతారు. అలాగే ”దరిద్రుడు ఏ రేవు కెళ్ళినా ముళ్ళపరిగే పడిందన్నదీ” సామెత. దైవబలం చాలకపోతే అన్నీ బాధలే,చుట్టు ముడతాయి."అన్న వస్త్రాలకోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు"సామెత.  నేటి కాలానికి  సరిపోయే పోలిక చెప్పండి.

మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు దైవబలం లేనపుడు ఆపదలు చుట్టు ముడతాయి


ఖర్వాటో దివసేశ్వరస్య సంతాపితే మస్తకే

వాఞ్చన్దేశ మనాతపం విధివశా త్తాలస్య మూలంగతే

తత్రవ్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః

ప్రాయోగఛ్ఛతి యత్ర దైవహతకస్త త్రైవ యా న్త్యాపదః

32 comments:



  1. నేటి కాలానికి సరిపోయే పోలిక చెప్పండి.

    వచ్చిన ప్రావిడెంటు ఫండు మార్కెట్లో పెడితే మార్కెట్టు కుదేలు మనడం :)


    ReplyDelete
    Replies
    1. దాన్ని స్వయంకృతాపరాధము లేదా అత్యాశ అంటారు. ఖర్వాటుడి విషయం అది కాదే.

      Delete
    2. దురాశ దుఃఖమునకు చోటు

      Delete
    3. విన్నకోటవారు,
      అమ్మణ్ణీ చూపు వేరండీ! చెంపకు చేరెడు కన్నులు కదా!! :)

      Delete
  2. కబీర్ దోహా ఒహటి గుర్తుకొట్టింది శర్మాచార్య..
    "बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ ख़जूर।
    पंथी को छाया नहीं फ़ल लागै अति दूर॥"

    ReplyDelete
    Replies
    1. పెద్దదైన ఖర్జూరపు చెట్టులా నీడ ఇవ్వలేకపోయినా అది ఇచ్చే పళ్ళలా ఉండు
      అనుకుంటున్నా దోహా అర్ధం.

      Delete
    2. లేదాచార్య..
      ఎంత ఎత్తుకు ఎదిగితే ఏమి లాభం.. ఎదిగినంతలో కాస్తైన ఒదిగి ఉండాలన్నదే ఆ దోహా అర్ధం.. అంటే తాటి చెట్టు లేదా ఖర్జుర చెట్టు ఎంత ఎదిగితేనేమీ.. అలసిన పథికునికి కావలసినంత నీడ లేదు పైపెచ్చు కాయలు కూడా చాలా ఎత్తున ఉంటాయి. (రాళ్ళు రువ్వి దెబ్బలు తగిలిన మావి చెట్టు పళ్ళే తీయగ ఉంటాయి)

      Delete
    3. ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

      Delete


    4. ఎదిగిన కొలది జిలేబీ
      యొదగాలి సుజనులగుచు ప్రయోజన మపుడే
      గద వారు సమాజమునకు
      పద నేర్చుకొని విదురులకు వందారనవే !


      జిలేబి

      Delete
    5. తెలిసినకొద్దీ,ఙ్ఞానము
      బలిసినకొద్దీ , బుధులకు బలుపెక్కు, నహం
      బొలుకు, నడంకువ గలుగరు,
      కలనైనన్ విడరు పొగరు , కారులు గూతుర్ .

      Delete
  3. మరొకటికి ఇటువంటిదే..
    కాకతాళీయం:
    ఒకతను తాటి చెట్టు కింద నుంచున్నాడట.. అంతలోనే కాకోకటి ఆ చెట్టుపై వాలితే అదే క్షణం తాటికాయ అతని నెత్తి పై పడటం.. యాదృచికమో కాకతాళీయమో అంటారు..
    అంటే ఆ వాయసః వృక్షము పై వాలితేనే తాళియఫలం జారిందా లేదా ఆ క్షణంలో దానంటతదే పడేదా.. అనే మిమాంస.. పెరడాక్సికల్.. (ఏ సిచువేషన్ విచ్ కెన్ బీ రైట్ యాజ్ వెల్ యాజ్ వ్రాంగ్ అట్ దీ సేమ్ టైమ్)

    ReplyDelete
    Replies
    1. అదే కాకతాళీయం :) దైవికంగా జరిగినదానిని తమ గొప్పగా చెప్పుకోడం :)

      Delete
  4. మీ సామెత లాటిదే ఒహటి నిజంగానే జరిగింది ఆచార్య..
    నేను పుట్టినపుడు మా తాత (అమ్మ గారి నాన్న గారు) నా పేరిట గొఱ్ఱెపిల్ల నొకటిని అమ్మ కు ఇచ్చారుట.. అది పెరిగినాక అమ్మితే మా నాయనమ్మ చేతికి పదిహేను వేలు వచ్చినాయట.. నైన్టీ ఫైవ్ లో.. ఐతే అమ్మ చెప్పిందంట.. బాబు పేరిట వచ్చిన సొమ్ము కదా అత్తయ్య వాడి పేరిట డిపాజిట్ చేసేస్తామ్ ఇమ్మని.. ఐతే మా నానమ్మ కు బ్యాంకులు గురించి అపట్లో అంత అవగాహన లేకపోయే సరికి, అపుడు వడ్డికి డబ్బుని ఆమే తమ్మునికి ఇచ్చారట.. అదీ కాస్త నలభై వేలుగా మారినాయట.. ఆ తాత తెచ్చి నాయనమ్మ చేతిలో పెట్టారు.. కాని మా తాత (నాన్న గారి నాన్న గారు) ఆ వచ్చిన డబ్బుతో పొలంలో బోరు వేయిద్దామని సరాసరి అలానే చేశారు.. బోరుబావి తవ్వినారు.. నలభై అడుగుల దాక నీటి జాడ లేదాయే (సమ్మర్ ౧౯౯౯). నా పేరిట బ్యాంక్ లో డిపాజిట్ చేసినా ఈ రోజుకి అది దాదాపు (పది శాతం స్టాటిక్ ఇంటిరెస్ట్ పై, ఇరవై ఒక్క సంవత్సరాలకి క్వార్టర్లి కాంపౌండ్ చేసుంటే) నలభై వేలు ఇరవై ఒక్క సంవత్సరాలకి వడ్డితో కలిపి రూ. మూడు లక్షల పదెనిమిది వేల మూడు వందల ఇరవై సగటున వచ్చేది..

    ReplyDelete
  5. నాలుకనుజాపి పొడవుగ మేలు గలుగ
    కుడికి యెడమకు పదిమార్లు కుదిపి కదుప
    ముదిమిలో మతిమరుపుజబ్బు తొలగునట !
    దోస్తి నాల్కకున్ మెదడుకు జాస్తియంట !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ఎవరో చెప్పేరిదివరలో
      చేశా కొంతకాలం
      మరిచానిప్పుడు
      మరలా గుర్తు చేశారు. వందనాలు.

      Delete
    2. ఇద్దరమూ కలసి పెద్దలకు నమస్కారం. ఏమటారు :)

      Delete
  6. నిజము , ప్రణతులిడిన నెమ్మది శాంతించు
    పెద్దలకు , మనకును ప్రియము కలుగు ,
    ఐన , తమరికంటె అసలు పెద్దలెవరు !
    నరస విభులు గలరు నాకు నొకరు .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      నమస్కారం మన సంస్కారం కదు సార్!
      ఎదిగినకొద్దీ ఒదగమనీ

      Delete
    2. // "ఐన , తమరికంటె అసలు పెద్దలెవరు !
      నరస విభులు గలరు నాకు నొకరు . " //


      వయసులోను, జ్ఞానంలోను, అనుభవంలోనూ మనందరి కన్నా పెద్దలు శర్మ గారు ... నిస్సందేహంగా.

      నా కంటే వయసులో కాకపోయినా (అనుకుంటున్నాను?) జ్ఞానంలో పెద్దలు రాజారావు మాస్టారు.

      Delete


    3. ఆహా ఇంత మంది పెద్దోళ్ల సావాసంతో నే కూడా పెద్ద దద్ది యై పోయా :)



      జిలేబి

      Delete
    4. మీకేమండీ "జిలేబి"గారూ, చతురతలో మీరు అందరి కంటే పెద్దవారు 👌.

      Delete
    5. దద్దేమి ఖర్మ విబుధా !
      మద్దతు ఈ హితుడు మీకు , మహితా!యెపుడున్
      ఇద్దరి దలలో నాలుక
      పెద్దలకందరకు మీరు, ప్రియములు గూర్చన్ .

      Delete
    6. అందరికి
      నమస్కారం
      అంతా ఎంతో కొంత వృద్ధులే.షష్టి పూర్తి నుంచి సహస్ర చంద్ర దర్శనం లోగా ఉన్నవారే! ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా? అని అరిచిందో పిల్ల కాకి. దానిని మాత్రం ఎందుకు ప్రోత్సహించకపోవాలి?వృద్ధులు మూడు రకాలని చాలా సార్లు చెప్పుకున్నాం కదా! వయో వృద్ధులు కనపడతారు, జ్ఞాన వృద్ధులు, తపోవృద్ధులు తెలియరు, కనపడరు. అందుచేత నమస్కారమే మన సంస్కారం. ఇచ్చిన నమస్కారం స్వీకరిద్దాం, హుందాగా, గుర్తింపుకోసం తపన పడుతున్నవారి సంగతి పట్టించుకోండి, ఇది విన్నపం. ప్రతి నమస్కారం చేదాం.
      నమస్కారం

      Delete


    7. చేద్దాము నమస్కారము
      వద్దనకన్ స్వీకరించి వందనముల పా
      రేద్దామోయ్ చిరునవ్వును
      హద్దరి బన్న మనకేమి హాని జిలేబీ !


      జిలేబి

      Delete
    8. నమస్కారం శర్మగారూ👮...సారీ🙇

      Delete


    9. మనమంతా వృద్ధులమే
      మునులము, జ్ఞానులము, వయసు ముదరని వార
      మ్ము, నలుతెరగుల విదురులము
      మనలో భేదములు లేని మాన్యులము ‌కదా!


      జిలేబి

      Delete
    10. సూర్యాజీ
      నమస్కారం

      Delete
    11. పోసుకోలు నుడుల పొద్దుబుచ్చుటకంటె
      ఇహము పరము లొసగు హితవుగలుగు
      ధర్మకార్యమగ్న నిర్మిత కార్యాల
      చరమజీవితమ్ము జరుప మేలు .

      కనుచూపుమేర మరణము
      కనుపించుచు నున్నదనఘ ! కబళించే లో
      పునె మంచిపనులు జేయుట
      ఘనముగదా ! తదుపరి నవకాశము లేదే .


      Delete
    12. అస్తు.శుభమస్తు

      Delete
  7. పెద్దలు శ్రీనరసింహులు
    తద్దయు ఙ్ఞానాన వయసతా నన్నింటన్ ,
    వద్దన్నను గౌరవము త్రి
    శుధ్ధిగ నొసగుదు , నుతింతు , జోతలు 🙏 గూర్తున్ .

    ReplyDelete